రామ్‌గోపాల్ వర్మ
సాక్షి, హైదరాబాద్: గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ (జీఎస్టీ) వెబ్ సిరీస్ వివాదంపై నమోదైన కేసులో దర్శకుడు రామ్‌గోపాల్ వర్మకు సీసీఎస్ అధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీంతో గురువారం దర్యాప్తు అధికారి ముందు హాజరుకావాల్సి ఉన్న వర్మ షూటింగ్స్ కారణంగా రాలేకపోతున్నానంటూ వర్తమానం పంపారు. మరోసారి నోటీసులు జారీ చేస్తే వస్తానని చెప్పారు. అశ్లీలానికి కేరాఫ్ అడ్రస్‌గా ఉందంటున్న జీఎస్టీ వెబ్ సిరీస్ వివాదాలకు కేంద్ర బిందువైంది. దీనికితోడు ఈ చిత్ర ప్రచారం, చర్చల నేపథ్యంలో వర్మ మహిళల్ని అగౌరవపరుస్తూ వ్యాఖ్యలు చేశారు. దీంతో వర్మపై అనేక ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. బాగ్‌లింగంపల్లికి చెందిన సామాజికవేత్త, మహిళా ఉద్యమ నాయకురాలు దేవి గత నెల 25న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీనిపై పోలీసులు ఐపీసీ 506తో పాటు ఐటీ యాక్ట్ కింద వర్మపై కేసులు నమోదు చేశారు. గురువారం సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరవ్వాల్సిందిగా ముంబైలో ఉన్న వర్మకు నోటీసులు పంపారు. ముంబైలో ఓ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండటంతో హాజరుకావడం సాధ్యం కాలేదంటూ వర్మ తన లాయర్ ద్వారా వర్తమానం పంపారు. మరోసారి నోటీసులిస్తే వచ్చే వారం విచారణకు వస్తానన్నారు. దీంతో రామ్‌గోపాల్ వర్మకు మరోసారి నోటీసులు జారీ చేయాలని సైబర్‌క్రైమ్ పోలీసులు నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment