hostel buildings
-
కోటాలో భవంతులకు వలలు
కోటా: పోటీ ప్రవేశ పరీ క్షలకు ప్రసిద్ధి చెందిన రాజస్తాన్‌లోని కోటా పట్ట ణం ఇటీవల విద్యార్థుల ఆత్మహత్యలతో తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఈ ఏడాది ఏకంగా 20 మంది విద్యార్థులు బలవన్మ రణానికి పాల్పడడంతో జిల్లా యంత్రాంగం ఆత్మహత్యల నిరోధానికి ఎన్నో చర్యలు చేపట్టింది. ఇప్పటికే అన్ని హాస్టల్స్‌లో విద్యార్థులకు కౌన్సెలింగ్‌తోపాటు యోగా తరగతులు ప్రారంభించింది. ఫ్యాన్‌కు ఉరేసుకుని చాలా మంది విద్యార్థులు ప్రాణాలు తీసుకున్న ఉదంతాల నేపథ్యంలో ఫ్యాన్లను స్ప్రింగ్‌లకు బిగించారు. ఇప్పుడు తాజాగా అన్ని హాస్టల్ భవనాలకు వలలు బిగించాలని జిల్లా యంత్రాంగం హాస్టల్ యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో విద్యార్థులు భవనాలపైకి ఎక్కి దూకకుండా ‘సూసైడ్ ప్రూఫ్’ వలలు బిగించే కార్యక్రమాన్ని అన్ని హాస్టళ్లు యుద్ధప్రాతిపదికన అమరుస్తున్నాయి. ‘భవనాల వెలుపల, బాల్కనీల్లోనూ పెద్ద పెద్ద వలలు బిగించాం. ఇవి 150 కేజీల బరువులను సైతం మోయగలవు. ఎవరైనా విద్యార్థి భవనంపై నుంచి దూకినా ఈ వలలో పడతారు. గాయాలు కావు’ అని అమ్మాయిల హాస్టల్ నిర్వహిస్తున్న వినోద్ గౌతమ్ వివరించారు. ‘ఫ్యాన్లకు స్ప్రింగ్‌లు, భవనాలకు వలల కారణంగా విద్యార్థుల ఆత్మహత్యలను దాదాపు అడ్డుకోవచ్చు. విద్యార్థులను హాస్టల్స్‌లో విడిచి వెళుతున్న తల్లిదండ్రులు ఆందోళనతో ఉంటారు. ఇలాంటి నివారణ చర్యల కారణంగా తల్లిదండ్రుల్లో ధైర్యం కాస్తంత ఎక్కువ అవుతుంది’ అని గౌతమ్ అభిప్రాయపడ్డారు. ‘ఇలాంటి చర్యలు తాత్కాలికంగా ఆత్మహత్యలను నిరోధించగలవేమో. కానీ విద్యార్థులపై చదువుల ఒత్తిడిని తగ్గించాలి. అదే అసలైన పరిష్కారం’ అని కొందరు మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
శిథిల భవనాలు.. గాలిలో ప్రాణాలు!
