hits a car
-
అయ్యో భగవంతుడా.. తండ్రి కారు కాటికి పంపింది
సాక్షి,నాగోలు(హైదరాబాద్): ఓ వాచ్మెన్ కారును రివర్స్ తీసుకుంటుండగా కారు చక్రాలకింద పడి అతని కుమారుడు మృతి చెందాడు. ఈ సంఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌కు చెందిన అంగీర్ల రాణీ, లక్ష్మణ్ భార్యభర్తలు. వీరికి కుమారుడు సాత్విక్ (2) ఉన్నాడు. గత సంవత్సరం ఎల్బీనగర్లో కాస్మోపాలిటన్ కాలనీ రాణీ అపార్మ్మెంట్లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నారు. లక్ష్మణ్ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం అపార్ట్మెంట్ దగ్గర లక్ష్మణ్ ఇన్నోవా క్రిస్టా కారును క్లీన్ చేసి కారును రివర్స్‌లో తీస్తుండగా వెనకాల సైడ్‌నుంచి వచ్చిన లక్ష్మణ్ కుమారుడు సాత్విక్ కారు వెనుక చక్రాల కింద పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన లక్ష్మణ్ .. కుమారుడిని చికిత్స నిమిత్తం ఎల్బీనగర్లోని కామినేని హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి సాత్విక్ మృతి చెందినట్లు నిర్ధారించారు. సమచారం అందుకున్న ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: గూగుల్‌లో వాటి కోసం వెతికారా.. మన బ్యాంక్ అకౌంట్ ఖాళీనే! -
కారును ఢీకొన్న విమానం..
కాలిఫోర్నియా: ఓ ప్రైవేట్ విమానం అనుకోకుండా ప్రమాదానికి గురైంది. విమానం కారును ఢీకొన్న ఈ ఘటనలో ఒక మహిళ మృతి చెందగా, మరో ఐదుగురు వ్యక్తులు గాయాలపాలయ్యారు. ఈ ఘటన దక్షిణ కాలిఫోర్నియాలో శనివారం చోటుచేసుకుంది. కాలిఫోర్నియా పెట్రోలింగ్ అధికారి క్రిస్ పేరెంట్ తెలిపిన వివరాల ప్రకారం... ఒకే ఇంజిన్ విమానం లాంకేర్ 4 లో సాంకేతిక లోపాలు తలెత్తడంతో పైలట్ జాగ్రత్త వహించాడు. విమానాన్ని ల్యాండింగ్ చేయడానికి ప్రయత్నించాడు. అయితే, ల్యాండ్ అయ్యే సమయంలో రోడ్డుపై ఆగిఉన్న ఓ కారును విమానం ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ఓ మహిళ(38) మృతిచెందింది. పైలట్ తో పాటు కారులో ఉన్న నలుగురు గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. పైలట్ మాత్రం ఈ విషయంలో తన తప్పేమీ లేదని, ల్యాండింగ్ చేస్తున్నప్పుడు విమానం ఓవైపు ఒరిగిపోవడం వల్ల కారును ఢీకొట్టిందని చెప్పాడు. విమానం కారును ఢీకొట్టే సమయంలో కారు డ్రైవర్ పాటలు వింటున్నాడని, శబ్ధాన్ని గ్రహించలేదని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటన వల్ల రహదారిపై ట్రాఫిక్ జామ్ ఏర్పడి లాస్ వేగాస్ కు వెళ్లే దారిని కొన్ని గంటల పాటు మూసివేశారు. విమానం రోడ్డుపై ల్యాండ్ కావడంతో అక్కడున్నవారు ఒక్కసారిగా ఆశ్చర్చానికి లోనయ్యారు.