at hospital
-
మహిళ మృతితో ఆస్పత్రి ఎదుట ఆందోళన
ధవళేశ్వరం: ప్రసవానంతరం ఓ మహిళ మృతి చెందడంతో ఆస్పత్రి ఎదుట స్థానికులు ఆందోళన చేపట్టారు. రాజకీయ పార్టీల నేతలతో జరిగిన చర్చల్లో నష్టపరిహారం చెల్లించేందుకు ఆస్పత్రి యాజమాన్యం అంగీకరించడంతో ఆందోళన విరమించారు. స్థానిక ఎర్రకొండ ప్రాంతానికి చెందిన గూటాల హేమలత(22) ప్రసవం కోసం శుక్రవారం ధవళేశ్వరం సీఈఎం ఆస్పత్రిలో చేరింది. ఆమె శనివారం సాయంత్రం మగపిల్లవాడిని ప్రసవించింది. కొంతసేపటి తరువాత పల్స్ డౌన్ అయ్యిందని, ఆమెను రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లాలని సీఈఎం ఆస్పత్రి వైద్యులు హేమలతను అంబులెన్స్‌లో పంపారు. అప్పటికే హేమలత మృతి చెంది సుమారు గంట అయ్యి ఉంటుందని అక్కడి వైద్యులు చెప్పడంతో బంధువులు మృతదేహంతో ధవళేశ్వరం సీఈఎం ఆస్పత్రి ఎదుట శనివారం రాత్రి ఆందోళన చేపట్టారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి నక్కా రాజబాబు, నియోజకవర్గ కో–ఆర్డినేటర్ గిరజాల బాబు, సీపీఎం నాయకులు కర్రి రామకృష్ణ, ఎన్.భీమేశ్వరరావు, ఎస్ఎస్ మూర్తి, సీపీఐ నాయకులు కిర్ల కృష్ణ, టీడీపీ నాయకులు ఇళ్ల రాంబాబు, దుర్గారావు, బత్తిన ఏడుకొండలు, నాళ్ళ రమేష్, డీఎస్పీ నారాయణరావు, సీఐ కృపానందం తదితరులు పలు దఫాలు ఆస్పత్రి యాజమాన్యంతో చర్చలు జరిపారు. ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యంతోనే తన భార్య మృతి చెందిందని రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. మృతురాలి కుటుంబానికి రూ.2లక్షలు ఇవ్వడానికి ఆసుపత్రి యాజమాన్యం అంగీకరించడంతో ఆదివారం మధ్యాహ్నం ఆందోళనను విరమించారు. -

శస్త్రచికిత్స చేసి.. సూది మర్చిపోయి..
∙రెండు నెలల తర్వాత బయటపడిన వైనం కంబాలచెరువు(రాజమహేంద్రవరం) : కాలికి శస్త్రచికిత్స చేసి, శరీరం లో సూది మర్చిపోయి న వైద్యుడి నిర్వాకం ఇది. బాధితురాలి కుమారుడు నిమ్మలపూడి లక్ష్మణరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అతడి తల్లి నిమ్మలపూడి వీరమ్మ(72) ఐదు నెలల క్రితం ఇంట్లో పడిపోవడంతో కాలి ఎముక విరిగిం ది. దీంతో దానవాయిపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చూపించడంతో, అక్కడి వైద్యుడు డాక్టర్ రవిప్రకాశ్ నేతృత్వంలో శస్త్రచికిత్స చేశారు. అనంతరం ఇంటికెళ్లిన రెండు నెలల తర్వాత ఆమె కాలిలో తీవ్రనొప్పి మొదలైం ది. దీంతో ఆపరేషన్ చేసిన డాక్టర్‌ను కలిశారు. ఫర్వాలేదు.. కొద్దిరోజులకు తగ్గిపోతుందంటూ ఆయన పంపేశారు. నొప్పి తగ్గకపోవడంతో మోరంపూడిలోని మరో ప్రైవేట్ ఆస్పత్రిలో ఆమె బంధువులు చూపించారు. కాలిలో సూది ఉందని అక్కడి వైద్యులు చెప్పారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఆమోదంతో వీరమ్మకు వైద్యులు శస్త్రచికిత్స చేసి, కాలిలోని సూదిని తొలగించారు. ముందుగా శస్త్రచికిత్స చేసిన ఆస్పత్రి వద్దకు ఆదివారం రాత్రి చేరుకున్న బాధితురాలి బంధువులు అక్కడి వైద్యుడిని నిలదీశారు. తమకు న్యాయం చేయాలంటూ ఆస్పత్రి వద్ద ఆందోళన చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ప్రకాశ్‌నగర్ పోలీసులు అక్కడకు చేరుకున్నారు. దీనిపై ఆస్పత్రి వైద్యుడు రవిప్రకాశ్ మాట్లాడుతూ సర్జరీ సమయంలో తాము రోగి శరీరంలో ఏమీ మర్చిపోలేదని, కుట్లు వేసే సమయంలో కే వైర్ అనేది శరీరరంలో ఉండిపోయిందని తెలిపారు.