hyderbad police
-
బీటెక్ పూర్తి చేసి ఉద్యోగాన్వేషణ.. భర్త, ఆడపడచుతో గొడవ..
హైదరాబాద్: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ మహిళ భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సోమవారం అబిడ్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మూసాపేట్, భరత్‌నగర్ ప్రాంతానికి చెందిన మురారి అనూష(32)కు గత ఫిబ్రవరి 12న విజయవాడకు చెందిన నాంచారయ్యతో వివాహం జరిగింది. నాంచారయ్య సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుండగా, బీటెక్ పూర్తి చేసిన అనూష ఉద్యోగాన్వేషణలో ఉంది. మూడురోజుల క్రితం ఇంట్లో జరిగిన వేడుకలో భర్త, ఆడపడచుతో గొడవ జరగడంతో ఆమె పుట్టింటికి వచ్చింది. అయినా భర్త, ఆడపడుచు ఫోన్‌చేసి గొడవ పడుతుండటంతో మనస్తాపానికి లోనైంది. ఈ నేపథ్యంలో బ్యాంకు పని నిమిత్తం ఎస్ఆర్నగర్ వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి బయటికి వచ్చిన అనూష నేరుగా గగన్‌విహార్ భవనం 11వ అంతస్తు పైకి ఎక్కి సోదరుడికి వాయిస్ మెసేజ్ చేసి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలను సేకరించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతురాలి సోదరుడు కార్తీక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ మార్గాల్లో వెళ్లొద్దు
గన్‌ఫౌండ్రీ(హైదరాబాద్): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ నెల 3వ తేదీన ఎల్బీస్టేడియంలో సద్దుల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నగరంలో ట్రాఫిక అంక్షలు విధించారు. ఎల్బీ స్టేడియం మీదుగా వచ్చే వాహనాలను దారి మళ్లించేలా నగర ట్రాఫిక్ పోలీసులు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. సోమవారం ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాల మీదుగా కాకుండా ఇతర మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. చదవండి: పోలీసు కొలువులకు తగ్గిన కటాఫ్ ♦అబిడ్స్ చాపెల్ రోడ్డు, నాంపల్లి నుంచి బిజెఆర్ విగ్రహం వైపు వచ్చే వాహనాలకు అనుమతి లేదు. వాటిని ఎఆర్ పెట్రోల్ పంపు మీదుగా మళ్లిస్తారు. ♦బషీర్‌బాగ్ ఫ్లైఓవర్ మూసివేసి ఆ వాహనాలను ఎస్బిఐ గన్ఫౌం డ్రీ వైపు మళ్లిస్తారు. ♦రవీంద్రభారతి, ఆదర్శ్‌నగర్ ప్రాంతాల మీదుగా వచ్చే వాహనాలను నాంపల్లి వైపు వెళ్లాలి. ♦నారాయణగూడ నుంచి బషీర్‌బాగ్ వైపు వచ్చే వాహనాలను ఎమ్మెల్యే క్వార్టర్స్ మీదుగా హిమయత్‌నగర్ వై జంక్షన్ వైపు వెళ్లాలి ♦కింగ్‌కోఠి నుంచి బషీర్‌బాగ్ వైపు వచ్చే వాహనాలను అబిడ్స్ తాజ్‌మహల్ హోటల్ రోడ్డు వైపు మళ్లిస్తారు. ఆర్టీసీ బస్సులు ఇలా... ♦కెపిహెచ్బి, మెహదీపట్నం నుంచి వచ్చే బస్సులు ఏఆర్ పెట్రోల్ పుంపు మీదుగా నాంపల్లి వైపు మళ్లించారు ♦కోఠి నుంచి సికింద్రాబాద్ వెళ్లే బస్సులు కాచిగూడ, నారయణగూడ, హిమయత్‌నగర్ మీదుగా వెళ్లాలి పార్కింగ్ ఇలా... ♦వీఐపీ, అధికారుల కోసం టెన్నిస్ గ్రౌండ్ వద్ద. ♦ప్రింట్ ఆండ్ మీడియా ప్రతినిధుల కోసం సర్వశిక్ష అభియాన్ కార్యాలయం వద్ద. ♦ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ప్రతినిధుల కోసం నిజాం కళాశాల మైదానం వద్ద.. -
జింఖానా గ్రౌండ్ ‘తొక్కిసలాట’దృశ్యాలు
-
సొనాలీ ఫోగట్ హత్య కేసులో సంచలన విషయాలు వెల్లడించిన సీపీ ఆనంద్
