Housewife commits suicide
-
ఉద్యోగం రావడం లేదని గృహిణి ఆత్మహత్య
గచ్చిబౌలి: పోటీ పరీక్షలు రాసినా ఉద్యోగం రాకపోవడంతో తీవ్ర ఒత్తిడికి లోనైన ఓ గృహిణి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసకు చెందిన పప్పల సతీష్ పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగిగా పని చేస్తూ జీపీఆర్ఏ క్వార్టర్స్‌లోని 32సీలో నివాసం ఉంటున్నాడు. మంగళవారం రాత్రి భోజనం అనంతరం భార్య బాలమణి (31)తో కలిసి ఇద్దరు ఒకే గదిలో నిద్రపోయారు. బుధవారం ఉదయం 5.30 గంటలకు కుమారుడు చిద్విలాస్(7) తల్లి కనిపించకపోవడంతో ఏడుస్తూ హాల్లోకి వెళ్లాడు. పిల్లాడి ఏడుపు విన్న సతీష్ లేచి భార్యను పిలువగా పలకలేదు. మరో గది తలుపులు వెనక నుంచి గడియపెట్టి ఉండటాన్ని ఆయన గమనించాడు. ఎంత పిలిచినా స్పందించకపోవడంతో ఇరుగు పొరుగు వారి సహాయంతో తలుపులు విరగ్గొట్టి చూడగా..బాలమణి చున్నీతో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకొని వేలాడుతూ కనిపించింది. అప్పటికే మృతి చెందిందని నిర్ధారించుకొని గచ్చిబౌలి పోలీసులకు సమాచారం అందించారు. కొద్ది సంవత్సరాలుగా బాలమణి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న పోటీ పరీక్షలకు హాజరవుతూ ఉందని, ఉద్యోగం రాకపోవడంతో తీవ్ర ఒత్తిడికి లోనైందని కుటుంబ సభ్యులు తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు. మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఒంటరిగా బతకలేను.. అందుకే వెళ్లిపోతున్నా.. నన్ను క్షమించండి
చైతన్యపురి(హైదరాబాద్): ‘భర్త, అత్త వేధింపులు తట్టుకోలేను.. విడిపోయి ఒంటరిగా బతకలేను...అందుకే వెళ్లిపోతున్నా.. నన్ను క్షమించండి’ అంటూ సూసైడ్ నోట్ రాసి ఓ గృహిణి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సరూర్‌నగర్ ఎస్ఐ మాధవరావు, మృతురాలి కుటుంసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ ఆనంద్‌నగర్‌కు చెందిన వ్యాపారి రాపోలు జనార్ధన్, జయమ్మల ఏకైక సంతానం నాగలక్ష్మి (36) బీటెక్ పూర్తి చేసింది. 2015లో దేవరకొండకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి శ్రీకాంత్‌తో పెళ్లైంది. చదవండి: భర్తను పచ్చడి బండతో కొట్టి చంపిన భార్య వివాహ సమయంలో 25 తులాల బంగారం, రూ.4 లక్షలు కట్నంగా ఇచ్చారు. సరూర్‌నగర్ వెంకటేశ్వర కాలనీలో శ్రీకాంత్, నాగలక్ష్మి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఆరేళ్ల కుమారుడు చరణ్‌జిత్ ఉన్నాడు.పెళ్లైన నాటి నుంచి అదనపు కట్నం కోసం నాగలక్ష్మిని భర్త, అత్త, ఆడపడుచు వేధిస్తుండేవారు. నాగలక్ష్మిని తల్లిగారింటికి, బంధువుల ఇళ్లకు వెళ్లనిచ్చేవాడు కాదు. ఈ నేపథ్యంలో మనస్తాపం చెంది శనివారం సాయంత్రం నాగలక్ష్మి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. భార్య ఆత్మహత్య చేసుకుందని శ్రీకాంత్ అత్తమామలకు సమాచారం ఇచ్చాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. భర్త, అత్త, ఆడపడుచుల వేధింపుల వల్లే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు నాగలక్ష్మి రాసిన సూసైడ్ నోట్ పోలీసులకు లభ్యమైంది. మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, అల్లుడు తమ కూతుర్ని ఏనాడూ భార్యలా చూడలేదని, అందంగా లేదని సూటిపోటి మాటలతో వేధించేవాడని మృతురాలి తల్లిదండ్రులు జనార్ధన్, జయమ్మ తెలిపారు. ఇల్లు కొనేందుకు డబ్బులు కావాలని గొడవ చేస్తూ శాడిస్టులా వ్యవహరించేవాడని వారు వాపోయారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
తెలిసినోడని ఇస్తే కట్నదాహానికి బలిచ్చాడు
