Honorable
-
Respect Pakistan: అయ్యర్ వీడియో కలకలం
న్యూఢిల్లీ: వరసబెట్టి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న కాంగ్రెస్ నేతల జాబితాలో మణిశంకర్ అయ్యర్ చేరిపోయారు. దక్షిణభారత వాసులు ఆఫ్రికన్లలా ఉంటారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన శ్యామ్ పిట్రోడా వివాదం ముగిసేలోపే అయ్యర్ పాత వీడియో ప్రస్తుతం బీజేపీ ఎన్నికల ప్రచారాస్త్రంగా మారిపోయింది. పాక్ పట్ల కాంగ్రెస్ పక్షపాత ధోరణి మరోసారి బట్టబయలైందని బీజేపీ దుమ్మెతిపోయగా అవి అయ్యర్ వ్యక్తిగత అభిప్రాయాలని, పారీ్టతో సంబంధం లేదని కాంగ్రెస్ ఖరాకండీగా చెప్పేసింది. అయ్యర్ అన్నదేంటి? ఏప్రిల్‌లో ‘చిల్పిల్ మణిశంకర్’ పేరిట జరిగిన ఒక ఇంటర్వ్యూలో అయ్యర్ చేసిన వ్యాఖ్యల తాలూకు వీడియో శుక్రవారం సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమైంది. ‘‘ పొరుగుదేశమైన పాకిస్తాన్‌కు మనం గౌరవం ఇవ్వాల్సిందే. ఎందుకంటే అది కూడా సార్వ¿ౌమ దేశమే. దాయాది దేశంతో తగాదాలకు పోతే భారత్‌పై అణుబాంబు వేయాలనే దుర్బుద్ధి పాక్ పాలకుల్లో ప్రబలుతుంది. పాక్‌తో కఠినంగా వ్యవహరించొచ్చు. కానీ చర్చలైతే జరపాలికదా. సరిహద్దుల్లో తుపాకీ పట్టుకుని తిరిగినంతమాత్రాన ఒరిగేదేమీ ఉండదు. ఉద్రిక్తతలు అలాగే కొనసాగుతాయి. పాక్‌లో పిచ్చోడు అధికారంలోకి వస్తే భారత్‌కు ప్రమాదమే కదా. పాక్ వద్ద కూడా అణుబాంబులు ఉన్నాయి. మన అణుబాంబును లాహోర్‌లో పేలిస్తే తిరిగి దాని రేడియోధారి్మక ప్రభావం కేవలం ఎనిమిది సెకన్లలోనే మన అమృత్సర్పై పడుతుంది. అందుకే పాక్‌తో చర్చల ప్రక్రియ మొదలెట్టాలి’’ అని అన్నారు. -
హంతకులకు కేంద్ర మంత్రి సన్మానం!
హజారీబాగ్: కేంద్ర మంత్రి జయంత్ సిన్హా వివాదంలో చిక్కుకున్నారు. గతేడాది ఓ మాంస వ్యాపారిని కొట్టి చంపిన కేసులో జైలు నుంచి విడుదలైన నిందితులకు శుక్రవారం ఆయన పూల మాలలు వేసి సన్మానించారు. ప్రతిపక్షాలు మంత్రి చర్యను ఖండించాయి. నిందితులకు మిఠాయిలు తినిపించిన జయంత్ సిన్హా..న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంచాలని, తప్పకుండా న్యాయం జరుగుతుందని వారికి భరోసా ఇచ్చారు. తన నియోజకవర్గానికి చెందిన వారంతా విడుదలవడం ఎంతో సంతోషంగా ఉందని, వారికి న్యాయం జరిగేలా చూడటం తన బాధ్యత అని పేర్కొన్నారు. తమకు లాయర్‌ను ఏర్పాటుచేసిన మంత్రికి 8 మంది నిందితులు ధన్యవాదాలు తెలిపారు. విద్వేషపూరిత, విభజన రాజకీయాలు సమాజాన్ని దారుణంగా దెబ్బతీస్తున్నాయని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మండిపడ్డారు. జయంత్ సిన్హా తీరు హేయమైనదని జేఎంఎం నాయకుడు హేమంత్ సోరెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
హై డ్రామా!
