hunger problems
-
Kavita Shukla: అమ్మమ్మ ఇంట్లో వచ్చిన ఐడియా జీవితాన్నే మార్చేసింది!
సెలవుల్లో అమ్మమ్మ ఇంటికి వెళితే ఏం దొరుకుతుంది? అంతులేని ఆనందం. అయితే అమెరికా నుంచి ఇండియాలో ఉన్న అమ్మమ్మ ఇంటికి వచ్చిన కవితా శుక్లాకు ఆనందంతో పాటు ‘ఐడియా’ కూడా దొరికింది. ఆ ఐడియా ఆమెను ఇన్వెంటర్ని చేసింది. ఆ తరువాత ఎంటర్‌ప్రెన్యూర్‌ను చేసింది. ఇన్వెంటర్, ఎంటర్ప్రెన్యూర్, మోటివేషనల్ స్పీకర్, డిజైనర్‌గా ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచింది కవితా శుక్లా... చిన్నప్పటి నుంచి సైన్స్, కళలు అంటే కవితకు ఆసక్తి. సైన్స్‌లో రకరకాల ప్రయోగాలు చేసేది. తాను ఇన్నోవేటర్ కావడానికి ఆ ప్రయోగాలు పునాదిగా ఉపయోగపడ్డాయి. పదిహేడు సంవత్సరాల వయసులోనే ఎన్నో పేటెంట్లు తీసుకుంది. ‘ఫ్రెష్‌పేపర్’ రూపంలో ఆహార వ్యర్థాలను తగ్గించే సాంకేతిక ఆవిష్కరణ కవితకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు తెచ్చింది. ఈ ఫ్రెష్ పేపర్ ఆహారం, కూరగాయలలో బ్యాక్టీరియా, ఫంగస్ పెరుగుదలను నిరోధించి వాటిని ఎక్కువసేపు తాజాగా ఉంచుతుంది. బోస్టన్లోని స్థానిక రైతు మార్కెట్ లో ఫ్రెష్ పేపర్ లాంచ్ చేశారు. మౌత్‌టాక్‌తోనే ఈ పేపర్ పాపులర్ అయింది. ప్రస్తుతం ఈ ఫ్రెష్‌పేపర్ 180 దేశాల్లో అందుబాటులో ఉంది. ‘యూఎస్‌లో ఆహార వృథా అనేది ఇంత పెద్ద సమస్య అని తెలియదు. ఫ్రెష్పేపర్కు వచ్చిన స్పందన నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. పండ్లు, కూరగాయలు, ఆహారాన్ని తాజాగా ఉంచడానికి తద్వారా ఆరోగ్యంగా ఉండడానికి ఇది ఉపయోగపడుతుంది. లోకల్ఫుడ్ బ్యాంకులకు వీటిని విరాళంగా ఇచ్చాం’ అంటుంది కవిత. ఫుడ్ ప్రిజర్వేషన్‌కు సంబంధించిన ఆసక్తి కవితలో పదమూడు సంవత్సరాల వయసు నుంచే మొదలైంది. సెలవులు వచ్చినప్పుడు ఇండియాలోని అమ్మమ్మ ఇంటికి వచ్చింది కవిత. ఒకరోజు పొరపాటున కలుషితమైన నీరు తాగింది. ఆందోళన పడిన అమ్మమ్మ వెంటనే కవితతో ఏదో కషాయం తాగించింది. దీంతో కవితకు ఏమీ కాలేదు. అమెరికాకు తిరిగిన వచ్చిన తరువాత కషాయంలో అమ్మమ్మ ఉపయోగించిన పదార్థాల గురించి వివరంగా తెలుసుకోవడం మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే ఆహారపదార్థాలు, కూరగాయలు చెడిపోకుండా సంరక్షించడానికి సంబంధించిన పరిశోధనలు మొదలుపెట్టింది. జర్మనీలో పుట్టిన కవిత ఇలియట్ సిటీ (యూఎస్)లో పెరిగింది. హార్వర్డ్ యూనివర్శిటీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ పట్టా పుచ్చుకుంది. ‘ సింపుల్ ఐడియాలకు మార్పు తెచ్చే శక్తి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఉపయోగించవచ్చు’ అంటుంది కవిత. ఆహార భద్రత, సంరక్షణకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా కృషి చేస్తున్న విశిష్ట వ్యక్తులలో ఒకరిగా పేరు తెచ్చుకున్న కవిత మోటివేషనల్ స్పీకర్ కూడా. ఎన్నో కాలేజీలలో, సమావేశాలలో యువతను ఉద్దేశించి ఉత్తేజకరమైన ప్రసంగాలు చేసింది. ఎన్నో ప్రతిష్ఠాత్మకమైన అవార్డ్లు అందుకుంది. ఫోర్బ్స్ ‘30 అండర్ 30: సోషల్ ఎంటర్ ప్రెన్యూర్స్’ టైమ్ మ్యాగజైన్ ‘5 మోస్ట్ ఇనోవేటివ్ ఉమెన్ ఇన్ ఫుడ్’ న్యూస్‌వీక్ ‘125 ఉమెన్ ఆఫ్ ఇంపాక్ట్’ జాబితాలలో చోటు సంపాదించింది. రెండు సంవత్సరాల క్రితం వర్జీనియాలో జరిగిన వ్యాపారులు, చిన్న వ్యాపారులు, ఇండిపెంటెంట్ ఇన్వెంటర్లు, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ప్రొఫెషనల్స్ సమావేశంలో కీలక ఉపన్యాసం ఇచ్చింది. ఇన్వెంటర్ అయిన కవిత ‘ఫ్రెష్ గ్లో’ కంపెనీతో ఎంటర్‌ప్రెన్యూర్‌గా అద్భుత విజయం సాధించింది. ‘మీకు ఏదైనా ఆసక్తిగా అనిపిస్తే దాని గురించి లోతుగా ఆలోచించండి. ఆ తరువాత పరిశోధించండి. ఫలితాలు చేతికి అందేవరకు ప్రయోగాలు చేయండి’ అంటుంది కవిత. ఆలోచించండి... అద్భుతాలు చేయండి కష్టాల దారిలో ప్రయాణించి విజయాలు సాధించిన ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ల గురించి తెలుసుకోవడం అంటే ఇష్టం. వారి గురించి సమావేశాల్లో చెబుతుంటాను. వారి విజయగాథలు ఎంతోమందికి స్ఫూర్తిని ఇస్తాయి. ఆలోచిస్తే ఐడియాలు వస్తాయి. ఆ ఐడియాలతో ఎన్ని గొప్ప పనులైనా చేయవచ్చు. మన ఐడియాను మొదట ఇతరులతో పంచుకోవడానికి భయంగా అనిపిస్తుంది. ఆ భయాన్ని వదులుకొని ఆత్మవిశ్వాసంతో చెప్పండి. ఆత్మవిశ్వాసం ఉన్న చోటుకి విజయం త్వరగా వస్తుంది. – కవితా శుక్లా, ఫ్రెష్ గ్లో కంపెనీ ఫౌండర్, సీయీవో ∙చిన్నప్పుడు అమ్మమ్మ ఇంట్లో కవితా శుక్లా -
పిల్లాడి పెద్దమనసు..మేక్ ఎ విష్
భరించలేని బాధ, కష్టం కలిగినప్పుడు చుట్టపక్కల ఏం జరుగుతున్నా పట్టించుకోము. ఆ పరిస్థితిని అర్థం చేసుకుని, బయటపడే ఆలోచనల్లో మునిగిపోతాం. అటువంటిది ఓ చిన్నపిల్లాడు ప్రాణాంతక వ్యాధితో బాధపడుతూ, ఎన్నాళ్లు జీవించి ఉంటాడో తెలియనప్పటికీ ... కూడు, గూడు లేనివాళ్ల ఆకలి తీర్చండి అని చెబుతూ, నిరాశ్రయుల ఆకలి తీరుస్తున్నాడు. అమెరికాలోని మిస్సిసీపికి చెందిన పదమూడేళ్ల అబ్రహం ఒలెబెగికి గతేడాది ‘అప్లాస్టిక్ ఎనీమియా’ ఉన్నట్టు తెలిసింది. అరుదైన అప్లాస్టిక్ ఎనీమియా కారణంగా..శరీరంలో సరిపడినంతగా కొత్త రక్తకణాలు ఉత్పత్తి కావు. దీని వల్ల క్రమంగా ఆరోగ్యం క్షీణించి ప్రాణాంతకంగా మారుతుంది. ఈ విషయం తెలిసినప్పుడు అబ్రహం ఏ మాత్రం భయపడలేదు. రెగ్యులర్‌గా డాక్టర్ వద్దకు వెళ్లి చికిత్స తీసుకుంటున్నాడు. ఇటువంటి ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతోన్న పిల్లల కోరికలను తీర్చే ‘మేక్ ఏ విష్’ ఫౌండేషన్ అబ్రహం గురించి తెలిసి అతని విష్ను తీర్చేందుకు సంప్రదించింది. అందరు పిల్లలు కోరుకున్నట్లే తన జీవిత లక్ష్యాన్ని కోరుకుంటాడని ఫౌండేషన్ అనుకుంది. కానీ అందరికంటే భిన్నంగా ‘‘ఇల్లు లేని వారికి ఏడాది పాటు ఆకలి తీర్చండి, అదే నా మేక్ ఏ విష్’’ అని కోరాడు. అబ్రహం కోరిక నచ్చిన మేక్ ఏ విష్ అతని కోరిక మన్నించడంతోపాటు, మరికొన్ని బహుమతులు కూడా ఇచ్చింది. పౌండేషన్ సాయంతో గూడులేని నిరాశ్రయులకు ఆహారం అందించి, ఆకలి తీరుస్తున్నాడు అబ్రహాం. తన తల్లితో కలిసి వందమంది ఆకలిని తీర్చాడు. అబ్రహం పెట్టే ఫుడ్ తిన్న వారంతా థ్యాంక్స్ బాబు అంటూ అబ్రహంకు కృతజ్ఞతలు చెబుతూ ..ఆయుష్షు పెరగాలని దీవిస్తున్నారు. ఈ కార్యక్రమం ఫౌండేషన్ సాయంతో 2022 ఆగస్టు వరకు కొనసాగనుంది. అబ్రహం టేబుల్.. ప్రస్తుతం చికిత్స తీసుకుంటూనే..బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం అబ్రహం ఎదురుచూస్తున్నాడు. ఎవరైనా దాత దొరికితే అతని సమస్య దాదాపు తీరుతుంది. ఫౌండేషన్ సాయంతో నిరాశ్రయుల ఆకలి తీరుస్తూ ఎంతో సంతోషంగా ఉన్న అబ్రహం భవిష్యత్‌లో ‘‘అబ్రహం టేబుల్’’ పేరు మీద ఓ ఎన్జీవోని ప్రారంభించి ఈ సేవలను మరింతగా విస్తరించాలనుకుంటున్నాడు. ఈ విషయం తెలిసిన ప్రపంచ వ్యాప్త నెటిజన్లు అబ్రహంను మెచ్చుకోవడమేగాక, అతను త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. -
‘పాచి’ .. పంచభక్ష పరమాన్నం..!
