breaking news
Idli Kottu Movie
-
ఆకట్టుకునేలా ధనుష్ 'ఇడ్లీ కొట్టు' ట్రైలర్
ధనుష్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన సినిమా 'ఇడ్లీ కొట్టు'. అక్టోబరు 01న తెలుగు, తమిళ భాషల్లో థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ జరుగుతున్నాయి. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. పూరి గుడిసెలో ఉండే ఓ ఇడ్లీ కొట్టు బ్యాక్ డ్రాప్లో సాగే ఓ ఎమోషనల్ జర్నీలా అనిపిస్తుంది. నిత్యామేనన్, అరుణ్ విజయ్, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.(ఇదీ చదవండి: 'ఇలాంటి సినిమా మీరెప్పుడూ చూసుండరు'.. టాక్ ఏంటి?)ట్రైలర్ బట్టి చూస్తే మురళి(ధనుష్) తండ్రికి సొంతూరిలో చిన్న ఇడ్లీ కొట్టు ఉంటుంది. అదంటే ఆయనకు ఎంతో ప్రాణం. తండ్రిని చూస్తూ పెరిగిన మురళి.. పెరిగి పెద్దయ్యాక ఓ పెద్ద ఫుడ్ కంపెనీలో జాబ్ సాధిస్తాడు. అక్కడ పనైతే చేస్తుంటాడు గానీ మనసంతా ఊరిలో తమ ఇడ్లీ కొట్టుపైనే ఉంటుంది. తండ్రి తదనంతరం దాన్ని మూసేస్తారు. పెద్ద జాబ్ చేసుకునే మురళి.. ఊరికొచ్చి మళ్లీ తమ ఇడ్లీ కొట్టు ఎందుకు తెరిచాడు? ఈ స్టోరీలో విలన్ ఎవరు? అనేదే మిగతా స్టోరీలా అనిపిస్తుంది.సెప్టెంబరు 25న తెలుగులో ఓజీ సినిమా రానుంది. దీనిపై అంచనాలు ఉన్నాయి. అలానే అక్టోబరు 2న పాన్ ఇండియా మూవీ 'కాంతార' సీక్వెల్ రాబోతుంది. ఈ రెండింటికి పోటీగా ధనుష్ 'ఇడ్లీ కొట్టు' చిత్రాన్ని బరిలో దింపుతున్నాడు. ఎమోషనే ప్రధానంగా తీసిన ఈ సినిమా.. ట్రైలర్ బట్టి చూస్తుంటే ప్రేక్షకుల మనసు గెలుచుకునేలా కనిపిస్తుంది. మరి 'ఇడ్లీ కొట్టు'.. పోటీలో ఉన్న మిగతా సినిమాలపై ఏ మేరకు ప్రభావం చూపిస్తుందో?(ఇదీ చదవండి: రీతూ బండారం బట్టబయలు.. పవన్ కెప్టెన్సీ ఫసక్) -
'ఇడ్లీ కొట్టు' టైటిల్ ఎందుకు పెట్టామంటే..: ధనుష్
నటుడు ధనుష్ తాజాగా స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా నటించిన చిత్రం ఇడ్లీ కడై (ఇడ్లీ కొట్టు). నటి నిత్యామీనన్ నాయకిగా నటించారు. శాలిని పాండే, సత్యరాజ్, అరుణ్‌విజయ్, రాజ్‌కిరణ్, పార్తీపన్, సముద్రఖని తదితరలు ముఖ్య పాత్రలు పోషించారు. డాన్ పిక్చర్స్, వండర్‌బార్ ఫిలింస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి జీవీ.ప్రకాశ్‌కుమార్ సంగీతాన్ని అందించారు. కాగా నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబర్1వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమా విడుదల సందర్భంగా నటుడు ధనుష్ మాట్లాడుతూ ఈ చిత్రానికి ఇడ్లీ కొట్టు అని పేరు పెట్టడానికి కారణం గురించి చెబుతూ చిన్నతనంలో తనకు రోజూ ఇడ్లీ తినాలని ఆశగా ఉండేదన్నారు. అయితే చేతిలో డబ్బు ఉండేది కాదన్నారు. దీంతో తోటల్లో పూలు కోసే పనికి వెళితే రోజుకు రూ. 2 లేదా 2.50 రూపాయలు ఇచ్చేవారన్నారు. ఆ డబ్బుతో నాలుగు లేదా ఐదు ఇడ్లీ వస్తే కొనుక్కుని తినేవాడినన్నారు. ఆ ఇడ్లీ రుచి ఇప్పుడు పెద్ద పెద్ద ఫైవ్‌స్టార్ హోటళ్లలోనూ లభించడం లేదన్నారు. ఆ ఇడ్లీ కొట్టు ఇతి వృత్తంతో చిత్రం చేయాలని అనిపించిందన్నారు. అలా నిజమైన కథ, నిజమైన పాత్రలతో చిత్రం చేసినట్లు ధనుష్ చెప్పారు. అదే విధంగా తన హేటర్స్ గురించి స్పందిస్తూ అసలు హేటర్స్ అనే కాన్సెప్టే పరిశ్రమలో లేదన్నారు. అలాంటి వారు కూడా ఇక్కడ లేరన్నారు. అందరూ అన్ని చిత్రాలు చూస్తుంటారని, అలాంటిది హేటర్స్ ఎవరని చెప్పాలంటూ పేర్కొన్నారు. అయితే ఒక 30 మంది తమ జీవనం కోసమో లేదా మరేదైనా ఆశించో 300 ఐడియాలతో ఏదైనా తప్పుడు ప్రచారం చేయడమే హేట్ అని తెలిపారు. ఆ 30 మంది కూడా చిత్రాలను చూస్తారని ధనుష్ పేర్కొన్నారు. ఇకపోతే ఈ వేదికపై మాట్లాడిన నటుడు పార్తీపన్ నటుడు ధనుష్‌ను సకలకళావళ్లభుడిగా పేర్కొన్నారు. ఇక ఆయన అభిమానులైతే యువ సూపర్‌స్టార్ అంటూ పోస్టర్లతో ప్రచారం చేశారు. -