రాజేంద్రనగర్: అదనపు కట్నం తెమ్మని భర్త వేధిస్తుండటంతో ఓ గృహిణి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. నార్సింగి పోలీసుల కథనం ప్రకారం...చిత్తూరు జిల్లా పెద్దమండ్యం మండలానికి చెందిన రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి సుధాకర్ కుమార్తె స్వప్న (23)ను రెడ్డికోట మండలానికి చెందిన శ్రీనివాస్(27)కు ఇచ్చి రెండున్నరేళ్ల క్రితం పెళ్లి జరిపించారు. కట్నం కింద రూ. 2 లక్షల నగదు, 20 తులాల బంగారం, గృహోపకరణాలు ఇచ్చారు. శ్రీనివాస్ భార్య స్వప్నను తీసుకొని కొన్ని నెలల క్రితం హైదర్షాకోట్ ప్రాంతంలో కాపురం పెట్టాడు. సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నానని నమ్మబలికిన శ్రీనివాస్.. జులాయిగా తిరుగుతూ ఉన్న డబ్బంతా ఖర్చు చేశాడు. అదనపు కట్నం తెమ్మని కొద్ది రోజులుగా భార్యను వేధిస్తున్నాడు. వీటిని తాళలేక స్వప్న గురువారం రాత్రి ఇంట్లో చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పుష్కర యాత్రలో ఉన్న మృతురాలి తల్లిదండ్రులకు ఈ విషయం తెలిసి నేరుగా శుక్రవారం ఉదయం నార్సింగి ఠాణాకు చేరుకున్నారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ కుమార్తెను తెలిసిన వాడని శ్రీనివాస్‌కు ఇచ్చిపెళ్లి చేస్తే.. అదనపు కట్నం కోసం వేధించి ఉసురుతీశాడని బోరుమన్నారు. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు -
వరకట్న వేధింపులకు గృహిణి బలి
-
వరకట్న వేధింపులకు గృహిణి బలి
అత్తింటివారే చంపారని బంధువుల ఆరోపణ ఆత్మహత్యకు పాల్పడిందంటున్న భర్త, అత్తమామలు అండలూరు (వీరవాసరం) : వరకట్న వేధింపులను తాళలేక ఓ గృహిణి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వీరవాసరం మండలం అండలూరులో మంగళవారం చోటుచేసుకుంది. ఎస్సై పి.శ్యామ్‌సుందర్ తెలిపిన వివరాల ప్రకారం.. అండలూరుకు చెందిన మల్లుల సుధారాణి (19) వరకట్న వేధింపులను తట్టుకోలేక ఇంట్లోని ఫ్యాన్‌కు చీరతో ఉరిపోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అత్తిలి మండలం బొంతువారిపాలెంకు చెందిన పెచ్చెట్టి శేఖరశ్రీను, దానేశ్వరి దంపతుల కుమార్తె సుధారాణిని అండలూరు గ్రామానికి చెందిన డ్రైవర్ మల్లుల ప్రసాద్‌కు ఇచ్చి ఏడాదిన్నర క్రితం వివాహం చేశారు. సుధారాణి తల్లిదండ్రులు ప్రస్తుతం గల్ఫ్‌లో ఉంటున్నారు. అక్కడ వారు సంపాదిస్తున్న మొత్తంలో కొంత సొమ్మును కుమార్తె సుధారాణి, అల్లుడు ప్రసాద్‌కు పంపిస్తుండేవారు. అయితే, రెండు నెలల నుంచి వారికి సొమ్ము పంపించడం మానేసి కుమార్తె వివాహం నిమిత్తం చేసిన బకాయిలు తీరుస్తుండటంతో సుధారాణిని భర్త, అత్తమామలు వేధించడం మొదలుపెట్టారు. వేధింపులను తట్టుకోలేక సుధారాణి మంగళవారం ఉరిపోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె ఏడు నెలల క్రితమే పాపకు జన్మనిచ్చింది. అత్తింటివారే చంపేశారు సుధారాణిని ఆమె భర్త, అత్తమామలు కొట్టి చంపేశారని ఆమె తాతయ్య గుడాల కృష్ణారావు ఆరోపించారు. ఆమెను సోమవారం నాడు ఆమెను తమ ఇంటినుంచి అత్తింటికి పంపించామని ఆయన చెప్పారు. ఇంటికి వెళ్లిన కొద్దిసేపటికే సుధారాణి తమకు ఫోన్ చేసిందని, భర్త, అత్తమామలు వేధిస్తున్నట్టు చెప్పిందని తెలిపారు. మంగళవారం ఉదయం మరోసారి ఫోన్‌చేసి వేధింపులు తట్టుకోలేకపోతున్నానని కన్నీరు పెట్టుకుందన్నారు. దీంతో ఆమెను తమ ఇంటికి తీసుకొచ్చేందుకు అండలూరు వెళ్లగా, అప్పటికే చంపేశారని కృష్ణారావు కన్నీటి పర్యంతమవుతూ వివరించారు. ఇదిలావుండగా, సుధారాణి ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని భర్త ప్రసాద్, అత్తమామలు తెలిపారు. మృతదేహాన్ని డీఎస్పీ పి.సౌమ్యలత పరిశీలించారు. వరకట్న వేధింపుల కింద కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించామని ఎస్సై శ్యామ్‌సుందర్ చెప్పారు.