husband killed by wife
-
Hyderabad: ఇల్లాలిని చంపిన భర్త
మణికొండ: కుటుంబ కలహాలతో భార్యను చంపాడు ఓ భర్త. ఈ ఘటన నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలోని హైదర్షాకోట్ మాధవీనగర్ కాలనీలో మంగళవారం జరిగింది. స్థానికులు, నార్సింగి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రకు చెందిన శ్రీనివాస్ సాగర్, కృష్ణవేణి (32)కి పన్నెండేళ్ల క్రితం వివాహమైంది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. బతుకుదెరువు కోసం నగరానికి వచి్చన శ్రీనివాస్ సాగర్ హైదర్షాకోట్లోని ఓ టెంట్‌హౌస్‌లో పని చేస్తున్నాడు. కుటుంబ కలహాలతో దంపతులిద్దరూ తరచూ గొడవపడేవారు. ఈ విషయంలో కృష్ణవేణి నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కక్షగట్టిన శ్రీనివాస్ సాగర్.. సోమవారం తెల్లవారుజామున ఇంట్లో నిద్రిస్తున్న ఆమె తలపై సుత్తితో బాదాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో కృష్ణవేణి అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం పిల్లలను తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తన భార్యను చంపానంటూ శ్రీనివాస్‌సాగర్ లొంగిపోయాడు. కాగా.. కృష్ణవేణి హత్య విషయం తెలుసుకుని హైదర్షాకోట్కు చేరుకున్న ఆమె బంధువులు పోలీస్‌స్టేషన్‌లో ఉన్న శ్రీనివాస్ సాగర్‌ను తమకు అప్పగించాలని ఆందోళనకు దిగారు. మూడు గంటల పాటు వారిని పోలీసులు సముదాయించి ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. -
నా భార్య మరో వ్యక్తితో కళ్లెదుటే తిరుగుతుంటే జీర్ణించుకోలేక
(అనంతపురం) రాప్తాడురూరల్: ప్రేమించి మతాంతర వివాహం చేసుకున్నాడు.. వారి ప్రేమకు గుర్తుగా ఓ కొడుకు పుట్టాడు. 15 ఏళ్ల వైవాహిక జీవితంలో మనస్పర్థలు తలెత్తడంతో సర్దుకుపోలేక విడాకులు తీసుకున్నాడు. మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండడాన్ని జీర్ణించుకోలేక కిరాతకంగా హతమార్చాడు. పోలీసులు తెలిపిన మేరకు... వజ్రకరూరుకు చెందిన తపాల్ బాబా బేల్దారి పనులతో జీవనం సాగించేవాడు. ఈ క్రమంలో 17 ఏళ్ల క్రితం గార్లదిన్నె మండలం పెనకచెర్ల గ్రామానికి చెందిన లక్ష్మిని ప్రేమించి, మతాంతర వివాహం చేసుకున్నాడు. పెళ్లి అనంతరం తన పేరును ఆషాబీగా ఆమె మార్చుకుంది. ఇద్దరూ కురుగుంట వైఎస్సార్ కాలనీలో ఉండేవారు. వీరికి నూర్ మహమ్మద్ వలి అనే కుమారుడు ఉన్నాడు. ప్రస్తుతం ఆ బాలుడి వయసు 15 సంవత్సరాలు. అధికారికంగా తలాక్ కొన్నేళ్ల పాటు ఆషాబీ, బాబా జీవనం సాఫీగా సాగింది. అనంతరం బాబా శైలిలో మార్పు వచ్చింది. మద్యానికి బానిసయ్యాడు. తాగుడు అలవాటు మానేయాలని తరచూ భార్య చెబుతుండడంతో ఆమెతో ఘర్షణ పడేవాడు. బంధుమిత్రులు చెప్పినా మార్పు రాలేదు. దీంతో రెండేళ్ల క్రితం మసీదులో మత పెద్దల సమక్షంలో అధికారికంగా విడాకులు (తలాక్) తీసుకున్నారు. ఆ సమయంలో తన 13 ఏళ్ల కుమారుడిని పెద్దల మాటకు కట్టుబడి భర్త వద్దనే ఆమె వదిలేసింది. ఈ క్రమంలో అప్పడప్పుడు తల్లి వద్దకు కుమారుడు వెళ్లి పలకరించి, తిరిగి తండ్రి వద్దకు చేరుకునేవాడు. మరొకరితో వివాహం తపాల్ బాబా నుంచి విడాకులు తీసుకున్నాక అక్కంపల్లికి చెందిన నబీరసూల్‌తో ఆషాబీకి పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారి పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే నబీరసూల్‌కు అప్పటికే వివాహమై భార్య కూడా ఉంది. ఆషాబీ రెండోభార్యగా కొనసాగుతూ వస్తోంది. ఇటీవల కురుగుంట జగనన్న కాలనీలో ఆషాబీకి ఇల్లు మంజూరు కావడంతో నబీరసూల్ దగ్గరుండి నిర్మాణం పూర్తి చేయించాడు. అనంతరం కొత్త ఇంట్లోనే వారు కాపురం ఉంటున్నారు. కళ్లెదుటే తిరుగుతుంటే జీర్ణించుకోలేక మాజీ భార్య ఆషాబీ తన కళ్లెదుటే మరో వ్యక్తిని పెళ్లి చేసుకుని సంతోషంగా తిరుగుతుండడాన్ని చూసి తపాల్ బాబా జీర్ణించుకోలేక పోయారు. దీంతో ఆషాబీని హతమార్చేందుకు పథకం వేశాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి కుమారుడు వలితో కలసి ఆషాబీ ఇంటికి వెళ్లి తలుపు తట్టాడు. ఆ సమయంలో ఆషాబీ సోదరుడు రమేష్ వాకిలి తీయగానే బాబా ఒక్కసారిగా కత్తితో కడుపులో పొడవడంతో పేగులు బయట పడి అతను కుప్పకూలిపోయాడు. వెనువెంటనే బెడ్రూంలోకి వెళ్లి ఆషాబీపై విచక్షణారహితంగా కత్తితో దాడి చేశాడు. ఆమె మృతి చెందినట్లు నిర్ధారించుకున్న తర్వాత కుమారుడితో కలసి పారిపోయాడు. అపస్మార స్థితిలో పడి ఉన్న రమేష్ ను స్థానికులు వెంటనే సర్వజనాస్పత్రికి తరలించారు. వైద్యులు శస్త్రచికిత్స చేశారు. అయినా రమేష్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. సమాచారం అందుకున్న అనంతపురం ఇన్చార్జ్ డీఎస్పీ మహబూబ్‌బాషా, రూరల్ సీఐ విజయభాస్కరగౌడ్, ఎస్ఐ నబీరసూల్, సిబ్బంది కురుగుంట జగనన్న కాలనీకి చేరుకుని పరిశీలించారు. ఘటనపై చుట్టుపక్కల వారిని, ఆషాబీ బంధువులను ఆరా తీశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రమేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
పాణం తీసిన బంగారు గొలుసు
రామగుండం: బంగారు గొలుసు దంపతుల మధ్య చిచ్చుపెట్టింది. మాటామాటా పెరగడంతో ఆ గొడవలో భర్తను భార్య ఇటుకతో తలపై కొట్టి చంపేసింది. పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ పీటీఎస్‌లో శుక్రవారం తెల్లవారు జామున ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఎల్కలపల్లి గేటు ప్రాంతానికి చెందిన చిలుముల సుమన్ (40), పొట్యాల గ్రామానికి చెందిన స్పందన దంపతులు రామగుండం ఎన్టీపీసీ విద్యుత్ పరిశ్రమకు సంబంధించిన సర్వెంట్ క్వార్టర్లో నివాసం ఉంటున్నారు. ఇటీవల స్పందన తన బంగారు గొలుసును సోదరుడికి ఇచ్చింది. ఈ విషయంలో దంపతుల మధ్య గొడవ జరగడంతో స్పందన ఇటుకతో సుమన్ తలపై బాదింది. దీంతో సుమన్ రక్తం మడుగులో పడి విగతజీవిగా మారాడు. -
విజయనగరం టూ హైదరాబాద్.. పిల్లలున్నా ప్రియుడే కావాలని..
హిరమండలం: ప్రియుడు మోజులో పడి భర్తనే చంపించేసిది ఓ మహిళ. తరువాత ఏం తెలియనట్టు భర్త కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. భర్త వాడిన సెల్ ఫోన్ సిమ్‌ను మార్చేసి మరొకటి వేసి ఆ ఫోన్‌నే వాడింది. చివరకు అదే ఈ దారుణంతో సంబంధం ఉన్నవారిని పట్టించింది. సుమారు ఐదు నెలల క్రితం జరిగిన ఈ ఘాతుకం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను కొత్తూరు సీఐ ఆర్.వేణుగోపాలరావు గురువారం స్థానిక పోలీసు స్టేషన్లో తెలియజేశారు. వివరాల్లోకి వెళితే.. విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం గ్రామానికి చెందిన కుంబిర రాజుకు హిరమండలం మేజర్ పంచాయతీకి చెందిన సుజాతతో 17 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలున్నారు. వివాహం జరిగినప్పటి నుంచి చిన్నకొల్లివలస గ్రామంలో ఉండేవారు. ఐదేళ్ల క్రితం పిల్లలను చదువుల నిమిత్తం బంధువుల వద్ద విడిచిపెట్టి ఉపాధి కోసం దంపతులిద్దరూ హైదరాబాద్ వెళ్లారు. అయితే, చిన్నకొల్లివలస గ్రామంలో ఉన్నప్పటి నుంచి సుజాత మాత్రం పాడలి గ్రామానికి చెందిన గురల్లా రాముతో వివాహేతర సంబంధం కొనసాగించేది. హైదరాబాద్‌లో ఉన్నప్పటికీ రాముతో తరచూ ఫోన్లో మాట్లాడుతుండేది. ఈ విషయం తెలిసిన భర్త రాజు భార్య సుజాతతో తరచూ గొడవ పడుతుండేవాడు. ఇంట్లో గొడవలు జరుగుతున్న విషయాన్ని ప్రియుడుతో ఆమె చెప్పేంది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్త రాజును ఎలాగైనా అంతమోందించాలని ప్రియుడుతో కలిసి పన్నాగం పన్నింది. ఈ క్రమంలోనే సుజాతను హైదరాబాద్‌లో విడిచిపెట్టి ఈ ఏడాది ఏప్రిల్ నాలుగో తేదీన రాజు స్వగ్రామానికి వచ్చాడు. ఈ విషయాన్ని ప్రస్తుతం కొత్తూరు మండలం మాసంగిలో నివాసం ఉంటున్న ప్రియుడు రాముకు సమాచారం ఇవ్వడంతోపాటు ఎలాగైనా హతమార్చాలని కోరింది. దీంతో, రాము ఎల్‌ఎన్‌పేట మండలం దనుకువాడ గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ కె.