న్యూఢిల్లీ: వైద్య శాస్త్రాన్ని సమాచార సాంకేతికత శాస్త్రం(ఐసీటీ)తో సమ్మిళితం చేస్తే వైద్య రంగంలో గ్రామీణ భారతం, మారుమూల ప్రాంతాలు ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించడం వీలవుతుందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. వైద్యశాస్త్రవేత్తలు దీనిపై దృష్టి పెట్టాలని ఆయన కోరారు. అంతర్జాతీయ కరోనరీ కాంగ్రెస్‌ను ప్రణబ్ శనివారం ఢిల్లీలో ప్రారంభించారు. అక్కడ మాట్లాడుతూ వైద్య రంగంలో సాంకేతికతను ఉపయోగించడానికి ఇంకా ఎంతో అవకాశం ఉందని అన్నారు.