Hitachi payment Services
-
పేమెంట్ అగ్రిగేటర్‌గా హిటాచీ: ఆర్బీఐ గ్రీన్ సిగ్నల్
సాక్షి,ముంబై: దేశీయ పేమెంట్ సేవల్లోకి మరో సంస్థ వచ్చి చేరింది. హిటాచీ చెల్లింపు సేవలకు ఆర్బీఐ తాజాగా పేమెంట్ అగ్రిగేటర్ లైసెన్స్‌ను మంజూరు చేసింది. దీంతో B2B కస్టమర్లకు EMI, పేలేటర్, BBPS , లాయల్టీ సొల్యూషన్స్ లాంటి వాల్యూ యాడెడ్ సర్వీస్‌లతో పాటు అన్ని డిజిటల్ చెల్లింపులకు సూత్రప్రాయంగా ఆమోదాన్ని తెలిపిందని హిటాచీ పేమెంట్ సర్వీసెస్ అధికారిక ప్రకటనలో తెలిపింది. ఈ ఆథరైజేషన్ ద్వారా కస్టమర్లకు వన్ స్టాప్ డిజిటల్ పేమెంట్ సేవలను కూడా అందించనున్నామనివెల్లడించింది. ఆర్బీఐ తమకందించిన పేమెంట్ అగ్రిగేటర్ ఆథరైజేషన్ ద్వారా దేశంలో పటిష్టమైన డిజిటల్ చెల్లింపుల పర్యావరణ వ్యవస్థను నిర్మించాలనే తమ దృష్టి మరింత బలోపేతం కానుందని హిటాచీ పేమెంట్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ రుస్తోమ్ ఇరానీ అన్నారు. తద్వారా దేశ ప్రజలకు సులభమైన డిజిటల్ చెల్లింపులను అందించడంతోపాటు, డిజిటల్ ఇండియా చొరవకు మరింత దోహదపడుతుందనీ, అందరికీ ఆర్థిక సాధికారతను అందిస్తుందని ఇరానీ చెప్పారు. -
కొత్త 100 నోటు : 100 కోట్ల ఖర్చు
న్యూఢిల్లీ : లేత వంగ పువ్వు వర్ణంలో కొత్త వంద రూపాయి నోటు త్వరలోనే చలామణిలోకి రాబోతుంది. ఈ నోటు ప్రస్తుతం మార్కెట్లో ఉన్న నోటు కంటే కాస్త చిన్నదిగా ఉన్నట్టు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. దీంతో ఏటీఎంలలో ఈ నోట్లను అందుబాటులోకి తీసుకురావడానికి, ఏటీఎంలను మార్చాల్సి వస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న 2 లక్షల 40 వేట ఏటీఎంలను కొత్త వంద నోటుకు అనుగుణంగా మార్చాల్సి వస్తుందని ఏటీఎం ఆపరేటర్లు తెలిపారు. దీనికోసం దాదాపు 100 కోట్ల రూపాయలను ఏటీఎం ఇండస్ట్రి వెచ్చించాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఈ ప్రక్రియకు గడువు కూడా ఏడాదికి మించి పట్టనుందని తెలిపారు. కొత్త బ్యాంక్ నోటు 66 ఎంఎం x 142 ఎంఎం సైజులో ఉండనుందని ఆర్బీఐ నోటిఫికేషన్లో తెలిసింది. ఇది ప్రస్తుతమున్న 73 ఎంఎం x 157 ఎంఎం పరిణామాల కంటే తక్కువ. ‘కొత్త 100 రూపాయల నోట్ల కోసం రికాలిబ్రేషన్ చేసేందుకు రూ.100 కోట్లకు పైగా ఖర్చు అవుతుందని మేము నమ్ముతున్నాం. దీనికి 12 నెలల మేర సమయం పట్టే అవకాశముంది’ అని హిటాచి పేమెంట్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ లోని ఆంటోని తెలిపారు. కొత్త నోట్లతో తమకు సవాళ్లు పెరుగుతూనే ఉన్నాయని పేర్కొన్నారు. అయితే 2016 నవంబర్‌లో పెద్ద నోట్ల రద్దు తర్వాత కొత్త ప్రమాణాలు, మరింత భద్రతా అంశాలతో కొత్త నోట్లను ఆర్బీఐ విడుదల చేస్తోంది. తాజాగా తెస్తున్న రూ.100 నోటు ఈ క్రమంలో అయిదో నోటు. అంతకుముందు కొత్త రూ.500, 2000, రూ.50, 200 నోట్లు వచ్చాయి. వీటిల్లో రూ.50ని ఏటీఎంలలో ఉంచడం లేదు. కొత్త నోట్లకు అనుగుణంగా దేశంలోని 2.4 లక్షల ఏటీఎంలలో ఎప్పటికప్పుడు మార్పులు చేయాల్సి వస్తోంది. తాజాగా మళ్లీ రూ.100 నోట్ల జారీకి అనుగుణంగా తీర్చిదిద్దాలంటే, ఒత్తిడి పెరిగినట్లేనని ఏటీఎం పరిశ్రమ చెబుతోంది. కొత్త వంద నోట్ల ప్రింటింగ్ ఇప్పటికే దేవాస్‌లో ప్రారంభమైందని సీనియర్ ప్రభుత్వ అధికారి తెలిపారు. ప్రతి ఒక్క ఏటీఎంలో నాలుగు క్యాసెట్స్ ఉంటాయి. రెండు క్యాసెట్లను సింగిల్ డినామినేషన్‌కు, మరో రెండు క్యాసెట్లు అత్యధిక డినామినేషన్ నోట్లకు అనుగుణంగా ఏటీఎంలు ఉన్నాయి. 2.4 లక్షల ఏటీఎంల నిర్వహణ ఇలా.. దేశంలో ఉన్న మొత్తం ఏటీఎంలు 2.4 లక్షలు. ఇందులో ఎన్సీఆర్ 1.1 లక్షల ఏటీఎంలను నిర్వహిస్తుండగా.. 55,000 ఏటీఎంలను హిటాచి నిర్వహిస్తోంది. 12,000 ఏటీఎమ్‌లు ఎఫ్ఐఎస్ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. గత ఆగస్టులో ప్రవేశపెట్టిన రూ.200 నోట్ల కోసం ఏటీఎమ్‌లను మార్చడానికి రూ.100-120 కోట్లు ఖర్చయ్యాయి. కొత్త నోటుకు అనుగుణంగా ఒక్కో ఏటీఎం మార్చడానికి అయ్యే ఖర్చు రూ. 3000-4000 ఉంటుందని ఇండస్ట్రి వర్గాలు చెబుతున్నాయి. -
భారత్‌లో 32 లక్షల కార్డులు హ్యాక్
ఆన్లైన్ భద్రతను సవాలు చేస్తూ గతేడాది అక్టోబర్‌లో వెలుగులోకి వచ్చిన అతిపెద్ద సైబర్ అటాక్స్పై హిటాచి పేమెంట్ సర్వీసెస్ స్పందించింది. భారత్‌లో 32 లక్షల డెబిట్ కార్డులు హ్యాకయ్యాయని హిటాచి పేమెంట్ సర్వీసెస్ ఒప్పుకుంది. యస్ బ్యాంకుకు సేవలందిస్తున్న హిటాచీ పేమెంట్ సర్వీసెస్ అనే సంస్థ కంప్యూటర్లోకి మాల్వేర్(దొంగ సాఫ్ట్వేర్)ను పంపి వినియోగదారుల సమాచారాన్ని సేకరించినట్టు తెలిసింది. ఈ ఏటీఎం నెట్వర్క్ అన్ని బ్యాంకులతో అనుసంధానమై ఉండటం వల్ల బ్యాంకు ఖాతాదారుల సమాచారం చైనా దొంగల చేతుల్లోకి వెళ్లిపోయింది. ఈ వ్యవహారం మే, జూన్‌ల్లోనే జరిగినప్పటికీ తమ ఖాతాల్లోని సొమ్ము పోయిందని వినియోగదారులు సెప్టెంబరు, అక్టోబర్‌లో ఫిర్యాదులు చేయడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 600కు పైగా కస్టమర్లు ఈ హ్యాంకింగ్లో నష్టపోయారని, వారి లావాదేవీల విలువ రూ. 1.3 కోట్లు దొంగతనానికి గురైనట్టు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రిపోర్టు చేసిన సంగతి తెలిసిందే. గురువారం మీడియాకు హ్యాకింగ్ జరిగినట్టు ధృవీకరించిన హిటాచి పేమెంట్ సర్వీసెస్, తమ భద్రతా చర్యలపై ఎప్పడికప్పుడూ సమీక్షిస్తున్నామని పేర్కొంది. ''మిడ్-2016లో మా సెక్యురిటీ సిస్టమ్స్ దొంగతనానికి గురైనట్టు ఒప్పుకుంటున్నాం. త్వరలోనే ఈ దొంగతనాన్ని కనిపెడతాం. కనిపెట్టిన వెంటనే ఆ వివరాలను రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలకు వివరిస్తాం. తమ ఖాతారులు సెన్సిటివ్ డేటాను భద్రంగా ఉంచడానికి బ్యాంక్స్, డెబిట్ కార్డు స్కీమ్స్‌ను తీసుకొస్తున్నాం'' అని హిటాచీ పేమెంట్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ లోని ఆంటోని తెలిపారు.