husband suiside
-
ప్రేమించి పెళ్లాడి... చిన్న గొడవతో
సత్తుపల్లిటౌన్: భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో భర్త ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బుధవారం సత్తుపల్లిలో చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం శీతానగరం గ్రామానికి చెందిన కుట్టడి సురేష్(26) పట్టణంలోని పాలవాడకు చెందిన కీర్తిలు డిగ్రీ చదువుకుంటూ ప్రేమించుకున్నారు. ఇరు కుటుంబాలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఏడాదిన్నర వివాహం జరిగింది. ఇతను పట్టణంలోని గాంధీనగర్‌లో అద్దెకు ఉంటూ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అయితే చుట్టుపక్కవారి మాటలతో భార్యభర్తల మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఈ క్రమంలో మంగళవారం రాత్రి కీర్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో ఆమెను ప్రభుత్వాస్పత్రిలో చేర్చి చికిత్స అందించారు. బుధవారం ఉదయం ఆమెను తీసుకొని ఇంటికి వెళ్లిన కొద్దిసేపటికే సురేష్ ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. స్థానికుల సహకారంతో అతడిని ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. ఈ మేరకు సత్తుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయ్యో ‘పాపం’.. ఈ దంపతులకు ఐదు నెలల పాప ఉంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నామని..ఆనందంగా కలిసి ఉందామని అందరినీ ఒప్పించి వేరుగా ఉంటున్నామని..ఇలా ఘోరం జరిగిందని..అయ్యో దేవుడా తనకు దిక్కెవరని మృతుడి భార్య కీర్తి బోరున విలపించడం పలువురిని కంటతడిపెట్టింది. ఆవేశంలో, మనస్తాపంతో యువకుడు ప్రాణాలు తీసుకోవడం స్థానికులను కలిచివేసింది. భార్య, చిన్నారి కోసం ఆలోచించి..బతికుండాల్సిందని ఆవేదన వ్యక్తం చేశారు. -
భార్యలేని లోకంలో ఉండలేక..
– ఈ నెల 3వతేదీన స్కూటీపై వెళ్తూ భార్య మృతి – మనోవేదనతో భర్త ఆత్మహత్య కర్నూలు: ఐదురోజుల క్రితం భార్య, ఇప్పుడు భర్త తమ చిన్నారి కూతురును ఒంటరి చేసి తిరిగిరానిలోకాలకు వెళ్లిపోయారు. కుటుంబ సభ్యులకు తీరని వేదన మిగిల్చారు. ఈ ఘటన కర్నూలు వ్యవసాయ మార్కెట్‌యార్డు వెనుక ఉన్న రెవెన్యూ కాలనీలో చోటుచేసుకుంది. షేక్‌షబ్బీర్‌నాయక్ (40) ఆదివారం ఉదయం ఆనంద్ థియేటర్ సమీపంలోని వంతెనపై రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. సిస్టర్స్ స్టాన్సిలాస్ పాఠశాలలో చదువుతున్న నాలుగేళ్ల కూతురు షేక్‌సాదియాను స్కూటీపై ఇంటికి తీసుకొస్తుండగా ఈ నెల 3వతేదీన పంప్‌హౌస్ దగ్గర డీసీఎం వాహనం ఢీకొనడంతో భార్య గౌషియాబేగం మరణించింది. ఆదివారం ఐదవదినం చేసేందుకు బంధువులంతా ఇంటికి చేరుకున్నారు. భార్య మృతి చెందిన రోజు నుంచి శోకసంద్రంలో ఉన్న షబ్బీర్‌నాయక్ ఒక్కసారిగా బంధువులను చూసి మనోవేదనకు గురయ్యాడు. 11 గంటల సమయంలో టీ తాగివస్తానంటూ రైల్వే ట్రాక్‌పైకి వెళ్లాడు. రైలుకు ఎదురుగా వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రమాదంలో ఆయన కాలు, చేయి చిధ్రమైపోయాయి. స్థానిక ఇందిరాగాంధీ నగర్ వాసుల సమాచారం మేరకు రైల్వే ఎస్ఐ జగన్ అక్కడకు వెళ్లి పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఒంటరిదైన చిన్నారి.. షేక్‌షబ్బీర్‌నాయక్ మార్కెట్‌యార్డు వెనుక కూల్‌డ్రింక్‌షాపు నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. సంతానం లేనందునా నాలుగేళ్ల పాపను దత్తత తీసుకున్నారు. ఆ పాపను స్కూలు నుంచి ఇంటికి తీసుకొస్తుండగా జరిగిన ప్రమాదంలో భార్య మతి చెందింది. ఇప్పుడు భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో చిన్నారి ఒంటరిగా మిగిలింది.