HITEC City
-
కో కో రెస్టారెంట్ : డింపుల్ హయతీ, హెబ్బా పటేల్ సందడి
ఫుడ్ హబ్‌గా పేరుగాంచిన భాగ్యనగరానికి మరో హాట్‌స్పాట్ వచ్చింది. ముంబైకి చెందిన ప్రఖ్యాత లగ్జరీ ఆసియా డైనింగ్ రెస్టారెంట్ ‘కోకో’ మన నగరంలో ప్రారంభమైంది. వినూత్న కాంటోనీస్, జపనీస్ వంటకాలు నగరవాసులను నోరూరించేందుకు సిద్ధమైంది. #KoKo Restaurant Launch in #Hyderabad #dimplehayati pic.twitter.com/XUyCPnmWMt— Dimple Hayathi (Parody) (@hayathidimple) November 11, 2024ప్రారంభోత్సవంలో డింపుల్ హయాతీ, హెబ్బా పటేల్, సిద్దు జొన్నలగడ్డ, ఆదర్శ్ బాలకృష్ణ తదితరులు హాజరై సరికొత్త రుచులను ఆస్వాదించారు. -
కమలోత్సాహం! మినీ ఇండియాలాంటి నగరం పైనే ఫోకస్
భాగ్యనగరం కాషాయమైంది. గల్లీగల్లీ నేతలతో నిండిపోయింది. ఫ్లెక్సీలు, కటౌట్లతో సందడి నెలకొంది. ఎన్నికల సమయంలో ఉండే హడావుడి ఇప్పుడే కన్పిస్తోంది. అగ్రనేతల దూకుడుతో కార్యకర్తల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. మాటల తూటాలు పేలుతున్నాయి. విమర్శల కౌంటర్..ఎన్కౌంటర్లతో రాజకీయ వేడి రగులుకుంది. శనివారం నుంచి ప్రారంభమయ్యే భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభమవుతున్న వేళ...రానున్న ఎన్నికలకు రాష్ట్ర శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్న నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి ఏర్పడింది. మూడవ రోజు బహిరంగ సభలో ప్రధాని మోదీ ఏం మాట్లాడుతారోనన్న ఉత్కంఠ నెలకొంది. మొత్తంగా భాగ్యనగరంలో జరుగుతున్న బీజేపీ సమావేశాలు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి. సాక్షి, హైదరాబాద్: కమలం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జాతీయ కార్యవర్గ సమావేశాలకు నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ప్రధాని సహా పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీపాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జాతీయ కార్యవర్గ సభ్యులు ఇతర దిగ్గజ నేతలు హాజరవుతోన్న ఈ సమావేశానికి మినీ ఇండియా లాంటి గ్రేటర్ సిటీ అతిథ్యమిస్తోంది. నగరంలోని అన్ని ప్రధాన రహదారులు కాషాయ శోభ సంతరించుకున్నాయి. భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు, పార్టీ పతకాలతో అన్ని దారులూ హైటెక్స్ వైపే అన్నట్లుగా తీర్చిదిద్దారు. భిన్న రాష్ట్రాల..సంస్కృతులు..ఆచార వ్యవహారాలు కలగలిసిన భాగ్యనగరంలో గంగా జమునా తహజీబ్ లాంటి మిశ్రమ సంస్కృతి ఏళ్లుగా కొనసాగుతుండడంతో ఇక్కడే సమావేశాల నిర్వహణకు బీజేపీ అధినాయకత్వం ఆసక్తి చూపింది. ఇదే క్రమంలో మహానగరం పరిధిలో పాతనగరంలోని 8 నియోజకవర్గాలు మినహా మిగతా 16 శాసనసభ స్థానాలపై బీజేపీ ప్రత్యేకంగా దృష్టిసారించింది. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఆయా నియోజకవర్గాల్లో పాగా వేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో నగరంలో పలు ప్రాంతాల్లోనివసిస్తున్న 15 రాష్ట్రాలకు చెందిన వివిధ సామాజిక వర్గాలు,నేతలు,ప్రముఖులతో ఆపార్టీ అగ్రనేతలు సదస్సులు, సమావేశాలు, సాంస్కృతిక వేడుకలు, సమాలోచనలు,విందు సమావేశాలను గురు,శుక్రవారాల్లో నిర్వహించడం విశేషం. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న కార్యకర్తల నివాసాల్లోనే అల్పాహారం,భోజనం స్వీకరిస్తూ అందరితో మమేకమవుతోన్న ఆపార్టీ అగ్రనేతలు కొత్త ట్రెండ్‌ను సృష్టిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల పరిధిలో అన్ని వర్గాల్లో పార్టీ ఎజెండానూ ముందుకు తీసుకెళ్లడంతోపాటు గ్రూపు తగాదాలు లేకుండా బీజేపీ అనుబంధ సంఘాలను సమన్వయం చేస్తూ పార్టీని బలోపేతం చేయడం, బూత్‌స్థాయి కార్యకర్తలు, నేతల్లో కొత్త ఉత్సాహం నింపడమే లక్ష్యంగా పార్టీ నేతల కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం విశేషం. ఎన్నికలకు ముందుగానే వ్యూహాత్మకంగా కమలం పార్టీ పావులు కదుపుతుండడంతో ఆ పార్టీ క్యాడర్, నేతల్లో జోష్ నెలకొంది. ముఖ్యమైన నేతలు మాత్రమే హాజరయ్యే కార్యవర్గ సమావేశాల అనంతరం ఆదివారం పరేడ్‌గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్టీ క్యాడర్‌కు సరికొత్తగా దిశానిర్దేశం