Hug Day
-
కౌగిలింత ఎందుకు? పసివాళ్లను హగ్ చేసుకుంటే ఏమొస్తుంది?
ప్రేమికులకు వాలెంటైన్ వీక్‌లోని ప్రతి రోజు చాలా ప్రత్యేకమైనదే. ఫిబ్రవరి 12ను వాలెంటైన్ వీక్‌లో ‘హగ్ డే’గా జరుపుకుంటారు. ఈ రోజున ప్రేమికులు మాత్రమే కాదు.. ఆప్యాయతను అందుకునేవారంతా తమకు ఇష్టమైనవారిని కౌగిలించుకోవాలని, తమ మనసులోని భావాలను వారితో పంచుకోవాలని చెబుతుంటారు. ఇంతకీ కౌగిలింతతో వచ్చే లాభాలేమితో ఇప్పడు తెలుసుకుందాం. ప్రస్తుత కాలంలో ఒక వైపు పని భారం, మరోవైపు కుటుంబ బాధ్యతలు, దీనికితోడు ఎన్నో సమస్యలు.. వీటన్నింటి మధ్య మనిషి ఒత్తిడితో సతమతమవుతున్నాడు. అలాంటి సమయంలో కౌగిలింత (హగ్) అనేది ఒక అద్భుత వరమని, అది ప్రశాంతతకు దోహదపడుతుందని మానసిక వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఒత్తిడి మాయం కావలించుకోవడమనేది ఒక మంచి ఫీలింగ్‌ని కలిగిస్తుంది. మనం బాధలో ఉన్నప్పుడు సన్నిహితులను కావలించుకుంటే మనసుకు ఓదార్పు లభిస్తుంది. అంతేకాదు ఆరోగ్యం మెరుగు పడుతుంది. అందుకే మీరు పార్ట్నర్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్‌కు మీ ఆప్యాయమైన కౌగిలింత అందించి, వారి ఒత్తిడిని దూరం చేయడంతోపాటు మీలోని ఒత్తిడిని కూడా తొలగించుకునే ప్రయత్నం చేయాలని అంటున్నారు మానసిక వైద్య నిపుణులు. బరువు తగ్గడంలోనూ.. బరువు పెరగడానికి గల కారణాల్లో ఒత్తిడి కూడా ఒకటి. టెన్షన్, పని ఒత్తిడి రోజూ అందరికీ ఉంటుంది. ఇటువంటి సమయాల్లో కొందరు ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తుంటారు. అలాంటి వారికి ఆత్మీయుల కౌగిలింత వారిలోని ఒత్తిడిని మటుమాయం చేస్తుంది. తద్వారా వచ్చే రిలాక్సేషన్ బరువు తగ్గడానికీ దోహదపడుతుంది. 10 సెకన్ల కౌగిలింత అనేక సమస్యలకు ఉపశమనంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. రక్తపోటుకు వైద్యం మనకు ఆప్యాయతను అందించేవారిని 20 సెకన్ల పాటు హగ్ చేసుకుంటే మనలోని ఒత్తిడి తగ్గి, రక్తపోటు కూడా నియంత్రణలోకి వస్తుందట. అందుకే బీపీ కంట్రోల్లో ఉండాలనుకుంటే ఆత్మీయులను కౌగిలించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పసివాళ్లను హగ్ చేసుకుంటే.. అప్పుడే పుట్టిన బిడ్డను తల్లి తన దగ్గరికి తీసుకుని హత్తుకుంటుంది. దీంతో ఆ తల్లి అప్పటి వరకూ పడిన నొప్పులన్నింటినీ మరచిపోతుంది. అలాగే తల్లి కౌగిలింత పిల్లలకు సురక్షితంగా ఉన్నామనే భరోసానిస్తుంది. అది వారు ఆరోగ్యంగా పెరిగేందుకు దోహద పడుతుంది. ఇదేవిధంగా పసివాళ్లను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంటే ఎవరికైనా సరే మనసుకు స్వాంతన లభిస్తుందని మానసిక వైద్య నిపుణులు చెబుతుంటారు. -
ఫిబ్రవరి 14 మాత్రమే కాదు.. ప్రతి నెల 14 వారికి ప్రేమికుల రోజే! ఎక్కడంటే?
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేమికులు తమ ప్రేమను వ్యక్తపరిచేందుకు 'ఫిబ్రవరి 14'వ తేదీనే ఎంచుకుంటారు. ఎందుకంటే ఈ రోజు చరిత్రలో ఎంతో ప్రత్యేకం. నిజమైన ప్రేమకు గుర్తుగా దీన్ని ప్రేమికుల రోజుగా ఏటా జరుపుకొంటారు. అయితే ప్రపంచం మొత్తం ఒక్కరోజే వాలెంటైన్స్ డేను జరుపుకొంటే కొరియాలోని యువత మాత్రం ప్రతి నెల 14వ తేదీని ప్రేమికుల రోజుగానే జరుపుకొంటారు. ఇలా మొత్తం ఏడాదిలో 12 రోజులు తమ ప్రియమైన వారికి కానుకలు ఇచ్చిపుచ్చుకుంటారు. మరి ఆ 12 రోజుల ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం... డైరీ డే (జనవరి 14) దక్షిణ కొరియాలో జనవరి 14ను 'డైరీ డే'గా జరుపుకొంటారు. అమ్మాయిలు, అబ్బాయిలు, స్నేహితులు, ఈరోజున కొత్త డైరీలను కానుకలుగా ఇచ్చిపుచ్చుకుంటారు. కొత్త ఏడాది తర్వాత డైరీ డే రావడంతో వ్యాపారులు కూడా ఆకర్షణీయంగా వీటిని రూపొందించి విక్రయిస్తారు. మరొకొందరు ఈ రోజును 'క్యాండిల్ డే'గా జరుపుకొంటారు. అలంకరించిన క్యాండిల్స్‌ను కానుకలుగా ఇచ్చిపుచ్చుకుంటారు. వాలెంటైన్స్ డే (ఫిబ్రవరి 14) ప్రపంచంలోని అన్ని దేశాల్లాగే ఈ రోజును ప్రేమికుల రోజుగా జరుపుకొంటారు కొరియా యువత. అయితే వీళ్ల ప్రత్యేకత ఏమిటంటే.. ఈ రోజు అమ్మాయిలు మాత్రమే అబ్బాయిలకు చాక్లెట్లను కానుకగా ఇస్తుంటారు. అబ్బాయిలు రిటర్న్ గిఫ్ట్‌గా ఏమీ ఇవ్వకూడదు. ఇది వీళ్ల సాంప్రదాయంగా కొనసాగుతోంది. అందుకే కొరియా వ్యాపారులు ఈరోజు రకరకాల చాక్లెట్లను ప్రదర్శిస్తూ యువతను ఆకర్షిస్తుంటారు. వైట్ డే (మార్చి 14) వాలెంటైన్స్ డే తర్వాత వచ్చే 'వైట్ డే' కొరియాలో చాలా స్పెషల్. ప్రేమికుల రోజు తమ ప్రేయసి నుంచి చాక్లెట్లు కానుకగా అందుకున్న అబ్బాయిలు.. వైట్ డే రోజు వాళ్లకు రిటర్న్ గిఫ్టులు ఇస్తారు. తెల్లరంగు చాక్లెట్లనే ఇవ్వడం వల్ల ఈ రోజుకు వైట్ డే అని పేరు పెట్టారు. అయితే ఈ మధ్య కాలంలో తెల్లరంగుతో పాటు నల్లరంగు చాక్లెట్లను కూడా రిటర్న్ గిఫ్టులుగా ఇవ్వడం అలవాటైంది. అయితే అమ్మాయిలు వాలెంటైన్స్ డే రోజు ఒక్క చాక్లెట్ గిఫ్ట్‌గా ఇస్తే.. అబ్బాయిలు మాత్రం రిటర్న్‌గా మూడు గిఫ్టులు ఇస్తారు. వైట్ చాక్లెట్‌తో పాటు క్యాండీస్, లాలీపప్లను కలిపి ఇస్తుంటారు. బ్లాక్ డే (ఏప్రిల్ 14) వాలెంటైన్స్ డే, వైట్ డే రోజున ఎలాంటి కానుకలు రాని యువత బ్లాక్ డేను జరపుకొంటారు. సింపుల్‌గా చెప్పాలంటే ఇది సింగిల్స్ డే. తమకు ప్రేమ ప్రపోజల్ రాని యువతీయువకులు ఈ రోజు కలిసి బ్లాక్ నూడుల్స్ తింటారు. సింగిల్స్ మీటింగ్‌గా చెప్పుకునే బ్లాక్ డే రోజున తమను ప్రేమించేవారు లేరని యువత కాస్త ఒత్తిడికి గురవుతారు. ఎల్లో డే (మే 14) ఈ రోజున ప్రేమికులు, దంపతులు పుసుపు రంగు పూలను ఇచ్చిపుచ్చుకుంటారు. తమ ప్రియమైన వారితో కలిసి రెస్టారెంట్లకు వెళ్లి భోజనం చేస్తారు. ఈ రోజు ఎక్కువ సమయం వారికి కేటాయిస్తారు. కిస్ డే (జూన్ 14) కొరియన్ల ఫేవరెట్ డే ఇది. తమ గాఢమైన ప్రేమను వ్యక్తపరిచేందుకు ప్రేమికులు, భార్యాభర్తలు ఒకరికొకరు ముద్దులు పెట్టుకుంటారు. జంటలకు ఇది బెస్ట్ రొమాంటిక్ డే అని చెప్పుకుంటారు. సిల్వర్ డే (జులై 14) ఈ రోజున ప్రేమికులు ఉంగరాలు మార్చుకుంటారు. సింపుల్‌గా చెప్పాలంటే నిశ్చితార్థంలా అనమాట. జీవితాంతం కలిసి ఉంటామని ఇద్దరు ప్రామిస్ చేసుకుని రింగ్స్ మార్చుకుంటారు. గ్రీన్ డే (ఆగస్టు 15) ఈ రోజున ప్రేమికులు, దంపతులు అందమైన పశ్చికబయళ్లు ఉంటే ప్రదేశాలను సందర్శిస్తుంటారు. అక్కడే భోజనం చేస్తుంటారు. వీలైతే ఆకుపచ్చరంగు దుస్తులు ధరిస్తారు. ఈ రోజు ఫ్యామిలీస్ ఎక్కువగా పార్కులకు వెళ్లి ఆనందంగా గడుపుతారు. ఫొటో డే (సెప్టెంబర్ 14) ఈరోజున ప్రేమికులు, స్నేహితులు, ఫ్యామిలీస్ ప్రత్యేకంగా ఫొటోలు దిగుతారు. సెల్ఫీలతో పాటు స్టూడియోలకు వెళ్లి ఫొటో షూట్లు నిర్వహిస్తారు. తమ జీవితంలో ఈ రోజు ప్రత్యేకంగా గుర్తుండిపోయేలా చూసుకుంటారు. వైన్ డే (అక్టోబర్ 14) ఇది వైన్ ప్రియులకు ఇష్టమైన రోజు. ప్రేమికులు, దంపతులు వైన్ డే రోజున ప్రత్యేక పార్టీలు చేసుకుంటారు. స్నేహితులు, కుటంబసభ్యులతో కలిసి బార్లకు, పార్టీలకు వెళ్లి ఇష్టమైన వైన్ తాగుతారు. మూవీ డే (నవంబర్ 14) కొరియన్లకు ఇది కూడా చాలా ఇష్టమైన రోజు. తమ ప్రియమైన వారిని సినిమా హాళ్లలో కలుస్తారు. కొత్త సినిమాలు చూస్తారు. మరికొందరేమో ఇళ్లలోనే డీవీడీలు అద్దెకు తెచ్చుకుని పాప్‌కార్న్ తింటూ మూవీస్ చూసి ఎంజాయ్ చేస్తారు. హగ్ డే (డిసెంబర్ 14) ఈ రోజున కొరియన్ ప్రజలు తమకు ఇష్టమైన వారిని ఆలింగనం చేసుకుంటారు. ప్రేమికులు ఎక్కడున్నా ఈరోజు కలుసుకొని హగ్ ఇస్తుంటారు. సింగిల్స్ అయితే తమ ఇంట్లో వాళ్లని, స్నేహితులను ఆలింగనం చేసుకుంటారు. ఏడాదికి 12 రోజులు ఇలా ప్రత్యేకంగా జరుపుకొన్నా.. వాలెంటైన్స్ డే, వైట్ డే రోజుల్లో మాత్రం సందడి చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రెండు రోజులు వ్యాపారాలు కూడా బాగా సాగుతాయి. చదవండి: ప్రేమ కానుక.. మనసు దోచెనిక.. ప్రేమికుల రోజు ఇచ్చే గిఫ్ట్‌లు ఇవే..! -
ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు కాదు.. 'కౌ హగ్ డే'..!
న్యూఢిల్లీ: ఫిబ్రవరి 14 అంటే ప్రేమికుల రోజు అని అందరికీ తెలుసు. యువతీ, యువకులు తాము ప్రేమించిన వారికి ఈరోజే ప్రపోజ్ చేస్తుంటారు. ఇప్పటికే ప్రేమలో ఉన్నవారు తమ భాగస్వాములకు ప్రత్యేక కానుకలు ఇచ్చి సర్ఫ్రైజ్ చేస్తుంటారు. భారతీయ యువతలో ఈ ఆలోచనను మార్చాలని కేంద్ర పశుసంవర్ధక శాఖ భావిస్తోంది. పాశ్చాత్య దేశాల పట్ల ప్రభావితమై భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను మర్చిపోతున్న యువతలో మార్పు తీసుకురావాలనుకుంటోంది. అందుకే ఫిబ్రవరి 14ను 'కౌ హగ్ డే'గా జరుపుకొని గోవులను ఆలింగనం చేసుకోవాలని పిలుపునిచ్చింది. 'భారతీయ సంస్కృతికి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు గోవులు వెన్నెముక. పశుసంపదకు, జీవ వైవిధ్యానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. మానవాళికి సకల సంపదలను అందించే తల్లి వంటి పోషకాహార స్వభావం ఉన్నందున ఆవును కామధేను, గోమాత అని పిలుస్తారు. గోవును ఆలింగనం చేసుకుంటే మానసిక ఆనందం కలుగుతుంది. అందుకే ఫిబ్రవరి 14 కౌ హగ్ డే జరుపుకోండి' అని పేర్కొంది. కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమల శాఖ సూచన మేరకు ఆ శాఖ కార్యదర్శి ఈ ప్రకటన విడుదల చేశారు. చదవండి: పార్లమెంట్లో విపక్షాలను ఏకిపారేసిన మోదీ.. -
వాలెంటైన్స్ వీక్! 8రోజుల ప్రేమ పండుగ!
ప్రేమలో ఉన్నవారికి ప్రతి రోజూ పండగే. అయితే ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో వచ్చే వాలెంటైన్స్ డే మాత్రం ప్రేమికులకు ఇంకా ప్రత్యేకం. చాలా మంది ప్రేమికులు వాలెంటైన్స్ డే రాకకోసం ఏడాది మొత్తం ఎదురుచూస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ప్రేమికులు ఎంతో సంబరంగా జరుపుకునే వాలెంటైన్స్ డే ప్రత్యేక ఆ ఒక్కరోజుకే పరిమితం కాలేదు. ప్రేమికుల రోజు.. ఫిబ్రవరి 14వ తేదీకి వారం రోజుల ముందు ఫిబ్రవరి 7నుంచే వేడుకలు మొదలవుతాయి. దీన్నే వాలెంటైన్స్ వీక్‌గా పిలుస్తారు. వాలెంటైన్స్ వీక్‌లోని ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. వాలెంటైన్ వీక్‌లోని ఎనిమిది రోజులల్లో ఒక్కోరోజు ఒక్కో విధంగా ప్రేమికులు తమ ప్రేమను వ్యక్తపరుస్తుంటారు. 1) రోజ్ డే : వాలెంటైన్ వీక్.. రోజ్‌డేతో ప్రారంభం అవుతుంది. ఫిబ్రవరి 7నుంచి 14 వరకు వారం రోజుల పాటు ఈ స్పెషల్డేస్ ఉంటాయి. ఈరోజు తాము ప్రేమించిన వారికి ఒక గులాబీ పువ్వును బహుమతిగా ఇస్తారు. దానితో పాటు గులాబీ పువ్వులు ఉండే మంచి మెసేజ్‌లు ఉన్న గ్రీటింగ్ కార్డులను గిఫ్ట్‌లుగా ఇస్తారు. ‘మనసుకు మాత్రమే తెలిసిన భాషలో.. నా ప్రేమను ఈ గులాబి పువ్వు నీకు తెలియజేస్తుంది’ లాంటి కొటేషన్స్ ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకర్షిస్తాయి. 2) ప్రపోజ్ డే : ఫిబ్రవరి 8వ తేదీన ప్రపోజ్ డే జరుపుకుంటారు. ఈరోజున తాము ప్రేమించిన వారికి ధైర్యంగా తమ ప్రేమను వ్యక్తపరుస్తారు. ఎన్ని రోజుల నుంచో ప్రేమను వ్యక్తపరచడానికి సంకోచిస్తూ ఉన్న వారికి ఈ రోజు ఒక మంచి అవకాశంగా చెప్పవచ్చు. సో మీరు కూడా మీకిష్టమైన వారికి మీ మనసులో మాట చెప్పాలనుకంటే ఈ ఏడాది కచ్చితంగా చెప్పేయండి. ఒక మంచి గులాబీతోనో, లేక చేతికి రింగ్ తొడిగో మీ ప్రేమను వ్యక్తపరచండి. 3) చాక్లెట్ డే : ఇక వాలంటైన్ వీక్‌లో మూడో రోజు చాక్లెట్ డే. ప్రేమ బంధం ఎంతో తీయనైనది. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రేమ మధురమే. తాము ప్రేమించిన వారు పక్కన ఉంటే అంతకు మించిన స్వర్గం ఉండదు. అలాంటి ఆ బంధాన్ని మరింత మధురంగా మలుచుకోవాలంటే చాక్లెట్ డే రోజు ప్రేమించిన వారితో చాక్లెట్ షేర్ చేసుకోవాల్సిందే. 4) టెడ్డీ డే : ఫిబ్రవరి 10వ తేదీన టెడ్డీ డేని జరుపుకుంటారు. టెడ్డీలంటే అమ్మాయిలకు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చూడటానికి ఎంతో అందంగా మృధువుగా ఉండే టెడ్డీలు ఎంతో ఆకర్షిస్తాయి. అంతే కాకుండా అనుక్షణం మిమ్మల్ని గుర్తు చేస్తూ ఉంటాయి. సో టెడ్డీని ప్రజెంట్ చేయడం ద్వారా మీ అందమైన ప్రేమసికి ఎంతో క్యూట్‌గా మీ ప్రేమను తెలియజేయవచ్చు. 5) ప్రామిస్ డే : ఈరోజు ఒకరికొకరు జీవితాంతం తోడుంటాం అంటూ ప్రేమికులు మాట ఇచ్చిపుచ్చుకుంటారు. నీ సంతోషంలోనే కాదు నీ బాధలోనూ నీకు బాసటగా నిలుస్తాను అంటూ తమ ప్రేమను వ్యక్తపరుస్తారు. ప్రేమ బంధం మరింత బలపడటానికి మీరు చెప్పే ఒక్క మాట చాలు. అందుకే మీ మనసులో ఉన్న భావాల్ని మీరు ప్రేమించిన వారికి అర్థం అయ్యేలా అందంగా చెప్పండి. ‘ నేను చేసిన ప్రమాణాన్ని ఎన్నటికి మర్చిపోను! నిన్ను ఎప్పటికీ వీడిపోను’’ అంటూ మీ ప్రేమను తెలపండి. ఇచ్చిన మాటకు జీవితాంతం కట్టుబడి ఉండండి. ఎందుకంటే ఒక్కసారి మాట నిలబెట్టుకోలేకపోతే తర్వాత సారీ చెప్పినా ఏం ప్రయోజనం ఉండదు. 6) హగ్ డే : ఈ డే ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రేమించిన వారిని కౌగిళ్లలోకి తీసుకుని మీ ప్రేమను వ్యక్తపరిస్తే ఆ భావాలు మాటల్లో వర్ణించలేము. ఆ అనుభూతులు జీవితాంతం గుర్తుండిపోతాయి. అందుకే హగ్డే రోజు తాము ప్రేమించిన వారిని హగ్ చేసుకోవడంతో పాటు ఒక మంచి గ్రీటింగ్ కార్డును బహుమతిగా ఇస్తారు. 7) కిస్ డే : వాలెంటైన్స్ డేకి ముందు రోజైన ఫిబ్రవరి 13వ తేదీని కిస్ డేగా జరుపుకుంటారు. ఎంతటి ఒత్తిడిలో ఉన్నా.. ప్రేమించిన వారు ఇచ్చే చిన్న ముద్దు.. ఆ బాధలన్నింటిని దూరం చేస్తుంది. మిమ్మల్ని మరింత దగ్గర చేస్తుంది. ప్రపంచాన్ని మర్చిపోయేలా చేసే ముద్దుతో.. రోజును ప్రారంభిస్తే ఆరోజంతా ఆనందంగానే గడుస్తుంది. 8) వాలంటైన్స్ డే : ఇక వాలంటైన్ వీక్‌లో చివరి రోజైన ఫిబ్రవరి 14ను వాలెంటైన్స్‌డేగా జరుపుకుంటారు. ప్రేమ కోసం ప్రాణాలు అర్పించిన వాలెంటైన్ జ్ఞాపకార్థం ప్రపంచవ్యాప్తంగా ఈ రోజును ప్రేమికుల రోజుగా జరుపుకుంటారు. ఈ రోజున ప్రేమించిన వారికి మంచి గిఫ్ట్ ఇచ్చి ప్రేమను వ్యక్తపరచడంతో పాటు ఆరోజంతా వారితో ఆనందంగా నచ్చిన ప్రదేశానికి వెళ్లి గడుపుతారు. తెలుసుకున్నారుగా వాలెంటైన్ వీక్‌లో ఒక్కొక్క రోజుకు ఉన్న ప్రత్యేకతలు ఇంకెందుకు ఆలస్యం! ఆరోజు ఏం చేయాలో ప్లాన్ చేసుకోండి. -
ఆత్మీయ పులకరింత
నీకోసం నేనున్నాను..అనే భావనను కలగజేయడానికి ఆలింగనం ద్వారా తెలియపర్చవచ్చు. కౌగిలింత మధురమైన అనుభూతి. విడదీయరాని బంధానికి చిహ్నం. ఆపదలో, ఆనందంలో, దుఃఖంలో సాంత్వన చేకూర్చేదే కౌగిలింత. అన్నదమ్ముళ్లు, అన్నాచెల్లెలు, అక్కా చెల్లెలు, ప్రియుడు ప్రియురాలు, భార్య భర్తలు, స్నేహితులు ఒకరికొకరు అప్పుడప్పుడు కౌగిలించుకుంటారు. ప్రేమాభిమానాలను మనస్ఫూర్తిగా వ్యక్తం చేసేందుకు ఆలింగనం తోడ్పడుతుంది. విజయదశమి, రంజాన్ మొదలగు పర్వదినాల్లో కులాలకు, మతాలకు అతీతంగా ఒకరికొకరు ఆలింగనం చేసుకుంటారు. శుభకార్యాల్లో కూడా కౌగిలించుకుని శుభాకాంక్షలు తెలుపుకుంటారు. కౌగిలించుకునే వ్యక్తుల శరీరంలో హర్మోన్ల ప్రభావం వల్ల విడుదలయ్యే ఎండార్పిన్లు మానసిక, శారీరక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఆస్పత్రిలో చికిత్స పొందే రోగులకు కేవలం మందులు ఇచ్చినంత మాత్రన వారు వెంటనే ఆరోగ్యవంతులు కారు. ప్రేమ, ఆప్యాయతతో చెప్పే మాటలు వారికి సాంత్వన చేకూరుస్తాయి. ఇంట్లో చిన్నపిల్లలు భయపడితే వీపుపై ఆప్యాయతతో నిమురటం వల్ల వెన్నెముకలో తాత్కలికంగా నిక్షిప్తమైన ఓ రకమైన షాక్ మాయమయ్యేందుకు ఇలా చేస్తారు. ఆ పిల్లవాడిని కౌగిలించుకుని ధైర్యం చెబితే టచ్ థెరపిలా పనిచేస్తుంది. అంతేకాకుండా ఆరోగ్యవంతులుగా కూడా ఉంటారు. బంధాలు మరింత బలోపేతం ఆలింగనం ద్వారా వ్యక్తుల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది. స్నేహితులతో అనేక విషయాలు చర్చిస్తాం. ఇంట్లో భార్య పిల్లలతో చెప్పని విషయాలు కూడా స్నేహితులకు చెప్తాం. ఇద్దరి మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు రాకుండా ఒకరికొకరు ఆలింగనం చేసుకుంటారు. అలాగే ఎన్ని జన్మలైనా నీతోనే ఉంటాను..భార్య భర్తల మ«ధ్య ఉండే సాన్నిహిత్యానికి ఈ కౌగిలింత సంకేతం. తండ్రి కొడుకుల మ«ధ్య కూడా దాపరికాలు లేకుండా ఆలోచనలు పంచుకుంటారు. ఇకపోతే ప్రేమికులు ఒకరికొకరు నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగించేది ఆలింగనం. ప్రేమికుల కౌగిలింత అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుంది. అక్కాచెల్లెలు కూడా అమ్మ నాన్నలతో పంచుకోలేని భావాలను హుందాగా మెరుగుపర్చేదే అక్కాచెల్లెల ఆలింగనం. అన్నదమ్ముల మధ్య కూడా అసూయ, ధ్వేషం, అహంకారం వంటి దుర్గుణాలను దూరం చేసుకునేందుకు రామాయణంలో మాదిరిగా రామలక్ష్మణుల ఆత్మీయ ఆలింగనం పలుచోట్ల కనపడుతుంది. అంతేకాకుండా వివిద దేశాధినేతలు కూడా దేశాల మధ్య సంబంధాలను మెరుగుపర్చుకునేందుకు కౌగిలింత ఎంతగానో తోడ్పడుతుంది. అమెరికాలో ప్రారంభం పాశ్చాత్య దేశాల్లో ప్రతి సంవత్సరం కౌగిలింతల వారోత్సవాలు జరుపుకుంటారు. అమెరికాలో కేవిన్ జాబోర్ని కౌగిలింత సంప్రదాయాన్ని ప్రారంభించారు. అక్కడి నుంచి ఇరాన్, రష్యా, పోలాండ్, జర్మని, కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్ తదితర దేశాలు వ్యాపించింది. అనేక లాభాలు ఆలింగనంతో అనేక లాభాలున్నాయి. స్పర్శతోనే ఎదుటివారి పట్ల ఆత్మీయతను ప్రకటించే దివ్య ఔషధం ఆలింగనం.మందులతో నయం కాని జబ్బులను ఆత్మీయ ఆలింగనంతో తగ్గించవచ్చునని పరిశోధనలు చెబుతున్నాయి. మానవ సంబంధాల్లో అన్యోనతను సూచించేందుకు కౌగిలింత ఎంతగానో తోడ్ప డుతుంది. భార్య భర్తల మధ్య దాంపత్య జీవితం సజావుగా సాగుతుంది. మానసిక ఒత్తిడి నుంచి దూరం కావచ్చు. ఒకరిపై ఒకరికి ప్రేమ, విశ్వాసాన్ని కలిగిస్తుంది. కష్టాల్లో ఉన్నవారిని కౌగిలించుకుంటే వారికి కొండంత అండ ఇచ్చినట్లు అవుతుంది. సత్సంబంధాలు మెరుగుపర్చుకునేందుకు భావోద్వేగాలను సమన్వయపర్చుకునేందుకు ఎంతగానో తోడ్ప డుతుంది. -
హగ్ ఇస్తుంది ధైర్యం..భరోసా
► బాధల్లో ఉన్నవారిని హత్తుకుంటే రిలీఫ్ ► నేడు హగ్ డే ప్రేమనేది అనిర్వచనీయమైన అనుభూతి. అందుకే పుట్టిన బిడ్డ ప్రపంచంలోకి రాగానే తల్లిని హత్తుకుని పడుకుంటుంది. ఆమె స్పర్శలో ఉండే ధైర్యం ప్రపంచంలో మరెవరూ ఇవ్వలేరు. మనం ఓడిపోయినప్పుడు ఓదార్పు కోసం ఆత్మీయుల స్పర్శ కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. మనిషిని మనిషిగా గుర్తించగలిగే ప్రేమను ఆత్మీయ ఆలింగనం కొండంత బలాన్ని ఇస్తుంది. శంకర్‌దాదా ఎంబీబీఎస్ సినిమాలో చిరాకుగా ఉన్న కాంపౌండర్‌ను హత్తుకునే సన్నివేశంలో హీరో ప్రేమ ఒక చిన్న కౌగిలింతతో తెలుస్తుంది. అలాగే ప్రముఖ ఆధ్యాత్మిక గురువుగా పేరుతెచ్చుకున్న అమృతానందమయి అమ్మ కూడా భక్తులకు తన స్పర్శ ద్వారానే ప్రేమను చాటుతుంది. ఎన్ని కోట్లున్నా ఒంటరిగా అనుభవించడం ఏవరికీ చేతకాదు. అందుకే ప్రేమను తెలిపే ఆత్మీయ స్పర్శను హగ్ డేగా ప్రపంచం జరుపుకుంటోంది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా వారం రోజులపాటు ఒక్కో డేను జరుపుకుంటున్నారు ప్రేమికులు. ఆదివారం నిర్వహించే హగ్ డే ఇందులో భాగమే.. విశాఖపట్నం : ప్రపంచ దేశాల్లో మనుషుల మధ్య కులం, మతం, రంగు, అంతస్తు, హోదా ఇవన్నీ అడ్డు గోడల్లా నిలిచిపోతాయి. వాటిని అధిగమించేందుకు కొంత మంది ఈ హగ్డేను జరుపుకుంటారు. కొంత మంది యువతీ యువకులు పబ్లిక్ ప్లేస్ల్లో ఫ్రీ హగ్స్ పేరుతో బోర్డు పెట్టి నిలబడతారు. అంటే తమకు అంతస్తు, రంగు వంటి బాహ్య విషయాలపై ఆసక్తి లేదని మనుషులనందరినీ దగ్గరకు చేర్చుకోవడం ఇష్టమని అందువల్ల తనను ఎవరైనా హగ్ చేసుకోవచ్చని అర్థం. ఈ ప్రయోగం చాలా సక్సెస్ అయింది. కావాలంటే యూట్యూబ్‌లో ఫ్రీహగ్స్ అని టైప్ చేసి చూడండి చాలా వీడియోలు ఉంటాయి. ఏఆర్. రెహమాన్ ఫ్రీహగ్స్ పై జియాసే జియా అని ఒక ఫేమస్ ఆల్బమ్ కూడా చేశారు. ప్రపంచంలో ఉన్న మనుషుల మధ్య దూరాలు చెరిగిపోయేలా అందరం ఒక్కటవుదామనే నినాదంతో హగ్డే ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రేమికుల మధ్య.. అదే ప్రేమికుల మధ్య ఉండే ఆత్మీయత వేరు. పైన చెప్పినవన్నీ ప్రేమను అందించేవి కాని.. ఇక్కడ ప్రేమను కోరుకునేది. ఒక అమ్మాయి అబ్బాయి మధ్యన ఉండే అనుబంధం వారి మానసిక పరిపక్వతపై ఆధారపడి ఉంటుంది. అందుకే ప్రేమికుల మధ్య ఉండే ప్రేమ వయసుతోపాటు పెరుగుతుంది. బ్రేకప్‌లతో విడిపోయే వారికి ఇవేమీ అర్థం కాకపోవచ్చు. కాని నిచ్చెలి చేతిలో చెయ్యివేసి కబుర్లు చెప్పుకోవడం హత్తుకోవడం జీవితాంతం మరచిపోలేని మధురానుభూతినిస్తుంది. అ స్పర్శ జీవితాంతం గుర్తుండిపోతుంది. హగ్డే