సెలబ్రిటీలతో కలిసి బిజినెస్.. ఆ నయా ట్రెండ్ మొదలుపెట్టిందే ఇతడు!
అతిపెద్ద స్వదేశీ ఫిట్నెస్ బ్రాండ్లలో ఒకటైన హెచ్ఆర్ఎక్స్ (HRX) గురించి చాలామందికి తెలుసు. అయితే ఈ బ్రాండ్ పేరు వినగానే మొదట అందరికి 'హృతిక్ రోషన్' (Hrithik Roshan) గుర్తొస్తాడు. ఈ కంపెనీ వెనుక ఈతడు మాత్రమే కాదు.. అఫ్సర్ జైదీ (Afsar Zaidi) అనే వ్యక్తి కూడా ఉన్నారు. ఇంతకీ అఫ్సర్ ఎవరు? సెలబ్రిటీలతో కలిసి పని చేసేంతలా ఎలా ఎదిగాడు? అతని నెట్‌వర్త్ ఎంత అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
అఫ్సర్ జైదీ ఎక్సీడ్ ఎంటర్టైన్మెంట్ సీఈఓ అండ్ కో-ఫౌండర్. ఈ కంపెనీని 2013లో హృతిక్ రోహన్ ప్రారంభించినట్లు సమాచారం. ఈ కంపెనీ బూట్లు, వ్యాయామం చేసేటప్పుడు వినియోగించే దుస్తులను విక్రయిస్తూ.. నైక్, పుమా, డెకాథ్లాన్ వంటి గ్లోబల్ కంపెనీలతో పోటీ పడుతోంది.
ఎక్సీడ్ ఎంటర్టైన్మెంట్ అనేది హృతిక్ రోషన్, సైఫ్ అలీ ఖాన్, ప్రియాంక చోప్రా, సోనాక్షి సిన్హా, అజయ్ దేవగన్, కాజోల్, షాహిద్ కపూర్, అర్జున్ రాంపాల్, ఇమ్రాన్ హష్మీ, మలైకా అరోరా, బిపాషా బసు, శిల్పా శెట్టి, చిత్రాంగద సింగ్, మిథిలా పాల్కర్, దియా మీర్జా వంటి సెలబ్రిటీల మేనేజ్మెంట్ కంపెనీ.
(ఇదీ చదవండి: హెయిర్ ఆయిల్ అమ్మి వేలకోట్ల సామ్రాజ్యం.. తల్లి పెట్టుబడితో కుబేరుడైన కొడుకు!)
అఫ్సర్ జైదీ.. సైఫ్ అలీ ఖాన్ దుస్తుల బ్రాండ్ హౌస్ ఆఫ్ పటౌడీకి కో ఫౌండర్ కూడా. నిజానికి ఇతడు 2005 వరకు సాధారణ జీతం పొందే వ్యక్తి. అప్పట్లో మహేష్ భూపతికి చెందిన గ్లోబోస్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్‌లో పనిచేసేవారు. అయితే ఆ తరువాత కార్వింగ్ డ్రీమ్స్ అనే స్పోర్ట్స్ మేనేజ్మెంట్ కంపెనీ ప్రారంభించాడు. ఆ సంస్థ ఇప్పుడు భారతదేశంలోని ప్రముఖ సెలబ్రిటీ మేనేజ్మెంట్ కంపెనీలలో ఒకటైన ఎక్సీడ్గా అవతరించింది.
(ఇదీ చదవండి: ఎన్ని ఉద్యోగాలకు అప్లై చేసినా ఒక్కటీ రాలేదు.. నేడు ప్రపంచ ధనికుల్లో ఒకడిగా!)
పెళ్లిళ్లలో సెలబ్రిటీలు డ్యాన్స్ చేసేలా ఒప్పందాలు చేసుకునే ట్రెండ్‌ని జైదీ ప్రారంభించారు. అంతే కాకుండా హృతిక్ రోషన్, సైఫ్ అలీ ఖాన్ ఇద్దరికీ మేనేజర్‌గా ఉండేవాడు. ఆ తరువాత వారి సహకారంతో వ్యాపార రంగంలో అడుగుపెట్టాడు. ఇతడు వ్యాపార రంగంలో అడుగుపెట్టినప్పుడు ఈ-కామర్స్ రంగం అప్పుడే ప్రారంభ దశలో ఉండేది. ఆ తరువాత మింత్రాతో భాగస్వామ్యం కుదుర్చుకున్నాడు. భాగస్వామ్యం ఏర్పడిన మొదటి సంవత్సరంలో కంపెనీ టర్నోవర్ రూ.350 కోట్లు. కాగా గతేడాది చివరి త్రైమాసికం నాటికి కంపెనీ ఆదాయం రూ.920 కోట్లు.