చేయనున్నారు. ఈనేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో తెలంగాణాలో అధికారం చేపట్టడమే లక్ష్యంగా పార్టీ దూసుకుపోతోందని ఆ పార్టీ వర్గాలు, రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కేడర్‌లో జోష్.. గ్రేటర్లో కమలం పార్టీ కేడర్‌లో నయా జోష్ నెలకొంది. జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరయ్యేందుకు పార్టీ అగ్రనేతలు నగరాన్ని సందర్శిస్తుండడం, వీరంతా ఆయా నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తుండడంతో వారిలో నూతన ఉత్సాహం నెలకొంది. నగరంలో పలు చోట్ల కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి పేరిట వెలిసిన ఫ్లెక్సీలు, స్థానిక నాయకులు, నియోజకవర్గాల ఇన్‌ఛార్జిలు, కన్వీనర్లు ఏర్పాటు చేసిన కటౌట్లు అగ్రనేతలకు ఘనంగా స్వాగతం పలుకుతున్నాయి. నగరవ్యాప్తంగా ముఖ్య కూడళ్లలో భారీ కటౌట్లు ప్రత్యేక ఆకర్షణగా నలిచాయి. హైటెక్స్ ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేసిన భారీ స్వాగత ద్వారం హైలెట్‌గా నిలిచింది. పరేడ్‌గ్రౌండ్స్ మైదానంలో ఆదివారం నిర్వహించనున్న ప్రధాని బహిరంగ సభ సందర్భంగా ఏర్పాట్లు ఊపందుకున్నాయి. ప్రధానమంత్రి మోదీ,ముఖ్య నాయకులు సభ అనంతరం బయటకు వెళ్లేందుకు టివోలి రోడ్డులో మరో ద్వారం ఏర్పాటు చేశారు. జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరవుతోన్న పలువురు కేంద్ర మంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, ఎంపీలు, ఇప్పటికే నగరంలోని పలు కీలక నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించడం, కిందిస్థాయి నేతలు, కార్యకర్తలతో మమేకమయి సరికొత్తగా దిశానిర్దేశం చేయడంతోపాటు పలువురు నేతలు క్షేత్రస్థాయిలోనే కార్యకర్తల ఇళ్లలో బస చేయడంతో పార్టీ కేడర్‌లో కొత్త ఉత్సాహం నిండింది. చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో సినీనటి, బీజేపీ నేత ఖుష్భూ ప్రత్యేక పూజలు చేయడంతో పాతనగరంలోనూ కమలం పార్టీ కేడర్‌లో జోష్ నిండింది. (చదవండి: రాష్ట్రంలో బీజేపీదే అధికారం) -
అంతు చిక్కని అస్వస్థత
సాక్షి, గచ్చిబౌలి: హైటెక్ సిటీలోని వడ్డెర బస్తీకి అంతు చిక్కని అస్వస్థత చుట్టుముట్టింది. పదులు సంఖ్యలో బాధితులు ఆస్పత్రుల పాలవుతున్నారు. ఒకరు తేరుకోక ముందే మరో ముగ్గురు అన్నట్లుగా కొనసాగుతోంది వడ్డెర బస్తీలోని అస్వస్థత కేసుల సంఖ్య. మొదటి రోజు 20 మంది ఉన్న బాధితులు రెండో రోజు 51కి చేరింది. మూడో రోజుకు 76కు చేరడం అందరినీ కలవర పెడుతోంది. కలుషిత మంచి నీరు కారణమని చెబుతుండటంతో ఇప్పటికే నీటి శాంపిల్స్ సేకరించిన వాటర్ వర్క్స్ అధికారులు శనివారం మళ్లీ శాంపిల్స్ సేకరించారు. హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సత్యనారయణ వడ్డెర బస్తీని సందర్శించి తాగునీటిని పరిశీలించారు. గాంధీకి అయిదుగురి తరలింపు కొండాపూర్ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో అయిదుగురిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అస్వస్థతకు గురై విరేచనాలు, వాంతులతో బాధపడుతున్న వారిలో కిడ్నీ సమస్యలు ఉండటంతో శుక్రవారం ముగ్గురికి, శనివారం ఇద్దరిని గాంధీ ఆస్పత్రికి తరలించామని కొండాపూర్ ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వరదా చారి తెలిపారు. నీటి నమూనాల సేకరణ వడ్డెర బస్తీలో జనం అస్వస్థకు గురైన వెంటనే హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ అధికారులు 40 ఇళ్లలో శాంపిల్స్ సేకరించారు. థర్డ్ పార్టీ పరీక్షలు నిర్వహించిందని ఎలాంటి కలుషితం లేదని చెప్పినట్లు వాటర్‌వర్క్స్ జీఎం రాజశేఖర్ తెలిపారు. మరో రిపోర్ట్ రావాల్సి ఉందన్నారు. కలుషితమే కారణమంటున్నారు మంచి నీరు, ఆహరం, గాలి కలుషితం కారణంగానే విరేచనాలు, వాంతులు, కడుపునొప్పి, జ్వరం వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. మంచి నీటిలో మురుగు నీరు సరఫరా జరిగిందని, కలుషిత నీటి కారణంగానే అస్వస్థత చోటు చేసుకుందని వడ్డెర బస్తీ వాసులు పేర్కొంటున్నారు. (చదవండి: భయంకరమైన యాక్సిడెంట్: మహిళ పైకి దూసుకుపోయిన బీఎండబ్ల్యూ కారు) -
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. హైదరాబాద్‌లో మరో భారీ ఐటీ ప్రాజెక్ట్..!