నూకరాజు సహాయం తీసుకున్నాడు. ముందు నుంచే రాజు, రాము, నూకరాజు మధ్య పరిచయం ఉంది. దీంతో పార్టీ చేసుకుందామని ఏప్రిల్ ఆరో తేదీన రాజుని తహసీల్దార్ కార్యాలయం సమీపంలో ఉన్న వంశధార నది గట్టువైపు ఆటోలో తీసుకువెళ్లారు. రాజుకు బాగా మద్యం తాగించడంతో మత్తులోకి జారుకున్నాక ఆటోను స్టార్ట్ చేసేందుకు ఉపయోగించే తాడును మెడకు బిగించి హత్య చేశారు. మృతదేహాన్ని సమీపంలో ఉన్న తుప్పల్లో పడేశారు. ఈ విషయాన్ని రాము ప్రియురాలు సుజాతకు ఫోన్లో తెలియజేశాడు. అయితే మృతదేహాన్ని అలా వదిలేస్తే దొరికిపోతామని.. కాల్చివేయాలని సుజాత రాముకు చెప్పింది. దీంతో వీరు ఏప్రిల్ ఏడో తేదీ రాత్రి మృతదేహాన్ని ఎల్‌ఎన్‌పేట మండలం పెద్దకొల్లివలస పాత గ్రామం వద్దకు తీసుకొని వచ్చి పెట్రోల్ పోసి కాల్చేశారు. కొద్దిరోజుల తరువాత అటుగా వెళ్లిన గొర్రెల కాపరులు కాలిపోయి ఉన్న ఎముకలను చూసి పోలీసులకు సమాచారం ఇచ్చా రు. దీంతో సరుబుజ్జిలి పోలీస్‌స్టేషన్‌లో గుర్తు తెలియని మృతదేహంగా కేసు నమోదు చేశారు. హిరమండలం పోలీస్‌స్టేషన్‌లో భార్య ఫిర్యాదు రాజు గత కొన్నిరోజులుగా కనిపించడం లేదని సుజాతకు స్థానికులు సమాచారం ఇచ్చారు. దీంతో ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు మృతుడి భార్య సుజాత హైదరాబాద్ నుంచి వచ్చి ఏప్రిల్ 22 తేదీన తన భర్త కనిపించడం లేదని హిరమండలం పోలీస్టేషన్లో ఫిర్యాదు చేసింది. అప్పటి నుంచి పోలీసులు దర్యాప్తు చేస్తూ వస్తున్నారు. భర్త వాడిన సెల్ఫోన్లో సిమ్ తీసి ఫోన్‌ను మాత్రం సుజాత ఉపయోగిస్తోంది. సెల్ఫోన్లో సిమ్ తీసినప్పటికీ ఈఎంఐ నంబర్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేయగా సుజాతనే ఫోన్ ఉపయోగిస్తున్నట్లు నిర్ధారణకు వచ్చారు. కాల్‌డేటా ఆధారంగా నిందితులను గుర్తించారు. తాము ఎలాగైనా దొరికిపోతామని నిందితులు భావించి వీఆర్వో శేషగిరిరావు వద్ద లొంగిపోగా.. ఆతను స్థానిక పోలీసుస్టేషన్లో ముగ్గురినీ అప్పగించారు. ఏ–1గా నూకరాజు, ఏ–2గా రాము, ఏ–3గా సుజాతలపై కేసు నమోదు చేసి.. అరెస్టు చేసి ఆమదాలవలస కోర్టు తరలించినట్టు సీఐ వేణుగోపాల్ తెలిపారు. ఎస్సై నారాయణస్వామి పాల్గొన్నారు. కేసును ఛేదించిన సిబ్బందిని అభినందించారు. -
వీడని మిస్టరీ.. పోలీసులకే సవాల్
తిరువళ్లూరు: ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మూడేళ్లు సంసారం చేశాడు. ఆ తరువాత వరకట్నం కోసం భార్యను వేధించాడు. అందుకు అంగీకరించకపోవడంతో భార్యను చిత్తూరు జిల్లా నారాయణవనం కైలాసకోనకు తీసుకెళ్లాడు. హతమార్చి మృతదేహం కనిపించకుండా మాయం చేశాడు. ఈ దారుణ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. తిరువళ్లూరు జిల్లా సెంగుడ్రం ప్రాంతానికి చెందిన మదన్, తమిళ్‌సెల్వి మూడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. కొంత కాలం పాటు సజావుగా సాగిన వీరి సంసారం, వరకట్నం వేధింపుల వైపు వెళ్లింది. వరకట్నం తేవాలంటూ మదన్ తరచూ భార్యను వేధించేవాడు. ఈ నేపథ్యంలో గత జూన్ 25న తమిళ్‌సెల్వి మాయమైంది. దీంతో ఆందోళన చెందిన తమిళ్‌సెల్వి తల్లిదండ్రులు మణిగండన్, పల్గీస్ సెంగుడ్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన అసిస్టెంట్ కమిషనర్ మురుగేషన్, ఇన్స్పెక్టర్ రమేష్ తమిళ్ సెల్వి ఆచూకీ కనుగొనడానికి ప్రయత్నాలను ముమ్మరం చేశారు. కైలాసకోన వైపు కదిలిన కేసు విచారణలో భాగంగానే పోలీసులు మదన్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడు ఇచ్చిన పొంతనలేని సమాధానాలు ఇవ్వడంతో తమదైన శైలిలో విచారణ చేశారు. దీంతో అసలు విషయం బయటపడింది. గత నెలలో తమిళ్‌సెల్వితో కలిసి చిత్తూరు జిల్లా నారాయణవనం మండలంలోని కైలాసకోనలోని కొండపైకి వెళ్లానని, అక్కడ ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు తెలిపాడు. కోపంలో కత్తితో తమిళ్సెలి్వని దారుణంగా పొడిచానని, తీవ్రంగా గాయపడడంతో అక్కడే వదిలేసి ఇంటికి వచ్చినట్లు వెల్లడించాడు. తరువాత ఏం జరిగిందో తనకు తెలియదని పోలీసులకు వాగ్మూలం ఇచ్చాడు. ఆంధ్రాలో పోలీసుల దర్యాప్తు మదన్ ఇచ్చిన వాగ్మూలంతో సెంగుండ్రం పోలీసుల బృందం 20 రోజుల క్రితం కైలాసకోనకు వెళ్లింది. నారాయణవనం పోలీసుల సాయంతో కైలాసకోన కొండపై గాలించారు. ఫలితం కనిపించలేదు. అక్కడే ఉన్న సీసీ టీవీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు కొండపైకి తమిళ్‌సెలి్వ, మదన్ జంటగా వెళ్లినట్టు నిర్ధారించారు. సుమారు రెండు గంటల తరువాత మదన్ ఒంటరిగా వచ్చినట్లు వీడియోలో రికార్డయింది. కానీ మృతదేహాం కనిపించకపోవడంతో విచారణలో పురోగతి కనిపించలేదు. పోలీసులు పలు కోణాల్లో విచారణ చేసినా ఫలితం కనిపించలేదు. గత నెలలో మదన్ ఫోన్లో ఎక్కువ సార్లు మాట్లాడిన సంతోష్, బందారవిని సైతం విచారణ చేశారు. అయినా తమిళ్‌సెల్వి ఆచూకీ గుర్తించలేకపోయారు. ఇది కూడా చదవండి: గర్ల్‌ఫ్రెండ్ కోసం డబ్బులు కావాలని ఏటీఎం చోరికీ ప్లాన్.. -
ప్రియుడి మోజులో భర్త హత్య
సాక్షి, వరంగల్: ప్రియుడి మోజులో భర్తను హత్య చేయించిన సంఘటనలో సుబేదారి పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి కారు, నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు వివరాలను కమిషనరేట్‌లో సీపీ ప్రమోద్‌కుమార్ శుక్రవారం వెల్లడించారు. అదృశ్యంపై కేసు నమోదు గత నెల 24న వడ్డెపల్లి ప్రాంతానికి చెందిన తాళ్లపల్లి అనిల్ కనిపించడం లేదని ఆయన భార్య పూజిత సుబేదారి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో గత నెల 29న అనిల్ మృతదేహం రాయపర్తి మండలం మైలారం రిజర్వాయర్‌లో లభ్యమైంది. అయితే, అనిల్ బంధువులు భార్య పూజితపై అనుమానం వ్యక్తం చేశారు. దీంతో కేసుపై దృష్టి సారించిన పోలీసులు చేపట్టిన విచారణలో పూజితతో పాటు పెద్దమ్మగడ్డకు చెందిన హన్మకొండ డానీ, హన్మకొండ సతీష్, జులైవాడకు చెందిన కొట్టి సుధామణిలు అనిల్‌ను హత్య చేసినట్లు తేల్చారు. వివాహేతర సంబంధమే కారణం.. వరుసకు తమ్ముడైన హన్మకొండ డానీ వద్ద మృతు డు అనిల్ 2018లో రూ.లక్ష అప్పుగా తీసుకున్నాడు. వాటిని వసూలు చేసుకునే క్రమంలో డానీకి పూజిత తో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారి తీసింది. అప్పటి నుంచి డానీ అక్క సుధామణి ఇంట్లో ఇరువురు తరచు కలుసుకునే వారు. అనుమానంతో హత్యకు ప్రణాళిక కారణం లేకుండా భర్త గొడవపడడంతో అక్రమ సంబంధంపై అనుమానం రావొచ్చని భావించిన పూజిత.. అనిల్‌ను అడ్డు తొలగించుకోవాలని భావించింది. ఈ మేరకు తన భర్తను హతమార్చాలని డానీకి సూచించింది. జనవరి 22న అనిల్ హైదరాబాద్‌కు వెళ్లగా విషయాన్ని డానీకి చెప్పింది. దీంతో అతడిని హతమార్చేందుకు డానీ తమ్ముడైన సతీష్ సహకారం తీసుకున్నాడు. ఈ క్రమంలో ఫాతిమా జంక్షన్లో బస్సు దిగి వడ్డెపల్లి చర్చి వద్దకు చేరుకున్న అనిల్‌ను నిందితులు కారులో పెగడపల్లి డబ్బాలు, వంగపహాడ్ మీదుగా ఔటర్ రింగ్ రోడ్డు కు తీసుకెళ్లారు. అక్కడే మృతుడితో కలిసి మద్యం తాగి రాత్రి 10.30 కు భీమారం మీదుగా హసన్‌పర్తి మండలం అనంతసాగర్ కెనాల్ వద్దకు చేరుకున్నారు. అక్కడ అనిల్‌ను తీవ్రంగా కొట్టి.. ఆయన చొక్కాతోనే గొంతుకు బిగించి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని కెనాల్లో వేసి వెళ్లిపోయారు. ఈ క్రమంలో తన భర్త కనిపించడం లేదంటూ పూజిత పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా విచారణ జరిపిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. కాగా, కేసును ఛేదించి నిందితులను అరెస్టు చేయడంలో ప్రతిభ కనబరిచిన పోలీసులను సీపీ ప్రమోద్‌కుమార్ అభినందించారు.ఈ సమావేశంలో డీసీపీ పుష్ప, ఏసీపీ జితేందర్‌రెడ్డి, సుబేదారి ఇన్స్పెక్టర్ రాఘవేందర్, ఎస్సైలు పాల్గొన్నారు. -
రెండో పెళ్లే ప్రాణం తీసింది..
