ICT
-
ఐటీలో పరిశోధనలకు ప్రోత్సాహంపై ట్రాయ్ కసరత్తు
న్యూఢిల్లీ: టెలికం, బ్రాడ్‌కాస్టింగ్, ఐటీ రంగాల్లో పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలను ప్రోత్సహించే మార్గాలను అన్వేíÙంచడంపై టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా పరిశ్రమ వర్గాలతో సంప్రదింపుల కోసం చర్చాపత్రాన్ని విడుదల చేసింది. ఐసీటీ రంగంలో ఆర్అండ్డీ కార్యకలాపాల కోసం ప్రస్తుతమున్న విధానం సరిపోతుందా లేక ప్రత్యేక ఏజెన్సీ ఏదైనా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందా అనే విషయంపై అభిప్రాయాలను కోరింది. అలాగే, ప్రైవేట్ రంగం ఆర్అండ్డీని చేపట్టేలా ప్రోత్సహించేందుకు ట్యాక్స్ మినహాయింపులు, ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహకాలు వంటి విధానాలు ఎంత వరకు ఉపయోగకరంగా ఉంటాయనేది తెలపాలని సూచించింది. దీనితో పాటు పలు ప్రశ్నలను చర్చాపత్రంలో ట్రాయ్ పొందుపర్చింది. వాటిల్లో కొన్ని.. ► ఆర్అండ్డీ ప్రోగ్రామ్‌లకు తగినన్ని నిధులను, సకాలంలో మంజూరు చేసేందుకు పారదర్శకమైన విధానాన్ని అమలు చేయడానికి ఏమేమి చర్యలు తీసుకోవచ్చు? ► నవకల్పనల స్ఫూర్తిని పెంపొందించాలంటే రాష్ట్రాలకు ర్యాంకింగ్ విధానాన్ని అమలు చేస్తే ఉపయోగకరంగా ఉంటుందా? ► భారత్‌లో పేటెంట్ ఫైలింగ్ వ్యయాలను తగ్గించాల్సిన అవసరం ఉందా? ఒకవేళ సమాధానం అవును అయితే, ఎలా చేయొచ్చు? -
చట్టసభల నిర్వహణలో టెక్నాలజీ కీలకం
సాక్షి, అమరావతి: దేశ, రాష్ట్ర చట్టసభల్లో సాంకేతిక పరిజ్ఞానం కీలకపాత్ర పోషిస్తోందని రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం చెప్పారు. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ) వినియోగించడం ద్వారా కాగితం అవసరం లేకుండా చట్టసభలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలోను, శాసనమండలిలోను పూర్తిస్థాయిలో కంప్యూటరైజేషన్‌ను అమలు చేస్తున్నామన్నారు. టెక్నాలజీ ద్వారానే కోవిడ్ సమయంలో 15వ చట్టసభలనుద్దేశించి గవర్నర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించే వెసులుబాటు కలిగిందని చెప్పారు. కెనడాలో జరుగుతున్న 65వ కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్ వర్క్‌షాప్‌లో గురువారం ఆయన కీలకోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో శాసనసభ కార్యకలాపాలను, ప్రభుత్వ పాలన, ప్రజా సమస్యలు, రూల్ ఆఫ్ లా వంటి అంశాల్లో పాటిస్తున్న విధానాలను వివరించారు. చట్టాల రూపకల్పనలో సభ్యుల మధ్య జరిగే లోతైన చర్చలతో సరికొత్త విషయ ఆవిష్కరణ జరుగుతున్న తీరును తెలిపారు. దేశంలో లోక్‌సభ, రాజ్యసభల్లో టెక్నాలజీని పూర్తిస్థాయిలో వినియోగిస్తున్నారని, ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం రూ.738 కోట్లతో నేషనల్ ఈ–విధాన్ అప్లికేషన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిందని తెలిపారు. ఈ యాప్ ద్వారా పార్లమెంటు ప్రొసీడింగ్స్, ప్రశ్నోత్తరాలు, చర్చలు ఎప్పటికప్పుడు ప్రజలు తెలుసుకునే అవకాశం కల్పించినట్లు చెప్పారు. చట్టసభల నిర్వహణలో సోషల్ మీడియా కీలకపాత్ర పోషిస్తోందన్నారు. -
మైక్రోసాఫ్ట్ సహకారంతో ఐసీటీ ‘సైబర్ శిక్షా’
సాక్షి, హైదరాబాద్: సైబర్ సెక్యూరిటీ రంగంలో రానున్న మూడేళ్లలో లక్షల ఉద్యోగ అవకాశాలు రానున్నాయని మైక్రోసాఫ్ట్ ఫిలాంత్రోపీస్ విభాగపు అధ్యక్షులు కేట్ బెన్కెన్ చెప్పారు. వాటిని అందిపుచ్చుకునేందుకు తాము ఐసీటీ అకాడమీ భాగస్వామ్యంతో ‘సైబర్ శిక్షా’ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. దేశంలోని ఏడు రాష్ట్రాల్లో సుమారు 400 మంది అధ్యాపకులకు, ఆరువేల మంది ఉన్నత విద్యావంతులకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. మైక్రోసాఫ్ట్, ఐసీటీ మధ్య ‘సైబర్ శిక్షా’కు సంబంధించిన ఒప్పందం శుక్రవారం హైదరాబాద్‌లో కుదిరింది. ఈ సందర్భంగా కేట్ బెన్కెన్ మాట్లాడుతూ, 2025 నాటికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 35 లక్షల మంది సైబర్ సెక్యూరిటీ నిపుణుల అవసరం ఉంటుందని, ఒక్క భారత్‌లోనే ఈ సంఖ్య 15 లక్షల వరకూ ఉంటుందని చెప్పారు. అయితే ప్రస్తుతం ఈ డిమాండ్‌కు తగ్గట్లు నైపుణ్యమున్న వారు లేరన్నారు. ఐసీటీ అకాడమీ సీఈవో బాలచంద్రన్ మాట్లాడుతూ, సైబర్ సెక్యూరిటీలో మహిళలకు బాగా డిమాండ్ ఉందని, అందువల్ల శిక్షణకు ఎంపిక చేసేవారిలో 70 శాతం మంది మహిళలు ఉండే లా జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. దేశంలోని దాదాపు 1,200 విద్యాసంస్థలతో తాము శిక్షణకు సంబంధించిన ఒప్పందాలు చేసుకున్నామని, వీటిల్లో 86 తెలంగాణలో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ సీవీడీ రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
పశుగ్రాసం, ఎరువులుగా ఈకల వ్యర్థాలు
సాక్షి, న్యూఢిల్లీ: మానవ జుట్టు, ఉన్ని , పౌల్ట్రీ ఈకలవంటి కెరాటిన్ వ్యర్థాలను ఎరువులు, జంతువుల ఫీడ్లుగా తక్కువ ఖర్చులో మార్చేందుకు నూతన విధానాన్ని మన దేశ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దేశంలో ప్రతి సంవత్సరం భారీ మొత్తంలో మానవ జుట్టు, పౌల్ట్రీ ఈకల వ్యర్థాలు, ఉన్ని వ్యర్థాలు వెలువడతాయి. ఈ వ్యర్ధాలను డంప్ చేయడం, పాతిపెట్టడం, ల్యాండ్‌ఫిల్లింగ్ కోసం ఉపయోగించడం లేదా దహనం చేయడం ద్వారా పర్యావరణ ప్రమాదాలు, కాలుష్యం, ప్రజారోగ్యానికి ముప్పు, గ్రీన్‌హౌజ్ వాయు ఉద్గారాలు పెరుగుతున్నాయని గుర్తించారు. అంతేగాక ఈ వ్యర్థాల్లో ఉన్న అమైనో ఆమ్లాలు, ప్రోటీన్ వంటి వనరులను జంతువుల దాణాతో పాటు ఎరువుగా ఉపయోగించగలిగే సామర్థ్యం ఉందని నిపుణులు తెలిపారు. ముంబైకి చెందిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ ఎ. బి.పండిట్ తన విద్యార్థులతో కలిసి, కెరాటిన్ వ్యర్థాలను పెంపుడు జంతువుల ఆహారంగా, మొక్కలకు ఎరువులుగా వాడే సాంకేతికతను అభివృద్ధి చేశారు. వ్యర్థాలను విక్రయించదగిన ఎరువులు, పశుగ్రాసంగా మార్చేందుకు వారు అధునాతన ఆక్సీకరణ విధానాన్ని ఉపయోగించారు. -
ఐసీటీ సర్వీసులఎగుమతుల్లో భారత్ టాప్
ఐక్యరాజ్యసమితి: ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ) సర్వీసుల ఎగుమతుల్లో భారత్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఐక్యరాజ్యసమితి (యూఎన్) తాజా నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. దీని ప్రకారం.. భారత్ చాలా అంశాల్లో మెరుగైన ప్రదర్శన కనబరచింది. అలాగే మరికొన్ని వాటిల్లో అంత మంచి ర్యాంక్‌లను సాధించలేకపోయింది. గ్రాడ్యుయేట్స్ ఇన్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ కేటగిరిలో 10వ స్థానాన్ని, ఇ–పార్టిసిపేషన్‌లో 27వ స్థానాన్ని, గ్లోబల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కంపెనీస్‌లో 14వ స్థానాన్ని, గవర్నమెంట్ ఆన్లైన్ సర్వీసెస్‌లో 33వ స్థానాన్ని, జనరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో 32వ స్థానాన్ని, సృజనాత్మక వస్తువుల ఎగుమతుల్లో 18వ స్థానాన్ని, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ పేమెంట్స్‌లో 29వ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇక ఇండియా కొన్ని అంశాల్లో అంతగా మెప్పించలేకపోయింది. రాజకీయ స్థిరత్వం, భద్రతలో 106వ స్థానంలో ఉంది. వ్యాపార పరిస్థితుల్లో 121వ స్థానంలో, ఎడ్యుకేషన్‌లో 114వ స్థానంలో నిలిచింది. -
వైద్యం, సాంకేతికతలను మిళితం చేయాలి: ప్రణబ్
న్యూఢిల్లీ: వైద్య శాస్త్రాన్ని సమాచార సాంకేతికత శాస్త్రం(ఐసీటీ)తో సమ్మిళితం చేస్తే వైద్య రంగంలో గ్రామీణ భారతం, మారుమూల ప్రాంతాలు ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించడం వీలవుతుందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. వైద్యశాస్త్రవేత్తలు దీనిపై దృష్టి పెట్టాలని ఆయన కోరారు. అంతర్జాతీయ కరోనరీ కాంగ్రెస్‌ను ప్రణబ్ శనివారం ఢిల్లీలో ప్రారంభించారు. అక్కడ మాట్లాడుతూ వైద్య రంగంలో సాంకేతికతను ఉపయోగించడానికి ఇంకా ఎంతో అవకాశం ఉందని అన్నారు. -
యూకే వీసా పాలసీలో మార్పులు
లండన్: పెరిగిపోతున్న వలసదారుల సంఖ్యను తగ్గించేందుకు బ్రిటన్ ప్రభుత్వం వీసా పాలసీలో మార్పులు చేసింది. యూరోపియన్ యూనియన్(ఈయూ)కు చెందని దేశాల పౌరులకు వీసా నిబంధనలను మరింత కఠినతరం చేసింది. యూకే సర్కారు తాజా నిర్ణయంతో భారతదేశానికి చెందిన ఐటీ రంగ నిఫుణులపై ఎక్కువగా ప్రభావం పడనుంది. యునెటైడ్ కింగ్డమ్ హోం ఆఫీస్ ప్రకటించిన కొత్త వీసా నిబంధనల ప్రకారం.. టైర్ 2 ఇంట్రా కంపెనీ ట్రాన్సఫర్(ఐసీటీ) కేటగిరీ కింద నవంబర్ 24 తర్వాత వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారికి కనీస వార్షిక వేతనం 30,000 పౌండ్లు ఉండాలి. ఇప్పటి వరకూ ఇది 20,800 పౌండ్లుగా ఉంది. బ్రిటన్‌లోని భారత ఐటీ కంపెనీలు ఈ ఐసీటీ కేటగిరీనే ఎక్కువగా వినియోగించుకుంటున్నాయని, సుమారు 90 శాతం మంది భారత ఐటీ నిఫుణులు ఐసీటీ కిందే వీసా పొందారని యూకే మైగ్రేషన్ అడ్వయికమిటీ(ఎంఏసీ) ఇటీవల వెల్లడించింది. బ్రిటన్ ప్రధాని థెరెసా మే మూడు రోజుల పర్యటనకు ఆదివారం భారత్‌కు రానున్న నేపథ్యంలో వీసా మార్పుల ప్రకటన రావడం గమనార్హం. టైర్ 2 వీసా జారీకి సంబంధించి ఎంఏసీ సూచనల మేరకు మార్చిలో రెండు దశల మార్పులను యూకే ప్రభుత్వం ప్రారంభించింది. టైర్ 2 ఐసీటీతో పాటు ఇతర విభాగాల్లో కూడా వేతన పరిమితిని పెంచింది బ్రిటన్ ప్రభుత్వం. టైర్ 2(జనరల్) ఉద్యోగులకు కొన్ని మినహాయింపులతో 25,000 పౌండ్లు వేతనం ఉండాలని నిర్దేశించారు. ఇక ట్రైనీలుగా వచ్చే టైర్ 2(ఐసీటీ) గ్రాడ్యుయేట్ ట్రైనీల వేతన పరిమితి 23,000 పౌండ్లుగా నిర్ణరుుంచారు. దీంతోపాటు ఒక్కో కంపెనీ ఏటా 20 మందిని మాత్రమే ఇలా తీసుకురావాలని నిబంధన విధించారు. టైర్ 4 కేటగిరీలోనూ పలు మార్పులు చేశారు. -
హైదరాబాద్‌లో ‘ఐటీ ఆసియా’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రతిష్టాత్మక ఐటీ ఆసియా-2015 ప్రదర్శనకు హైదరాబాద్ వేదికవుతోంది. సెప్టెంబర్ 25 నుంచి మూడు రోజులపాటు హైటెక్స్‌లో ఈ కార్యక్రమం జరుగనుంది. తెలంగాణ ప్రభుత్వ సహకారంతో ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్స్ టెక్నాలజీ (ఐసీటీ) కంపెనీల సమాఖ్య అయిన ఎంఏఐటీ దీనిని నిర్వహిస్తోంది. టెక్నాలజీ రంగ సంస్థల వ్యాపార విస్తరణకు ఈ ప్రదర్శన దోహదం చేస్తుందని ఎంఏఐటీ ఈడీ అన్వర్ శిర్పూర్వాలా గురువారమిక్కడ తెలిపారు. తెలంగాణ ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్‌తో కలసి మీడియాతో మాట్లాడారు. ఐసీటీ హార్డ్‌వేర్ రంగంలో దేశీయంగా తయారీని పెంపొందించే చర్యల్లో భాగంగా ప్లాంట్లు పెట్టేలా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ఎంఏఐటీ ప్రోత్సహిస్తోందని చెప్పారు. విదేశీ కంపెనీలు తెలంగాణలో ప్లాంట్లు పెట్టేందుకు సుముఖత వ్యక్తం చేశాయన్నారు. ఐటీ ఆసియా కార్యక్రమం ద్వారా మరిన్ని ప్లాంట్లు ఇక్కడికి వచ్చే అవకాశం ఉందన్నారు. -
ముకేశ్ అంబానీకి ఐసీటీ డాక్టరేట్
న్యూఢిల్లీ: దేశీ వ్యాపార రంగానికి అందించిన సేవలకు గానూ రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ ముకేశ్ అంబానీకి ముంబైలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐసీటీ) డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. ముకేశ్ అంబానీ ఐసీటీలోనే 1979లో కెమికల్ ఇంజనీరింగ్‌లో బీఈ పూర్తిచేశారు. ఈయనకు ముందు ఈ డాక్టరేట్‌ను భారతరత్న అవార్డు గ్రహీత, ప్రపంచ ప్రసిద్ధ శాస్త్రవేత్త డా.సీఎన్ఆర్ రావు, ప్రముఖ రసాయన శాస్త్రవేత్త ఎంఎం శర్మతో పాటు మరొక వ్యక్తి పొందారు. -
321 పాఠశాలల్లో కంప్యూటర్ విద్య ఎత్తివేత
హైటెక్ ఏలికల పాలనలో కంప్యూటర్ విద్య.. మిథ్యగా మారింది. ప్రభుత్వ పాఠశాలల్లో నిరుపేద విద్యార్థులకు కంప్యూటర్ విద్యను అందించే లక్ష్యంతో చేపట్టిన పథకాన్ని పాలకులు కొంతకాలంగా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఫలితంగా జిల్లాలోని 321 పాఠశాలల్లో కంప్యూటర్ విద్య విద్యార్థులకు దూరమైంది. ఇందుకోసం ఏర్పాటు చేసిన కోట్లాది రూపాయల కంప్యూటర్ పరికరాలు నిరుపయోగంగా మారి, మూలనపడ్డాయి. కొత్తపేట :పాఠశాలల్లో కంప్యూటర్ విద్యపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తూం డడం విద్యార్థులకు శాపంగా మారింది. గడచిన రెండేళ్లలో జిల్లాలోని 321 పాఠశాలల్లో కంప్యూటర్ విద్యను దశలవారీగా ఎత్తివేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ (ఐసీటీ) స్కీమ్ కింద రాష్ట్రంలోని వెయ్యి పాఠశాలల్లో 2002లో తొలివిడతగా కంప్యూటర్ విద్యను ప్రవేశపెట్టారు. అప్పట్లో జిల్లాలోని 53 పాఠశాలల్లో ఇది ఆరంభమైంది. ‘కార్పొరేట్’కు దీటుగా సామాన్య విద్యార్థులు కూడా ఎదగాలని భావించిన నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కంప్యూటర్ విద్యను మరిన్న పాఠశాలలకు విస్తరించారు. మారుమూల గ్రామాల్లోని పాఠశాలల్లో సైతం దీనిని అందుబాటులోకి తెచ్చారు. ఇందులో భాగంగా ఐసీటీ రెండో దశ కింద 2008 సెప్టెంబర్‌లో జిల్లాలోని మరో 321 పాఠశాలల్లో కంప్యూటర్ విద్యను అందుబాటులోకి తెచ్చారు. మూడో దశ కింద 2010 జనవరిలో మరో 66 పాఠశాలల్లో దీనిని ప్రారంభించారు. కంప్యూటర్ విద్యకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తూ నిర్వహణ బాధ్యతను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించింది. కంప్యూటర్ విద్య కోసం ప్రతి పాఠశాలకు 11 మోనిటర్లు, 5 ఐదు యూపీఎస్‌లు, మూడు సీపీయూలు, ఒక జనరేటర్, ఒక ప్రింటర్ సమకూర్చారు. ఇంటర్నెట్ సౌకర్యం కల్పించారు. ఇద్దరు ఫ్యాకల్టీలను నియమించారు. అవసరమైన ఫర్నిచర్ కూడా అందించారు. రెండో దశపై చిన్నచూపు కంప్యూటర్ విద్య 1, 3 దశలు బాగానే అమలవుతున్నా, రెండు దశలోని 321 పాఠశాలలపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. రెండో దశకు సంబంధించి ప్రైవేటు ఏజెన్సీలతో ఐదేళ్లకు కుదుర్చుకున్న ఒప్పందం 2013 సెప్టెంబర్‌తో పూర్తయింది. దీనిని పునరుద్ధరించకపోవడంతో ఆయా ఏజెన్సీలు కంప్యూటర్లను పాఠశాలలకు అప్పగించాయి. ఫ్యాకల్టీలను తొలగించాయి. ఫలితంగా జిల్లాలోని 321 పాఠశాలల్లో కంప్యూటర్ విద్యకు తెర పడినట్లయింది. కంప్యూటర్లు మూలన పడ్డాయి. మూడో దశ అమలవుతున్న 66 పాఠశాలల్లో కూడా వచ్చే జూన్‌తో కాంట్రాక్ట్ పూర్తి కానుంది. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం కంప్యూటర్ విద్య గురించి పట్టించుకోవడంలేదు. ఫలితంగా పేద విద్యార్థులకు కంప్యూటర్ విద్య అందడంలేదు. మరోపక్క కోట్ల రూపాయల విలువైన కంప్యూటర్లు నిరుపయోగంగా మారి, మూలకు చేరుతున్నాయి. కొనసాగించాలి కంప్యూటర్ విద్యను కొనసాగించాలని పలువురు విద్యార్థులు కోరుతున్నారు. విద్యా వలంటీర్ల మాదిరిగా ఫ్యాకల్టీలను నియమించి, కంప్యూటర్ విద్యను అందించాలని పలువురు సూచిస్తున్నారు. వాస్తవానికి ఫ్యాకల్టీ వద్ద ఆయా పాఠశాలల్లోని ఇద్దరు ఉపాధ్యాయులు ఐదేళ్లపాటు శిక్షణ పొందాలి. అనంతరం వారు ఆ పాఠశాలలో కంప్యూటర్ విద్యను బోధించాలి. ఇలా శిక్షణ పొందినట్టు పాఠశాలల రికార్డుల్లో పేర్కొన్నారు కానీ, వాస్తవానికి చాలాచోట్ల అలా శిక్షణ పొందిన దాఖలాల్లేవు. తమ రెగ్యులర్ తరగతులకు ప్రాధాన్యం ఇస్తూ కంప్యూటర్ విద్యను వారు పక్కన పెట్టేశారు. నియోజకవర్గ కథనాలు జోన్ పేజీల్లో..