ఇందూరు(నిజామాబాద్ అర్బన్): హాస్టల్ భవనా లు శిథిలావస్థకు చేరాయి.. విద్యార్థుల ప్రాణాలు గాలిలో దీపంలా మారాయి! ఇటీవల బోధన్‌లోని ప్రభుత్వ బీసీ బాలికల కళాశాల వసతిగృహంలో పైకప్పు కూలి ముగ్గురు విద్యార్థినులకు తీవ్ర గాయాలైన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో ప్రస్తు తం శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ వసతిగృహాల్లో ఉండేందుకు విద్యార్థులు జంకుతున్నారు. తమ వసతిగృహం పైకప్పు కూడా కూలి తమపై పడుతుందని భయం భయంతో కాలం వెళ్లదీస్తున్నారు. అయితే, హాస్టళ్లకు మరమ్మతులు చేయించాలని జిల్లా నుంచి ఎస్సీ, బీసీ సంక్షేమ శాఖల అధికారులు ప్రభుత్వానికి పలుమార్లు ప్రతిపాదనలు పంపినా సర్కారు.. వాటిని బుట్టదాఖలు చేస్తోంది. దీంతో నిధులు లేక హాస్టళ్లలో మరమ్మతు కరువయ్యాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా బోధన్‌లోని బీసీ హాస్టల్లో పైకప్పు కూలిపోయి విద్యార్థినులపై పడిందని తల్లిదండ్రులు విమర్శిస్తున్నారు. ప్రభుత్వం నిధులిస్తే హాస్టల్‌కు మరమ్మతులు చేయించి ఉంటే ఈ ఘటన జరిగేది కాదని వారు చెబుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో కొనసాగుతున్న ప్రీ మెట్రిక్, పోస్టు మెట్రిక్ హాస్టళ్లలో చాలా వరకు సౌకర్యాలు సక్రమంగా లేవు. స్లాబు లీకేజీ, బోరు రిపేర్, విరిగిన కిటికీలు, తలుపులు, డ్రైనేజీ వసతులు అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఫ్యాన్లు, విద్యుత్ దీపాలు, పైపులైన్లు, సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్, టాయిలెట్స్, బాత్రూంలు, వాటర్ ప్లాంటు, ఫ్లోరింగ్, ఇతర పనులు చేయించాల్సి ఉంది. ఆయా పనుల కోసం నిధులు మంజూరు చేయాలని చాలా సార్లు అంచనాలు వేసి ప్రతిపాదనలు జిల్లా శాఖల నుంచి రాష్ట్ర శాఖల ద్వారా ప్రభుత్వానికి వెళ్లాయి. ప్రస్తుతం జిల్లాలో ఎస్సీ ప్రీ మెట్రిక్ హాస్టళ్లు, పోస్టు మెట్రిక్ కలిపి 39 ఉన్నాయి. అన్ని హాస్టళ్లలో కలిపి దాదాపు రూ.2 కోట్ల వరకు మరమ్మతులకు ప్రతిపాదనలు గతేడాది వెళ్లాయి. బీసీ హాస్టళ్ల విషయానికి వస్తే 19 ప్రీ మెట్రిక్, 4 పోస్టు మెట్రిక్ కలిపి మొత్తం 23 హాస్టళ్లు ఉండగా, 4 వేలకు పైగా విద్యార్థులు వసతి పొందుతున్నారు. అయితే, వీటిలో మరమ్మతుల కోసం బీసీ సంక్షేమ శాఖ నుంచి రూ.1.25 కోట్ల అంచనాతో గతేడాది ప్రతిపాదనలు పంపించారు. మొత్తం హాస్టళ్లకు కలిపి జిల్లాకు దాదాపు రూ.3.50 కోట్ల వరకు నిధులు అవసరం ఉండగా, ఆ ప్రతిపాదనలను ఈ ఏడాది జనవరిలో ప్రభుత్వం తిరస్కరించింది. మరోసారి ప్రతిపాదనలు.. బోధన్‌లో బీసీ బాలికల కళాశాల హాస్టల్ పైకప్పు కూలి ముగ్గురు విద్యార్థినులకు తీవ్ర గాయాలు కావడంతో మరమ్మతులు ఏయే హాస్టళ్లకు అత్యవసరమో గుర్తించారు. నిజామాబాద్‌లో బాలికలు, బాలుర హాస్టళ్లు, ఆర్మూర్‌లో బాలుర, బాలికల వసతి గృహాలు, రెంజల్ బాలికల హాస్టల్, బోధన్ బాలికల హాస్టళ్లు రెండు, మోపాల్ బాలుర హాస్టల్, కుద్వాన్పూర్ బాలుర హాస్టల్, బాల్కొండ బాలుర, బాలికల వసతిగృహాలు, చౌట్పల్లి బాలుర హాస్టల్, పడగల్ బాలుర హాస్టల్, కోటగిరి బాలుర హాస్టల్, మాక్లూర్ బాలుర హాస్టల్ కలిపి 15 హాస్టళ్లలో మరమ్మతులు అత్యవసరమని, ఇందుకు రూ.55.65 లక్షలు అవసరమని ప్రతిపాదనలను ఇటీవల బీసీ సంక్షేమ శాఖ నుంచి వెళ్లాయి. ఇటు కలెక్టర్ రామ్మోహన్రావు కూడా నిధుల కోసం రాష్ట్ర శాఖలకు లేఖ రాయడానికి సిద్ధమైనట్లు సమాచారం. మరీ ఈ నిధులనైనా ప్రభుత్వం మంజూరు చేస్తుందో లేదో..? -
అద్దెకోసం అడ్డదారులు
గురుకుల పాఠశాలలు కొనసాగుతున్న ప్రైవేటు భవనాలకు ప్రభుత్వం పెద్ద మొత్తంలో అద్దె చెల్లిస్తోంది. దీంతో పక్క జిల్లాలో ఇప్పటికే మూతబడిన ఇంజినీరింగ్ కాలేజీల యాజమాన్యాల దృష్టి వీటి వైపు మళ్లింది. స్కూల్ పర్యవేక్షణ అధికారులకు పర్సెంటేజీలు ఇచ్చి.. జిల్లాలో కొనసాగుతున్న పాఠశాలలను మూతబడిన తమ కళాశాల భవనాలకు తరలించేలా లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. ఫలితంగా గత మూడేళ్లుగా జిల్లాలోని అద్దె భవనాల్లో కొనసాగుతున్న గురుకులాల్లో నీళ్లు లేవని, ఇరుగ్గా ఉన్నాయని సాకులు చూపుతున్న అధికారులు.. చిన్నచిన్న సమస్యల పరిష్కారానికి ప్రత్నామ్నాయ ఏర్పాట్లు చేయకుండా జిల్లా దాటిస్తున్నారు. పరిగి : గురుకులాలకు గూడు కష్టాలు మొదలయ్యాయి. ఆర్భాటంగా ఆశ్రమ పాఠశాలలను మంజూరు చేస్తున్న ప్రభుత్వం వీటికి సొంత భవనాలు నిర్మించకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాకు మంజూరైన గురుకులాల నిర్వహణను గాలికి వదిలేయడంతో.. పక్క జిల్లాకు తరలిపోతున్నాయి. చిన్నచిన్న విషయాల్లో రాజకీయాలు చేసే జిల్లా ఎమ్మెల్యేలకు వీటి గోడు పట్టడంలేదు. ఈ స్కూళ్లకు కనీసం స్థానికంగా అద్దె భవనాలు కూడా సమకూర్చలేకపోతున్నారు. ఇదే అదనుగా భావిస్తున్న ఇంజినీరింగ్ కళాశాలల ఓనర్లు.. అద్దె ఆశతో ఒక్కో ఆశ్రమ పాఠశాలను పక్క జిల్లాకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో జిల్లాకు చెందిన మూడు గురుకులాలు రంగారెడ్డికి పయనమయ్యాయి. జిల్లాలో 24 గురుకులాలు.. గతంలో నియోజకవర్గానికి రెండు చొప్పున గురుకుల పాఠశాలలు ఉండేవి. తెలంగాణ ప్రభుత్వం కొలువుదీరాక ఒక్కో నియోజకవర్గానికి నాలుగు గురుకులాలు