మామడ/నిర్మల్: ఇద్దరు ప్రియులతో అక్రమ సంబంధం పెట్టుకోవడమే కాకుండా తమ సాన్నిహిత్యానికి అడ్డొస్తున్నాడని పథకం ప్రకారం భర్తను హత్య చేయించిందో భార్య. మృతుడితో పాటు నిందితులు నిజామాబాద్ వారు కాగా, హత్యోదంతం నిర్మల్ జిల్లా మామడ మండలం పొన్కల్ శివారులో జరిగింది. 4 నెలల క్రితం జరిగిన ఘటనకు సంబంధించిన కేసును నిర్మల్ జిల్లా పోలీసులు ఛేదించారు. నిజామాబాద్ జిల్లా అంకాపూర్‌కు చెందిన గుజ్జెటి ఉదయ్‌కుమార్ (39) మొదటి భార్య చనిపోవడంతో ఆలూరుకు చెందిన పావని ఆలియాస్ లావణ్యను రెండో పెళ్లి చేసుకున్నాడు. పావనికీ గతంలో వివాహమైంది. మొదటి భర్తతో విడాకులయ్యాయి. రెండో పెళ్లి చేసుకున్న ఉదయ్, పావనిలు అంకాపూర్‌లోనే కాపురం పెట్టారు. ఉదయ్‌కుమార్ కూలీ పనులు చేస్తుండగా, పావని బీడీలు చుడుతూ జీవనం సాగించారు. రెండో పెళ్లే ప్రాణం తీసింది ఉదయ్‌కుమార్ రెండో పెళ్లే ఆయన నిండు ప్రాణం తీసింది. పావని భర్తతో ఉంటూనే తన పాత పరిచయస్తుడు దవాతే దౌలాజీ అలియాస్ రమేష్‌తో అక్రమ సంబంధం పెట్టుకుంది. దౌలాజీ సైతం అంకాపూర్‌లోనే కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఈ సమయంలోనే తన భర్త ఉదయ్‌కుమార్ స్నేహితుడైన గంగాధర్‌తోనూ పావనికి పరిచయం ఏర్పడింది. ఆయనతోనూ వివాహేతర సంబంధాన్ని ఏర్పరుచుకుంది. భర్త ఉదయ్‌కుమార్‌కు ఇది తెలియడంతో పావనిని మందలించాడు. దీంతె ఇద్దరు ప్రియులతో కలసి భర్తను అంతం చేయాలని పథకం రచించింది. చచ్చాడా.. లేదా..: 4 నెలల క్రితం జూన్ 5న ఉదయ్ హత్యకు ప్లాన్ చేశారు. భర్తను చంపాలని ప్రియులిద్దరినీ పురమాయించింది. ఈ మేరకు వారిద్దరూ ఉదయ్‌కుమార్‌కు జరిగిందేదో జరిగింది. అన్నట్లుగా మాటలు చెప్పి, దావత్ చేసుకుందామని ఒప్పించారు. అదేరోజు అంకాపూర్ నుంచి బైక్‌పై నిర్మల్–నిజామాబాద్ జిల్లాల సరి హద్దులో గోదావరి ఒడ్డున గల నిర్మల్ జిల్లా మామడ మండలం పొన్కల్ గ్రామ శివారుకు తీసుకొచ్చారు. దౌలాజీ, గంగాధర్ తక్కువ మద్యం సేవించారు. ఉదయ్‌కుమార్‌కు మాత్రం ఎక్కువ మొత్తంలో మద్యం తాగించారు. అక్కడి నుంచే పావనికి ఫోన్ చేశారు. ఉదయ్‌కుమార్‌ను చంపాలా.. వద్దా.. అని మరోమారు అడిగారు. ఆమె చంపమని స్పష్టంగా చెప్పిన తర్వాత వారిద్దరూ కలసి ఉదయ్‌కుమార్‌ను గోదావరిలో ముంచి చంపేశారు. చంపిన తర్వాత మళ్లీ పావనికి ఫోన్ చేశారు. అప్పుడు కూడా ఆమె.. చచ్చాడా.. లేదా.. చూడమని చెప్పడంతో వారు ఉదయ్ మృతదేహాన్ని పైకి లేపి శ్వాస చూసి చనిపోయినట్లు నిర్దారించుకుని.. మృతదేహాన్ని గోదావరి మడుగులో పడేశారు. నాలుగురోజుల తర్వాత జూన్ 9న ఉదయ్‌కుమార్ మృతదేహం బయటపడింది. స్థానికులు మామడ పోలీసులకు సమాచారం ఇవ్వగా, గుర్తుతెలియని మృతదేహంగా కేసు నమోదు చేశారు. కుటుంబసభ్యులకు అనుమానం వచ్చి.. ఉదయ్‌కుమార్‌ను హత్య చేసిన అనంతరం గంగాధర్ గుట్టుచప్పుడు కాకుండా దుబాయ్‌కు వెళ్లిపోయాడు. ఇక దౌలాజీ ఏమి ఎరుగనట్టు మళ్లీ అంకాపూర్ చేరుకుని పావనితో సహజీవనం కొనసాగిస్తున్నాడు. నాలుగు నెలలుగా ఉదయ్‌కుమార్ కనిపించకపోవడంతో ఆయన కుటుంబసభ్యులు అనుమానం వచ్చి అక్టోబర్ 19న పావని వద్దకు వెళ్లారు. అక్కడ ఆమె ప్రియుడు దౌలాజీతో కలసి ఉండటంతో షాక్ అయ్యారు. ఉదయ్‌కుమార్ ఎక్కడున్నాడని