Hydrogen gas
-
హైడ్రోజన్ ఉత్పత్తిలో అగ్రగామిగా భారత్!.. కేంద్రమంత్రి
చమురు దిగుమతులను తగ్గించుకోవడానికి కేంద్రం తగిన ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే.. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడం, సీఎన్జీ వాహనాల ఆవశ్యకతను గురించి వెల్లడించడం వంటివి చేస్తోంది. వాహన తయారీ సంస్థలకు కూడా ఫ్యూయెల్ వాహనాలకు ప్రత్యామ్నాయ వాహనాలను తయారు చేయాలనీ సూచిస్తోంది. రాబోయే రోజుల్లో మన దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా.. హైడ్రోజన్ ఉత్పత్తిలో కూడా భారత్ అగ్రగామిగా మారుతుందని పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ మంత్రి 'హర్దీప్ సింగ్ పూరి' అన్నారు.6వ సౌత్ ఏషియన్ జియోసైన్స్ కాన్ఫరెన్స్ అండ్ ఎగ్జిబిషన్లో మంత్రి 'హర్దీప్ సింగ్ పూరి' మాట్లాడుతూ.. నేచురల్ గ్యాస్ పైప్లైన్లలో హైడ్రోజన్ కలపడం, ఎలక్ట్రోలైజర్ బేస్డ్ టెక్నాలజీ, గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి బయో-పాత్‌వేలను ప్రోత్సహించడం వంటి ప్రాజెక్టులలో భారత్ అభివృద్ధి చెందుతోందని అన్నారు. భవిష్యత్‌కు ఇంధనంగా భావించే గ్రీన్ హైడ్రోజన్‌కు మనదేశం కేంద్రంగా మారే అవకాశం ఉందని ఆయన అన్నారు.భారతదేశంలో రోజుకు 5.4 మిలియన్ బ్యారెల్స్ ఇంధన వినియోగం జరుగుతోంది. ఇది 2030నాటికి 7 మిలియన్ బ్యారెళ్లకు చేరుకుంటుందని అంచనా. ప్రతి రోజూ 67 మిలియన్ల మంది ప్రజలు పెట్రోల్ పంపులను సందర్శిస్తున్నట్లు హర్దీప్ సింగ్ పూరి పేర్కొన్నారు. ఈ సంఖ్య యూకే, ఫ్రాన్స్, ఇటలీ వంటి దేశాల జనాభాకు సమానమని ఆయన అన్నారు. రాబోయే రెండు దశాబ్దాల్లో ప్రపంచ ఇంధన డిమాండ్‌లో 25 శాతం భారత్ నుంచి వస్తుందని అంచనా. -
హాట్.. కూల్.. సోలార్
సాక్షి, అమరావతి: సూర్యరశ్మిలో ఉన్న అనంత శక్తిని వినియోగించుకోవడంపై ఎన్నో ప్రయోగాలు, పరిశోధనలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. అలాగే హైడ్రోజన్ గ్యాస్‌ను భవిష్యత్ ఇంధనంగా కూడా భావిస్తున్నారు. ఇన్నాళ్లూ సౌర శక్తిని విద్యుత్ శక్తిగా మార్చి వినియోగించుకుంటున్నాం. ఆ విద్యుత్‌తో దీపాలు వెలిగిస్తున్నాం. వాహనాలను, పరిశ్రమలను కూడా నడుపుతున్నాం. వీటన్నింటినీ మించి తాజా ఆవిష్కరణలు ఇప్పుడు ప్రపంచాన్ని