పెళ్లిళ్లలో హిజ్రాల వీరంగం.. నిరాకరిస్తే నగ్నంగా డ్యాన్స్
సాక్షి, జగిత్యాలక్రైం: పెళ్లంటే జీవితంలో ఒక్కసారి వచ్చే వేడుక. దీన్ని పేదవారు సైతం తమకు ఉన్నంతలో గొప్పగా జరిపించాలని అనుకుంటారు. కానీ హిజ్రాల కారణంగా భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. మామూళ్లు ఇవ్వకుంటే అసభ్యకరంగా ప్రవర్తిస్తూ శుభకార్యాల్లో అలజడి సృష్టిస్తున్నారు. జగిత్యాల రూరల్ మండలం పొరండ్ల గ్రామానికి చెందిన భీమయ్య కుమారుడి వివాహం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిపించారు. రాత్రి బరాత్ జరుగుతున్న సమయంలో హిజ్రాలు వచ్చి, వీరంగం సృష్టించారు. పెళ్లి కుమారుడిని డబ్బులు డిమాండ్ చేశారు. అతను నిరాకరించడంతో రెచ్చిపోయి, నగ్నంగా డ్యాన్స్ చేయడంతో అక్కడున్నవారు పారిపోయారు. రెండు రోజుల కిందట జగిత్యాల జిల్లా కేంద్రంలోని విద్యానగర్‌కు చెందిన రమణ కుమారుడి పెళ్లి స్థానిక ఓ ఫంక్షన్‌హాలులో జరిగింది. హిజ్రాలు వేదికపైకి వెళ్లి, ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించారు. డబ్బులివ్వాలంటూ అసభ్య పదజాలం వాడారు. దీంతో ఆయన రూ.5 వేలు ఇచ్చి, పంపించారు.
చదవండి: (ఒకే కాలేజీ.. ఫేస్బుక్లో దగ్గరై సహజీవనం.. పవిత్రకు నిజం తెలిసి.. )
రూ.50 వేల వరకు వసూలు
జగిత్యాల జిల్లాలోని అన్ని ఫంక్షన్‌హాళ్లలో హిజ్రాలు హల్చల్ చేస్తున్నారు. ఒక్కో పెళ్లికి రూ.5 వేల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేస్తున్నారు. దీంతో వధూవరుల తల్లిదండ్రులు తమ బంధువులు, స్నేహితుల ముందు హేళన కావొద్దని వా రు అడిగినంత ముట్టజెబుతున్నారు. సామాన్య కుటుంబాలకు చెందినవారు డబ్బు ఇచ్చేందుకు నిరాకరిస్తే అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. ఫలి తంగా శుభకార్యానికి వచ్చిన బంధువులు, కుటు ంబ సభ్యులు, స్నేహితులు భయపడుతున్నారు. ఎవరైనా హిజ్రాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తే వారితో ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో అందరూ జంకుతున్నారు.
చదవండి: (Hyderabad: వ్యభిచార గృహం గుట్టు రట్టు.. సోదరుడి ఇంట్లోనే..)
హిజ్రాల ఆగడాలను అరికట్టాలి
జిల్లాలో వివాహ వేడుకలకు వచ్చి, హిజ్రాలు మామూళ్లు కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఇవ్వకుంటే అసభ్యకరంగా ప్రవర్తిస్తుండటంతో ఫంక్షన్‌కు వచ్చిన వారంతా భయపడుతున్నారు. పోలీసులు స్పందించి, హిజ్రాల ఆగడాలను అరికట్టాలి.
– మారు గంగారెడ్డి, జాబితాపూర్
ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం
హిజ్రాలు మామూళ్ల కోసం డిమాండ్ చేస్తే బాధితులు 100 డయల్‌కు కాల్ చేయాలి. ఫిర్యాదు చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. శుభకార్యాల్లో ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించి, డబ్బులివ్వాలని వేధిస్తే హిజ్రాలను కఠినంగా శిక్షిస్తాం.
– రత్నపురం ప్రకాశ్, డీఎస్పీ, జగిత్యాల