ఆమెను నిలదీశారు. ఉదయ్‌కుమార్ మిస్సింగ్‌తోపాటు వీరిపై అనుమా నం ఉన్నట్లు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి పావని, దౌలాజీలను కోర్టులో హాజరుపర్చగా వారు బెయిల్‌పై విడుదలయ్యారు. తీగ లాగితే.. మామడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పొన్కల్ వద్ద గోదావరిలో బయటపడ్డ ఉదయ్‌కుమార్ మృతిపై అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకున్నారు. ఆర్మూర్ పోలీసుల వద్ద అక్టోబర్ 19న మిస్సింగ్ కేసు నమోదైనట్లు తేలడంతో దానిపై దృష్టి పెట్టారు. పోలీసులు కేసును దర్యాపు చేయడంతో పావని చేసిన కథంతా బయటపడింది. పావని ప్రస్తుతం 8 నెలల గర్భిణి. -
భర్తను కడతేర్చిన భార్య
సాక్షి, యల్లనూరు: ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తనే హత్యచేయించిన భార్య ఉదంతం యల్లనూరు మండల కేంద్రంలో వెలుగు చూసింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన మేరకు... యల్లనూరుకు చెందిన డి.చిన్న ఆంజనేయులు (38) భార్య రాజేశ్వరి, ఇద్దరు కూతుర్లతో కలిసి నివాసముంటున్నాడు. చిన్న ఆంజనేయులు లారీ డ్రైవర్‌గా పనిచేస్తుండగా, రాజేశ్వరి ఆశావర్కర్‌గా విధులు నిర్వహిస్తోంది. రాజేశ్వరి కొంత కాలంగా తాడిపత్రి ప్రాంతానికి చెందిన వేరొక వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. పథకం ప్రకారం హత్య అడ్డుగా ఉన్న భర్తను హతమార్చడం కోసం రాజేశ్వరి తన ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్ అమలు చేసింది. గత శుక్రవారం రోజున చిన్న ఆంజనేయులు, రాజేశ్వరి ప్రియుడు మద్యం తాగారు. రాజేశ్వరి సూచనల ప్రకారం చిన్న ఆంజనేయులును హత్య చేసి, శవాన్ని గోనె సంచుల్లో కట్టి సమీపంలోని చెరువు వద్ద గల చింత వనంలో పడేసి వెళ్లారు. భర్తను వెతుకుతున్నట్లు నటించి.. భర్తను హత్య చేయించిన రాజేశ్వరి ఎవరికీ అనుమానం రాకుండా ఉండటానికి చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. శుక్రవారం సాయంత్రం రూ.500 కావాలంటూ భర్త తనతో గొడవపడ్డాడని, డబ్బు ఇవ్వకపోవడంతో ఇంటి నుంచి వెళ్లిపోతున్నానని కోపంగా చెప్పి వెళ్లిపోయాడని సమీప బంధులకు చెప్పింది. అనంతరం అక్కడా, ఇక్కడా వెతకడంతో పాటు పలువురు స్వామీజీల వద్దకు వెళ్లింది. అయితే స్వామీజీల వద్దకు వెళ్లినప్పుడు నీ భర్త ఊరికి తూర్పు భాగాన వేరొక ఊరికి వెళ్లే దారిలో కుడి పక్క ఉన్నట్లు చెప్పడంతో ఆ మేరకు వెతుకుతుండగా చింత వనంలో భర్త శవమై కనిపించాడని, దీంతో గ్రామస్తులకు, పోలీసులకు సమాచారం ఇచ్చింది. రాజేశ్వరిపై బంధువుల ఫిర్యాదు చిన్న ఆంజనేయులు హత్యకు గురయ్యాడని తెలుసుకున్న అతని సమీప బంధువులు సోమవారం యల్లనూరు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి చిన్న ఆంజనేయులు భార్య రాజేశ్వరిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు రాజేశ్వరిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. చిన్న ఆంజనేయులు హత్యకు గల కారణం వివాహేతర సంబంధమేమని, భార్యే అతడి హత్యకు ప్లాన్ వేసిందని పోలీసుల విచారణలో తేలింది. హత్య చేసిన నిందితులు, వారికి సహకరించిన వారి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తే ...
