శస్త్రచికిత్స చేసి.. సూది మర్చిపోయి..
శస్త్రచికిత్స చేసి.. సూది మర్చిపోయి..
Published Sun, Jul 17 2016 11:25 PM | Last Updated on Mon, Sep 4 2017 5:07 AM
∙రెండు నెలల తర్వాత బయటపడిన వైనం
కంబాలచెరువు(రాజమహేంద్రవరం) : కాలికి శస్త్రచికిత్స చేసి, శరీరం లో సూది మర్చిపోయి న వైద్యుడి నిర్వాకం ఇది. బాధితురాలి కుమారుడు నిమ్మలపూడి లక్ష్మణరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అతడి తల్లి నిమ్మలపూడి వీరమ్మ(72) ఐదు నెలల క్రితం ఇంట్లో పడిపోవడంతో కాలి ఎముక విరిగిం ది. దీంతో దానవాయిపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చూపించడంతో, అక్కడి వైద్యుడు డాక్టర్ రవిప్రకాశ్ నేతృత్వంలో శస్త్రచికిత్స చేశారు. అనంతరం ఇంటికెళ్లిన రెండు నెలల తర్వాత ఆమె కాలిలో తీవ్రనొప్పి మొదలైం ది. దీంతో ఆపరేషన్ చేసిన డాక్టర్‌ను కలిశారు. ఫర్వాలేదు.. కొద్దిరోజులకు తగ్గిపోతుందంటూ ఆయన పంపేశారు. నొప్పి తగ్గకపోవడంతో మోరంపూడిలోని మరో ప్రైవేట్ ఆస్పత్రిలో ఆమె బంధువులు చూపించారు. కాలిలో సూది ఉందని అక్కడి వైద్యులు చెప్పారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఆమోదంతో వీరమ్మకు వైద్యులు శస్త్రచికిత్స చేసి, కాలిలోని సూదిని తొలగించారు. ముందుగా శస్త్రచికిత్స చేసిన ఆస్పత్రి వద్దకు ఆదివారం రాత్రి చేరుకున్న బాధితురాలి బంధువులు అక్కడి వైద్యుడిని నిలదీశారు. తమకు న్యాయం చేయాలంటూ ఆస్పత్రి వద్ద ఆందోళన చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ప్రకాశ్‌నగర్ పోలీసులు అక్కడకు చేరుకున్నారు. దీనిపై ఆస్పత్రి వైద్యుడు రవిప్రకాశ్ మాట్లాడుతూ సర్జరీ సమయంలో తాము రోగి శరీరంలో ఏమీ మర్చిపోలేదని, కుట్లు వేసే సమయంలో కే వైర్ అనేది శరీరరంలో ఉండిపోయిందని తెలిపారు.
Advertisement
Advertisement