నేను ధనుష్‌ని వెన్నుపోటు పొడవలేను: జీవీ
డబ్బింగ్ సినిమాల మూలాన తమిళ హీరోహీరోయిన్లతో పాటు టెక్నిషియన్లు కూడా తెలుగు ప్రేక్షకులకు చాలావరకు పరిచయమైపోతున్నారు. పాన్ ఇండియా మూవీస్ వల్ల చాలామంది కోలీవుడ్.. మన దగ్గర పనిచేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇలాంటి వారిలో సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్ ఒకడు. తెలుగు, తమిళంలో పలు చిత్రాలు సంగీతమందిస్తూ బిజీగా ఉండే ఇతడు.. ఇప్పుడు ఓ సీక్రెట్ బయటపెట్టాడు. ధనుష్‌ని తాను వెన్నుపోటు పొడవలేనని చెప్పుకొచ్చాడు.ధనుష్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన లేటెస్ట్ సినిమా 'ఇడ్లీ కడై'. దీన్ని 'ఇడ్లీ కొట్టు' పేరుతో తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నారు. అక్టోబరు 01న థియేటర్లలోకి రానుంది. నిన్న అంటే ఆదివారం ఈ చిత్ర ఆడియో లాంచ్ ఈవెంట్ చెన్నైల్లో గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకలోనే మాట్లాడిన సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్.. గతేడాది రిలీజైన ధనుష్ 'రాయన్'లో తనకు నటించే అవకాశం వచ్చిందని, కానీ దాన్ని వద్దనుకున్నట్లు చెప్పాడు.(ఇదీ చదవండి: Bigg Boss 9 తెలుగు 2వ వారం నామినేషన్స్‌లో ఎవరెవరంటే?)'రాయన్ మూవీలో తమ్ముడి పాత్ర చేయమని ధనుష్ నన్ను మొదట అడిగారు. అయితే ఆ పాత్ర ధనుష్ పాత్రని వెన్నుపోటు పొడుస్తుంది. ఆ పాయింట్ నచ్చక నేను నో చెప్పేశాను. సినిమాలో కూడా నా స్నేహితుడిని మోసం చేసే పాత్రని చేయను' అని జీవీ ప్రకాశ్ కుమార్ చెప్పుకొచ్చాడు. ఇప్పడు ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 'రాయన్'లో ధనుష్ తమ్ముళ్లుగా కాళిదాస్, సందీప్ కిషన్ నటించారు. ఇందులో ఓ పాత్రనే జీవీ చేయాల్సింది కానీ వద్దనేశాడనమాట.ఇకపోతే 'ఇడ్లీ కొట్టు' సినిమా.. పూర్తిగా ఎమోషన్స్ బేస్ చేసుకుని తీశారు. ధనుష్, నిత్యామేనన్, సత్యరాజ్, అరుణ్ విజయ్, షాలినీ పాండే లీడ్ రోల్స్ చేశారు. దసరా కానుకగా తెలుగు, తమిళంలో థియేటర్లలో రిలీజ్ అవుతుంది. దీనికి ఐదు రోజుల ముందు పవన్ కల్యాణ్ 'ఓజీ', ఓ రోజు తర్వాత 'కాంతార' సీక్వెల్ విడుదల కానున్నాయి. మరి వీటితో నిలబడి బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి?(ఇదీ చదవండి: రూ.100 కోట్లకు చేరువలో 'మిరాయ్' కలెక్షన్) -
రిలీజ్‌కి సిద్ధమైన ధనుష్ 'ఇడ్లీ కొట్టు'
తమిళ హీరో ధనుష్‌కి తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. దీంతో ఎప్పటికప్పుడు ఇతడి సినిమాలు ఇక్కడ కూడా రిలీజ్ అవుతుంటాయి. ఇప్పుడు కొత్త మూవీని రెడీ చేశాడు. ధనుష్ లీడ్ రోల్ చేస్తూ దర్శకత్వం వహించిన చిత్రం 'ఇడ్లీ కడై'. దీన్ని తెలుగులో 'ఇడ్లీ కొట్టు' పేరుతో తీసుకురానున్నారు. ఈ మేరకు తాజాగా పోస్టర్ రిలీజ్ చేసి అధికారికంగా ప్రకటించారు.(ఇదీ చదవండి: స్టార్ కొరియోగ్రాఫర్.. సైకో పాత్రలతో కేరాఫ్.. ఇతడెవరో తెలుసా?)పవన్ కల్యాణ్ 'ఓజీ'.. సెప్టెంబరు 25న థియేటర్లలోకి రానుంది. ఇదొచ్చిన ఐదు రోజులకే 'ఇడ్లీ కొట్టు' థియేటర్లలోకి వస్తుంది. దీని తర్వాత రోజున 'కాంతార' ప్రీక్వెల్ విడుదల కానుంది. చూస్తుంటే ఈసారి దసరాకు బాక్సాఫీస్ దగ్గర మంచి సందడిగా ఉండనుందని అర్థమైపోతోంది. 'ఇడ్లీ కొట్టు' సినిమా పూర్తిగా కంటెంట్, ఎమోషన్స్‌పై ఆధారపడి తీశారు. ధనుష్, నిత్యామేనన్, అరుణ్ విజయ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.(ఇదీ చదవండి: 'మిరాయ్'లో శ్రీరాముడు ఇతడే.. ఈ నటుడు ఎవరో తెలుసా?)