ఆకర్షిస్తున్నాయి. వాటిలో ఒకటి సోలార్ హైడ్రోజన్ ప్యానల్స్ కాగా, రెండవది హైబ్రిడ్ సోలార్ ఎయిర్ కండీషనర్లు. భవిష్యత్ తరాలకు భరోసా కల్పిస్తున్న ఈ రెండు కొత్త ప్రాజెక్టులు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. ఇంటిపైనే హైడ్రోజన్ ఫ్యాక్టరీ.. పర్యావరణానికి హాని చేసే ఉద్గారాలు ఏమీ లేని స్వచ్ఛమైన ఇంధనం హైడ్రోజన్. ఈ గ్యాస్‌ను గాలి నుంచి పొందేలా బెల్జియంలో పరిశోధనలు సాగాయి. సూర్యుని నుంచి విద్యుత్ శక్తిని, గాలి నుంచి హైడ్రోజన్ వాయువును సంగ్రహించగల పైకప్పు (రూఫ్‌టాప్) ప్యానెల్స్‌ను కేయూ లీవెన్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు అభివృద్ధి చేశారు. చాలా కాలంగా వీరు చేసిన పరిశోధనలు ఇప్పుడు ఓ కొలిక్కి వచ్చాయి. ప్రస్తుతం పారిశ్రామికోత్పత్తి దిశగా అడుగులు వేస్తున్నారు. 2030కల్లా రూఫ్‌టాప్ హైడ్రోజన్ ప్యానల్స్ తయారు చేసేలా కృషి చేస్తున్నారు. హైడ్రోజన్‌ను నిల్వ చేసి అవసరమైనప్పుడు విద్యుత్‌గా, రూమ్ హీటర్‌గా వినియోగించుకునేందుకు వారు ఈ ప్రాజెక్టును రూపొందించారు. వీరు తయారు చేసిన ప్యానల్స్‌లో ఎలక్ట్రిక్ వైర్లకు బదులుగా గ్యాస్ ట్యూబ్‌లు ఒకదానికొకటి అనుసంధానించి ఉంటాయి. ఈ ప్యానల్స్ సూర్యరశ్మిని గ్రహించి విద్యుత్‌గా మారుస్తాయి. అలాగే గాలి నుంచి నీటి ఆవిరిని గ్రహిస్తాయి. సూర్యుని నుంచి గ్రహించిన శక్తిని వినియోగించి ఆ ప్యానల్స్ నీటి అణువులను హైడ్రోజన్, ఆక్సిజన్‌గా విభజిస్తాయి. హైడ్రోజన్‌ను స్టోర్ చాంబర్‌కు పంపి, ఆక్సిజన్‌ను తిరిగి వాతావరణంలోకి విడుదల చేస్తాయి. ఇలా నిల్వ చేసిన హైడ్రోజన్‌ను శీతాకాలంలో రూమ్ హీటింగ్ సిస్టంకు, అలాగే గృహానికి విద్యుత్‌గా కూడా వాడుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. సౌర, బ్యాటరీ, విద్యుత్‌తో పనిచేసే ఏసీ హైబ్రిడ్ సోలార్ ఎయిర్ కండీషనర్‌ను సోలార్ ఏసీగా పిలుస్తున్నారు. వీటిని సౌరశక్తి, సౌర బ్యాటరీ బ్యాంక్, విద్యుత్‌తో పనిచేయించవచ్చు. అంటే కరెంటు, సూర్యరశ్మి లేకున్నా ఏసీ ఆగదు. సోలార్ ప్యానల్స్, సోలార్ ఇన్వర్టర్లు, అన్ని ఉపకరణాలతో కలిపి ఏసీని తయారు చేశారు. ఇది ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది. -
వావ్ గడ్కరీ.. ఈయన ప్రతీ ఆలోచన గొప్పే!