ప్రేమికులకే కాదు... హగ్డేను అపార్థం చేసుకునేవాళ్లు కూడా లేకపోలేదు. కేవలం ప్రేమికులకు మాత్రమే హగ్డే అనుకుంటే పొరబాటే. తాత మనవరాలిని, తండ్రి కూతురిని, తల్లి కొడుకుని, అన్న చెల్లెల్ని, స్నేహితుల మధ్య ఇలా ఒకరి ప్రేమను ఒకరికి తెలపడానికి హగ్ అనేది ఒక ప్రక్రియ మాత్రమే. అందుకే హగ్డేకు అంత ప్రాధాన్యం ఉంది. యువతీ యువకుల మధ్య... హగ్డేను జరుపుకునే వారిలో యువతీ యువకులు, ప్రేమికులు కూడా ఉంటారు. ఒకరిపై ఒకరికున్న అనుబంధాన్ని తెలపడానికే ఆలింగనం ఒక అసంకల్పిత చర్యగా భావించాల్సి ఉంటుంది. చాలా కాలం తరువాత స్నేహితుడ్ని లేదా స్నేహితురాలిని చూస్తే ఆశ్చర్యంతో పాటు మనకు తెలియకుండానే వాళ్లను హత్తుకుంటాం. అంటే దానర్థం దురుద్దేశం కాదుగా. ఆస్ట్రేలియా, అమెరికా వంటి దశాల్లో వందల మంది స్టూడెంట్స్ హగ్గింగ్ క్యాంపెయిన్లు చేస్తారు. వాళ్లే మనుషుల దగ్గరికి వెళ్లి హగ్ చేసుకుంటారు. -
ఈ రోజు అమెరికాలో ఎవరు ఎవర్నైనా హగ్ చేసుకోవచ్చు!
నిన్నంతా అమెరికాలో ట్రంప్ హడావిడి. ప్రెసిడెంట్ గారి ప్రమాణం స్వీకారం కదా. అందుకు. అదే సందర్భంలో వైట్ హౌస్నుంచి వెళ్లిపోతున్న ఒబామాను చాలామంది హగ్ చేసుకున్నారు. ప్రమాణం స్వీకారంలో గాంభీర్యం ఉంటుంది. పదవీ విరమణలో ఉద్వేగం ఉంటుంది. ఏమైనా.. అమెరికాలో ఉద్వేగాలకన్నా, గాంభీర్యాలే ఎక్కువ. ఈ సంగతిని ఈసరికే చాలామంది అమెరికన్ పౌరులు కనిపెట్టే ఉంటారు కానీ.. కెవిన్ జబోర్ని అనే యువకుడు కనిపెట్టి ఊరుకోలేదు. ‘మనం ఎందుకు ఇలా ఉండాలి?’ అని ప్రశ్నించుకున్నాడు. ‘ఇలా’ అంటే.. విడివిడిగా, వేరువేరుగా, నువ్వో మనిషివి, నేనో మనిషిని అన్నట్టుగా, అసలు మనిషన్నవాడే పట్టనట్టుగా.. అని! కెవిన్‌కి చాలా ఆవేదన కలిగింది. అమెరికా అగ్రరాజ్యం అయితే అయివుండొచ్చు గానీ, అనుబంధాలలో ఇంత అల్పరాజ్యం అయిపోతే ఎలా అనుకున్నాడు. బాగా ఆలోచించి.. ‘నేషనల్ హగ్గింగ్ డే’ని ప్రచారంలోకి తెచ్చాడు. దానికి అమెరికన్ ప్రజల ఆమోదం కూడా పొందాడు. అప్పట్నుంచీ.. అంటే 1986 జనవరి 21 నుంచీ.. ఏటా అమెరికా ‘హగ్ డే’ని జరుపుకుంటోంది. ఇవాళ అక్కడ హగ్ డే. ఎవరు ఎవర్నైనా హగ్ చేసుకోవచ్చు. అయితే, చిన్న కండిషన్. అనుమతి తీసుకున్నాకే హగ్ చేసుకోవాలి. అనుమతి లేకుండా హగ్ చేసుకున్నామంటే ఆ హగ్ కాస్తా క్రైమ్ అయిపోతుంది. మరి జనవరి 21 నే ‘హగ్ డే’గా ఎందుకు జరుపుకుంటున్నట్లు? దానికో కారణం చెప్పాడు కెవిన్. క్రిస్మస్ నుంచి వాలెంటైన్స్ డే వరకు అంతా ఫెస్టివ్ మూడ్‌లో ఉంటారు కాబట్టి.. ఈ మధ్యలో.. ఏదైనా ఒకరోజును హగ్ డేగా డిసైడ్ చేసుకుంటే ఫెస్టివ్ ఫీల్ కంటిన్యూ అవుతుందని అనుకున్నాడట. కౌగిలింతల వల్ల ఆత్మీయతలు పెరుగుతాయని, అనుబంధాలలోనూ అమెరికా అగ్రరాజ్యంగా ఎదుకుతుందని కెవిన్ ఆశ.