సాక్షి, హైదరాబాద్: గోవాలోని అంజునా పోలీసుల నిర్లక్ష్యమే బీజేపీ నేత, టిక్ టాక్ స్టార్, టీవీ నటి సొనాలీ ఫోగట్ హత్యకు పరోక్ష కారణమైంది. ఆ కేసులో నిందితులుగా ఉన్న వారిలో ఇద్దరు ఉస్మానియా యూనివర్సిటీ ఠాణాలో గత నెలలో నమోదైన డ్రగ్స్ కేసులోనూ నిందితులుగా ఉన్నారు. దీనిపై అధికారిక సమాచారం ఇచ్చినా అంజునా పోలీసులు స్పందించలేదు. హైదరాబాద్ పోలీసులు ఆగస్టు 17న డ్రగ్స్ మాఫియాపై సమాచారం ఇవ్వగా.. 22 తెల్లవారుజామున ఫోగట్ హత్యకు గురి కావడం గమనార్హం. ఈ దారుణం జరిగిన పబ్ యజమాని సహా మరొకరు ఇక్కడి పోలీసులకు వాంటెడ్‌గా ఉన్నాడు. వీరిద్దరినీ గత నెల 28న గోవా పోలీసులు అరెస్టు చేశారు. పీటీ వారెంట్‌పై హైదరాబాద్ తీసుకువస్తామని గురువారం కొత్వాల్ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. ప్రీతీష్ విచారణతో వెలుగులోకి.. గోవాలోని అంజునా బీచ్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఏళ్లుగా డ్రగ్స్ దందా చేస్తున్న ఘరానా డ్రగ్ పెడ్లర్ ప్రీతీష్ నారాయణ్ బోర్కర్‌ను హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్– న్యూ) గత నెల 17న పట్టుకుంది. ఇతడి విచారణలో అంజునా ప్రాంతానికే చెందిన స్టీవెన్, ఎడ్విన్ నూనిస్ సహా ఆరుగురి నుంచి డ్రగ్స్ దేశవ్యాప్తంగా చలామణి అవుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. దీంతో ప్రీతీష్‌ను అరెస్టు చేసిన ఉస్మానియా వర్సిటీ పోలీసులు ఆ కేసులో ఆరుగురినీ నిందితులుగా పేర్కొన్నారు. ఈ ఎఫ్ఐఆర్ కాపీ సహా ఇతర వివరాలను అంజునా పోలీసులకు పంపిన హైదరాబాద్ అధికారులు వారిని అరెస్టు చేయాల్సిందిగా కోరారు. నిందితులకే వత్తాసు.. దేశవ్యాప్తంగా జరుగుతున్న డ్రగ్స్ దందాకు గోవా కీలకమన్నది జగమెరిగిన సత్యం. అక్కడి పోలీసుల సహకారంతోనే ఈ వ్యాపారం సాగుతోందనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో నగరంలో దొరికిన ఓ వ్యక్తిని ప్రశ్నించగా.. గోవా నుంచి డ్రగ్ సరఫరా అయినట్లు తేలింది. దీంతో హెచ్– న్యూ టీమ్ అక్కడకు వెళ్లి ఆ సరఫరాదారు ఉన్న హోటల్‌పై దాడి చేసింది. ఫలితంగా అతడు చిక్కడంతో పాటు దాదాపు 100 గ్రాముల ఎండీఎంఏ రికవరీ అయింది. దీనిపై హెచ్–న్యూ టీమ్ స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చి నిందితుడిని తీసుకురావడానికి సన్నాహాలు చేసింది. అక్కడకు వచ్చిన అంజునా పోలీసులు నిందితుడిని తీసుకువెళ్లడానికి వీల్లేదని, తామే అరెస్టు చూపిస్తామని పట్టుబట్టారు. ఆపై పీటీ వారెంట్‌పై తీసుకువెళ్లాలని చెప్పి పంపారు. సీన్ కట్ చేస్తే ఆ నిందితుడు, దొరికిన సరుకు ఏమైందో ఇప్పటికీ హెచ్– న్యూకి సమాచారం ఇవ్వలేదు. చదవండి: బీజేపీ నేత సోనాలి ఫోగట్ మృతిపై సీబీఐ దర్యాప్తు? కిడ్నాప్ కేసులు పెడతామంటూ బెదిరింపు.. తమకు వాంటెడ్‌గా ఉన్న వారిని అరెస్టు చేయడానికి వెళ్తున్న సందర్భంలో హెచ్–న్యూ అధికారులు కొన్నిసార్లు గోవా పోలీసుల సహాయం కోరారు. అలా జరిగిన ప్రతిసారీ నిందితులు అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం పరిపాటిగా మారింది. దీంతో వారికి సమాచారం ఇవ్వకుండానే హెచ్–న్యూ ఆపరేషన్లు చేపట్టడం మొదలెట్టింది. ఓ సందర్భంలో అలా వచ్చి నిందితులను అరెస్టు చేసి తీసుకువెళితే కిడ్నాప్ కేసులు పెడతామంటూ హెచ్–న్యూ అధికారులనే గోవా పోలీసులు బెదిరించారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే స్టీవెన్, ఎడ్విన్ నూనిస్ల సమాచారాన్ని హెచ్–న్యూ గోవా పోలీసులకు అందించి అరెస్టు చేయమని కోరింది. ఎడ్విన్ అంజునా ప్రాంతంలో గ్రాండ్ లియోనీ రెసార్ట్, స్టీవెన్ హిల్ టాప్ పబ్ నిర్వహిస్తున్నారని, వీటిలో పని చేసే వారితోనే డ్రగ్స్ అమ్మిస్తున్నారని తెలిపింది. అయినప్పటికీ గోవా పోలీసులు పట్టించుకోలేదు. సొనాలీ హత్యలో