Huge collections
-
కొనసాగుతున్న ‘జీఎస్టీ’ కనకవర్షం!
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) భారీ వసూళ్లు కొనసాగుతున్నాయి. 2022 మేలో 2021 ఇదే నెలతో పోల్చితే (రూ.97,821) వసూళ్లు 44% పెరిగి రూ.1,40,885 లక్షల కోట్లకు చేరాయి. అయితే ఆల్ టైమ్ రికార్డు ఏప్రిల్ రూ.1,67,540 కోట్లు, మార్చి రూ.1,42,095 కోట్లు, జనవరి రూ. 1,40,986 కోట్లతో పోల్చితే మే వసూళ్లు తక్కువ. అంటే 2017 జూలై 1న ప్రారంభమై తర్వాత మేలో వసూళ్లు నాల్గవ అతిపెద్ద పరిమాణం. కాగా, ఈ క్యాలెండర్ ఇయర్లో ఫిబ్రవరిని (రూ.1,33,026 కోట్లు) మినహాయిస్తే, జీఎస్టీ రూ.1,40 లక్షల కోట్లను అధిగమించడం ఇది నాల్గవసారి. వేర్వేరుగా... ► మొత్తం వసూళ్లు రూ.1,40,885 కోట్లుకాగా, సెంట్రల్ జీఎస్టీ వసూళ్లు రూ.25,036 కోట్లు. ► స్టేట్ జీఎస్టీ వసూళ్లు రూ.32,001 కోట్లు. ► ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ వసూళ్లు రూ.73,345 కోట్లు (వస్తువుల దిగుమతులపై వసూలయిన రూ.37,469కోట్లుసహా). ► సెస్ రూ.10,502 కోట్లు (వస్తువుల దిగుమతులపై వసూలయిన రూ.931 కోట్లుసహా). ► మే నెల గణాంకాలకు ప్రాతిపదిక అయిన ఏప్రిల్ నెల్లో నమోదయిన ఈ–వే బిల్లులు 7.4 కోట్లు. ఎకానమీకి శుభ సంకేతం గత మూడు నెలల్లో రూ. 1.4 లక్షల కోట్లకు పైగా జీఎస్టీ వసూళ్లు ఆర్థిక వ్యవస్థ స్థిరత్వానికి, వృద్ధికి సంకేతం. స్థూల దేశీయోత్పత్తి (జీఎస్టీ) సంఖ్యలతో సహా ఇతర ఆర్థిక విభాగాల్లో రికవరీ పరిస్థితి ఉందని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి. పటిష్ట ఆడిట్లు, ప్రభుత్వ చర్యలు పన్ను ఎగవేతల నిరోధానికి దోహదపడుతున్నాయి. – ఎంఎస్ మణి, డెలాయిట్ ఇండియా పార్ట్నర్ -
భారీగా పెరిగిన పరోక్ష పన్నుల వసూళ్లు
ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య కాలంలో 36 శాతం అప్ న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో (ఏప్రిల్ నుంచి సెప్టెంబర్) పరోక్ష పన్ను వసూళ్లు 36% పెరిగాయి. విలువ రూపంలో ఈ వసూళ్లు రూ.3.24 లక్షల కోట్లు. గత ఆర్థిక సంవత్సర ఇదే కాలంలో ఈ వసూళ్ల విలువ రూ.2.38 లక్షల కోట్లు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పరోక్ష పన్ను వసూళ్లలో 19% వృద్ధిని (మొత్తంగా రూ.6.47 లక్షల కోట్లు) సాధించాలని బడ్జెట్ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే గడచిన ఆరు నెలల్లో ఈ వసూళ్లలో వృద్ధి రేటు లక్ష్యానికన్నా రెట్టింపుకావడం ప్రభుత్వానికి ఉత్సాహాన్ని అందిస్తోంది. ఆర్థిక మంత్రిత్వశాఖ శుక్రవారం విడుదల చేసిన గణాంకాలను పరిశీలిస్త్తే... మొత్తంలో ఎక్సైజ్ సుంకం వసూళ్లు భారీగా ఉన్నాయి. ఈ వసూళ్లు 70 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నాయి. రూ.74 వేల కోట్ల నుంచి రూ. 1.25 లక్షల కోట్లకు ఎగశాయి. డీజిల్, పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకాల పెంపు, మోటార్ వాహనాలపై పన్ను మినహాయింపుల ఉపసంహరణ, క్లీన్ ఎనర్జీ సెస్ పెంపు, జూన్‌లో సేవల పన్ను రేటు పెరుగుదల వంటి అంశాలు ఈ విభాగంలో భారీ వసూళ్లకు కారణం. -
‘గోవిందుడు అందరివాడేలే’ మూవీ సక్సెస్ మీట్
-
జపాన్‌లో శ్రీదేవి హిట్...
సుదీర్ఘ విరామం తర్వాత అతిలోక సుందరి శ్రీదేవి నటించిన ‘ఇంగ్లిష్ వింగ్లిష్’ జపాన్‌లో భారీ వసూళ్లు సాధిస్తోంది. ఇప్పటి వరకు 4.20 లక్షల డాలర్లు వసూలు చేసిన ‘ఇంగ్లిష్ వింగ్లిష్’ జపాన్ థియేటర్లలో ఇంకా ఆడుతోంది.‘3 ఇడియట్స్’ తర్వాత జపాన్‌లో భారీ వసూళ్లు సాధించిన హిందీ చిత్రం ఇదే కావడం విశేషం. గౌరీ షిండే దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ఎరోస్ ఇంటర్నేషనల్ విడుదల చేసింది.