హైదరాబాద్: మహానగరం వేగంగా విస్తరిస్తుండటంతో పాటు అభివృద్ధిలో దూసుకపోతోంది. ఈ మహా నగరం ఇప్పటికే ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ఐటీ కంపెనీలకు అడ్డాగా తెలంగాణను మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ఫలితంగా స్టార్టప్ కంపెనీలతో పాటు అంతర్జాతీయ కంపెనీలు కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. అయితే.. ఇప్పటి వరకు హైటెక్ సిటీ వరకు మాత్రమే పరిమితమైన ఐటీ కంపెనీలు.. ఇప్పుడు నగరం నలుమూలాల విస్తరిస్తున్నాయి. తాజాగా.. ప్రముఖ ఐటీ కంపెనీ జెన్పాక్ట్ ఉప్పల్‌లో భారీ క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. ఈ విషయాన్ని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తన ట్విటర్ వేదికగా ప్రకటించారు. ‘జెన్పాక్ట్ తమ గ్రిడ్ పాలసీలో భాగంగా ఉప్పల్‌లోని తమ క్యాంపస్‌ను విస్తరిస్తోంది. ఈ క్రమంలోనే నేడు ఉప్పల్ క్యాంపస్‌కు భూమి పూజ జరగనుంది. దీంతో 15 వేలకుపైగా కొత్త ఉద్యోగాలు రానున్నాయి. ఐటీ రంగంలో రానున్న రోజుల్లో హైదరాబాద్‌లో లక్ష ఉద్యోగాల కల్పనను చేరుకోనున్నాము’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. అందులో భాగంగానే… ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఉప్పల్ క్యాంపస్‌కు భూమి పూజ చేశారు. తూర్పు ప్రాంతంలో జెన్పాక్ట్ సంస్థ 20 లక్షల చదరపు అడుగుల వాణిజ్య కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. Ministers @KTRTRS & @chmallareddyMLA laid foundation stone for expansion of @Genpact Campus in Uppal in alignment with the GRID (Growth in Dispersion) Policy. pic.twitter.com/CRtLYN3TSr — Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) February 13, 2022 హైటెక్ సిటీ ప్రాంతంలో ఉన్నట్లుగా సెక్యూరిటీ కౌన్సిల్ ఈ ప్రాంతంలో ఒకటి ఏర్పాటు చేస్తామని, ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాల ఏర్పాటు కోసం కృషి చేస్తున్నామన్నారు. ఉప్పల్ నుండి నారపల్లి వరకు భారీ ఫ్లైఓవర్ వేస్తున్నట్లు, ఇంకా 4, 5 మంది ప్రైవేటు డెవలపర్స్ ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు. వారికి కూడా అవకాశం కల్పిస్తామని హామీనిచ్చారు. ఈ ప్రాంతంలో ఐటీ విస్తరించడం ద్వారా చాలా మందికి ఉపాధి దొరుకుతుందన్నారు మంత్రి కేటీఆర్. Good news for Eastern Hyderabad!@Genpact will be creating 15,000 seats as part of expansion of their campus in Uppal in alignment with our GRID Policy. We will be reaching the 1 lakh employment mark in this part of Hyderabad soon! Laying the foundation today for 1.9 Mn campus pic.twitter.com/sPAyb3XG3C — KTR (@KTRTRS) February 13, 2022 (చదవండి: ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి..! ప్లేయర్స్‌తో పాటుగా దీని వేలం కూడా..!) -
ఆఫీస్ స్పేస్.. హాట్ కేకుల్లా హైటెక్ సిటీ, మాదాపూర్
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆఫీస్ స్పేస్‌కు డిమాండ్ అనూహ్యంగా పెరుగుతోంది. రాబోయే నాలుగేళ్లలో (2025 నాటికి) మహానగర పరిధిలో ఏకంగా 15 కోట్ల చదరపు అడుగుల విలువైన ఆఫీస్ స్పేస్ ఏర్పాటవుతుందని తాజా అధ్యయనం అంచనా వేసింది. ఇప్పటికే నగరంలో సుమారు 7 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో వివిధ ఐటీ, బీపీఓ, కేపీఓ సంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. రాబోయే నాలుగేళ్లలో మరో 8 కోట్ల చదరపు అడుగుల లక్ష్యాన్ని చేరుకుంటుందని స్పష్టం చేయడం విశేషం. ప్రధానంగా హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి ఫైనాన్షియల్ జిల్లా, కోకాపేట్ పరిధిలో తమ కార్యాలయాలను నెలకొల్పేందుకు బహుళజాతి, దేశీయ సంస్థలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయని ప్రముఖ రియల్టీ సంస్థ కుష్మన్ వేక్ఫీల్డ్ చేపట్టిన తాజా అధ్యయనం పేర్కొంది. ఇక మహానగరం పరిధిలో గతేడాదిగా 4 కోట్ల ఆఫీస్ స్పేస్ అదనంగా ఏర్పాటైందని తెలిపింది. కార్యకలాపాల విస్తరణ.. ► కోవిడ్.. లాక్డౌన్ కారణంగా నగరంలో పలు ఐటీ, బీపీఓ, కేపీఓ సంస్థలు తమ ఉద్యోగులకు ప్రస్తుతానికి వర్క్‌ఫ్రం హోంకు అనుమతించాయి. ఈ ఏడాది చివరి నాటికి ఈ పరిస్థితిలో మార్పు వస్తుందని ఈ అధ్యయనం అంచనా వేసింది. ► రాబోయే నాలుగేళ్లలో తమ కార్యకలాపాలను నగరంలో విస్తరించేందుకు పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ముందుకొచ్చే అవకాశాలున్నట్లు స్పష్టం చేసింది. ► నగరంలో సుమారు 20కిపైగా ప్రముఖ నిర్మాణ రంగ సంస్థలు 6.5 కోట్ల ఆఫీస్‌స్పేస్‌ను ఏర్పాటు చేసే పనుల్లో నిమగ్నమయ్యాయని.. చేపట్టిన ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేసేందుకు కృషి చేస్తున్నాయని ఈ అధ్యయనం తెలిపింది. డిమాండ్– సప్లై సూత్రాల ఆధారంగానే ఈ నిర్మాణ కార్యకలాపాలు సాగుతున్నాయని పేర్కొంది. ► ప్రధానంగా ఒక్కో ప్రాంతంలో 2 లక్షల నుంచి 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో వీటిని నెలకొల్పుతున్నట్లు తెలిపింది. ప్రభుత్వ పరంగా పలు కార్పొరేట్, ఐటీ, బీపీఓ, కేపీఓ, స్టార్టప్ సంస్థలకు ఇస్తున్న ప్రోత్సాహకాలు, ఐటీ, హార్డ్‌వేర్ పాలసీ తదితర కారణాల రీత్యా ఆఫీస్ స్పేస్ అభివృద్ధి విషయంలో ఏటా 5 నుంచి 10 శాతం వృద్ధి నమోదవుతోందని విశ్లేషించింది. ముంబై, బెంగళూరు, ఢిల్లీ తర్వాత.. ► ఆఫీస్‌స్పేస్ విషయంలో దేశ వాణిజ్య రాజధాని ముందు వరుసలో ఉందట. రెండోస్థానంలో బెంగళూరు, ఢిల్లీ నగరాలు పోటాపోటీగా పురోగిస్తున్నాయట. ఈ మెట్రో సిటీల తర్వాత మూడో స్థానంలో మన గ్రేటర్ హైదరాబాద్ నగరం నిలిచినట్లు ఈ అధ్యయనం స్పష్టం చేసింది. ► నగరంలో ఫోనిక్స్, ఆర్ఎంజెడ్, సాలార్‌పూర్ సత్వ, కె.రహేజా గ్రూప్, దివ్యశ్రీ డెవలపర్స్, జీఏఆర్ కార్పొరేషన్, వంశీరామ్ బిల్డర్స్ తదితర ప్రముఖ నిర్మాణ రంగ సంస్థలు 2025 నాటికి సుమారు 6.5 కోట్ల చదరపు అడుగుల మేర ఆఫీస్‌స్పేస్‌ను ఏర్పాటుచేసే అవకాశాలున్నాయని ఈ అధ్యయనం తెలిపింది. -
హైదరాబాద్‌లో కరోనా కలకలం
-
ఐటీలో హై అలర్ట్!
సాక్షి, హైదరాబాద్/గచ్చిబౌలి: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఐటీకి కేంద్ర బిందువుగా ఉన్న మాదాపూర్‌లో బుధవారం కోవిడ్ కలకలం రేగింది. మైండ్‌స్పేస్ బిల్డింగ్–20లోని డీఎస్ఎం కంపెనీలో పనిచేస్తున్న ఓ మహిళా టెకీకి కోవిడ్ వచ్చిందనే సమాచారం రావడంతో ఐటీ జోన్ హై అలర్ట్ అయింది. వారం రోజుల క్రితం ఇటలీ నుంచి వచ్చిన ఆమెకు కోవిడ్ లక్షణాలు బయటపడడంతో గాంధీ ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే మైండ్ స్పేస్‌లోని ఉద్యోగులు నిమిషాల వ్యవధిలోనే ఇళ్లకు వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్‌లోని పలు సాఫ్ట్వేర్ కంపెనీలు అప్రమత్తమయ్యా యి. వైరస్ నివారణ దిశగా చర్యలు చేపట్టాయి. హైటెక్ సిటీ, మాదాపూర్ ,గచ్చిబౌలి ఫైనాన్షియల్ జిల్లా, రాయదుర్గం ప్రాంతాల్లో దాదాపు 600కి పైగా ఐటీ సంబంధిత రంగాలకు చెందిన కంపెనీలున్నాయి. వీటిలో దాదాపు 6 లక్షల మంది పనిచేస్తున్నారు. వ్యాపార, వాణిజ్య, నైపుణ్య శిక్షణ తదితర కార్యకలాపాల్లో భాగంగా ఇక్కడి ఉద్యోగులు సింగపూర్, మలేషియా, హాంకాంగ్ తదితర దేశాలకు వెళ్లి రావాల్సి ఉంటుంది. అలాగే ఆయా దేశాల నిపుణులు సైతం సాధారణంగా నెలకు సుమారు 5వేల మంది వరకు ఇక్కడకి వచ్చి వెళుతుంటారు. ఈ నేపథ్యంలో ఐటీ జోన్లో కోవిడ్ కలకలం రేగడంతో ఆయా కంపెనీలు తమ ఉద్యోగులకు పలు సూచనలు చేశాయి. కరచాలనం చేయడం నిలిపివేయాలని పేర్కొనడంతోపాటు విదేశీయానానికి, వారాంతపు టూర్లకు దూరంగా ఉండాలని