I-T
-
అనుమానాస్పద క్లెయిమ్స్‌పై ఐటీ కన్ను
న్యూఢిల్లీ: గడిచిన మూడేళ్లలో అనుమానాస్పద ఆదాయ పన్ను రీఫండ్ క్లెయిమ్స్ సంఖ్య గణనీయంగా పెరిగిందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి శివ్ ప్రతాప్ శుక్లా రాజ్యసభకు తెలిపారు. 2016–17లో 9,856గా ఉన్న ఈ సంఖ్య 2018–19 నాటికి 20,874కి చేరిందన్నారు. ఆదాయం, పెట్టుబడులకు పొంతన లేకుండా భారీ రీఫండ్స్ కోసం క్లెయిమ్ చేస్తున్న పన్ను చెల్లింపుదారుల రిటరŠన్స్‌పై ఆదాయ పన్ను శాఖ స్క్రూటినీ జరుపుతోందని మంత్రి వివరించారు. స్క్రూటినీ అనంతరం క్లెయిమ్ తప్పని తేలిన పక్షంలో కేసును బట్టి రీఫండ్‌ను నిరాకరించడంతో పాటు జరిమానా, ప్రాసిక్యూషన్ చర్యలు కూడా తీసుకోవడం జరుగుతోందని తెలిపారు. 2015–16లో రూ. 1.22 లక్షల కోట్లుగా ఉన్న ఐటీ రీఫండ్స్ 2018–19 నాటికి రూ. 1.43 లక్షల కోట్లకు పెరిగాయని ఆయన వివరించారు. అనుమానాస్పద క్లెయిమ్స్‌కు ఆటోమేటిక్‌గా చెల్లింపులు జరగకుండా పక్కకు తీసి పెట్టేలా ఐటీ శాఖ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోందన్నారు. మరోవైపు, 2017–18లో 4.63 కోట్ల ఐటీ రిటర్న్‌లు దాఖలు కాగా 2018–19 జనవరి నాటికి ఇది 37% పెరిగి 6.36 కోట్లకు చేరిందని చెప్పారు. 2018–19లో ఐటీఆర్‌లు గడువులోగా ఫైల్ చేయాలంటూ పన్ను చెల్లింపుదారులకు 25 కోట్ల పైచిలుకు ఎస్ఎంఎస్లు, ఈమెయిల్స్ పంపినట్లు శుక్లా తెలిపారు. -
రిటర్నుల్లో మాయచేస్తే భారీ పన్ను
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు(డీమోనిటైజేషన్) తర్వాత దాఖలైన సవరించిన ఐటీ రిటర్నులను(రివైజ్డ్ ఐటీఆర్) మరింత నిశితంగా పరిశీలించాలని ఆదాయపు పన్ను అధికారులకు కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల విభాగం(సీబీడీటీ) ఆదేశాలు జారీ చేసింది. ఆయా రిటర్నుల్లో నల్లధనం గనుక గుర్తించడం లేదా వివరాలను తారుమారు చేసినట్లు తేలితే పన్ను రేటును భారీగా పెంచి వసూలు చేయాలని పేర్కొంది. ఈ మేరకు నవంబర్ 24న ఐటీ శాఖలోని ప్రాంతీయ ప్రధాన అధికారులందరికీ సీబీడీటీ తగిన సూచనలతో కూడిన రెండు పేజీల లేఖను పంపినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ‘నోట్ల రద్దు తర్వాత దాఖలైన రివైజ్డ్ రిటర్నులలో ఆర్థిక లావాదేవీలకు సంబంధించి అనుమానాలు ఉంటే వాటిపై కచ్చితంగా మరింత నిశిత పరిశీలన అవసరం. అటువంటి కేసుల్లో లెక్కల్లో చూపని ఆదాయాలేవైనా బయటపడితే.. ఐటీ చట్టంలోని సెక్షన్ 115బీబీఈ ప్రకారం అధిక పన్ను రేటును విధించి వసూలు చేయాలి’ అని సీబీడీటీ స్పష్టం చేసింది. కాగా, వ్యాపార వర్గానికి చెందిన పన్ను చెల్లింపుదారులు గనుక అమ్మకాలను పెంచి చూపినట్లు అనుమానాలు ఉంటే.. సెంట్రల్ ఎక్సైజ్/వ్యాట్ రిటర్నులతో పోల్చిచూడాలని కూడా ఐటీ అధికారులను ఆదేశించింది. చట్టాన్ని దుర్వినియోగం చేయకుండా... ‘చట్టప్రకారం సవరించిన లేదా ఆలస్యంగా ఐటీ రిటర్నులు దాఖలు చేసేవారు.. డీమోనిటైజేషన్ తర్వాత నల్లధనాన్ని తెల్లధనంగా మార్చిచూపేందుకు దుర్వినియోగం చేసే అవకాశాలు ఉన్నాయి. దీనికి అడ్డుకట్టవేయడమే సీబీడీటీ తాజా ఆదేశాల ముఖ్య ఉద్దేశం. నోట్ల రద్దు తర్వాత అనుమానాస్పద ఆర్థిక లావాదేవావీల ఆధారంగా ఇప్పటికే ఐటీ శాఖ 20 వేలకు పైగా కేసులను నిశిత పరిశీలనకోసం గుర్తించింది. ఇప్పుడు కొత్త ఆదేశాల ఆధారంగా వీటిపై ఐటీ అధికారులు ప్రత్యేకంగా దృష్టిసారించనున్నారు’ అని సీనియర్ ఐటీ అధికారి ఒకరు వివరించారు. ఐటీ రిటర్నుల్లో సవరణ అవకాశాన్ని దుర్వినియోగం చేస్తే(ఆదాయాన్ని మార్చి చూపడం వంటివి) జరిమానాతోపాటు చట్టపరమైన కేసులను కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని ఇప్పటికే సీబీడీటీ అసెస్సీ(పన్ను చెల్లింపుదారులు)లను తీవ్రంగా హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఐటీ చట్టంలోని సెక్షన్ 139(5) ప్రకారం అసెస్సీలు అసలు రిటర్నుల్లో తప్పులేవైనా ఉంటే సరిదిద్దడానికి, అనవసరమైన అంశాల తొలగింపునకు మాత్రమే రివైజ్డ్ ఐటీఆర్‌లను దాఖలు చేసేందుకు వీలుంటుంది. -
మరోసారి చిక్కుల్లో బాలీవుడ్ సూపర్‌స్టార్
న్యూఢిల్లీ: పనామా పేపర్ల బహిర్గతం సృష్టించిన కలకలం అంతా ఇంతా కాదు. ఈ వ్యవహారంపై సీరియస్‌గా స్పందించిన ఆదాయపన్ను శాఖ ఇప్పటికే దాదాపు 33 మందిపై చర్యలకు ఉపక్రమించగా తాజాగా ఇతరులపై కూడా దర్యాప్తును వేగవంతం చేసింది. పనామా పేపర్స్‌లో పేర్లున్న మరికొందరి ‘పెద్దల’ వివరాలపై ఆదాయపన్ను శాఖ తీవ్రంగా కదులుతోంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్‌కు మరోసారి ఇబ్బందులు తప్పడంలేదు. ఈ కేసులో బిగ్‌బీ సహా పలువురిపై సహా ఆదాయపన్ను శాఖ దృష్టి కేంద్రీకరించింది. పనామా పేపర్స్ లీక్ విచారణలో పురోగతి సాధించేందుకు గ్లోబల్ టాస్క్ ఫోర్స్‌లో చేరిన ఇండియా ఈ మేరకు అత్యున్నత స్థాయి బృందాన్ని కరేబియన్‌లోని బ్రిటిష్ వర్జిన్ ఐల్యాండ్‌కు పంపింది. పనామా పేపర్ల లీక్ వ్యవహారంలో విచారించేందుకు ఉన్నత స్థాయి అధికారులను బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్కు పంపించినట్టు సీనియర్ ఐటీ అధికారి ఒకరు వెల్లడించారు.సమాచారాన్ని సేకరించి, విశ్లేషించనున్నట్టు చెప్పారు. అయితే అమితాబ్‌కు వ్యతిరేకంగా వచ్చిన ఆరోపణలపై ప్రశ్నించినపుడు. ఈ ఆరోపణలను అమితాబ్ ఇప్పటికే ఖండించారని..పూర్తి సమాచారం వచ్చేంతవరకు విచారణ చేపట్టలేమన్నారు. సీనియర్ సీబీడీటీ (సెంట్రల్ బోర్డ్ అఫ్ డైరెక్ట్ టాక్స్) అధికారిని బ్రిటిష్ వర్జిన్ ద్వీపాలకు పంపించామనీ, వివిధ ఇతర దేశాలనుంచి దీనికి సంబంధించిన వివరాలను రాబడుతున్నట్టు తెలిపారు. అనంతరం ఈ మొత్తం సమాచారాన్ని విశ్లేషించి, ఉల్లంఘనలను పరిశీలించనున్నట్టు ఆయన చెప్పారు. ఇది సుదీర్ఘమైన ప్రక్రియ అని పనామా పేపర్స్‌లో పేర్లు బయటకి వచ్చిన వారిపై విచారణను ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కాగా 35 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న పనామాకు చెందిన న్యాయ సంస్థ మోస్సాక్ ఫోన్సెకా ద్వారా ఈ పనామా కీలక పత్రాలు లీక్ అయ్యాయి. ఇది 1977- 2015 మధ్యకాలంలో 2,14,000 ఆఫ్‌షోర్ సంస్థలకు సంబంధించిన 11.5 మిలియన్ పత్రాలను కంపెనీ లీక్ చేసింది. విదేశీ బ్యాంక్ ఖాతాలున్న 50 దేశాల నుంచి 140 రాజకీయ వ్యక్తుల పేర్లను బహిర్గతం చేసింది. వీటిలో వివిధ దేశాల 12 మంది ప్రస్తుత లేదా మాజీ అధిపతులు, అలాగే క్రీడాకారులు, వ్యాపారవేత్తలు, సినీతారలు సహా, ఫోర్బ్స్ రిచ్ లిస్ట్ లో చోటు సంపాదించుకున్న 29 మంది బిలియనీర్లు ఉన్నారు. ఇదే కేసులో పాక్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ తన పదవిని కోల్పోయిన సంగతి తెలిసిందే. -
షాకైన ఐటీ: ఫామ్‌హౌజ్‌లో 15 ఎల్ఈడీ టీవీలు
న్యూఢిల్లీ : పన్నులు ఎగవేస్తూ.. కోట్లకు కోట్లు ఆర్జిజిస్తున్న అధికారుల నివాసాలపై ఆదాయపు పన్ను శాఖ కొరడా ఝలిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో భాగంగా ఉత్తరప్రదేశ్, ఉత్తరఖాండ్ రాష్ట్రాల్లో జరిపిన సెర్చ్ ఆపరేషన్‌లో ఖరీదైన ఆస్తులు, కార్లు, వస్తువుల బయటపడ్డాయి. గత రెండు రోజులుగా ఉత్తరప్రదేశ్, ఉత్తరఖాండ్ వంటి ప్రాంతాల చెందిన కొంతమంది అధికారులపై ఆదాయపు పన్ను దాడులు జరిపింది. ఈ రైడ్స్‌లో 20 కోట్ల రూపాయల బ్లాక్ ఇన్కమ్ వెలుగులోకి వచ్చినట్టు ఐటీ అధికారులు వెల్లడించారు. వందల ఎకరాల్లో విస్తరించి ఉన్న అధికారుల ఫామ్‌హౌజ్‌ల్లో లెక్కలో చూపని చాలా పెట్టుబడుల డాక్యుమెంట్లను గుర్తించినట్టు అధికారులు తెలిపారు. ఇతర నగరాల్లో ఉన్న అధికారుల స్థిర ఆస్తులను సీజ్ చేసినట్టు వెల్లడించారు. రేంజ్ ఓవర్, ఆడియా, బీఎండబ్ల్యూ లాంటి ఖరీదైన వాహనాలను, ఖరీదైన ఆస్తులను ఈ పన్ను చెల్లించని అధికారులు కలిగి ఉన్నారట. ఓ ఫామ్‌హౌజ్‌లో ఏకంగా 15 పెద్దపెద్ద ఎల్ఈడీ టెలివిజన్ సెట్స్ ఫిట్ చేసి ఉన్నాయని, అవి చూసి తాము షాకయ్యామని తెలిపారు. ఆ ఫామ్‌హౌజ్‌లోనే ఎంతో పకడ్బందీగా నిర్మించిన జిమ్, గెస్ట్ హౌజ్, నిర్మాణంలో ఉన్న స్విమ్మింగ్ పూల్‌ను అక్కడ గుర్తించినట్టు పేర్కొన్నారు. డెహ్రడూన్‌లోని ఉత్తరప్రదేశ్ రాజకీయ నిర్మాణ్ నిగమ్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ తన అధికారిక పదవిని ఉపయోగించుకుని పన్ను ఎగొడుతున్నాడనే ఆరోపణల మీద ఈ దాడుల నిర్వహించినట్టు అధికారులు చెప్పారు. మరో సెర్చ్ ఆపరేషన్‌లో యూపీలోని సిద్దార్థనగర్ కు చెందిన లోకల్ బాడీ చైర్మన్‌పై కూడా దాడులు జరిపినట్టు తెలిసింది. ఈ సెర్చ్ ఆపరేషన్‌లో ప్రభుత్వం నుంచి వచ్చే అభివృద్ధి పథకాల గ్రాంట్స్ ను ఆ చైర్మన్ వ్యక్తిగత ప్రయోజనాలకు ఉపయోగిస్తున్నారని, ఇతనికి రెండు పెట్రోల్ బంకులు, ఓ గ్యాస్ ఏజెన్సీ ఉన్నట్టు గుర్తించినట్టు తేల్చారు. కాన్పూర్ కు చెందిన రోడ్డు రవాణా శాఖ అధికారిపై, నోయిడాకు చెందిన సీనియర్ అధికారి ఇళ్లపైనే ఐటీ దాడులు చేసింది. -
ఆ చాయ్ వాలా ఇచ్చిన కట్నం వింటే షాక్!
-
ఆ చాయ్ వాలా ఇచ్చిన కట్నం వింటే షాక్!
జైపూర్ : కూతుళ్ల పెళ్లి ఖర్చు భరించాలంటేనే కొంతమంది తల్లిదండ్రులకు తల ప్రాణం తోకకు వస్తోంది. మరి కొంతమందైతే ఏకంగా లక్షలకు లక్షలు కట్నాలిచ్చి ఆడంభరంగా పెళ్లిళ్లు చేస్తుంటారు. అయితే ఓ చాయ్ వాలా ఒకేరోజు తన ఆరుగురు కూతుళ్లకి పెళ్లి చేసి, భారీ మొత్తంలో కట్నం ముట్టజెప్పి ఇరకాటంలో పడ్డాడు. పెళ్లి ఖర్చులుకాక, తన కూతుళ్లకు ఏకంగా కోటిన్నర కట్నమిచ్చాడు. చాయ్ వాలా ఏకంగా కోటిన్నర మేర కట్నమివ్వడంతో ఇంత డబ్బు ఎక్కడినుంచి వచ్చిదంటూ ఐటీ శాఖ వారు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. లీలా రామ్ గుజ్జర్.. రాజస్తాన్ లోని కొత్పుట్లీ సమీపంలోని హదుటా వద్ద ఓ టీ స్టాల్ నడుపుతున్నాడు. ఏప్రిల్ 4న తన ఆరుగురు కూతుర్లకు పెళ్లి చేశాడు. ఆ పెళ్లి వేడుకలో స్థానిక ప్రజలు, కమ్యూనిటీ నేతలు చూస్తుండగా పెద్దపెద్దగా నోట్లను లెక్కకడుతూ పెళ్లికొడుకులకు కట్నమిచ్చాడు. దీన్ని గుర్తించిన ఆదాయపు పన్ను శాఖ బుధవారం రోజు ఆ చాయ్ వాలాకు నోటీసులు జారీచేసింది. ఈ మొత్తాన్ని ఎక్కడి నుంచి సంపాదించారో తెలపాలంటూ ఐటీ ఆఫీసు సమన్లు పంపింది. ''గురువారం వరకు మేం ఆగుతాం. ఒకవేళ రిటర్న్స్ ఫైల్ చేయడంలో అతను విఫలమైతే, ఆదాయార్జనపైన ప్రశ్నలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ కట్నం లెక్కలో చూపని నగదుగా గుర్తిస్తే, తదుపరి ప్రక్రియను కొనసాగిస్తాం. ఆదాయానికి సంబంధించిన డాక్యుమెంట్లు కూడా సమర్పించాలని అతన్ని ఆదేశించాం'' అని ఓ సీనియర్ ఐటీ ఆఫీసర్ పేర్కొన్నారు. మరోవైపు నలుగురు మైనర్ కూతుళ్ల వివాహం కూడా గుజ్జర్ మెడకు చుట్టుకుంది. ఇద్దరి పెద్ద కూతుళ్ల పెళ్లికి మాత్రమే ఆహ్వాన పత్రికలు పంపి, మరో నలుగురు మైనర్ కూతుళ్లకి కూడా గుజ్జర్ వివాహం చేసినట్టు తెలిసింది. గుజ్జర్ ఇంటికి వెళ్లినప్పటికీ, వారి కుటుంబసభ్యులు ఎవరూ అక్కడ లేరని కొత్పుట్లీ పోలీసులు చెప్పారు. -
కొత్త నోట్లు ప్రెస్‌ల నుంచి డైరెక్ట్‌గా ఇంటికే!
రోజుల తరబడి క్యూలైన్లో నిల్చున్నా బ్యాంకుల్లో నగదు దొరకడం లేదు.. కొంతమంది దగ్గరైతే కోట్లకు కోట్లు కొత్త నోట్లు దర్జాగా వచ్చేస్తున్నాయి. ఇదంతా ఏమిటి? వారందరికీ కొత్త నోట్లు ఎలా దొరుకుతున్నాయి. మనం ఎన్నిరోజులు నిల్చున్న మనకెందుకు దొరకట్లేదు. కొందరి బ్యాంకు అధికారులు మతలబుతో పాటు ఇంకేమైనా గందరగోళం ఉందా? ఇవన్నీ పెద్ద నోట్ల రద్దు అనంతరం ప్రజల నుంచి వస్తున్న సందేహాలు. వారి సందేహాలకు ఆజ్యం పోస్తూ తాజాగా ఆదాయపు పన్ను శాఖ కూడా పెద్ద ఎత్తున్న కొత్త నోట్లు కొందరి వద్దే దొరుకుతుండటంపై అనుమానాలు వ్యక్తంచేస్తోంది. పెద్ద ఎత్తున్న కొత్త నోట్లు ప్రభుత్వ ముద్రణా సంస్థలు, ఆర్బీఐ నుంచే డైరెక్ట్‌గా కొందరి ఇళ్లకు చేరినట్టు ఐటీ అనుమానిస్తోంది. దీనిపై ఆదాయపు పన్ను శాఖ, ఇంటిలిజెన్స్ అధికారులు విచారణ ప్రారంభించాయి. హిందుస్తాన్ టైమ్స్ రిపోర్టు ప్రకారం మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌కు చెందిన రెండు ప్రభుత్వ కరెన్సీ ప్రెస్ ముద్రణ వేసి ఉన్న రూ.20 లక్షల కొత్త 2000 రూపాయి నోట్లు గతనెలా ఢిల్లీలో పట్టుబడ్డాయి. ఇవి పట్టుబడిన అనంతరం వెంటనే ఐటీ శాఖ, మద్రణ సంస్థ నుంచి కొత్త నోట్లు ఇలా ఎక్కడికి వెళ్తున్నాయ్ అనే దిశగా విచారణ ప్రారంభించింది. ఈ నగదు పట్టుబడింది ఓ కొరియర్ బాయ్ దగ్గర. అతని పేరు కృష్ణ కుమార్‌గా అధికారులు గుర్తించారు. డిసెంబర్ 15న గ్రేటర్ కైలాష్-1 ఎం బ్లాక్ మార్కెట్లో వేచిచూస్తుండగా అధికారులు ఇతన్ని పట్టుకున్నారు. ముద్రణ సంస్థల సీల్‌తో ఉన్న నగదు పబ్లిక్‌లో పట్టుబడటం ఇదే మొదటిసారని ఇద్దరు సీనియర్ ఐటీ, ఇంటిలిజెన్స్ అధికారులు తెలిపారు. ఒకవేళ ప్రింటింగ్ ప్రెస్, ఆర్బీఐ చెస్ట్‌లు తమ లొసుగులతో రాజీపడి ఇలాంటి కార్యకలాపాలేమైనా నిర్వహిస్తే, ఆర్బీఐ కచ్చితంగా తమతో మరింత సమాచారం పంచుకోవాల్సి ఉంటుందని మరో అధికారి చెప్పారు. ఆర్బీఐ నుంచి బ్యాంకులకు నగదు చేరవేస్తున్న నగదు నిర్వహణ కంపెనీల పాత్రపై కూడా ఐటీ, ఇంటిలిజెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. అధికారులు పట్టుకున్న ఆ బ్యాగులు సాల్బోని, నాసిక్ ప్రెస్‌లకు సంబంధించినవి. పెద్ద నోట్ల రద్దు అనంతరం ఈ రెండు ప్రెసింగ్ సంస్థలు రోజుకు 52 లక్షల పీస్‌ల నోట్లను ప్రింట్ చేస్తున్నాయి. -
మరో బాంబు పేల్చిన ఐటీ అధికారులు
-
మరో బాంబు పేల్చిన ఐటీ అధికారులు
న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దు, బ్యాంకుల్లో పాత నోట్ల డిపాజిట్ల గడువు ముగిసిన అనంతరం ఆదాయ పన్ను అధికారులు మరో బాంబు పేల్చారు. రూ .15 లక్షల కోట్లపాతనోట్లు బ్యాంకులకు చేరాయన్న అంచనాలతో ఆదాయ పన్ను శాఖ బ్యాంకు నగదు డిపాజిట్ పోకడల విశ్లేషణ ప్రారంభించింది. ఈ క్రమంలో నవంబరు 8 కి ముందు బ్యాంకుల్లో జమ అయిన నగదుపై కూడా ఆరా తీస్తోంది. ముఖ్యంగా ఏప్రిల్ 2016 నుంచి నవబంరు 9 వరకు ఆయా బ్యాంకుల్లో నమోదైన డిపాజిట్ల వివరాలను కూడా పరిశీలిస్తోంది. డీమానిటేజేషన్ కి ముందు నెలల్లో బ్యాంకింగ్ లావాదేవీలను పరిశీలిస్తున్న ఐటీ శాఖ కోఆపరేటివ్ బ్యాంకులు సహా అన్ని బ్యాంకులు, పోస్ట్ ఆఫీసుల నగదు డిపాజిట్ల నివేదికను సమర్పించాల్సిందిగా కోరింది. పాన్ కార్డు వివరాలు గానీ, ఫాం60 గాని సమర్పించని ఖాతాదారుల డిపాజిట్ల వివరాలు అందించాలని కోరింది. సంబంధింత వివరాలను ఫిబ్రవరి 2017 లో సమర్పించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. కాగా రూ.500, 1000 నోట్ల రద్దుతో కేంద్ర ప్రభుత్వం భారీ సంచలనానికి తెర లేపింది. నల్లధనాన్ని అరికట్టేందుకు, నకిలీ కరెన్సీని నిరోధించేందుకంటూ చేపట్టిన ఈ డీమానిటైజేషన్ ప్రక్రియలో అనేక మార్పులు చేపట్టింది. నగదు కష్టాలకు అనేక ఉపశమన చర్యల్ని పక్రటించింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ రిజర్వ్ బ్యాంక్ ఇండియా ఆదాయ పన్ను అధికారులకు కీలక ఆదేశాలను జారీ చేసింది. ముఖ్యంగా నవంబరు 9 తరువాత నవంబర్ 10-డిసెంబర్ 30, 2016 మధ్య బ్యాంకులు, పోస్ట్ ఆఫీసుల పొదుపుఖాతాలరూ.2.5 లక్షలకుపైన డిపాజిట్లను, కరెంట్ ఖాతాల్లో రూ.12.50 లక్షల డిపాజిట్ల వివరాలను కోరింది. అలాగే ఒకే రోజులో రూ .50వేలకు మించిన నగదు డిపాజిట్ల వివరాలను అందించాలని కోరిన సంగతి తెలిసిందే. -
బిల్డర్స్‌కు ఐటీ షాక్!
న్యూఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు అనంతరం జువెల్లరీ వ్యాపారులను, బులియన్ ట్రేడర్స్‌ను, హవాలా ఆపరేటర్లను టార్గెట్ చేసిన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, ప్రస్తుతం బిల్డర్స్‌కు షాకిస్తోంది. దిగ్గజ బిల్డర్స్, వారి కమిషన్ ఏజెంట్లు రద్దు చేసిన రూ.500, రూ.1000 నోట్లను అంగీకరిస్తున్నారని ఇంటిలిజెన్స్ రిపోర్టులో తేలడంతో వారిపై కొరడా ఝళిపించడానికి సిద్దమైంది. తాజా ప్రాపర్టీ డీల్స్‌లో బిల్డర్స్ ఈ కార్యకలాపాలకు పాల్పడుతున్నారని వెల్లడైంది. దీంతో దేశవ్యాప్తంగా బిల్డర్స్పై ఐటీ సర్వే చేపడుతోంది. ఢిల్లీ-ఎన్సీఆర్, బెంగళూరు, మీరట్, అలహాబాద్, లక్నో, కోల్కత్తా, మధ్యప్రదేశ్‌లోని మరికొన్ని సిటీలోని పెద్ద బ్రోకింగ్ హైసింగ్స్పై రైడ్స్ నిర్వహిస్తోంది. పెద్ద నోట్లను రద్దుచేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అనంతరం వారి చేతుల్లో కలిగి ఉన్న నగదు, అవి ఎక్కడి నుంచి వచ్చాయో ఆధారాలను రాబడుతోంది. పెద్దనోట్ల రద్దుకు ముందు చాలామంది బిల్డర్స్ ఫండ్స్‌ను సేకరించడానికి చాలా తిప్పలు పడాల్సి వచ్చేది. కనీసం గడువు సమయానికి ఫ్లాట్ కట్టేసి, కొనుగోలు దారుడి చేతులోకి ఇవ్వడానికి ఆపసోపాలు పడేవారు. బిల్డర్స్పై ఇప్పటికే పలు కేసులు కోర్టులో ఫైల్ అయి, విచారణ సాగుతున్న సంగతి తెలిసిందే. కొంతమందికి కోర్టు జరిమానాలు కూడా పడ్డాయి. కానీ రద్దు అనంతరం పరిణామాలతో బంగారు వర్తకుల వల్లే, వీరి వద్ద కూడా రద్దు అయిన కరెన్సీ పెరుగుతోందని ఇంటలిజెన్స్ రిపోర్టులో వెల్లడైంది. వెనువెంటనే వారి కంట్రక్షన్ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. ఒకవేళ ప్రాజెక్టు ధర రూ.100 కోట్లు అయితే, బిల్డర్ చాలా తేలికగా రూ.10-15 కోట్ల నగదును చేతుల మీదనే నడిపిస్తున్నాడనని తెలిసింది. అదేవిధంగా నోట్ల రద్దుకు ముందు ప్రాపర్టీ అమ్మకం ద్వారా వచ్చిన నగదును సర్దుబాటు చేసుకుంటున్నారని తేలింది. గత మూడు రోజులుగా నోయిడా ఆధారిత దిగ్గజ బిల్డర్‌పై, మరో ఇద్దరి బిల్డర్స్పై ఐటీ అధికారులు జరిపిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఈ సర్వేలో బెంగళూరు ఆధారిత బిల్డర్ నుంచి రూ.12 కోట్ల లెక్కలో చూపని నగదును స్వాధీనం చేసుకున్నట్టు ఐటీ అధికారులు చెప్పారు. వాటిలో రూ.3.5 కోట్లు నగదు, రూ.45 లక్షల విలువైన బులియన్ బిల్డర్ దగ్గర లభ్యమైనట్టు చెప్పారు. నవంబర్ 8న ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయం అనంతరం బ్లాక్‌మనీ కలిగిఉన్న వారికి జువెల్లరీ వ్యాపారులు, హవాలా ఆపరేటర్లు, బిల్డర్స్ సహకరిస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుతం ఐటీ డిపార్ట్మెంట్ దేశవ్యాప్తంగా వారిపై సర్వే నిర్వహిస్తోంది. ఈ సర్వేలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, రెవెన్యూ ఇంటిలిజెన్స్ ఏజెన్సీలు, ఐటీ డిపార్ట్మెంట్కు సహకరిస్తున్నాయి.