పాదయాత్రను విజయవంతం చేయాలి
టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య
వరంగల్ రూరల్ : హైదరాబాద్‌లో సచివాలయం, ఛాతి అస్పత్రి తరలింపునకు నిరసనగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్వర్యంలో ఈ నెల 7వ తేదీన గాంధీ భవన్ నుంచి రాజ్‌భవన్ వరకు చేపట్టిన పాదయాత్రను విజయవంతం చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య పిలుపునిచ్చారు. గురువారం ఆయన తన స్వగృహంలో డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, డీసీసీబీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, టీపీసీసీ కార్యదర్శి, మీడియా కన్వీనర్ ఈవీ.శ్రీనివాసరావు, ఎస్సీ సెల్ రాష్ట్ర, జిల్లా అధ్యక్షులు ఎ.కృష్ణ, నమిండ్ల శ్రీనివాస్, ప్రొటోకాల్ కన్వీనర్ బట్టి శ్రీనివాస్, పీసీసీ కార్యదర్శి రాపోలు జయప్రకాశ్, రాజారపు ప్రతాప్‌తో భేటీ అయ్యారు. సీఎం కేసీఆర్ అనాలోచిత నిర్ణయూలకు నిరసనగా చేపట్టే కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొనేలా చూడాలని నాయకులకు పొన్నాల సూచించారు.
దళిత చైతన్య సదస్సును జయపప్రదం చేయూలి : నాయిని
హన్మకొండలోని నందన గార్డెన్స్‌లో ఈనెల 9నజరిగే దళిత చైతన్య జిల్లా సదస్సును విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి కోరారు. గురువారం ఆయన స్వగృహంలో జిల్లా, నగర నాయకులతో సమావేశమయ్యారు. ఏఐసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ కొప్పుల రాజు, టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, రాష్ట్ర ఎస్సీ సెల్ చైర్మన్‌తోపాటు సీనియర్ నాయకులు సదససుకు హాజరవుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు గ్రామ స్థాయి నుంచి కాంగ్రెస్ కార్యకర్తలను తరలించేలా చూడాలని నాయకులకు సూచించారు. సమావేశంలో నగర అధ్యక్షుడు విద్యాసాగర్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు శ్రీనివాస్, డీసీసీబీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, ఎస్సీ, ఎస్టీ కమీషన్ మాజీ సభ్యుడు ప్రతాప్, టీపీసీసీ కార్యదర్శి, మీడియా కన్వీనర్ ఈవీ.శ్రీనివాసరావు, కోన శ్రీకర్, మనోహర్, మేకల ఉపేందర్ పాల్గొన్నారు.