ఆదేశించాయి. విదేశాలకు వెళ్లి వచ్చినవారు తప్పనిసరిగా వైద్య పరీక్షలు చేయించుకోవాలని స్పష్టంచేశాయి. తమ కార్యాలయ పరిసరాలు, కామన్ ఏరియాలను డిటర్జంట్లు, అధిక గాఢత కలిగిన స్పిరిట్లతో శుభ్రం చేసినట్టు వెల్లడించాయి. వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వొద్దు: జయేశ్ రంజన్ కోవిడ్‌పై వస్తున్న వదంతులను నమ్మి వర్క్ ఫ్రం హోమ్‌కు అనుమతి ఇవ్వవద్దని ఐటీ కంపెనీలకు రాష్ట్ర ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ సూచించారు. ఒకవేళ వర్క్ ఫ్రం హోమ్‌కు అవకాశం ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటే తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని స్పష్టంచేశారు. ఓ మహిళా టెకీకి కోవిడ్ లక్షణాలు ఉండటంలో మైండ్‌స్పేస్‌లో కంపెనీలు మూసివేస్తున్నారని ప్రచారం జరగడంతో గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. మైండ్‌స్పేస్‌లోని ఓ కంపెనీలో పనిచేస్తున్న మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇటీవల ఇటలీ నుంచి హైదరాబాద్ వచ్చారని తెలిపారు. కోవిడ్ సోకిందనే అనుమానం రావడంతో ఆమె నుంచి నమూనాలు సేకరించి పుణేలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపించినట్టు చెప్పారు. గురువారం ఆ నివేదిక వచ్చిన తర్వా త వివరాలు వెల్లడిస్తామన్నారు. మైండ్‌స్పేస్ 9వ అంతస్తులో ఆమెతో పాటు పనిచేస్తున్న 23 మందిని గుర్తించామని వివరించారు. అదే భవనంలోని 4వ అంతస్తులో ఆమె భర్త పనిచేస్తున్నారని, ఆయనతోపాటు మరో 65 మంది కలిసి పనిచేస్తున్నవారిని కూడా గుర్తించామని పేర్కొన్నారు. వీరిద్దరూ పనిచేస్తున్న రెండు కంపెనీలతోపాటు అదే భవనంలో ఉన్న మరో రెండు కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్‌కు అవకాశం ఇచ్చాయ న్నారు. అనుమానితులు ఉన్నా.. వైరస్ ప్రభావం కేవలం 12 గంటలే ఉంటుందని, గురువారం భార్యాభర్తలు మినహా మిగిలిన ఉద్యోగులంతా ఆఫీస్ నుంచి విధులు నిర్వహిస్తారని ఆయన స్పష్టంచేశారు. మాస్క్‌లు అందించేందుకు ఇంటెల్, కాగ్నిజెంట్, వెల్స్‌ఫార్గో, టీసీఎస్, క్యాప్ జెమినీ సంస్థలు ముందుకు వచ్చాయని.. దగ్గు, జలుబు ఉన్న వారు మాత్రమే వాటిని ధరించాలని సూచించారు. ఐదు శాతం మందికే పాజిటివ్ వచ్చే ఛాన్స్... తెలంగాణలో కోవిడ్ పాజిటివ్ కేసు ఒక్కటి మాత్రమే నమోదైందని రాష్ట్ర పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ వెల్లడించారు. మైండ్‌స్పేస్‌లో పనిచేసే మహిళా టెకీ రిపోర్ట్ ఇంకా రావాల్సి ఉందన్నారు. ఇప్పటివరకు 45 నమూనాలు నెగిటివ్‌గా వచ్చాయని.. ఇద్దరి నమూనాలను మాత్రమే పుణేకు పంపినట్టు తెలిపారు. దాదాపు 81 శాతం మందికి కోవిడ్ సోకదని, 14 శాతం మందిలో లక్షణాలు కనిపిస్తాయని, రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే కేవలం ఐదు శాతం మందికి మాత్రమే పాజిటివ్ వచ్చే అవకాశం ఉందని వివరించారు. కోవిడ్ నేపథ్యంలో ఐటీ కంపెనీలు ఖాళీ చేస్తున్నారని అసత్య ప్రచారాలు చేసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సైబరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్ హెచ్చరించారు. బయోమెట్రిక్‌ను మార్చేశాం కోవిడ్ వైరస్ నేపథ్యంలో ఇప్పటికే బయోమెట్రిక్ విధానంలో మార్పులు తీసుకొచ్చాం. వేలి ముద్రతో కాకుండా ఐడెంటిటీ కార్డులతోనూ బయోమెట్రిక్ పని చేస్తుంది. ప్రత్యేక పరిస్థితులు ఉన్నప్పుడు ఉద్యోగులకు ల్యాప్‌టాప్‌లు, రవాణా, ఇంటర్నెట్ ఇచ్చే అంశాలపై సూచనలిచ్చాం. ముందు జాగ్రత్తలపై కరపత్రాలతో అవగాహన కల్పిస్తున్నాం. – మురళి బొళ్లు, హైసియా అధ్యక్షుడు వదంతులు నమ్మొద్దు రహేజా మైండ్‌స్పేస్‌లోని భవనం నెంబర్ 20లో శానిటైజేషన్ చేశాం. ఆ భవనంలోని మొత్తం 9 కంపెనీలలో దాదాపు 7,300 మంది ఉద్యోగులు ఉన్నారు. నాలుగు కంపెనీలలో దాదాపు రెండు వేల మందికి వర్క్ ఫ్రమ్ హోమ్‌కు ఒక్కరోజు అనుమతి ఇచ్చారు. కంపెనీలు ఖాళీ అవుతున్నాయనే వదంతులను ఎవరూ నమ్మవద్దు. – శ్రవణ్ గోనే, రహేజా సీఈఓ -