ఆ ఇద్దరి పాత్ర.. సొనాలీ ఫోగట్ హత్య కేసులో ఎడ్విన్, స్టీవెన్ నిందితులుగా మారారు. ఈ హత్య గ్రాండ్ లియానీ రిసార్ట్‌లోని పబ్‌లోనే జరిగింది. ఆమెకు అధిక మోతాదులో డ్రగ్స్ ఇచ్చి చంపేశారు. ఆ మాదక ద్రవ్యాలను సరఫరా చేసింది ఎడ్విన్, స్టీవెన్గా తేలడంతో వారినీ నిందితులుగా చేర్చారు. ఎడ్విన్‌ను అరెస్టు చేసిన అంజునా పోలీసులు స్టీవెన్ కోసం గాలిస్తున్నారు. హైదరాబాద్ పోలీసులు సమాచారం ఇచ్చినప్పుడే స్పందించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. ‘ఫోగట్ హత్య కేసులో అరెస్టు అయిన ఎడ్విన్ ఓయూ పరిధిలో నమోదైన ప్రీతీష్ కేసులో నిందితుడిగా ఉన్నాడు. అతడిని పీటీ వారెంట్‌పై సిటీకి తీసుకువస్తాం. డ్రగ్స్ కేసులో నిందితులను అరెస్టు చేయడానికి గోవా వెళ్లిన ప్రతిసారీ అక్కడి పోలీసుల నుంచి సహకారం లభించట్లేదు. అనేక సందర్భాల్లో నెగెటివ్ రిజల్ట్స్ వస్తున్నాయి. గోవా డ్రగ్ నెట్‌వర్క్‌పై హెచ్–న్యూకు ఉన్న సమాచారం గోవా పోలీసులకు ఎందుకు లేదంటూ అక్కడి పత్రికలూ రాస్తున్నాయి’ అని సీవీ ఆనంద్ అన్నారు. -
బంజారాహిల్స్‌లో దారుణం.. యువతిపై అత్యాచారం
బంజారాహిల్స్: పక్కింట్లో నివాసం ఉంటున్న ఓ యువతిపై కన్నేసిన కామాంధుడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమెపై అత్యాచారం చేశాడు. బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న వివరాలు ఇలా ఉన్నాయి. అస్సామ్ రాష్ట్రానికి చెందిన యువతి(22) బంజారాహిల్స్ రోడ్ నెం. 5లోని దేవరకొండ బస్తీలో అక్కాబావల వద్ద ఉంటూ ఓ మలీ్టఫ్లెక్స్లో టికెట్ బుకింగ్ కౌంటర్లో పనిచేస్తోంది. అదే రాష్ట్రానికి చెందిన చిన్మయ్ సైకియా(24) అనే యువకుడు కూడా అదే ప్రాంతంతో నివాసం ఉంటూ బంజారాహిల్స్ రోడ్ నెం. 2లోని ఓ షాపింగ్ మాల్లో సెక్యురిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 4న యువతి తన గదిలో ఒంటరిగా ఉన్న విషయాన్ని గమనించిన చిన్మయ్ సైకియా లోనికి ప్రవేశించాడు. ఆమెపై లైంగికదాడికి పాల్పడడంతో పాటు ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించాడు. అప్పటి నుంచి తీవ్రంగా ఏడుస్తూ ఇంట్లోనే ఉంటోంది. శనివారం రాత్రి బాధితురాలి సోదరి ఏంజరిగిందని ఆరా తీయగా విషయం బయటపడింది. దీంతో బాధితురాలితో కలిసి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
గ్రీజు డబ్బా.. గిఫ్ట్ ప్యాక్! ‘పుష్ఫ’ స్టైల్లో హష్ ఆయిల్ రవాణా
సాక్షి, నాగోలు: గంజాయి ప్రాసెసింగ్ ద్వారా తయారు చేసే హష్ ఆయిల్ స్మగ్లింగ్‌లో ఓ ముఠా ‘పుష్ఫ’ పంథాను అనుసరించింది. గ్రీజు డబ్బాతో పాటు గిఫ్ట్ ప్యాక్ రూపంలోనూ నాలుగు లీటర్లు తీసుకువస్తుండగా సమాచారం అందుకున్న ఎల్బీనగర్ స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్వోటీ) పోలీసులు ఇద్దరిని పట్టుకున్నారు. గురువారం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్, డీసీపీలు సన్‌ప్రీత్‌సింగ్, మురళీధర్, ఏసీపీలు వెంకన్న నాయక్, పురుషోత్తం రెడ్డితో కలిసి వివరాలు వెల్లడించారు. రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ లీటర్ హష్ ఆయిల్ రూ.4 లక్షలు.. ఏపీలోని విశాఖపట్నం జిల్లా జంపెన గ్రామానికి చెందిన కోనశివ (24) డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. అదే ప్రాంతానికి చెందిన వంట పని కార్మికుడు నూకరాజుతో (25) ఇతడికి స్నేహం ఉంది. శ్రీకాకుళం జిల్లా పలాస ప్రాంతానికి చెందిన సంతోష్‌కుమార్‌తో శివకు మూడేళ్లుగా పరిచయం ఉంది. ఇటీవల శివను కలిసిన సంతోష్ తాను ఇచ్చే