Ice Cream 2
-
ఈ రెండో ‘ఐస్‌క్రీమ్’ఇంకా బాగుంటుంది
- వర్మ ‘‘ ‘ఐస్‌క్రీమ్’ సినిమా అంతా ఒకే ఇంట్లో చిత్రీకరించాం. కానీ ‘ఐస్‌క్రీమ్-2’ను మాత్రం అవుట్‌డోర్‌లో చాలామంది ఆర్టిస్టులతో తీశాం. మొదటి ‘ఐస్‌క్రీమ్’ కంటే, ఈ రెండో ‘ఐస్‌క్రీమ్’ ఇంకా బాగుంటుంది’’ అని రామ్‌గోపాల్‌వర్మ చెప్పారు. జేడీ చక్రవర్తి, నవీన, నందు, భూపాల్, సిద్దు ముఖ్య తారలుగా రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మించిన ‘ఐస్‌క్రీమ్-2’ ప్లాటినమ్ డిస్క్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ నెల 21న చిత్రాన్ని విడుదల చేస్తున్నామని నిర్మాత తెలిపారు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చిత్రాన్ని నిర్మించిన తుమ్మలపల్లిని జేడీ చక్రవర్తి అభినందించారు. ఈ కార్యక్రమంలో నందు, మల్టీ డెమైన్షన్ వాసు, ధన్‌రాజ్, సత్య, జేకే భారవి తదితరులు మాట్లాడారు. -
‘ఐస్‌క్రీమ్ 2 ’ మూవీ ప్లాటినం డిస్క్ ఫంక్షన్
-
'ఐస్ క్రీం 2' కిస్ మిక్స్ సాంగ్ ఆవిష్కరణ
-
ఐస్‌క్రీమ్-2 లో జెడి డిఫరెంట్ గెటప్
-
ఐస్ క్రీమ్ పై వర్మకు తగ్గని మోజు!
హైదరాబాద్: దర్శకుడు రాంగోపాల్ వర్మకు 'ఐస్ క్రీమ్' విజయాన్ని మజా చేస్తున్నట్టు కనిపిస్తోంది. సినీ విమర్శకులు, ప్రేక్షకులు ఐస్ క్రీమ్ పై పెదవి విరిచినా.. ఆ చిత్రం లాభాల్ని అందించిన ఉత్సాహంతో వర్మ సీక్వెల్ కు సిద్దమయ్యారు. త్వరలోనే ఐస్ క్రీమ్ 2 చిత్రాన్ని రూపొందిస్తానని మీడియాకు వెల్లడించారు. సినీ విమర్శకులు ఐస్ క్రీమ్ పై ప్రతికూలంగా స్పందించినప్పటికి..ఇటీవల ఆ చిత్ర సక్సెస్ మీట్ జరుపుకున్నారు. ఇప్పటికే ఐస్ క్రీమ్ 1.5 కోట్లు వసూలు చేసిందని... ఈ వారాంతానికి మరో 80 లక్షలు రావచ్చని అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా భారీగా శాటిలైట్ హక్కులు అమ్ముడు పోవచ్చని నిర్మాత టి. రామ సత్యనారాయణ అంచనా వేస్తున్నారు. ఐస్ క్రీమ్ లో నటించిన నటీనటులు, టెక్నిషియన్లకు ఎలాంటి పారితోషకం ఇవ్వకుండా.. లాభాలును పంచి ఇస్తామనే ఒప్పందంతో ఈ చిత్రాన్ని రూపొందించినట్టు సమాచారం.