ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య కాలంలో 36 శాతం అప్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో (ఏప్రిల్ నుంచి సెప్టెంబర్) పరోక్ష పన్ను వసూళ్లు 36% పెరిగాయి. విలువ రూపంలో ఈ వసూళ్లు రూ.3.24 లక్షల కోట్లు. గత ఆర్థిక సంవత్సర ఇదే కాలంలో ఈ వసూళ్ల విలువ రూ.2.38 లక్షల కోట్లు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పరోక్ష పన్ను వసూళ్లలో 19% వృద్ధిని (మొత్తంగా రూ.6.47 లక్షల కోట్లు) సాధించాలని బడ్జెట్ లక్ష్యంగా పెట్టుకుంది.
అయితే గడచిన ఆరు నెలల్లో ఈ వసూళ్లలో వృద్ధి రేటు లక్ష్యానికన్నా రెట్టింపుకావడం ప్రభుత్వానికి ఉత్సాహాన్ని అందిస్తోంది. ఆర్థిక మంత్రిత్వశాఖ శుక్రవారం విడుదల చేసిన గణాంకాలను పరిశీలిస్త్తే...
మొత్తంలో ఎక్సైజ్ సుంకం వసూళ్లు భారీగా ఉన్నాయి. ఈ వసూళ్లు 70 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నాయి. రూ.74 వేల కోట్ల నుంచి రూ. 1.25 లక్షల కోట్లకు ఎగశాయి. డీజిల్, పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకాల పెంపు, మోటార్ వాహనాలపై పన్ను మినహాయింపుల ఉపసంహరణ, క్లీన్ ఎనర్జీ సెస్ పెంపు, జూన్‌లో సేవల పన్ను రేటు పెరుగుదల వంటి అంశాలు ఈ విభాగంలో భారీ వసూళ్లకు కారణం.
భారీగా పెరిగిన పరోక్ష పన్నుల వసూళ్లు
Published Sat, Oct 10 2015 12:45 AM | Last Updated on Sun, Sep 3 2017 10:41 AM
Advertisement
Advertisement