హష్ ఆయిల్‌ను హైదరాబాద్‌కు చేరిస్తే రూ.40 వేలు ఇస్తానంటూ చెప్పడంతో అంగీకరించిన శివ తనకు సహకరిస్తే ఆ మొత్తంలో సగం ఇచ్చేలా నూక రాజుతో ఒప్పందం కుదుర్చుకుని వీరిద్దరూ బుధవారం విశాఖలోని లంకెలపాలెం వెళ్లి సంతోష్‌ను కలిశారు. అక్కడ సంతోష్‌తో పాటు అతడి స్నేహితుడైన సంజీవ్‌రావు కూడా ఉన్నాడు. లీటర్ హష్ ఆయిల్‌ను గిఫ్ట్‌కవర్‌లో ప్యాక్ చేసి సంతోష్ వీరికి అప్పగించాడు. గ్రీజు డబ్బా అడుగున మూడు లీటర్ల హష్ ఆయిల్‌ను ప్లాస్టిక్ కవర్లలో ప్యాక్ చేసి ఉంచి, దానిపై గ్రీజు నింపిన డబ్బాను సంజీవరావు అప్పగించాడు. వీటిని తీసుకుని శివ, నూక రాజు పోలీసులకు అనుమానం రాకుండా వేర్వేరుగా బయలుదేరారు. గతంలో గంజాయి, హష్ ఆయిల్ పంపే ఏజెన్సీ ముఠాలు హైదరాబాద్‌లో ఎవరికి అందించాలే సరఫరా దారులకు చెప్పేవాళ్లు. ఇలా చేస్తే పోలీసులకు వాళ్లూ చిక్కుతున్నారనే ఉద్దేశంతో ఇటీవల పంథా మార్చారు. తొలుత హైదరాబాద్ చేరుకున్నాక తమకు ఫోన్ చేయాలని, అప్పుడు ఎవరికి అందించాలనేది చెప్తామంటూ శివ, నూకరాజుకు చెప్పారు. వీరి కదలికలపై ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులకు సమాచారం అందటంతో ఇన్స్పెక్టర్ సుధాకర్ నేతృత్వంలోని బృందం హయత్‌నగర్ పోలీసులతో కలిసి దాడి చేసి ఇద్దరినీ పట్టుకుని హష్ ఆయిల్ స్వాధీనం చేసుకుని సరఫరా దారుల కోసం గాలిస్తున్నారు. హష్ ఆయిల్‌ను నగరంలో లీటర్ రూ.4 లక్షలు లేదా 10 ఎంఎల్ రూ.4 వేలు చొప్పున అమ్ముతున్నట్లు గుర్తించారు. చదవండి: ట్యాక్సీ డ్రైవర్‌తో మహిళా టెక్కీ ప్రేమ పెళ్లి.. తప్పటడుగులు వేశానంటూ.. -
గోవా నుంచి మత్తు పదార్థాలు రవాణా చేసిన ముఠా అరెస్టు
-
ట్యాంక్ బండ్ లో గణేష్ నిమజ్జన ట్రయల్ రన్
-
యూట్యూబ్ వీడియోలు చూసి...
సాక్షి, సిటీబ్యూరో: అబిడ్స్ పోలీసుస్టేషన్ పరిధిలోని జగదీష్ మార్కెట్లో ఉన్న మహాలక్ష్మీ అమ్మవారి ఆలయంలో జరిగిన చోరీ కేసు తీగ లాగితే మూడు కమిషనరేట్లతో పాటు సంగారెడ్డిలో జరిగిన 25 దొంగతనాల డొంక కదిలింది. ఆరు నెలల కాలంలో ఈ నేరాలకు ఒడిగట్టిన అంతర్రాష్ట్ర ముఠాను అబిడ్స్, సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నట్లు నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. డీసీపీ విశ్వప్రసాద్, అదనపు డీసీపీ చక్రవర్తి గుమ్మి, ఏసీపీ కె.వెంకట్‌రెడ్డిలతో కలిసి శనివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడించారు. ♦కర్ణాటకలోని బీదర్ ప్రాంతానికి చెందిన వజీద్ 17 ఏళ్ళ వయస్సులో 2019లో నగరానికి వలసవచ్చి ఓ ప్రైవేట్ ఉద్యోగంలో చేరాడు. ♦అక్కడే వట్టేపల్లికి చెందిన అబ్దుల్ సమీర్, ఇస్మాయిల్, షహీద్, అమీర్, ఇలియాస్‌లతో పరిచయం ఏర్పడింది. వీరంతా దురలవాట్లకు బానిసలుగా మారారు. డబ్బు కోసం నేరాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చి బీదర్‌లో స్థిరపడిన కార్మికుడు షేక్ సోనుతో కలిసి ఓ ముఠా ఏర్పాటు చేశాడు. ♦వీళ్ళంతా కలిసి నగరంతో పాటు శివార్లలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న తక్కువ «ఖరీదు లాడ్జిల్లో బస చేస్తారు. పగలంగా నిద్రపోతూ రాత్రి వేళల్లో సంచరిస్తారు. ♦శివారు ప్రాంతాల్లో ఇళ్ళ బయట పార్క్ చేసి ఉండే ద్విచక్ర వాహనాలను చోరీ చేయడం మొదలుపెట్టారు.