సాక్షి, వెబ్ డెస్క్ : ప్రపంచ జనాభా 2050 కల్లా 9.8 బిలియన్లను చేరుతుందని ఓ అంచనా. ఇదే జరిగితే ఇప్పటికే ఆకలితో అలమటిస్తున్న దేశాల పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుంది. భారీ సంఖ్యలో పెరుగుతున్న జనాభా ఆకలిని తీర్చడానికి ఉన్న ఏకైక ప్రత్యామ్నాయం ‘సముద్రాలు’. అవును. భవిష్యత్‌లో సముద్ర ఆహారం పాత్ర చాలా కీలకంగా మారనుంది. 2050 కల్లా ప్రపంచవ్యాప్తంగా మాంసాహారం తినేవారి శాతం 60కు పైచిలుకు పెరుగుతుందని ఓ అంచనా. కానీ ఇప్పటికే ప్రపంచంలోని 90 శాతం చేపల నిల్వలు ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నాయి. కాలుష్యం, వాతావరణంలోని కార్బన్ డై ఆక్సైడ్ సముద్రాలను త్వరగా వేడిక్కిస్తున్నాయి. దీంతో సాగరాల్లోని జీవ సంపద త్వరగా అంతరించిపోతోంది. సముద్ర ఆహార ఉత్పత్తులను పెంచేందుకు అవకాశం ఉన్నా.. ప్రస్తుత పరిస్థితుల్లో పెద్ద చేపలపై ఆధారపడటం అంత శ్రేయస్కరం కాదు. వాతవరణ మార్పు - సముద్ర ఆహారంపై ప్రభావం సాగరాలు వేడెక్కడం అనేది ప్రదేశాన్ని బట్టి మారుతోంది. నీరు ఆమ్లంగా మారటం సముద్ర ఆహార పదార్థాల ఉత్పత్తిపై ఇప్పటికే పెను ప్రభావాన్ని చూపుతోంది. అమెరికా పశ్చిమ తీరం ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. ఈ ప్రాంతంలోని జీవ జాతులు లార్వా దశలలోనే చనిపోతున్నాయి. చల్లటి నీటి కోసం జీవ జాతులు ఉత్తర, దక్షిణ ధ్రువాలకు వలస పోతున్నాయి. ‘పాచి’ పంచభక్ష పరమాన్నం..! కాలుష్యం, కార్బన్ డై ఆక్సైడ్లు సముద్ర నీటిని వేడెక్కించడం కిరణ జన్య సంయోగ క్రియ జరిగి పాచి, సయానోబాక్టీరియా, ప్లాంక్టాన్ లాంటివి పెరుగుతాయి. వాస్తవానికి వీటిని ఆహారంగా స్వీకరిస్తూ సాగర జీవ జాలం బ్రతుకుతుంటుంది. ఇప్పుడు ఇదే ప్రక్రియ మనకు ఆహార ప్రక్రియ ప్రత్యామ్నాయంగా మారనుంది. పాచిని మానవాళి ఆహారంగా స్వీకరించేలా మార్చుకోవచ్చు. సీ వీడ్ అనే పాచి రకాన్ని వందల ఏళ్లుగా ఆహారంగా స్వీకరిస్తూ వస్తున్నారు. అయితే, కేవలం 35 దేశాలు మాత్రమే సీ వీడ్‌ను పెంచుతున్నాయి. స్పిరులినా సయానోబాక్టీరియాను ఇప్పటికే ఆహారంగా తీసుకుంటున్న విషయం తెలిసిందే. దీంతో పాచిలో మిగిలిన రకాలను కూడా ఆహారపు వనరులుగా మార్చేందుకు ప్రయత్నాలు జరగుతున్నాయి. పాచిని ఆహారపు వనరుగా తీసుకురావడం అనేది అంత సులువైన పనేం కాదు. అయితే, పాచిని ప్రత్యామ్నాయంగా వినియోగించగల్గితే ఆహారపు గొలుసుపై పడుతున్న ఒత్తిడిని తగ్గించేందుకు వీలు కల్గుతుంది. -
పోలీసుల ఆకలి కేకలు..
బందోబస్తులో భోజన సదుపాయాలులేక తిప్పలు రాజానగరం: పుష్కర బందోబస్తుకు తీసుకువచ్చి, తమ కడుపులు మాడుస్తున్నారని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి రాజమండ్రి వచ్చిన పోలీసులు ఆక్రోశిస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నానికే ఇక్కడకు చేరుకున్న పోలీసు సిబ్బందికి తగిన వసతులు కల్పించడంలో జిల్లా అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. పురుషుల మాటెలావున్నా మహిళా పోలీసుల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. తాగు నీరు, కాలకృత్యాలు తీర్చుకునే అవకాశం కల్పించకపోవడంతో నానా ఇబ్బందులు పడుతున్నారు. రోజుకు భోజనాల నిమిత్తం తమకు ఇచ్చేది రూ. 50 అయితే ఒక్కపూటకే రూ. 80 వెచ్చించవలసి వచ్చిందని పలువురు పోలీసులు చెప్పారు. రోజుకు తమకు టీఏగా రూ. 200 చొప్పున ఐదు రోజులకు మాత్రమే ఇచ్చారన్నారు. ప్రస్తుత రోజుల్లో రోజుకు రూ. 50 ఏవిధంగా సరిపోతాయన్నారు.