- భాస్కరరావు, అశ్విన్‌రావును కాపాడే యత్నం సాగుతోంది - కేసును సీబీఐకి అప్పగించకుండా ప్రభుత్వం నాటకాలాడుతోంది - ప్రభుత్వంపై విశ్రాంత లోకాయుక్త సంతోష్ హెగ్డే మండిపాటు సాక్షి, బెంగళూరు: లోకాయుక్త సంస్థకున్న గౌరవ మర్యాదలను మంటగలిపిన న్యాయమూర్తి వై.భాస్కర్‌రావు, ఆయన కుమారుడు అశ్విన్‌రావును రక్షించే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని మాజీ లోకాయుక్త సంతోష్ హెగ్డే విమర్శించారు. అందుకే ఈ కేసును సీబీఐకి అప్పగించకుండా నాటకాలాడుతోందంటూ తీవ్రంగా మండిపడ్డా రు. ‘భూ కబ్జాల వ్యతిరేక పోరాట సమితి’ ఆధ్వర్యంలో శనివారమిక్కడి శాసకర భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంతోష్ హెగ్డే ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. లోకాయుక్త సంస్థ న్యాయమూర్తిగా పనిచేస్తున్న భాస్కర్‌రావుపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక విచారణ బృందం(ఎస్ఐటీ)ను ఏర్పాటు చేసిందని, అయితే ఎస్ఐటీకి కేవలం ఫిర్యాదులు నమోదు చేసుకునే అధికారాన్ని మా త్రమే కల్పించిందని అన్నారు. కనీసం ఎఫ్ఐర్ నమో దు చేసి, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని అరెస్టు కూడా చేయలేని సందర్భంలో ఇక ఎస్ఐటీని ఏర్పాటు చేసి ఏం లాభం ఉంటుందని ఆయన ప్రశ్నించారు. న్యాయమూర్తి వై.భాస్కర్‌రావు అవినీతికి పాల్పడకపోయి ఉండవచ్చని, అయితే ఆయన కుమారుడు అశ్విన్‌రావు మాత్రం లోకాయుక్త పేరు చెప్పుకునే అవినీతి కార్యకలాపాలకు పాల్పడ్డారని అన్నారు. అందువల్ల ఇందుకు నైతిక బా ద్యత వహిస్తూ లోకాయుక్త స్థానానికి భాస్కరరావు రాజీనామా చేయాల్సి ఉందని అన్నారు. ఇక ఈ కేసును సీబీఐకి అప్పగించే అధికారాలు తమకు లేవంటూ రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తోందంటూ సంతోష్ హెగ్డే విమర్శించారు. లోకాయుక్త విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు సంతోష్‌హెగ్డే పేర్కొన్నారు. అనంతరం భూ కబ్జాల వ్యతిరేక పోరాట సమితి ప్రతినిధి ఎ.టి.రామస్వామి మాట్లాడుతూ....లోకాయుక్త న్యాయమూర్తి వై.భాస్కర్‌రావును ఆ పదవి నుంచి తప్పించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మౌనం వహించడం శోచనీయమని అన్నా రు. ఇక లోకాయుక్త న్యాయమూర్తి వై.భాస్కర్‌రావు కూ డా లోకాయుక్త ప్రతిష్టను మరింత దిగజార్చేలా పదవిని పట్టుకొని వేలాడుతున్నారని మండిపడ్డారు. లోకాయుక్త సంస్థ ప్రతిష్టను దెబ్బతీసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమం లో స్వాతంత్య్ర సమర యోధుడు హెచ్.ఎస్.దొరెస్వామి తదితరులు పాల్గొన్నారు.