యూట్యూబ్‌లో చూసి వాటి తాళాలు ఎలా పగులకొట్టాలో నేర్చుకున్నారు. ♦ఈ గ్యాంగ్ చోరీ సొత్తుతో పాటు వాహనాలనూ తీసుకువెళ్ళి వట్టేపల్లికి చెందిన మçహ్మద్ సమీర్, బీదర్‌కు చెందిన బాబురావులకు విక్రయించి సొమ్ము పంచుకుంటోంది. ♦గడిచిన ఆరు నెలల కాలంలో ఈ అంతరాష్ట్ర ముఠా హైదరాబాద్‌లో మూడు, సైబరాబాద్‌లో 15, రాచకొండలో ఒకటి, సంగారెడ్డిలో ఆరు నేరాలు చేసింది. ♦ఈ నెల 3న జగదీష్‌మార్కెట్‌లోని అమ్మవారి దేవాలయంలో చోరీ చేసిన వీళ్ళు వెండి, బంగారు నగలతో పాటు సీసీ కెమెరాల డీవీఆర్ కూడా ఎత్తకుపోయారు. ♦అబిడ్స్ పోలీసులు, దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ అధికారులు వందల సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్ పరిశీలించారు. వజీద్ మూడు నెలలుగా నాంపల్లిలోని రెండు లాడ్జిల్లో ఉండి వెళ్ళినట్లు వెలుగులోకి వచ్చింది. అక్కడ దొరికిన ఆధారాలను బట్టి ముందుకు వెళ్ళారు. ♦షహీద్, అమీర్, ఇలియాస్ మినహా మిగిలిన దొంగల్ని, ఇద్దరు రిసీవర్లను అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.35 లక్షల విలువైన 23 బైక్స్, వెండి, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ♦అబ్దుల్ షోయబ్‌పై గతంలో పహాడీషరీఫ్‌లో హత్య, మైలార్‌దేవ్‌పల్లిలో దోపిడీ, చోరీ కేసులు ఉన్నాయి. ఈ గ్యాంగ్‌పై పీడీ యాక్ట్ ప్రయోగించాలని కొత్వాల్ నిర్ణయించారు. -
తల్లిదండ్రులు చేసే తప్పులపై చిన్నారుల నిఘా
సాక్షి, సిటీబ్యూరో: నగర పోలీసు విభాగం మరో సరికొత్త ఆలోచనతో ముందుకు వస్తోంది. తల్లిదండ్రులు పాల్పడే ఉల్లంఘనలు గుర్తించడానికి, వారికి ‘కౌన్సెలింగ్’ ఇవ్వడానికి ఉద్దేశించి ‘వీకాప్’ అనే విధానంతో ముందుకు వస్తోంది. హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్, నగర ట్రాఫిక్ విభాగం అధికారులు సంయుక్తంగా ఈ కాన్సెప్ట్‌ను అమలులోకి తీసుకువస్తున్నారు. దీన్ని నగర పోలీసు విభాగం మంగళవారం తార్నాకలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రీషియన్ (ఎన్ఐఎన్) ఆడిటోరియంలో అధికారికంగా ఆవిష్కరించనుంది. నగరంలో రోజు రోజుకూ వాహనాల సంఖ్యతోపాటు ట్రాఫిక్ ఉల్లంఘనల సంఖ్య పెరుగుతూపోతోంది. దీన్ని నిరోధించడానికి ట్రాఫిక్ విభాగం అధికారులు అనేక చర్యలు తీసుకుంటున్నారు. వైలేషన్స్ చేసే వారిని గుర్తించి చలాన్లు జారీ చేయడం, తీవ్రమైన వాటిలో వాహనాలు సీజ్ చేయడంతో పాటు ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్లో (టీటీఐ) కౌన్సిలింగ్స్ ఇస్తున్నారు. మద్యం తాగి వాహనాలు నడపటం, మైనర్ డ్రైవింగ్ వంటి వైలేషన్స్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్న పోలీసులు బాధ్యుల్ని కోర్టుకు తరలిస్తున్నారు. నగరంలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిలో అనేక మంది ఎవరైనా తమ తప్పుల్ని ఎత్తి చూపితే వాటిని వీడుతున్నట్లు ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. ఈ బాధ్యతల్ని కేవలం పోలీసు విభాగమే భుజాన వేసుకోకుండా.. చిన్నారులకూ అప్పగించాలని నగర పోలీసులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే వీకాప్ విధానానికి శ్రీకారం చుడుతున్నారు. ప్రాథమికంగా ఐదు, ఆరు, ఏడు తరగతులు చదువుతున్న విద్యార్థుల్ని టార్గెట్‌గా చేసుకున్నారు. స్థానిక ట్రాఫిక్ విభాగం అధికారులు, విద్యాశాఖ, ఆయా స్కూళ్ళ యాజమాన్యాలు కలిసి ఈ తరగతుల విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలు, వాటి అమలుకు ఉన్న ప్రాధాన్యం ఉల్లంఘనలకు పాల్పడితే కలిగే నష్టాలపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తారు. ఆపై తల్లిదండ్రులతో కలిసి, వారి వాహనాల్లో ప్రయాణించేప్పుడు ‘వీకాప్’ చిన్నారులే పోలీసుల పాత్ర పోషిస్తారు. డ్రైవింగ్ చేస్తున్న తన తల్లి లేదా తండ్రి చేసిన ఉల్లంఘనల్ని