ICC anti corruption unit
-
టీ20 ప్రపంచకప్‌లో స్పాట్ ఫిక్సింగ్ కలకలం.. బంగ్లా క్రికెటర్‌తో
దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్‌లో స్పాట్ ఫిక్సింగ్ వార్తలు తీవ్ర కలకలం రేపాయి. ఈ మెగా టోర్నీలో ఫిక్సింగ్ కోసం ఓ బంగ్లాదేశీ ప్లేయర్‌ను బుక్కీలు సంప్రదించినట్లు సమాచారం. ఈ విషయాన్ని ప్రముఖ క్రీడా వెబ్సైట్ ఈఎస్పీన్ క్రిక్‌ఈన్‌ఫో వెల్లడించింది. అయితే ఆమె ఈ ఆఫర్‌ను తిరష్కరించి ఐసీసీ అవినీతి నిరోధక విభాగం ఫిర్యాదు చేసినట్లు ఈఎస్పీన్ తన నివేదికలో పేర్కొంది. అదే విధంగా ఇందుకు సంబంధించిన ఆడియో సంభాషణను బంగ్లాదేశ్‌కు చెందిన ఓ మీడియా సంస్థ విడుదల చేసినట్లు ఈఎస్పీన్ తెలిపింది. ఆ ఆడియో సంభాషణ ప్రకారం.. బుక్కీలకు ఆమెకు మరో మరో బంగ్లా ప్లేయర్ మధ్యవర్తిగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. కాగా ఫిబ్రవరి 14న ఆస్ట్రేలియా-బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్ తర్వాత ఈ స్పాట్ ఫిక్సింగ్‌కు సంబంధించిన వార్తలు వెలుగులోకి వచ్చాయి. ఇక ఈ విషయంపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ నిజాముద్దీన్ చౌదరి స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. "మేము ఇప్పటికే ఐసీసీ యాంటీ కరప్షన్ విభాగంకు ఫిర్యాదు చేశాం. ఐసీసీ దర్యాప్తు చేపడుతుంది. అయితే మా క్రికెటర్లకు ఫిక్సర్లు సంప్రదిస్తే.. వారికి ఏమో చేయాలో బాగా తెలుసు. ఈవెంట్ ప్రోటోకాల్ ప్రకారం ఐసీసీ అవినీతి నిరోధక విభాగం ఫిర్యాదు చేయాలని మా ప్లేయర్స్‌కు తెలుసు. ఇది బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు సంబంధించిన ఆంశం కాదు. అందుకే మేము ఈ విషయంపై ఎక్కువగా మాట్లాడాలని అనుకోలేదు. అంతా ఐసీసీ చూసుకుంటుందని"ఈఎస్పీన్‌తో పేర్కొన్నారు. ఇక టీ20 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ పేలవ ప్రదర్శన కనబరుస్తుంది. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ బంగ్లాదేశ్ ఓటమిపాలైంది. చదవండి: T20 WC: ప్రపంచకప్‌లో పాకిస్తాన్ బోణీ.. ఐర్లాండ్‌పై ఘన విజయం -
భారత సంతతి క్రికెటర్‌పై 14 ఏళ్ల నిషేధం
భారత సంతతికి చెందిన యూఏఈ క్రికెటర్ మెహర్ చాయ్కర్పై ఐసీసీ 14 ఏళ్ల నిషేధం విధించింది. ఫిక్సింగ్ ఆరోపణలతో పాటు అవినీతికి పాల్పడడం.. వీటితో పాటు ఐసీసీ నియమావళికి చెందిన ఏడు నిబంధనలు, కెనడా క్రికెట్ ఆంక్షలను ఉల్లఘించినందుకు గానూ మెహర్ చాయ్‌కర్ అన్ని ఫార్మాట్ల క్రికెట్ ఆడకుండా నిషేధం విధిస్తున్నట్లు ఐసీసీ బుధవారం పేర్కొంది. విషయంలోకి వెళితే.. 2018లో జింబాబ్వే, యూఏఈల మధ్య జరిగిన వన్డే మ్యాచ్‌తో పాటు అదే ఏడాది కెనడాలో జరిగిన గ్లోబల్ టి20 టోర్నీల్లో మెహర్ చాయ్‌కర్ బుకీలను సంప్రదించి ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఐసీసీ యాంటీ కరప్షన్ ట్రిబ్యునల్ మెహర్ చాయ్కర్ను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టింది. తమ విచారణలో మెహర్ చాయ్‌కర్ ఫిక్సింగ్‌కు పాల్పడింది నిజమేనని.. దీంతో పాటు క్రికెట్లో పలు నిబంధనలను గాలికొదిలేసినట్లు మా దృష్టికి వచ్చిందని యాంటీ ట్రిబ్యునల్ తెలిపింది. మెహర్‌పై వచ్చిన ఆరోపణలు నిజమని తేలడంతో అతనిపై 14 సంవత్సరాలు నిషేధం విధించినట్లు ట్రిబ్యునల్ పేర్కొంది. ఐసిసి జనరల్ మేనేజర్ అలెక్స్ మార్షల్ మాట్లాడుతూ.. "2018లో అజ్మాన్‌లో జరిగిన ఒక మ్యాచ్‌లో మెమర్ చాయ్‌కర్ తొలిసారి అవినీతికి పాల్పడినట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత బుకీలతో సంప్రదింపులు జరిపి మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడడం వంటివి చేశాడు. వీటిన్నింటిని పరిగణలోకి తీసుకొని అతనిపై 14 సంవత్సరాల నిషేధం విధించాం. క్రికెట్‌ను భ్రష్టు పట్టించడానికి ప్రయత్నించే ఆటగాళ్ల పట్ల కనికరం చూపించం. అవినీతికి పాల్పడేవారిపై ఇలాంటి కఠిన చర్యలే తీసుకుంటాం'' అని హెచ్చరించాడు. మెమర్ చాయకర్ ఉల్లఘించిన క్రికెట్ నిబంధనలు ఇవే.. ►ఆర్టికల్ 2.1.1 ప్రకారం ఏ విధంగానైనా కుట్రకు పాల్పడడం లేదా తప్పుగా ప్రభావితం చేయడం.. ఫిక్సింగ్‌కు పాల్పడడం ద్వారా ఒక అంతర్జాతీయ మ్యాచ్‌లో ఉద్దేశపూర్వకంగా తక్కువ ప్రదర్శన చేయడం ►ఆర్టికల్ 2.1.4 ప్రకారం.. ఒక ఆటగాడిని ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అభ్యర్థించడం, ప్రేరేపించడం, ప్రలోభపెట్టడం, సూచించడం, ఒప్పించడం ►ఆర్టికల్ 2.4.6 ప్రకారం విచారణకు సహకరించకుండా సమాధానాలు దాటవేయడం, తప్పును కప్పిపుచ్చుకోవడం ►ఆర్టికల్ 2.4.7 – ఏదైనా డాక్యుమెంటేషన్‌ను దాచిపెట్టడం, తారుమారు చేయడం లేదా నాశనం చేయడం.. దర్యాప్తును అడ్డుకోవడం లేదా ఆలస్యం చేయడం అయితే యూఏఈ క్రికెట్లో ఆటగాళ్లపై నిషేధం కొత్త కాదు. ఇప్పటికే నలుగురు యూఏఈ క్రికెటర్లు ఐసీసీ బ్యాన్‌ను ఎదుర్కొంటున్నారు. తొలిసారి మార్చి 2021లో యూఏఈ మాజీ కెప్టెన్ మహ్మద్ నవీన్‌తో పాటు బ్యాటర్ షైమన్ అన్వర్‌లపై ఐసీసీ ఎనిమిదేళ్ల నిషేధం ఉంది. ఆ తర్వాతి నెలలో మరో ఆటగాడు ఖదీర్ అహ్మద్‌పై ఐదు సంవత్సరాల నిషేధం.. గతేడాది సెప్టెంబర్‌లో ఐసీసీ నిబంధనలు ఉల్లఘించినందుకుగానూ యూఏఈ వికెట్ కీపర్ గులామ్ షబ్బీర్‌పై నాలుగేళ్ల నిషేధం పడింది. తాజాగా వీరి సరసన భారత సంతతికి చెందిన మెహర్ చాయ్‌కర్ వీరితో చేరాడు. చదవండి: ఫిట్నెస్ టెస్టులో క్లియరెన్స్.. ఆస్ట్రేలియాకు షమీ అంపైర్‌ను బూతులు తిట్టిన ఆరోన్ ఫించ్.. వీడియో వైరల్ -
భారత్-బంగ్లా మ్యాచ్‌పై విచారణ!
పాకిస్థాన్ మాజీ క్రికెటర్ డిమాండ్ కరాచీ: నరాలు తెగే ఉత్కంఠ మధ్య అత్యంత హోరాహోరీగా జరిగిన భారత్-బంగ్లాదేశ్ టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌పై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ ఒకరు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ మ్యాచ్‌పై ఐసీసీ అవినీతి నిరోధక విభాగం, భద్రతా యూనిట్ దర్యాప్తు జరపాల్సిన అవసరముందని పేర్కొన్నారు. పాక్ తరఫున 34 టెస్టులు, 70 వన్డేలు ఆడిన స్పిన్నర్ తౌసీఫ్ అహ్మద్ ఈ వ్యాఖ్యలు చేశారు. 'మ్యాచ్ ముగిసిన తీరు చూస్తే.. ఏదో జరిగినట్టు నాకు తోస్తుంది. ఐసీసీ అధికారులు దీనిపై విచారణ జరుపాల్సిన అవసరముందని అనిపిస్తోంది' అని ఆయన పేర్కొన్నాడు. మూడు వికెట్లు చేతిలో ఉండగా మూడు బంతుల్లో రెండు పరుగులు చేయాల్సిన స్థితిలో బంగ్లాదేశ్ ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది. బంగ్లాదేశ్ ప్రస్తుతం అనుభవరాహిత్యమున్న జట్టు కాదు. క్రీజులో వారికి అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఉన్నారు. అయినా ముందు ఒక సింగిల్ తీసి మ్యాచ్ టైకి ప్రయత్నించి.. ఆ తర్వాత భారీ షాట్ ఆడాల్సి ఉండగా.. అందుకు భిన్నంగా వారు ఎందుకు భారీ షాట్లకు ప్రయత్నించారో అర్థం కావడం లేదని ఆయన పేర్కొన్నారు. మరోవైపు స్లో బౌలింగ్ రేట్ కారణంగా బంగ్లాదేశ్‌పై ఐసీసీ జరిమానా విధించిన సంగతి తెలిసిందే.