హైదరాబాద్ మెట్రో సరికొత్త రికార్డు
సాక్షి, హైదరాబాద్ : మెట్రో రైలు మరో మైలురాయిని అధిగమించింది. హైదరాబాద్ మహానగర కీర్తి కిరీటంలో కలికితురాయిగా నిలిచిన మెట్రో రైలు మరో కొత్త మార్గంలో పరుగులు పెట్టింది. ఒకటిన్నర కిలోమీటర్ల హైటెక్‌సిటీ– రాయదుర్గం మెట్రో కారిడార్‌లో రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ శుక్రవారం ఉదయం హైటెక్‌సిటీ మెట్రో స్టేషన్లో మెట్రో రైలును ప్రారంభించారు. రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సైతం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడి నుంచి మెట్రో రైల్లో మైండ్ స్పేస్ ముందున్న రాయదుర్గం స్టేషన్ వరకు ప్రయాణం చేస్తారు. ఆ తరువాత రోడ్డు మార్గంలో నానక్‌రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కు వెళ్లి అక్కడ బుల్ స్టాట్యూ ప్రారంభిస్తారు. మెట్రో రైల్ ఎం.డి.ఎన్వీఎస్ రెడ్డి, రాష్ట్ర చీఫ్ సెక్రెటరీ ఎస్.కె.జొషీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్ స్పెషల్ సెక్రెటరీ అరవింద్ కుమార్, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఐటీ ఉద్యోగులకు వెసులుబాటు హైటెక్‌సిటీ మెట్రో స్టేషన్ నుంచి ఒకటిన్నర కిలో మీటర్ల దూరంలో మైండ్ స్పేస్ వరకు మెట్రో రైల్ రాకతో ఐటీ ఉద్యోగులకు ఎంతో సౌకర్యం లభించనుంది. హైటెక్‌సిటీ మెట్రో స్టేషన్ నుంచి ఆటోలు, క్యాబ్‌లలో వెళ్లాలంటే అరగంటకు పైగా సమయం ట్రాఫిక్‌లోనే గడిచిపోతుంది. దీంతో ఐటీ ఉద్యోగులు నడుచుకుంటూనే కె.రహేజ, ఫేజ్–2లో ఉన్న కంపెనీలకు వెళ్తారు. మెట్రో రాక వల్ల రాయదుర్గం మెట్రో స్టేషన్లో దిగి రహేజతో పాటు, ఫేజ్–2 కంపెనీలు, ఇనార్బిట్ మాల్ రోడ్డులో ఉన్న ఐటీ కంపెనీలకు కాలినడకన వెళ్లవచ్చు. ప్రస్తుతం రెండు మార్గాల్లో మెట్రో రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. నాగోల్ నుంచి అమీర్‌పేట్ వరకు అక్కడి నుంచి హైటెక్‌సిటీ వరకు , ఎల్బీనగర్ నుంచి మియాపూర్ వరకు మెట్రో పరుగులు తీస్తోంది.ప్రతి రోజు సుమారు 4 లక్షల మంది మెట్రో సేవలను వినియోగించుకుంటున్నారు. శుక్రవారం హైటెక్‌సిటీ నుంచి రాయదుర్గం వరకు మెట్రో అందుబాటులోకి రావడం వల్ల మరో లక్ష మందికి అదనపు ప్రయోజనం లభించనుంది. ప్రస్తుతం ట్రయల్‌రన్స్ కొనసాగుతున్న జేబీఎస్–ఎంజీబీఎస్ మార్గంలో సైతం మెట్రో రైలు ప్రయాణికులకు అందుబాటులోకి రావడం వల్ల లక్ష మందికి పైగా రవాణా సదుపాయం లభిస్తుంది. మైండ్‌స్పేస్ ముందు రాయదుర్గం మెట్రో స్టేషన్ రెండేళ్లలో 12.5 కోట్ల మంది ప్రయాణికులు ప్రపంచంలోనే అద్భుతమైన ప్రాజెక్టుగా పేరొందిన హైదరాబాద్ మెట్రో రైల్ పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో చేపట్టిన ప్రాజెక్టు. రెండేళ్ల క్రితం నగరంలో మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు 12.5 కోట్ల మంది ప్రయాణికులు మెట్రో సేవలను వినియోగించుకున్నారు. ప్రస్తుతం రోజుకు 4 లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నారు. ఈ రెండేళ్లలో మెట్రో రైళ్లు 86 లక్షల కిలోమీటర్లు తిరిగినట్లు హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్రెడ్డి తెలిపారు. -
బయోడైవర్సిటీ బస్టాప్ తరలింపు
సాక్షి, గచ్చిబౌలి : బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ నుంచి కారు పల్టీలు కొడుతూ ఎగిరి పడడంతో బస్సు కోసం ఎదురుచూస్తున్న సత్యవేణి మృతి చెందిన విషయం తెలిసిందే. కారు పడిన చోట బస్టాప్‌తో పాటు ఆటో స్టాండ్ ఉంది. ఫ్లైఓవర్ పైనుంచి పడిన కారు రోడ్డుపై పడి ఢీకొట్టడంతో చెట్టు విరిగిపోగా మరో నలుగురికి గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో మాదాపూర్ ట్రాఫిక్ పోలీసులు బయోడైవర్సిటీ జంక్షన్లో మాదాపూర్‌కు వెళ్లేందుకు నిస్సాన్ షోరూం ముందు ఉన్న బస్టాప్, ఆటో స్టాండ్‌ను అక్కడి నుంచి తరలించారు. ఈ జంక్షన్ నుంచి దాదాపు రెండు వందల మీటర్ల పొడవున బస్సులు, ఆటోలతో పాటు క్యాబ్‌లు ప్రయాణికుల కోసం అగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ప్రమాదానికి ముందు ప్రయాణికులు, వాహనాలు ఆగడంతో రద్దీగా ఉండే చోటు నేడు ఖాళీగా మారింది. ఇదే నెల మొదట్లో అర్ధరాత్రి కారు ఢీకొని ఇద్దరు యువకులు ఎగిరి నిసాన్ షోరూమ్ ముందున్న బస్టాప్ సమీపంలోనే పడి అక్కడికక్కడే మృతి చెందారు. గత శనివారం ఫ్లైఓవర్ పైనుంచి దూసుకొచ్చిన కారు కూడా అదే ప్రాంతంలో పడింది. బస్టాప్‌తో పాటు ఆటో స్టాండ్ ఉంటే ఎప్పటికైనా ప్రమాదమేనని ఆలోచించిన ట్రాఫిక్ పోలీసులు వాహనాలు ఆగకుండా చర్యలు తీసుకుంటున్నారు. -
యువ జాగృతి
-
కొండాపూర్ వద్ద ఫ్లై ఓవర్‌కు శంకుస్థాపన
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని కొండాపూర్ వద్ద మల్టీ లెవల్ ఫ్లై ఓవర్‌కు మంత్రి కేటీఆర్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ ఫ్లైఓవర్‌ను రూ. 263 కోట్లతో నిర్మించనున్నారు. గచ్చిబౌలి నుంచి హాఫిజ్‌పేట్ మార్గంలో నాలుగు లైన్ల ఫ్లై ఓవర్‌కు కూడా శంకుస్థాపన చేశారు. బొటానికల్ గార్డెన్ నుంచి ఓల్డ్ బాంబే రూట్.. కొండాపూర్ నుంచి హైటెక్ సిటీ రోడ్లను కలుపుతూ ఫ్లై ఓవర్ల నిర్మాణం జరగనుంది. హైటెక్‌సిటీ పరిసరాల్లో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ కష్టాలను తగ్గించేందుకు ఈ నాలుగు లేన్ల ఫ్లైఓవర్ ఉపయోగపగనుంది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ప్రజా రవాణా సౌకర్యాలు మెరుగు పరుస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. సరికొత్త ప్లై ఓవర్‌తో గచ్చిబౌలి నుంచి కొండాపూర్ మీదుగా హఫీజ్ పేట ప్రాంతాలకు వెళ్లే వాహనదారుల ట్రాఫిక్ కష్టాలకు తెరపడుతుందన్నారు. బొటానికల్ గార్డెన్ నుంచి ఓల్డ్ బాంబే రూట్.. కొండాపూర్ నుంచి హైటెక్ సిటీరోడ్లను కలుపుతూ ఈ నిర్మాణం సాగుతుందని తెలిపారు. నగరంలో ఇప్పటికే అనేక ఫ్లైఓవర్లు, అండర్ పాసులు నిర్మాణం కొనసాగుతుందని వాటిని దశవారీగా ప్రారంభోత్సవాలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మరో మంత్రి మహేందర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
బిల్‌గేట్స్‌కు కంప్యూటర్ గురించి చెప్పింది ఎవరో తెలుసా?
సాప్ట్వేర్ దిగ్గజం, మైక్రోసాప్ట్ కంపెనీ అధినేత బిల్ గేట్స్‌కు కంప్యూటర్ గురించి చెప్పింది ఎవరో తెలుసా? మన దేశంలో కంప్యూటర్ విద్యను ప్రమోట్ చేసింది ఎవరో తెలుసా? అంతెందుకు కంప్యూటర్ను కనుగొన్నది ఎవరో తెలుసా? మన మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రసంగాలు వింటే ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలిసిపోతాయి. వీటన్నింటికీ తానే ఆధ్యుడినని అన్నట్లు చంద్రబాబు ప్రసంగాలు ఉంటాయి. ఆయన స్వగతాల తీరు అలా సాగిపోతోంది. ఇంతటితో ఆగలేదు హైదరాబాద్‌లో హైటెక్ సిటీని కట్టింది తానే అంటారు. సాప్ట్వేర్ రంగాన్ని ముందుకు నడిపించిందీ కూడా తానే అంటూ ఆయన ఇప్పటికీ గొప్పలు చెప్పుకుంటూనే ఉన్నారు. ఆయనకు మైకు దొరికితే "చూడండి తమ్ముళ్లూ హైటెక్ సిటీని కట్టింది నేను. ఐటీ రంగాన్ని గుర్తించింది నేను.యువతను ఐటీ రంగం వైపు నడిపించింది నేను. ఐటీ ఎగుమతులను రికార్డు స్థాయిలో పెంచింది నేను. నా హయాంలో ఐటీ రంగం అభివృద్ధిని చూసి బిల్ గేట్సే మెచ్చుకున్నాడు" అని చెబుతుంటారు. వాస్తవానికి చంద్రబాబు నాయుడి పాలనలో ఐటీ రంగం దేశంలో ఏ రాష్ట్రంతో పోల్చినా తీసికట్టుగానే ఉంది. చంద్రబాబు పాలనలో ఐటీ రంగం ఎలా ఉంది? ఐటీ ఎగుమతులు ఏ విధంగా ఉన్నాయి? హైటెక్ సిటీ నిర్మాణం ఎవరికోసం జరిగింది? ఎవరికి మేలు జరిగింది? ఎవరి జేబులు నింపింది? చంద్రబాబు నాయుడి హయాంలో ఐటి ఎగుమతులు దేశం మొత్తంతో పోలిస్తే 6 శాతం ఉన్నాయి. చంద్రబాబు నాయుడి తర్వాత 2004 లో అధికారంలోకి వచ్చిన దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనలో అవే ఐటీ ఎగుమతులు 15 శాతానికి పెరిగాయి. అంటే రెండున్నర రెట్లు పెరిగాయి. చంద్రబాబు చెప్పుకునే ఐటీ జమానా కన్నా 250 శాతం ఎక్కువ. మరో ముఖ్య విషయం ఏమిటంటే చంద్రబాబుకు ముందు మన రాష్ట్రం ఐటి ఎగుమతులలో మూడవ స్థానంలో ఉండేది. ఆయన హయాం వచ్చేసరికి 4వ స్థానానికి దిగజారింది. వాస్తవాలు ఇలా ఉంటే ఐటి రంగాన్ని అభివృద్ధి చేసింది తానేనన్న భ్రమలో ఆయన ఉంటారు. ఐటీ ఛాంపియన్ని తానేనని చెప్పుకుంటుంటారు. ప్రజలను నమ్మించడానికి, వారి చెవిలో క్యాబేజీ పువ్వు పెట్టడానికి ప్రయత్నిస్తుంటారు. చీటికీ మాటికీ హైటెక్ సిటీ తానే కట్టించానని అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డులా చెబుతూనే ఉంటారు. హైటెక్ సిటీ నిర్మాణం వెనుక మతలబు: హైటెక్ సిటీ నిర్మాణం వల్ల చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన ప్రముఖులు లబ్దిపొందినట్లు ఒక పరిశోధనలో తేలింది. ఆ విషయాన్ని మాత్రం చంద్రబాబు ఎక్కడా బయటపెట్టారు. లండన్ ఎకనామిక్ స్కూల్‌కు చెందిన ప్రొఫెసర్ దలేల్ బెన్బాబాలి అనే విదేశీ మహిళ తన పిహెచ్డి కోసం ఈ హైటెక్ సిటీ నిర్మాణంపై పరిశోధన చేశారు. చంద్రబాబు నాయుడు తన సామాజిక వర్గానికి చెందిన వారు ఎక్కువగా ఉండే జూబిలీ హిల్స్, కెపిహెచ్బి ప్రాంతాలకు దగ్గరలోనే హైటెక్ సిటీ కట్టించారని తెలిపారు. తన సామాజిక వర్గానికి చెందిన ఆస్తుల విలువలు ఆమాంతం పెరిగేందుకు చంద్రబాబు దోహద పడ్డారని పేర్కొంది. హైటెక్ సిటీలో రాష్ట్ర వాటా కేవలం 18 శాతమే. స్థలం మనదే అయినా అంత తక్కువ వాటా ఉండడానికి కారణాలు వేరే ఉన్నాయి. హై టెక్ సిటీ నిర్మాణాన్ని చంద్రబాబు నాయుడు ఎల్ అండ్ టి కంపెనీకి అప్పగించారు. వారితో జరిగిన ఒప్పందంలో భాగంగా 40 నుంచి 50 శాతం వరకు ఉండవలసిన మన వాటాను 18 శాతానికే తగ్గించారు. దానికి ప్రతిఫలంగా ఎల్ అండ్ టి సంస్థ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయమైన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌ను ఉచితంగా నిర్మించి ఇచ్చిందన్న ఆరోపణలు ఉన్నాయి. హై టెక్ సిటీ నిర్మాణంలో బోలెడు అవకతవకలు జరిగాయని అప్పట్లో శాసనసభలో విపక్షాలు విరుచుకు పడ్డాయి. లెక్కకు మించి అవినీతి జరిగిందని విమర్శలు వెల్లువెత్తాయి. అలాగే హై టెక్ సిటీ చుట్టూ పక్కల భూములను చంద్రబాబు సూచన మేరకే సినీనటుడు మురళీ మోహన్ ముందుగానే కొని కోట్లకు పడగలెత్తారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. మురళీ మోహన్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో చంద్రబాబు కూడా వాటాదారుడని అప్పట్లో అసెంబ్లీలోనే అన్ని ప్రతిపక్షాలు ఆరోపించాయి. అయితే పుంఖాను పుంఖాలుగా వెల్లువెత్తిన ఈ ఆరోపణలను చంద్రబాబు నాయుడు కానీ, ఆయన అనుచరులు కానీ, ఆయన హయాం నాటి అధికారులు కానీ ఏనాడూ ఖండించ లేదు. హై టెక్ సిటీ నిర్మాణంలో జరిగిన గోల్ మాల్ ఆరోపణలకు వివరణ కూడా ఇవ్వలేదు. సొంత లాభం కొంత చూసుకుని హై టెక్ సిటీ నిర్మించిన చంద్రబాబు అదేదో జాతి ప్రయోజనాల కోసమే కంకణం కట్టుకున్నట్లు చెప్పడం విడ్డూరంగా ఉందని ఐటీ రంగ నిపుణులు ముక్కున వేలేసుకుంటున్నారు. పిలిచి పిల్లనిచ్చి పెళ్లి చేసి, పార్టీలో పదవి నిచ్చి ప్రోత్సహించిన ఎన్టీఆర్ నుంచి పదవినీ, పార్టీనీ లాక్కున్న చంద్రబాబు నాయుడు అడ్డగోలు విధానాలతో పార్టీ పేరును చెడగొడుతున్నారని తెలుగు తమ్ముళ్లు మనస్తాపం చెందుతున్నారు. ఇంత చేసిన చంద్రబాబుకు మళ్లీ అధికారం అప్పగిస్తే ఏం చేస్తారో తమకు తెలుసని పలువురు అంటున్నారు.