గుర్తిస్తారు. ఈ వివరాలను తమ వద్ద ఉండే రిపోర్ట్ కార్డ్‌లో నమోదు చేయడమే కాకుండా.. తమ తల్లిదండ్రులు చేస్తున్న ఉల్లంఘనలపై వారికి కౌన్సెలింగ్ ఇవ్వడం, లాభనష్టాలను వివరించి మరోసారి ఉల్లంఘనలకు పాల్పడకుండా అవగాహనకు ప్రయత్నించడం ఈ వీకాప్స్ ప్రధాన విధి. ఉల్లంఘనల్ని నమోదు చేసిన రిపోర్ట్ కార్డ్స్‌ను పాఠశాలతో సంబంధిత వారి ద్వారా స్థానిక ట్రాఫిక్ పోలీసులకు అందిస్తారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో విద్యా సంవత్సరం ప్రారంభమైన తర్వాత వీకాప్స్ ఎంపిక, శిక్షణ చేపట్టనున్నారు. ఈ విధానం ఎంతో ఉపయుక్తం భద్రమైన ఇల్లు ఉంటేనే భద్రమైన సమాజం సాకారం అయ్యే ఆస్కారం ఉంది. ఈ నేపథ్యంలోనే తల్లిదండ్రుల ట్రాఫిక్ ఉల్లంఘనలపై నిఘా అనేది చిన్నారులకు అప్పగిస్తున్నాం. దీనికోసమే ప్రత్యేకంగా సిటీ సెక్యూరిటీ కౌన్సిల్‌తో కలిసి వీకాప్ విధానం అమలు చేస్తున్నాం. వాహనం కలిగి ఉన్న ప్రతి తల్లిదండ్రీ కచ్చితంగా తమ పిల్లల్ని తీసుకుని వాటిపై ప్రయాణిస్తూ ఉంటారు. ప్రతి రోజూ పాఠశాలల వద్ద పిల్లల్ని దింపడానికే లక్షల మంది సొంత వాహనాల్లో బయటకు వస్తుంటారు. ఈ నేపథ్యంలోనే డ్రైవింగ్ చేసే తల్లిదండ్రులపై నిఘా ఉంచడానికి, వారు చేసిన ఉల్లంఘనల్ని గుర్తించడానికి, కౌన్సెలింగ్ ఇవ్వడంపై చిన్నారులకు శిక్షణ ఇస్తున్నాం. ఈ విధానం వల్ల ఆయా చిన్నారులకూ ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన ఏర్పడి వాటి ప్రాధాన్యం తెలుస్తుంది. ఫలితంగా భవిష్యత్తులో వాళ్లు బాధ్యతగల వాహనచోదకులుగా మసలుకుంటారు. – నగర పోలీసు అధికార -
చాలామంది పోలీసులకు గాయాలు అయ్యాయి..
-
చాలామంది పోలీసులు గాయపడ్డారు..
సాక్షి, హైదరాబాద్: చలో ట్యాంక్‌బండ్‌కు అనుమతి లేదని..అయినా వినకుండా పెద్దసంఖ్యలో కార్మికులు ట్యాంక్‌బండ్ వైపు చొచ్చుకు వచ్చారని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇవాళ మధ్యాహ్నం సమయంలో పోలీసులపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. ఈ దాడిలో చాలామంది పోలీసులకు గాయాలు అయ్యాయి. ఈ దాడిలో అడిషనల్ డీసీపీ రామచంద్రరావు, ఏసీపీ రత్నం, సీఐ సైదిరెడ్డి, ఎస్ఐ శేఖర్, కానిస్టేబుల్ రాజు గాయపడ్డారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. పెద్దసంఖ్యలో ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో టియర్ గ్యాస్ ప్రయోగించాం. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు ఆందోళనకారులను కట్టడి చేశారు.’ అని తెలిపారు. -
ఫోర్జరీ కేసు.. రోజుకో మలుపు!
-
ఒక హత్య.. వంద మంది పోలీసులు
గచ్చిబౌలి : సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఏ పోలీసును కదిపినా గర్భిని హత్య గురించే మాట్లాడుకుంటున్నారు. ఒక్క హత్య కేసులో వందల మంది భాగాస్వాములు కావడం ఇదే తొలిసారి. రోజులు గడుస్తున్నా మిస్టరీని చేధించలేకపోయామని ఆవేదన వ్యక్తొం చేస్తున్నారు. ఐటీ కారిడార్‌లో ఓ గర్భిణిని దారుణంగా హత్య చేయడమేగాక శరీరాన్ని ముక్కలు చేసి మూటల్లో కట్టి పడేయంతో ఈ కేసు ప్రాధాన్యం సంతరించుకుంది. సైబరాబాద్ కమిషనర్ సందీప్ శాండిల్య స్వయంగా ఈ హత్య కేసును పర్యవేక్షిస్తుండగా జాయింట్ కమిషనర్ షానవాజ్ ఖాసీమ్, మాదాపూర్ డీసీపీ విశ్వప్రసాద్ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఎస్వోటీ, సీసీఎస్ బృందాలు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నాయి. పోలీసులకు సవాల్ ఐటీ కారిడార్‌లో జరిగిన ఈ సంఘటనను తీవ్రంగా పరిగణించిన డీజీపీ మహేందర్ రెడ్డి