దొడ్డబళ్లాపురం : ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తే కాలయముడై భార్య ప్రాణం తీసిన సంఘటన బెళగావి జిల్లా బైలహొంగల తాలూకా మల్లమ్మన బెళవడి గ్రామంలో చోటుచేసుకుంది. çశనివారం ఉదయం నుండి భర్త యువరాజ్ అబ్బార్, మామ బసప్ప, అత్త మాదేవి, మరుదులు వీరణ్ణ, యల్లప్ప అందరూ ఇల్లు వదిలి పరారయ్యారు. సుమ (21) 10 నెలల క్రితమే యువరాజ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. యువరాజ్ కుటుంబ సభ్యులు వ్యతిరేకించారు. దీంతో యువరాజ్, సుమ ఇద్దరూ బైలహొంగలలో రిజిస్టర్ వివాహం చేసుకున్నారు. పెద్దల సమక్షంలో పంచాయతీ తరువాత అయిష్టంగానే దంపతులను ఇంట్లోకి రానిచ్చారు. అయితే ఆనాటి నుండి సుమను వేధించేవారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి సుమను కొట్టి గొంతు నులిమి హత్య చేయడం జరిగింది. మృతురాలి తల్లితండ్రుల ఫిర్యాదుమేర పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
భర్తను చంపిన భార్య జైలుపాలు
అత్తాపూర్ : ప్రియుడితో కలిసి భర్తను చంపిన ఓ మహిళను పోలీసులు కటకటాల వెనక్కి పంపించారు. రాజేంద్రనగర్ ఠాణాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శంషాబాద్ డీసీపీ పద్మజారెడ్డి కేసు వివరాలు వెల్లడించారు. వికారాబాద్ జిల్లా బొంరాస్‌పేట్ మండలానికి చెందిన ఆనంద్, మహేశ్వరి దంపతులు కొన్నేళ్ల క్రితం రాజేంద్రనగర్ పరిధిలోని శివరాంపల్లికి వలస వచ్చారు. ఆనంద్ హోటల్లో వంట పని చేస్తుండగా మహేశ్వరి ఓ షాపింగ్‌మాల్‌లో పనిచేస్తుండేది. కొన్ని నెలల క్రితం తను పనిచేస్తున్న మాల్లో మహేశ్వరి అస్వస్థతకు గురైంది. ఆ సమయంలో తోటి సిబ్బంది ఆటోను పిలిచి ఆమెను ఆస్పత్రికి తరలించారు. సదరు ఆటో డ్రైవర్ సంజూ మహేశ్వరికి సపర్యలు చేసి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నాడు. ఈనేపథ్యంలో వారికి పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. మహేశ్వరిని భర్త ఆనంద్ నిత్యం తాగి వచ్చి కొడుతుండగా.. సంజూ బాగా చూసుకునేవాడు. ఈనేపథ్యంలో ఇద్దరూ కలిసి ఆనంద్‌ను చంపేయాలని పథకం వేశారు. మహేశ్వరి మే 7న ఇంట్లో భర్త ఆనంద్ పీకలదాకా తాగేలా చేసింది. మత్తులో ఉన్న అతడిని ఆమె తన ప్రియుడు సంజూతో కలిసి ఓ ప్లాస్టిక్ వైర్‌తో ఉరి బిగించి చంపేసింది. అనంతరం ఆటోలో మృతదేహాన్ని గండిపేట మండల పరిధిలోని గంధంగూడ సమీపంలో ఉన్న మూసి నది ఒడ్డుకు తీసుకువెళ్లారు. అక్కడ పెట్రోల్ పోసి మృతేహాన్ని కాల్చేశారు. మరుసటి రోజు అస్తికలను మూసినదిలో పడేశారు. అనంతరం పది రోజుల పాటు ఏమీ తెలియనట్లు ఉన్న మహేశ్వరి మే 20న తన భర్త కనిపించడం లేదని రాజేంద్రనగర్ పోలీసులకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆనంద్ కుటుంబీకుల వివరాల ద్వారా పోలీసులు మహేశ్వరితోపాటు సంజూను అదుపులోకి తీసుకొని విచారించగా చేసిన నేరం అంగీకరించారు. దీంతో బుధవారం వారిద్దరిని రిమాండ్‌కు తరలించారు. డీసీపీ పద్మజారెడ్డి బుధవారం ఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. సమావేశంలో రాజేంద్రనగర్ ఏసీపీ ఆశోక్, ఇన్స్పెక్టర్ సురేష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. -
భార్యను నరికి చంపేసిన భర్త
కడియం(రాజమహేంద్రవరం రూరల్): మండలంలోని మాధవరాయుడుపాలెం పంచాయతీ పరిధి గుబ్బలవారిపాలెంలో దొంగల శ్రీనివాసు అనే వ్యక్తి తన భార్య దొంగల జయ (31)ను కత్తితో నరికి చంపాడు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. శ్రీనివాస్‌కు అదే గ్రామానికి చెందిన జయతో దాదాపు 16 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి సింధువైష్ణవి, అర్జున్‌వెంకటసాయి అనే కుమార్తె, కుమారుడు ఉన్నారు. భార్యాభర్తలిద్దరూ కొంతకాలంగా తగాదాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో పలు మార్లు పెద్దల సమక్షంలో వీరిమధ్య సయోధ్య కుదిర్చేందుకు కూడా ప్రయత్నాలు జరిగాయి. అయితే అవి సఫలం కాకపోవడంతో ప్రస్తుతం ఇద్దరూ విడివిడిగా ఉంటున్నారు. ఇదిలా ఉండగా గ్రామానికి సమీపంలోనే శ్రీనివాసు గులాబీ తోటను సాగు చేస్తున్నాడు. ఆదివారం ఉదయం సదరు తోట మీదుగా మరో ఇద్దరు మహిళలతో కలిసి జయ కూలిపనికి వెళుతోంది. గులాబీ తోట వద్దకు వచ్చేసరికి శ్రీనివాసు, జయతో వాగ్వాదానికి దిగాడు. హఠాత్తుగా తన కూడా తెచ్చుకున్న కత్తితో జయ మెడ భాగంలో విచక్షణా రహితంగా నరికేశాడు. ఉన్నట్టుంటి కత్తితో దాడికి దిగడంతో జయతోపాటు వస్తున్న ఇద్దరు మహిళలు పారిపోయి స్థానికులకు సమాచారమిచ్చారు. స్థానికులు వచ్చి చూసేసరికి కత్తిగాట్లతో తీవ్ర రక్తస్రావమవుతున్న జయ అక్కడే రక్తపుమడుగులో పడి ఉంది. ఆమెను హుటాహుటిన రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతిచెందింది. ఆమె మృతదేహాన్ని వెనక్కి తీసుకువచ్చేశారు. జయ మృతి నేపథ్యంలో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతురాలి తల్లి మంగాయమ్మ ఫిర్యాదు మేరకు టుటౌన్ ఇన్స్పెక్టర్ ముక్తేశ్వరరావు, కడియం ఎస్సైలు ఎల్ గౌరీనాయుడు, కె. సురేష్‌బాబులు తమ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. కాగా శ్రీనివాసు పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. -
పెనుభూతమైన అనుమానం
నరసాపురం రూరల్ : నరసాపురం రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రుస్తుం బాద పంచాయతీ మండావారిగరువులో భార్యపై అనుమానంతో భర్త ఆమెను హత్య చేశాడు. శనివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగినట్టు నరసాపురం సీఐ ఎం.సుబ్బారావు తెలిపారు. మల్లుల వెంకటేశ్వరరావు భార్య మహాలక్ష్మి (29)పై భర్త అనుమానం పెంచుకున్నాడు. వేరే వ్యక్తితో లైంగిక సంబంధం ఉందనే ఆరోపణలతో రెండు, మూడు సార్లు ఆమెను కొట్టినట్టు కూడా కుటుంబ సభ్యులు తెలిపారన్నారు. విడాకులు ఇవ్వాలని ఆమెపై ఒత్తిడి తేగా ఆమె ఒప్పుకోకపోవడంతో శనివారం తెల్లవారుజామున ఇనుపరాడ్డుతో ఆమె తలపైనా, ముఖం పైనా దాడి చేశాడు. ఆమె 11 ఏళ్ల కుమారుడు అడ్డం రాగా అతడిని పక్కకు తోసేసినట్టు సీఐ తెలిపారు. ఆమె మృతి చెందిందని నిర్ధారించుకున్న అనంతరం రూరల్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి వెంకటేశ్వరరావు స్వయంగా లొంగిపోయినట్టు నరసాపురం టౌన్ ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు. మహాలక్ష్మి మృతి చెందిందని తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. మృతురాలికి 13 ఏళ్ల కుమార్తె కల్యాణి, 11 ఏళ్ల రాజేష్ (కుమారుడు) ఉన్నారు. మృతదేహానికి నరసాపురం ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. నిందితుడిని కోర్టుకు హాజరుపర్చనున్నట్టు సీఐ తెలిపారు. పట్టణ ఎస్సై చంద్రశేఖర్, రూరల్ ఎస్సై చెన్నం ఆంజనేయులు, ఏఎస్సైలు శ్రీనివాస్, అడపా సత్యనారాయణ, రైటర్ భాస్కరరావు ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
భార్యను కిరాతకంగా హత్యచేసిన భర్త
►అనుమానంతో అమానుషం ► కె.కన్నాపురంలో ఘటన ► పరారీలో నిందితుడు ► అనాథగా మారిన మూడేళ్ల కుమారుడు కె.కన్నాపురం (పెదవేగి రూరల్) : అనుమానంతో ఓ భర్త భార్యను హత్య చేసిన ఘటన పెదవేగి మండలం కె.కన్నాపురంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. మృతురాలి అక్క తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పెదవేగి మండలం కొమ్మువారి కన్నాపురం కాలనీకి చెందిన జొన్నకూటి గంగరాజు, జయమ్మ దంపతులకు నలుగురు ఆడ పిల్లలు. రెండో కుమార్తె రోజా(26)ను 2009లో పెదవేగి మండలం కవ్వగుంట గ్రామానికి చెందిన తాళ్లూరి ఏసు కుమారుడైన తాళ్లూరి వెంకటేశ్వరరావుకు ఇచ్చి వివాహం చేశారు. వీరికి సుమారు మూడేళ్ల వయసు కలిగిన మహిందర్ అనే కుమారుడు ఉన్నాడు. పెళ్లయిన నాటి నుంచి వెంకటేశ్వరరావు రోజాను అనుమానంతో మానసికంగా, శారీరకంగా వేధిస్తుండేవాడు. పలుమార్లు పెద్దలు మందలించినా మార్పు రాకపోగా వేధింపులు ఎక్కువయ్యాయి. దీంతో సుమారు 4 నెలల క్రితం రోజా కె.కన్నాపురంలోని పుట్టింటికి వచ్చేసింది. వెంకటేశ్వరరావు అప్పుడప్పుడూ వచ్చి భార్యతో తగాదాపడడంతో పాటు దాడిచేసి గాయ పరిచేవాడు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి 11 గంటల సమయంలో వెంకటేశ్వరరావు రోజా ఇంటికి వచ్చాడు. రోజా తల్లి జయమ్మ, అక్క రజని, కుమారుడు మహిందర్ ఇంటిలోనే ఉన్నారు. రోజా ఒంటరిగా ఉన్న సమయం చూసి వెంకటేశ్వరరావు కత్తితో ఆమెపై దాడి చేశాడు. మెడపై, చేతులపై నరికాడు. రోజా అక్క రజని అడ్డుకునే ప్రయత్నం చేయగా ఆమెపై కూడా కత్తితో దాడి చేసే యత్నం చేశాడు. అరిస్తే చంపుతానంటూ బెదిరిస్తూ బయటకు పారిపోయాడు. అనంతరం రోజా తల్లి, అక్క కేకలకు చుట్టుపక్కల వాళ్లు వచ్చారు. అప్పటికే రోజా మృతి చెందింది. రజని ఫిర్యాదు మేరకు పెదవేగి ఎస్సై రామకోటేశ్వరరావు కేసు నమోదు చేశారు. ఘటనా స్థలాన్ని ఏలూరు డీఎస్పీ జి.వెంకటేశ్వరరావు, సీఐ నాగ మురళీ పరిశీలించారు.