దొడ్డబళ్లాపురం : ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తే కాలయముడై భార్య ప్రాణం తీసిన సంఘటన బెళగావి జిల్లా బైలహొంగల తాలూకా మల్లమ్మన బెళవడి గ్రామంలో చోటుచేసుకుంది. çశనివారం ఉదయం నుండి భర్త యువరాజ్ అబ్బార్, మామ బసప్ప, అత్త మాదేవి, మరుదులు వీరణ్ణ, యల్లప్ప అందరూ ఇల్లు వదిలి పరారయ్యారు. సుమ (21) 10 నెలల క్రితమే యువరాజ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.
యువరాజ్ కుటుంబ సభ్యులు వ్యతిరేకించారు. దీంతో యువరాజ్, సుమ ఇద్దరూ బైలహొంగలలో రిజిస్టర్ వివాహం చేసుకున్నారు. పెద్దల సమక్షంలో పంచాయతీ తరువాత అయిష్టంగానే దంపతులను ఇంట్లోకి రానిచ్చారు. అయితే ఆనాటి నుండి సుమను వేధించేవారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి సుమను కొట్టి గొంతు నులిమి హత్య చేయడం జరిగింది. మృతురాలి తల్లితండ్రుల ఫిర్యాదుమేర పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment