ibraheem patnam
-
ఆంధ్రప్రదేశ్ లో పుష్కలంగా కరెంట్
-
నీటిసంపులో పడిన బాలుడు
మంచాల: ఇంటి పట్టునే ఆడుకుంటున్న ఓ బాలుడు సంపులో పడి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని కాగజ్‌ఘట్ గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. కాగజ్‌ఘట్ గ్రామానికి చెందిన యార జంగ య్య, రజిత దంపతుల కుమారుడు సాయికుమార్(7) ఇంటి వద్ద ఆడుకుంటూ ప్రమాదవశాత్తు నీటి సంపులో పడ్డాడు. గమనించిన కు టుంబ సభ్యులు బయటకు తీశారు. బాలుడు సృహాలోలేకపోవడంతో వెంటనే చికిత్స నిమి త్తం ఇబ్రహీంపట్నం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్లు స్పం దించకపోగా.. కనీసం చెయ్యి పట్టుకొని నాడి కూడా పరిశీలించలేదు. కుమారుడు కళ్లు తెరవలేదనే ఆందోళనలో ఉన్న కుటుంబసభ్యులు ఆవేదనతో ప్రశ్నించినా పట్టించుకోలేదు. రెండు నిమిషాలు ముందొస్తే బతికించేవాళ్లం.. దీంతో చేసేదిలేక తిరిగి ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు రెండు నిమిషాలు ముందు బాలుడిని తీసుకొచ్చి ఉంటే బతికేవాడని చెప్పడంతో ఆ తల్లిదండ్రుల రోధన మిన్నంటాయి. ఆగ్రహంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ప్రభుత్వ ఆ స్పత్రి వైద్యుల నిర్లక్ష్యంతోనే బాలుడి ప్రాణం పోయి ందని ఆరో పించారు. ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. విధి నిర్వాహణలో నిర్లక్ష్యం వహించిన వైద్యులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. -
పట్నం టికెట్ క్యామకే
యాచారం(ఇబ్రహీంపట్నం): ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్.. డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్‌కే ఇస్తామని, అందరూ సంపూర్ణ మద్దతు ప్రకటించి భారీ మెజార్టీతో గెలిపించాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. యాచారం మండల పరిధిలోని మాల్ సర్పంచ్ చిన్నోళ్ల పద్మజ(టీఆర్ఎస్)తో పాటు పలువురు వార్డు సభ్యులు, 150 మంది వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు సోమవారం గాంధీభవన్‌లో కాంగ్రెస్ గూటికి చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రాంత ప్రజలు మనోభావాలను పరిగణనలోకి తీసుకుని సోనియాగాంధీ తెలంగాణ ఇస్తే.. 2014 ఎన్నికల్లో మాయమాటలు చెప్పి కేసీఆర్ అధికారంలోకి వచ్చారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చకపోవడంతో పాటు అన్ని వర్గాల వారిని మోసం చేశారని మండిపడ్డారు. 2019లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని, ఇప్పటికే నిర్వహించిన అన్ని సర్వేలు దీన్ని ధ్రువీకరించాయని తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో కూడా 14 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తంచేశారు. 2014 ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసి, బహిష్కరణలకు గురైన వారితో చర్చించి సస్పెన్షన్ ఎత్తేసే విధంగా చూస్తున్నట్లు తెలిపారు. పార్టీ నుంచి విడిపోయిన ప్రతీ నాయకుడిని, కార్యకర్తను మళ్లీ ఆహ్వానించేందుకు ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ, కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ముదిరెడ్డి కోదండరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్, కాంగ్రెస్ యాచారం మండల అధ్యక్షుడు దెంది రాంరెడ్డి, కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి పడకంటి శేఖర్‌గౌడ్, కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు కాలె మల్లేశ్, ప్రధాన కార్యదర్శి లిక్కి పాండురంగారెడ్డి, నక్కర్తమేడిపల్లి సర్పంచ్ పాశ్ఛ భాషా, నాయకలు ఆడాల గణేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఇబ్రహీంపట్నంలో కరువు బృందం పర్యటన
ఇబ్రహింపట్నం : కరువు పరిస్థితులను అధ్యయనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక బృందం రంగారెడ్డి జిల్లలో పర్యటించింది. జిల్లాలోని ఇబ్రహీంపట్నం లో మంగళవారం పర్యటించిన బృందం పెద్ద చెరువు ప్రాంతాన్ని పరిశీలించి కరువుపై ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను తిలకించారు. అనంతరం గండిపేట చెరువును పరిశీలిస్తారు. చెరువు అలుగు మట్టం వివరాలు, గతంలో పరిస్థితిని అధికారులను అడిగి వివరాలు సేకరిస్తారు. ఆ తర్వాత మొయినాబాద్ మండలం కేసారం గ్రామంలో పత్తి పంటను పరిశీలించి రైతులతో మాట్లడతారు. అక్కడి నుంచి పరిగి మండలంలోని పత్తి పంటను, వికారాబాద్ లోని శివసాగర్ చెరువు పరిస్థితిని సమీక్షిస్తారు. -
వివాహిత ఆత్మహత్య
ఇబ్రహీంపట్నం: కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన రంగారెడ్డి జ్లిలా ఇబ్రహీంపట్నం మండలం ఉప్పరిగూడ గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున వెలుగుచూసింది. గ్రామానికి చెందిన సంతోష(23)కు మోహన్‌తో ఆరేళ్ల కిందట వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా.. సంతోష శుక్రవారం ఇంట్లో ఎవరులేని సమయంలో చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.