త్వరితగతిన నిందితుల ఆచూకీ కనుగొనాలని సైబరాబాద్ కమిషనర్‌ను ఆదేశించడంతో అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. మృతదేహం లభించిన 13 రోజుల అనంతరం సీసీ పుజేటీల ద్వారా కీలక ఆధారాలు లభ్యమైనట్లు పేర్కొంటున్నారు. నిందితుల ఆచూకీ కోసం అన్ని కోణాల్లో ప్రయత్నాలు సాగుతున్నాయని, త్వరలోనే కేసును చేధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. వినూత్న దర్యాప్తు ఈ హత్య అంజయ్యనగర్, సిద్ధిఖీనగర్‌లో జరిగి ఉంటుందని అనుమానిస్తున్న పోలీసులు మాదాపూర్ అడిషనల్ డీసీపీ గంగారెడ్డి నేతృత్వంలో ఈ నెల 8న మృతురాలి ఊహ చిత్రాలతో ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. అంతరాష్ట్ర బస్సులకు, రైళ్లకు మృతురాలు ధరించిన దుస్తులు, మెట్టెలు, గాజుల ఫొటోలతో కూడిన కర పత్రాలను అంటించారు. గచ్చిబౌలి, మాదాపూర్, రాయదుర్గం పీఎస్‌ల పరిధిలో మైక్ ద్వారా ప్రచారం చేశారు. విస్తృత తనిఖీలు అనుమానితులు సిద్ధిఖీనగర్ నుంచి వెళ్లినట్లు సీసీ పుటేజీల్లో గుర్తించిన నేపథ్యంలో సీపీ ఆదేశాల మేరకు సిద్ధిఖీనగర్, అంజయ్యనగర్‌లో విస్తృతంగా తనిఖీలు చేశారు. కమిషనరేట్‌లోని 36 పోలీస్ స్టేషన్లకు చెందిన ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు తనిఖీల్లో పాల్గొన్నారు. ఆదివారం తెల్లవారు జామున పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించడంతో కలకలంరేగింది. రెండు బస్తీల్లో ఎటువైపు చూసిన పోలీసులే కనిపించారు. నిద్రపోతున్నవారిని కూడా లేపి అనుమానితుల ఫొటోలు, వీడియోలు చూపించారు. ఇంట్లో ఎంత మంది ఉంటారు, అద్దెకు ఉండే వారి వివరాలను తెలుసుకున్నారు. గర్భిణి హత్య కేసుపై ఇప్పటికే తెలిసి ఉండటంతో కొందరు స్థానికులు పోలీసులతో పాటు ఇంటింటికి తిరిగి సహకరించారు. -
జీఎస్టీపై వర్మకు పోలీసుల నోటీసులు
సాక్షి, హైదరాబాద్: గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ (జీఎస్టీ) వెబ్ సిరీస్ వివాదంపై నమోదైన కేసులో దర్శకుడు రామ్‌గోపాల్ వర్మకు సీసీఎస్ అధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీంతో గురువారం దర్యాప్తు అధికారి ముందు హాజరుకావాల్సి ఉన్న వర్మ షూటింగ్స్ కారణంగా రాలేకపోతున్నానంటూ వర్తమానం పంపారు. మరోసారి నోటీసులు జారీ చేస్తే వస్తానని చెప్పారు. అశ్లీలానికి కేరాఫ్ అడ్రస్‌గా ఉందంటున్న జీఎస్టీ వెబ్ సిరీస్ వివాదాలకు కేంద్ర బిందువైంది. దీనికితోడు ఈ చిత్ర ప్రచారం, చర్చల నేపథ్యంలో వర్మ మహిళల్ని అగౌరవపరుస్తూ వ్యాఖ్యలు చేశారు. దీంతో వర్మపై అనేక ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. బాగ్‌లింగంపల్లికి చెందిన సామాజికవేత్త, మహిళా ఉద్యమ నాయకురాలు దేవి గత నెల 25న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు ఐపీసీ 506తో పాటు ఐటీ యాక్ట్ కింద వర్మపై కేసులు నమోదు చేశారు. గురువారం సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరవ్వాల్సిందిగా ముంబైలో ఉన్న వర్మకు నోటీసులు పంపారు. ముంబైలో ఓ సినిమా షూటింగ్లో బిజీగా ఉండటంతో హాజరుకావడం సాధ్యం కాలేదంటూ వర్మ తన లాయర్ ద్వారా వర్తమానం పంపారు. మరోసారి నోటీసులిస్తే వచ్చే వారం విచారణకు వస్తానన్నారు. దీంతో రామ్‌గోపాల్ వర్మకు మరోసారి నోటీసులు జారీ చేయాలని సైబర్‌క్రైమ్ పోలీసులు నిర్ణయించారు. -
జబర్దస్త్ యాంకర్ అనసూయపై మహిళ ఫిర్యాదు
-
24 గంటల్లో ఐదు హత్యలు
-
వరుస హత్యలతో ఎరుపెక్కిన రాజధాని
-
యమ డ్రింకర్లు
-
న్యూఇయర్ వేడుకలకు బయటకు వెళ్తున్నారా..
సాక్షి, హైదరాబాద్ : కొత్త సంవత్సర వేడుకలకు భాగ్య నగరం సర్వం సిద్ధమౌతోంది. పార్టీలు, పబ్బులు, క్లబ్బులు కొత్త కొత్త డీజేలతో యువతను ఉర్రూతలూగిస్తున్నాయి. కొంత మంది దూరంగా వెళ్లి న్యూఇయర్ వేడుకలను జరుపుకుంటారు. మరికొందరు ఇంట్లోనే చేసుకుంటారు. అయితే బయటకు వెళ్లే వారు మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. మీకోసం కొన్ని ప్రత్యేక విషయాలు, జాగ్రత్తలు... ► మద్యం సేవించి డ్రైవింగ్ చేయకూడదు. డ్రంక్ అండ్ డ్రైవ్ కోసం 120 బృందాలను హైదరాబాద్ పోలీసులు రంగంలోకి దించారు. ఒకవేళ పట్టుపడితే 15రోజుల వరకూ జైలు శిక్ష పడే అవకాశం ఉంది. గత ఏడాది సుమారు 7,500 మంది జైలుకెళ్లారు. ► బార్లలో పీకల దాకా తాగి రోడ్ల మీద అల్లరులకు పాల్పడకూడదు, డీజేలతో ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదు. ► నిర్ణీత సమయం దాటిన తర్వాత పబ్‌లు, క్లబ్‌ల్లో ఉండకూడదు. మైనర్లు పబ్‌లకు వెళ్లకూడదు. ఒక వేళ వెళ్లారంటే అంతే సంగతులు. ► ఔటర్ రింగురోడ్డుపై రాత్రి 9 నుంచి వేకువజామున 3గంటల వరకు ఆంక్షలు ఉంటాయి. మద్యం తాగి ఎవరూ రింగ్‌రోడ్డుపై ప్రయాణించడానికి వీలు లేదు. ► మీరు చేసే ప్రతిపని సీసీ కెమెరాల ద్వారా పోలీస్ కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షించబడతాయి. ► రాత్రి 9 నుంచి తెల్లవారు జామున 3 గంటల వరకు అన్ని ఫ్లైఓవర్లు మూసేసి ఉంటాయి. ఏఒక్క వాహనానికి ఫ్లై ఓవర్లపై అనుమతి ఉండదు. ► అతిగా మద్యం సేవించిన వారు క్యాబుల్లో ఇంటికి వెళ్లాలి. ఇందుకోసం తెలంగాణ ఫోర్ వీలర్ డ్రైవర్ల అసోసియేషన్ రాత్రి 9 గంటల నుంచి తెల్లవారు జామున 2 గంటల వరకు ఉచితంగా క్యాబ్ సర్వీసులను అందిస్తోంది. ఫోన్ నెంబర్లు : 91776 24678, 88970 62663 ► అంతేకాకుండా దూర ప్రాంతాల వారికోసం హైదరాబాద్ మెట్రో ఆదివారం అర్ధరాత్రి 2.30 గంటల వరకు మెట్రో రైళ్లను నడపనుంది. నాగోల్, మియాపూర్ స్టేషన్ల నుంచి రాత్రి 2.30 గంటలకు చివరి రైళ్లు బయలుదేరతాయి. ► వేడుకల్లో ఏమైనా గొడవలు, అల్లరులు, ఇబ్బందులు తలెత్తితే స్థానిక పోలీసులకు సమాచారం అందించండి, లేదా డయల్ 100కు ఫోన్ చేయండి. -
శెభాష్.. పోలీస్
చైన్‌స్నాచర్ శివ గ్యాంగ్ చోరీ సొత్తు స్వాధీనం 181 మంది బాధిత మహిళలకు మంగళసూత్రాలు అందజేత హైదరాబాద్: దోపిడీ దొంగల ఆటకట్టించడమే కాదు.. వాళ్లు దోచుకున్న సొమ్మును బాధితులకు అందజేసి హైదరాబాద్ పోలీసులు అందరిచేత శెభాష్ అనిపించుకున్నారు. వరుస దొంగతనాలతో నగరాన్ని హడలెత్తించిన మోస్ట్ వాంటెడ్ చైన్‌స్నాచర్ శివ గ్యాంగ్ నుంచి రికవరీ చేసిన సొమ్మును గురువారం సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ బృందం బాధితులకు అందజేసింది. 181 మంది మహిళలకు మంగళసూత్రాలు తిరిగి ఇచ్చింది. ఈ సందర్భంగా బాధిత మహిళలు పోలీసులను అభినందించారు. స్వాధీనం చేసుకున్న వాహనాలు, ఇత ర ఫర్నీచర్‌ను కోర్టు అనుమతితో విక్రయించి మిగతా బాధితులకు న్యాయం చేస్తామని సీవీ ఆనంద్ తెలిపారు. శివ గ్యాంగ్ నుంచి సైబరాబాద్ సీసీఎస్ పోలీసులు భారీగా సొత్తు రికవరీ చేశారు. రూ. కోటి విలువైన 3.75 కిలోల బంగారు నగలు, రూ. 4.5 లక్షల నగదు, రెండు కార్లు, బైక్, ఫర్నీచర్‌ను నుంచి స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్ పరిధిలో శివ గ్యాంగ్ రెండేళ్లలో 511 స్నాచింగ్‌లకు పాల్పడింది. రికవరీ కోసం రెండు నెలలు కష్టపడి.. ఆగస్టు 14న శంషాబాద్ ప్రాంతంలో పోలీసు కాల్పుల్లో స్నాచర్ శివ (35) మృతి చెందడంతో ఈ గ్యాంగ్ దొంగతనాలు వెలుగు చూశాయి. వీరు తాకట్టుపెట్టిన బంగారాన్ని ముత్తూట్, శ్రీరామ్‌సిటీ యూనియన్ ఫైనాన్స్ కంపెనీల నుంచి రికవరీ చేసేందుకు పోలీసులు రెండు నెలలు కష్టపడ్డారు. చోరీ చేసిన బంగారాన్ని తాకట్టు పెట్టుకున్న రెండు ఫైనాన్స్ కంపెనీలు ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించడంతో పాటు మనీలాండరింగ్‌కు పాల్పడ్డాయి. ఈ కంపెనీల మేనేజర్లను సైతం పోలీసులు అరెస్టు చేశారు. ఇదే కంపెనీలో పనిచేస్తున్న మరో ఇద్దరు మాజీ పోలీసుఅధికారులనూ నిందితుల జాబితాలో చేర్చారు.