మంజూరు చేసింది. దీంతో జిల్లాలో వీటి సంఖ్య 24కు చేరింది. జిల్లా వ్యాప్తంగా గతంలో ఉన్న ఎనిమిది స్కూళ్లకు సొంత భవనాలు ఉండగా.. కొత్తగా మంజూరైన వాటిని అద్దె భవనాల్లో ప్రారంభించారు. మూడేళ్లుగా ఈ స్కూళ్లు కొనసాగుతున్నా ఇప్పటికీ సొంత గూళ్లకు నోచుకోలేదు. పరిగిలో మొదట రెండు గురుకులాలు ఉండేవి. వీటికి సొంత భవనాలు ఉన్నాయి. అయితే కొత్తగా మంజూరైన మూడు స్కూళ్లకు సంబంధించి ఒక్క ట్రైబల్ వెల్ఫేర్ గురుకులానికి మాత్రమే సొంత భవనం మంజూరు చేశారు. దీని నిర్మాణ పనులు సైతం నత్తనడకన కొనసాగుతున్నాయి. మిగతా వాటికి ఇంకా భవనాలే మంజూరు కాలేదు. నెలకు 6.లక్షల అద్దె.. మూడేళ్ల క్రితం సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా జిల్లాకు మహిళా డిగ్రీ కళాశాల మంజూరైంది. భవనం నిర్మించే వరకు వికారాబాద్‌లోని కొత్తగడిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అనంతరం కాలేజీని రంగారెడ్డి జిల్లా ఇబ్రహింపట్నం సమీపంలో ప్రారంభించారు. అప్పటికే ఇక్కడ రంగారెడ్డి జిల్లాకు చెందిన మరో గురుకుల పాఠశాల కొనసాగుతోంది. అయితే తమకే స్థలం సరిపోవడం లేదని చెప్పటంతో మొయినాబాద్‌కు మార్చారు. అక్కడ ఓ ఏడాది కొనసాగిన తర్వాత మళ్లీ చేవెళ్ల సమీపంలోని తోల్కట్ట దగ్గర్లో ఉన్న ఓ ఇంజినీరింగ్ కాలేజీ భవనంలోకి మార్చారు. దీనికి ప్రస్తుతం నెలకు రూ.6 లక్షలకు పైగా అద్దె చెల్లిస్తున్నారు. ఊరెళ్ల భవనానికి రూ.10 లక్షలు రెండేళ్ల క్రితం పరిగిలో పరిగితో పాటు బురాన్‌పూర్‌కు సంబంధించిన రెండు బీసీ గురుకుల పాఠశాలలు ప్రారంభించారు. వీటిలో ఒక్కోదానికి నెలకు రూ.98 వేల అద్దె చెల్లించే వారు. అయితే ఏడాదికి పైగా కొనసాగిన తర్వాత కొత్తగా సమస్యలు పుట్టుకొచ్చాయి. ఈ సాకుతో బురాన్‌పూర్ బీసీ గురుకులాన్ని చేవెళ్ల మండల పరిధిలోని ఊరెళ్ల ఇంజినీరింగ్ కళాశాలలోకి మార్చారు. దీంతో పాటు పరిగి గురుకులానికి చెందిన మూడు తరగతులను కూడా పక్క జిల్లాకు మార్చారు. ఒకే గురుకులాన్ని ఒక చోట సగం.. పక్క జిల్లాలో సగం తరగతులు నిర్వహిస్తున్న అధికారుల ధోరణిపై తల్లిదండ్రులు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. అయితే ఇక్కడ నెల అద్దెరూ.98 వేలు చెల్లిస్తూ రాగా.. పక్కజిల్లాలోని భవనానికి మాత్రం నెలకు రూ.10 లక్షల అద్దె చెల్లిస్తున్నారు. ఇలా రెండేళ్ల పాటు చెల్లించే అద్దెతో ఏకంగా గురుకుల భవన నిర్మాణమే పూర్తి చేయవచ్చనే విమర్శలు వినిపిస్తున్నాయి. వికారాబాద్ వచ్చేందుకు సిద్ధం.. గురుకుల పాఠశాలలు, కళాశాలలు వికారాబాద్ జిల్లా నుంచి పక్క జిల్లాకు తరలిపోవడంపై ఓ గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. తాము వికారాబాద్ జిల్లాకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని.. ఇదే విషయాన్ని పలుమార్లు జిల్లా ఎమ్మెల్యేలు, అధికారుల దృష్టికి కూడా తీసుకు వెళ్లామని తెలిపారు. వికారాబాద్ జిల్లాలో భవనం చూయిస్తే అందులోకి షిఫ్ట్ అవుతామని చెప్పారు. వికారాబాద్ జిల్లాకు చెందిన స్కూళ్లు, కాలేజీ కావడంతో ఏ సమస్య ఎదురైనా రంగారెడ్డి జిల్లా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న భవనాలు ఏ పట్టణానికి దగ్గరగా లేకపోవటంతో విద్యార్థులు అనారోగ్యానికి గురైతే రాత్రి వేళల్లో ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు అవస్థలు పడాల్సి వస్తోందన్నారు. అధికారుల అత్యుత్సాహం జిల్లాలోని గురుకులాలను పక్క జిల్లాలకు మార్చేందుకు అధికారులు అత్యుత్సాహం చూపుతున్నారు. గురుకులాలు మంజూరవగానే దగ్గరుండి నాలుగు భవనాలు చూపించా. కొడంగల్‌లో స్థలం దొరకడంలేదంటే దానికి కూడా పరిగిలో భవనం చూపించా. ఏదో కారణం చెప్పి దాన్ని మరోచోటకు మార్చారు. ఇంకో గురుకులానికి చెందిన మూడు తరగతులను పక్క జిల్లాకు తరలించారు. ఇక్కడికి తెస్తామంటే తోల్కట్ట వద్ద కొనసాగుతున్న కాలేజీకి కూడా పరిగిలో భవనం సమకూరుస్తాం. – టి.రామ్మోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే, పరిగి -
‘ఆదర్శం... అపహాస్యం!.
♦ నెరవేరని ఆదర్శ పాఠశాల లక్ష్యం ♦ అరకొరగా నిర్మితమైన హాస్టల్ భవనాలు ♦ ఉన్నవి ప్రారంభించకపోవడంతో మొలుస్తున్న పిచ్చిమొక్కలు ♦ నిరుపయోగంగా పడి ఉన్న వసతి సామగ్రి ♦ సుదూరం నుంచి ఆటోల్లో తప్పని రాకపోకలు నిరుపేదలకు కార్పొరేట్ తరహా విద్యను అందించాలి... వారిని సమున్నతంగా తీర్చిదిద్దాలి... అందుకోసం సకల సౌకర్యాలతో భవనాలు... వసతి సమకూర్చాలి. ఆంగ్ల బోధనద్వారా ఉజ్వల భవితను అందించాలి. ఒక్క మాటలో చెప్పాలంటే పిల్లలంతా ఆదర్శంగా నిలవాలన్న లక్ష్యంతో రూపొందించిన ఆదర్శ పాఠశాలల వ్యవస్థ అపహాస్యవమవుతోంది. అర్ధంతరంగా నిలిచిపోయిన పనులు... అక్కరకు రాని భవనాలు... అరకొర సౌకర్యాలు వారిని వెక్కిరిస్తున్నాయి. ఈ చిత్రం చూడండి. ఇదేదో స్క్రాప్ దుకాణం అనుకుంటున్నారు కదూ... లక్కవరపుకోటలో ఏర్పాటైన ఆదర్శ పాఠశాల విద్యార్థులకోసం తెప్పించిన సామగ్రి వాటిని వినియోగించకపోవడంతో అలా నిరుపయోగంగా పడి ఉన్నాయి. మరో కొద్ది రోజుల్లో అవి తుప్పుపట్టిపోవడం ఖాయం. రంగురంగుల్లో సుందరంగా కనిపిస్తున్న ఈ భవనం చూడండి. ఇది లక్కవరపుకోటలో నిర్మించిన ఆదర్శ పాఠశాల హాస్టల్. ఇది ఇలా బయటకు కనిపిస్తున్నా... లోపల మాత్రం సౌకర్యాలు పూర్తిగా కల్పించలేదు. అందువల్ల ఇవి ప్రారంభానికి నోచుకోలేదు. అవెప్పుడు పూర్తవుతాయో... దీనినెప్పుడు ప్రారంభిస్తారో తెలీదు గానీ... మరి కొద్దిరోజుల్లో ఇది శిథిలావస్థకు చేరినా ఆశ్చర్యపోనవసరం లేదు. లక్కవరపుకోట(ఎస్‌కోట): కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా సకల సౌకర్యాలు కల్పించి ఆంగ్లమాధ్యమంలో విద్యను అందించేందుకు ప్రభుత్వం 2013 సంవత్సరంలో ప్రారంభించిన ఆదర్శపాఠశాలల్లో ‘ఆదర్శం’ నేతిబీరకాయ చందంగా మారింది. విద్యా బోధన పక్కన పెడితే ఇక్కడ అపహాస్యం! సౌకర్యాలు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. జిల్లాలో ఎక్కడా నేటికీ వసతి గృహాలు ప్రారంభం కాలేదు. దీనివల్ల విద్యార్థినులు సుదూర ప్రాంతాలనుంచి ఆటోలపై రాకపోకలు సాగిస్తున్నారు. వసతి సౌకర్యం కల్పిస్తారంటేనే ఇక్కడ చేర్చామని తీరా రాకపోకలు సాగించడం ఇబ్బందికరంగా ఉందని పిల్లల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రారంభం కాని వసతి గృహాలు జిల్లాలో 16 చోట్ల ఆదర్శపాఠశాలల ఏర్పాటు చేశారు. ఇక్కడ కోట్లాది రూపాయలు వెచ్చించి వసతి గృహాలు నిర్మించారు. గత ఏడాది జూన్ నాటికి జిల్లాలోని అన్ని పాఠశాలల్లో వసతి గృహాలు ప్రారంభిస్తామని అధికారులు హడావుడి చేశారు. ఒక్కో వసతి గృహంలో 9వ తరగతి నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న వందమంది విద్యార్థినులకు అవకాశం కల్పిస్తామని చెప్పారు. అందుకు అవసరమైన వసతి, మంచాలు.. కుర్చీలు వంటి సామగ్రిని తెప్పించారు. అయితే అవన్నీ ఇప్పుడు ఓ మూల పడి ఉన్నాయి. ప్రస్తుతం హాస్టల్ భవనాలు పూర్తిస్థాయిలో నిర్మాణం కాకపోవడంతో అవి ప్రారంభానికి నోచుకోలేదు. ముఖ్యంగా లక్కవరపుకోట, వేపాడ, గర్భాంలోని వసతి గృహాలకు కనీసం మురుగునీటి పారుదల వ్యవస్థ లేదు. త్రీఫేజ్ విద్యుత్ సౌకర్యం, విజటర్స్ వేచివుండే గదులు నిర్మాణం కాలేదు. అధికారులు మాత్రం ఈ విద్యా సంవత్సరానికే ప్రారంభించేస్తామని చెబుతున్నా... అందుకు అనుగుణంగా అయితే పనులు జరగలేదు. ఐదేళ్లుగా ఇదే పరిస్థితి కనిపిస్తుండటంతో అధికారుల మాటలు వారిని నమ్మకం కలిగించడంలేదు. అవస్థలు పడుతున్న విద్యార్థులు హాస్టల్ సౌకర్యం కల్పిస్తారని అనడంతో సుదూర ప్రాంతాలకు చెందిన విద్యార్థులు చేరారు. తీరా హాస్టళ్లు ప్రారంభించకపోవడంతో నిత్యం ఆటోలపై రాకపోకలు సాగిస్తున్నారు. ఇందుకోసం చేతి చమురు వదులుతోందనీ, ఏ క్షణాన ఏ ప్రమాదం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వతసతి గృహాలు ప్రారంభించేలా చూడాలని పిల్లల తల్లిదండ్రులు కోరుతున్నారు.