iit student suicide
-
అసలు ఐఐటీలో ఏముంటుంది? ఎందుకు చేర్పించాలి? ఏం నేర్చుకుంటారు?
ఐఐటీలో ఇటీవల జరుగుతున్న ఘటనలు, వివిధ వార్తల నేపథ్యంలో ఒక ఐఐటీ విద్యార్థి పేరుతో Sripati Nagaraju ఫేస్ బుక్‌లో రాసిన అభిప్రాయాన్ని పాఠకులతో షేర్ చేసుకుంటున్నాం. తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది తల్లితండ్రులు తమ పిల్లలను ఐఐటీల్లో చేర్పించాలన్న తపన పడుతుంటారు. ఇటీవల ఐఐటీల్లో వరుసగా విద్యార్థులు ఆత్మహత్యల ఘటనలకు సంబంధించిన వార్తలతో కొందరు అసలు ఏం జరుగుతుందని తెలుసుకుంటున్నారు. అలాంటి వారందరూ తెలుసుకోవాల్సిన విషయం ఇది. ఒక ఐఐటీ విద్యార్థి అభిప్రాయం IIT లు సృజనాత్మకతకు కేంద్రాలు. ఒక క్రియేటర్ గా ఉండాలనుకున్నవాడికి , ఐఐటీలో వాడి కులమే గుర్తుండదు.. పక్కవాడి కులంతో పనేలేదు. ఒత్తిడి అనేది IITలలో కో కరిక్యులర్, ఎక్సట్రా కరిక్యులర్ యాక్టివిటిస్‌లో, క్లబ్స్‌లో పాల్గొనకుండా నా రూమ్ లో నేను తెగ చదివేసుకుంటాను అనేవాడికి ఉంటుంది. అసలు అలాంటివాళ్ళు IIT లకు పనికి రారు అని అడ్మిషన్ అయిన మొదటిరోజు జరిగే ఓరియంటేషన్ క్లాస్ లోనే ప్రొఫెసర్లు చెప్తారు. Drop outs : వరసగా ఏవైనా రెండు సెమిస్టర్లలో 5 GPA కంటే తక్కువ వస్తే ఆటోమేటిక్ గా రోల్స్ నుండి ఔట్ అవుతారు. Hindi, English లలో నైపుణ్యం పెంచుకోకుండా , సెల్ఫ్ స్టడీ అలవాటు చేస్కోకుండా, క్రియేటివ్ స్కిల్స్ డెవలప్ చేసుకోకుండా ఉండే స్టూడెంట్ డ్రాప్ అవడానికి అవకాశం ఎక్కువ. Games ఆడకపోవటం వలన ఫిజికల్ ఫిట్నెస్ తగ్గొచ్చేమోగానీ, గెలుపు ఓటములను సమానంగా తీసుకునే తత్వం IITiansకి ఉంటుంది కు ప్రిపేర్ అయ్యే క్రమంలో రాసే వందల ప్రాక్టీస్ టెస్టులు ప్రతీదీ ఒక ఆటే. అందులో తగ్గడం, పడిలేచిన కెరటంలా ఎదగటం మేం నేర్చుకుంటున్నాం. నేర్చుకున్నాం. ఇక IITలలో చేరినాక జిమ్‌లో మన ఫిట్నెస్ పెంచుకోవచ్చు. నచ్చిన స్పోర్ట్స్ ఎంచుకొని ఆడుకోవచ్చు. ప్రిపరేషన్లో భాగంగా హాస్టల్స్ లో ఉండే విద్యార్థులకు హ్యపీ ఎంజైమ్స్ రిలీజ్ అవకపోవటం అంటూ ఉండదు. మా ఫన్ మాకు ఉంటుంది. ఇంట్లో కుటుంబ సభ్యులను మిస్ అయినా , చాలా మంది స్నేహితుల ద్వారా ఆ లోటు పూరించుకుంటూ పరీక్షకు చదువుకుంటాం. కాబట్టి ఆ లోటు మాకు లేదు. యూనివర్శిటీలలో కుల వివక్ష ఉండొచ్చేమోగానీ, అత్యుత్తమ IIT లలో కులం తో సాధించేదేమీ లేదు, స్కాలర్ షిప్ తప్ప. అసలు అడ్మిషన్ కోసమే IIT Rank అవసరం. కానీ ఒకసారి అడ్మిట్ అయ్యాక మనకొచ్చిన ర్యాంకు నాలుక గీస్కోటానికి కూడా పనికిరాదు. అసలు IIT లలో నీ ర్యాంకు ఎంత అని అడిగేవాడే ఉండడు. ఈ ర్యాంకు వల్ల విద్యార్థుల్లో ఆత్మన్యూనతకి అవకాశమేలేదు. IIT లో Ph.D లాంటి మహోత్కృష్ఠమైన కోర్స్ లో చేరినవాడు కూడా ఆత్మహత్య చేస్కున్నాడూ అంటే వాడు ఐడియాలజికల్‌గా ఎంతో వెనకబడి ఉన్నాడని అర్థం. దానికీ అసలు ఒత్తిడి అనేమాటే ఉండదు. ప్రేమ వ్యవహారాలు, కుటుంబ కలహాలు, తల్లిదండ్రుల ప్రవర్తన, ఇలా ఎన్నో పార్శ్వాలు ఆత్మహత్యల వెనక ఉంటాయి. IITల శిక్షణ పేరిట వేల కోట్ల వ్యాపారం జరగొచ్చు గాక. అది IITల బయట విషయం. దానికీ IITలకి సంబంధం లేదు. కార్పొరేట్ కాలేజీలు రాకముందు కూడా 1954 నుండే IIT లు ఉన్నాయి. కార్పొరేట్ వ్యాపార దాహానికి ప్రతిష్టాత్మక IIT లకు సంబంధం లేదు. కార్పోరేట్ కాలేజీల్లో చేర్పిస్తేనే మా IIT లో అడ్మిషన్ ఇస్తాం అని ఏ ఒక్క IIT కూడా చెప్పదు. విద్యార్థి ఇష్టాయిష్టాలు, శక్తి సామర్థ్యాల ప్రకారం తల్లితండ్రులు తమ పిల్లల భవిష్యత్తును ప్లాన్ చేయాలి. అంతే తప్ప దానికి భిన్నంగా ప్రవర్తించవచ్చు. దురాశ దుఃఖానికి చేటు అనేది ఉండనే ఉంది. అది ఏ రంగం కైనా వర్తిస్తుంది. IIT కి ఒక్కదానికే కాదు. -
హైదరాబాద్ ఐఐటీ విద్యార్థి ఆత్మహత్య
-
ఒత్తిడి తట్టుకోలేకపోతున్నాను
సంగారెడ్డి రూరల్: ‘మానసిక ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నాను.. ఈ రోజు ఆత్మహత్య చేసుకుంటున్నాను’ అని లెటర్ రాసి మిత్రుడికి మెయిల్ చేసిన ఐఐటీ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సంగారెడ్డి జిల్లా కంది శివారులోని ఐఐటీ హైదరాబాద్‌లో ఈ సంఘటన చోటుచేసుకుందని రూరల్ ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. ఏపీలోని గుంటూరు జిల్లా తెనాలికి చెందిన రాజన్ కుటుంబం హైదరాబాద్‌లోని తిరుమలగిరిలో నివాసం ఉంటోంది. రాజన్ కుమారుడు అనిరుధ్య (21) కంది ఐఐటీ హైదరాబాద్‌లోని డీ బ్లాక్‌లో గల హాస్టల్లో ఉంటూ బీటెక్ మెకానికల్ అండ్ ఏరోస్పేస్ కోర్సు ఫైనలియర్ చదువుతున్నాడు. కాగా, అనిరుధ్య.. మానసిక ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నానని లెటర్ రాసి గురువారం రాత్రి 12 గంటల సమయంలో మిత్రుడు కనిష్క్‌రెడ్డికి మెయిల్ చేశాడు. అనంతరం హాస్టల్ ఏడో అంతస్తు పైకి చేరుకుని భవ నంపై నుంచి కిందికి దూకేశాడు. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలు కావ డంతో అనిరుధ్యకు ఐఐటీలోని ఆస్పత్రిలో ప్రథమచికిత్స అందించి మెరుగైన చికిత్స కోసం సంగారెడ్డిలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఇదిలా ఉండగా... మృతుడి తండ్రి రాజన్ మాట్లాడుతూ ఈ మధ్యే తన కుమారుడు సెలవుపై ఇంటికి వచ్చి వెళ్లాడని, ఇంతలోనే ఏం జరిగిందో అంతుబట్టడంలేదన్నారు. ప్రమాదానికి ముందు అనిరుధ్య టెర్రస్‌పైకి వెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయినట్లు ఎస్ఐ తెలిపారు. ఐఐటీ క్యాంపస్ సెక్యూరిటీ అధికారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
గువాహటిలో తెలుగు విద్యార్థి ఆత్మహత్య
గువాహటి : అసోంలో తెలుగు విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాలు.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పన్నెం పవన్ సిద్దార్థ.. గువాహటి ఐఐటీలో ఇంజనీరింగ్(ఈసీఈ) ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. అక్కడి కాలేజీ హాస్టల్లో బస చేస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం అతడితో మాట్లాడేందుకు కుటుంబ సభ్యులు ఫోన్ చేయగా అతడు లిఫ్ట్ చేయలేదు. దీంతో అనుమానం వచ్చిన సిద్దార్థ తల్లిదండ్రులు అతడి స్నేహితులకు ఫోన్ చేశారు. ఈ క్రమంలో వారు సిద్దార్థ గదికి వెళ్లి చూడగా ఫ్యాన్‌కు ఉరివేసుకుని కన్పించాడు. దీంతో వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే సిద్దార్థ మృతి చెందాడని వైద్యులు పేర్కొన్నారు. కాగా సిద్దార్థ ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. అతడి తల్లిదండ్రులు గువాహటి చేరుకున్న తర్వాత పోస్ట్‌మార్టం నిర్వహించనున్నట్లు సమాచారం. -
