
సాక్షి, హైదరాబాద్: చలో ట్యాంక్‌బండ్‌కు అనుమతి లేదని..అయినా వినకుండా పెద్దసంఖ్యలో కార్మికులు ట్యాంక్‌బండ్ వైపు చొచ్చుకు వచ్చారని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇవాళ మధ్యాహ్నం సమయంలో పోలీసులపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. ఈ దాడిలో చాలామంది పోలీసులకు గాయాలు అయ్యాయి. ఈ దాడిలో అడిషనల్ డీసీపీ రామచంద్రరావు, ఏసీపీ రత్నం, సీఐ సైదిరెడ్డి, ఎస్‌ఐ శేఖర్, కానిస్టేబుల్ రాజు గాయపడ్డారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. పెద్దసంఖ్యలో ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో టియర్ గ్యాస్ ప్రయోగించాం. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు ఆందోళనకారులను కట్టడి చేశారు.’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment