హెచ్ఎం పనితీరుపై వాట్స్ప్ కామెంట్లు!
చేగుంట : మండల పరిధిలోని చందాయిపేట ఉన్నత పాఠశాల హెచ్ఎం పనితీరుపై అదే పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు వాట్సాప్‌లో కామెంట్లు చేశారు. మంగళవారం పలువురు ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్లను ఫొటోలు తీసి చందాయిపేట పాఠశాల రిజిస్టర్ పరిస్థితి ఈ విధంగా ఉందంటూ వ్యాఖ్యానించారు. గతంలో కూడా హెచ్ఎంపై ఉపాధ్యాయులు వేధింపులకు గురిచేస్తుండడంతో ఉపాధ్యాయ సంఘాల నాయకులు సైతం కోఆర్డినేషన్ సమావేశం ఏర్పాటు చేసి హెచ్ఎంను గౌరవించి ఉపాధ్యాయులంతా స్నేహపూరితంగా ఉండాలని సూచించారు.
అయినా ఉపాధ్యాయుల వంకర బుద్ధులు మానలేదు. మంగళవారం సైతం ఉపాధ్యాయులు.. హెచ్ఎంపై ఉపాధ్యాయులు పలువురు వాట్సప్‌లో కామెంట్లు చేశారు. ఇదే విషయాన్ని మంగళవారం చేగుంటకు వచ్చిన డిప్యూటీ డీఈఓ శోభను న్యూస్‌లైన్ వివరణ కోరగా పాఠశాల వివరాలు బహిర్గతం చేయడం సైబర్ నేరం కిందకు వస్తుందని విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని వివరణ ఇచ్చారు. కాగా పాఠశాల విషయాలను వాట్సప్‌లో పొందుపరిచిన విషయంలో ప్రధానోపాధ్యాయురాలు గంగాబాయి మంగళవారం డీఈఓ రాజేశ్వర్రావ్కు ఫిర్యాదు చేశారు.