ఇప్పుడున్న కేంద్ర మంత్రుల్లో నితిన్ గడ్కరీకి దేశవ్యాప్తంగా ఫాలోయింగ్ కాస్త ఎక్కువే!. ఆయన నిర్ణయాలే కాదు.. ఆలోచనలు, ఆచరణలు సైతం అప్పుడప్పడు ఆశ్చర్యపరుస్తుంటాయి. అలాగే సంప్రదాయ ఇంధనాలకు ప్రత్యాయ్నాలను ఉపయోగించాలని పిలుపు ఇచ్చేవాళ్లలో నితిన్ గడ్కరీ కూడా ఒకరు. తాజాగా ఆయన పర్యావరణ పరిరక్షణ కోసం ఓ అడుగు ముందుకేశారు. కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ మధ్య ఓ కారును కొనుగోలు చేశారట. ఇందులో ఇంధనంగా పెట్రోల్, డీజిల్, సహజవాయువులను ఉపయోగించరు. ఈ కారు గ్రీన్ హైడ్రోజన్‌తో నడుస్తుంది. ఫరిదాబాద్‌లోని ఓ ఆయిల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ రూపొందించిన కారును త్వరలో రోడ్డెక్కించబోతున్నట్లు ఓ సదస్సులో పాల్గొన్న ఆయన స్వయంగా వెల్లడించారు. ‘నా హైడ్రోజన్ కారుతో త్వరలోనే ఢిల్లీ రోడ్లపై ప్రయాణిస్తా. ప్రజల్లో ఈ తరహా ప్రత్యామ్నాయ ఇంధనాలపై అవగాహన కల్పిస్తా. ఇది నమ్మదగిన విషయమేనని, కాలుష్యాన్ని తగ్గించే ఆచరణ అవుతుందని జనాలకి నమ్మకం కలిగిస్తా’ అని ప్రసంగించారాయన. యూట్యూబ్‌తో లక్షలు సంపాదిస్తున్న గడ్కరీ! డ్రైనేజీ మురుగు నీరు, ఘనరూప వ్యర్థాల నుంచి హైడ్రోజన్ ను తయారుచేసి దాన్నే ఇంధనంగా ఉపయోగించే వీలుందని, ఈ తరహా హైడ్రోజన్ ఇంధనంతో బస్సులు, ట్రక్కులు, కార్లను రోడ్లపై పరుగులు తీయించాలనేది తన ప్రణాళిక అని ఈ సందర్భంగా గడ్కరీ స్పష్టం చేశారు. ఇక మారుతున్న పరిస్థితుల దృష్ట్యా ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణకు విశేష ప్రాధాన్యత లభిస్తోంది. కాలుష్య రహితానికి ఆస్కారం ఉన్న ఇంధనాలపై ఎన్నో రకాల పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ తరుణంలో వ్యర్థాలను కూడా సద్వినియోగ పరిచేందుకు ప్రయత్నిస్తున్నానని గడ్కరీ ప్రకటించడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. గ్రీన్ హైడ్రోజన్ కార్ల నుంచి వేడి గాలి, నీటి ఆవిరి మాత్రమే వెలువడతాయి. దేశంలో పెట్రోల్, డీజిల్ వాహనాల బ్యాన్..! నితిన్ గడ్కరీ క్లారిటీ! గడ్కరీ కొత్త స్వరం.. కార్లకు మాత్రమే వినసొంపైన హారన్లు! చదవండి: ‘ఇలా చేస్తే పెట్రోలు ధరలు తగ్గుతాయి’ గడ్కరీ కీలక వ్యాఖ్యలు -
హైడ్రోజన్ తయారీ ఇక సులువు
న్యూఢిల్లీ: సాధారణంగా హైడ్రోజన్ వాయువు తయారీ చాలా ఖర్చుతో కూడుకున్నది. సహజ వాయువు తయారీతో పోల్చుకుంటే మూడు రెట్లు ఎక్కువ ఖర్చు అవు తుంది. పైగా అంత సులువైన ప్ర క్రియేమీ కాదు. ఐఐటీ వారణాసి పరిశోధకులు వీటన్నింటికీ చెక్ పెడుతూ సులువుగా అప్పటికప్పుడు మిథనాల్ నుంచి అత్యంత స్వచ్ఛమైన హైడ్రోజన్ వాయువును తయారు చేసేందుకు ఓ పరికరాన్ని రూపొందించారు. పెట్రోల్ బంకుల్లో స్థాపించి మెంబ్రేన్ టెక్నాలజీ ఆధారంగా ఈ వాయువును ఉత్పత్తి చేయొచ్చు. ఇలా ఉత్పత్తయ్యే వాయువుతో హైడ్రోజన్‌తో నడిచే వాహనాలకు ఇంధనంగా వాడుకోవచ్చు. అలాగే దీని నుంచి తయారైన విద్యుత్‌ను ఎలక్ట్రిక్ వాహనాలకు చార్జింగ్ చేసుకునేందుకు, మొబైల్ టవర్లకు విద్యుత్ సరఫరా చేసేందుకు ఉపయోగపడుతుందని ఈ రూపకల్పనలో పాలుపంచుకున్న అసోసియేట్ ప్రొఫెసర్ రాజేశ్ ఉపాధ్యాయ వివరించారు. ఈ పరికరాన్ని వినియోగించడం చాలా సులువని, 2 చదరపు మీటర్ల స్థలంలోనే ఇమిడిపోగలదని చెప్పారు. పైగా 0.6 లీటర్ల మిథనాల్ నుంచి దాదాపు 900 లీటర్ల హైడ్రోజన్‌ను తయారు చేయొచ్చని వెల్లడించారు. ఈ పరికరాన్ని ఉపయోగించి పీఈఎం ఫుయెల్ సెల్ సాయంతో 1 కిలోవాట్ విద్యుత్‌ను తయారుచేసినట్లు చెప్పారు. -
ఐఐఎస్సీలో పేలుడు: శాస్త్రవేత్త మృతి
సాక్షి, బెంగళూరు: బెంగళూరులోని ప్రతిష్టాత్మక ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సీ) ప్రయోగశాలలో బుధవారం శక్తిమంతమైన పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో 32 ఏళ్ల యువ శాస్త్రవేత్త మృతి చెందాడు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఏరోస్పేస్ విభాగానికి చెందిన హైపర్సోనిక్ షాక్ వేవ్ ప్రయోగశాలలో మధ్యాహ్నం 2.20 గంటల సమయంలో ప్రమాదవశాత్తు ఒక హైడ్రోజన్ సిలిండర్ పేలిపోయింది. ఐఐఎస్సీతో ఒప్పందం చేసుకున్న సూపర్‌వేవ్ టెక్నాలజీస్ అనే స్టార్టప్‌కు చెందిన నలుగురు శాస్త్రవేత్తలు ఆ సమయంలో ప్రయోగాలు చేస్తున్నారు. పేలుడు ధాటికి మైసూరుకు చెందిన ఏరోస్పేస్ శాస్త్రవేత్త మనోజ్ కుమార్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పేలుడు తీవ్రత అధికంగా ఉండటంతో సిలిండర్‌కు సమీపంలో ఉన్న మనోజ్ కుమార్ శరీరం పూర్తిగా కాలిపోయింది. గాయపడిన మిగిలిన ముగ్గురు శాస్త్రవేత్తలు కార్తీక్, అతుల్య, నరేశ్ కుమార్‌లను హుటాహుటిన స్థానిక ఎంఎస్ రామయ్య ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రమాదానికి అసలు కారణం తెలియరాకున్నా భారీ స్థాయిలో హైడ్రోజన్ వాయువు విడుదల కావడం వల్లే పేలుడు జరిగి ఉండొచ్చని ఫోరెన్సిక్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఘటనపై బెంగళూరులోని సదాశివనగర పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. కాగా, ఐఐఎస్సీ చాన్నాళ్లుగా ఉగ్రవాదుల హిట్‌లిస్టులో ఉంది. -
మార్కెట్లోకి హైడ్రోజన్ కారు ‘రస’
లండన్: ఆధునిక హంగులతో బ్రిటిన్ హైడ్రోజన్ కారు ‘రస’ బుధవారం నాడు రోడ్డు మీదకు వచ్చింది. రెండు సీట్ల ఈ కారులో గేర్లు ఉండవు. ముందుకు, వెనక్కి వెళ్లడానికి, న్యూట్రల్ చేయడానికి ఎగువ భాగాన బటన్లు ఉంటాయి. కాళ్ల కింద యాక్సిలేటర్, బ్రేక్‌లు ఉంటాయి. కిలోన్నర హైడ్రోజన్ ఇంధనంపై 482 కిలోమీటర్లు దూరం ప్రయాణిస్తుంది. పది సెకడ్లలో గంటకు 97 కిలో మీటర్ల గరిష్ట వేగాన్ని అందుకుంటుంది. ఇరువైపుల డోర్లు పై భాగానికి, అంటే ఆకాశానికి తెరచుకుంటాయి. సీఎన్జీ కంటే కూడా అతి తక్కువ కాలుష్యాన్ని విడుదల చేస్తుంది. వేగంగా పోతున్నప్పుడు నీటి ఆవిరి మాత్రమే బయటకు వెలువడి గాలిలో కలసిపోతుంది. మెల్లగా వెళుతున్నప్పుడు నీటి చుక్కలు మాత్రమే నేల రాలుతాయి. అందుకనే దీనికి లాటిన్ పదం ‘రస’ అని పేరు పెట్టారు. రస అంటే లాటిన్లో స్వచ్ఛమైన అని అర్థం. హైడ్రోజన్ ఇంధనం ప్రమాదకరమైనప్పటికీ పెట్రోలు, డీజిల్ కార్ల కన్నా ఈ కార్లే సురక్షితమైనవని కారు ఉత్పత్తిదారులు చెబుతున్నారు. పెట్రోలు లేదా డీజిల్ కార్లు ప్రమాదానికి గురైనప్పుడు వాహనం కిందకు ఆయిల్ లీకవుతుందని, అదే తమ హైడ్రోజన్ కారు ప్రమాదానికి గురైనప్పుడు హైడ్రోజన్ గ్యాస్ గాలిలో కలసిపోతుందని అంటున్నారు. కేవలం 580 కిలోల బరువు మాత్రమే ఉండే ఈ కారు బాడీని పటిష్టమైన మెటీరియల్‌తో తయారు చేశామని వేల్స్‌లోని ‘రివర్ సింపిల్ మూవ్మెంట్’ వర్గాలు తెలిపాయి. ఈ కంపెనీ ఇంజనీర్లే ఈ కారును రూపొందించారు. మరమ్మతులు, నిర్వహణ ఖర్చులు, బీమా అన్నింటిని వినియోగదారుడికి ఉచితంగానే ఇస్తామని, కారు ధర ఫోక్స్‌వాగన్ గల్ఫ్ కారు రేటు ఉంటుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. అన్నీ బాగున్నా బ్రిటన్‌లో హైడ్రోజన్ ఇంధనం నింపుకోవడమే కష్టం. ఎందుకంటే బ్రిటన్‌లో ప్రస్తుతం హైడ్రోజన్ ఇంధనం దొరికే బంకులు కేవలం 14 మాత్రమే ఉన్నాయి. త్వరలోనే మరో 12 బంకులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ఇటీవలనే ప్రకటించింది. -
అంతరిక్షంలో హైడ్రోజన్ నదులు
వాషింగ్టన్: అంతరిక్షంలో వివిధ నక్షత్ర మండలాల (గెలాక్సీల) మధ్య అత్యంత భారీ స్థాయిలో హైడ్రోజన్ వాయువు ప్రవహిస్తోందని అమెరికాకు చెందిన వెస్ట్ వర్జీనియా వర్సిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది సర్పిలాకార గెలాక్సీల్లో పెద్ద సంఖ్యలో నక్షత్రాలు పుట్టడానికి దోహదం చేస్తున్నట్లు వారు చెబుతున్నారు. అమెరికా జాతీయ సైన్స్ ఫౌండేషన్‌కు చెందిన ‘గ్రీన్ బ్యాంక్ టెలిస్కోప్’ సహాయంతో ఈ పరిశోధన చేశారు. భూమికి 2.2 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ‘ఎన్జీసీ6946’ అనే గెలాక్సీకి.. చుట్టూ ఉన్న గెలాక్సీల నుంచి హైడ్రోజన్ భారీగా ప్రవహిస్తున్నట్లు గుర్తించామని పరిశోధనకు నేతృత్వం వహించిన డీజే పిసానో చెప్పారు. ఇలాంటి హైడ్రోజన్ ప్రవాహాన్ని కనుగొనడం ఇదే మొదటిసారి అని, అత్యంత చల్లగా ఉండడం వల్ల ఈ ప్రవాహాలను గుర్తించడం కష్టమని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి ప్రవాహాల వల్లే సర్పిలాకార గెలాక్సీలు నిత్యం నక్షత్రాలకు జన్మనిస్తున్నట్లుగా భావిస్తున్నట్లు తెలిపారు.