కోటలో మరో విద్యార్థి ఆత్మహత్య
కోట: ఐఐటీ కోచింగ్ తీసుకుంటున్న మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కోటలో చోటు చేసుకుంది. బిహార్ శివాన్ జిల్లాలోని హర్దోబరకు చెందిన జితేశ్ (17) గుప్తా ఐఐటీ–జేఈఈ ప్రవేశ పరీక్ష కోసం మూడేళ్లుగా ఇక్కడి ఇన్స్టిట్యూట్లో సన్నద్ధం అవుతున్నాడు. మంగళవారం హాస్టల్లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని మహావీర్ నగర్ పోలీస్ స్టేషన్ ఎస్సై ఈశ్వర్ సింగ్ వెల్లడించారు. కాగా ఐదు రోజుల్లో ఇది మూడో ఆత్మహత్య కావడం గమనార్హం. ‘జితేశ్ తల్లిదండ్రులు అతనికి ఫోన్ చేయగా అతని నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో వారు తన స్నేహితునికి ఫోన్ చేశారు. కిటికీలోంచి జితేశ్ ఫ్యాన్‌కు వేలాడి ఉండటం చూసిన అతని స్నేహితుడు అధికారులకు సమాచారం అందించాడు’అని తెలిపారు. అయితే పోలీసులు జితేశ్ ఆత్మహత్యకు గల కారణాలకు సంబంధించి ఎటువంటి సూసైడ్ నోట్ లభ్యం కాలేదన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ఖుషినగర్‌కు చెందిన దీక్షా సింగ్ (17) అనే నీట్ విద్యార్థిని ఆదివారం ఆత్మహత్య చేసుకుంది. మరో ఐఐటీ అభ్యర్థి దీపక్ దదీచ్ (16) శనివారం మధ్యాహ్నం కోచింగ్ ఇన్స్టిట్యూట్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో ఈ ఏడాదిలో కోటలో ఆత్మహత్య చేసుకున్న వారి సంఖ్య జితేశ్‌తో కలిపి 19 మందికి చేరింది. -
నన్ను నిద్రపోనివ్వండి అంటూ శాశ్వతంగా..
అతడు ప్రతిష్ఠాత్మకమైన ఐఐటీ ఖరగ్‌పూర్‌లో చదువుతున్నాడు. ఏరోస్పేస్ ఇంజనీరింగ్ నాలుగో సంవత్సరంలో ఉన్నాడు. మరికొన్ని నెలలు ఆగితే బ్రహ్మాండమైన బంగారు భవిష్యత్తు అతడి ముందు ఉంది. కానీ.. 'నన్ను పడుకోనివ్వండి' అంటూ ఒక లేఖ రాసి శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయాడు. నెహ్రూహాల్ బి బ్లాకులోని తన గదిలో సీలింగ్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కేరళకు చెందిన ఎన్ నిధిన్ (22) మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టంకు పంపారు. ఈ సంవత్సరంలో ఐఐటీ ఖరగ్‌పూర్‌లో విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం ఇది మూడోసారి. ఒక నెలలోనే ఇది రెండో ఆత్మహత్య. నిధిన్ ప్రతిరోజూ అర్ధరాత్రి 2 గంటలకు అలారం పెట్టుకుని లేచి అప్పటినుంచి చదువుకునేవాడని పోలీసులు తెలిపారు. శుక్రవారం అర్ధరాత్రి అలారం ఎంతకూ ఆగకపోయేసరికి హాస్టల్లో ఉన్న ఇతర విద్యార్థులు ఏదో ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానించారు. వాళ్లు అతడి గదికి వెళ్లి తలుపు కొట్టినా ఎంతకీ తలుపు తీయలేదు. శుక్రవారం కూడా కనిపించకపోయేసరికి హాస్టల్ అధికారులకు చెప్పారు. కిటికీ అద్దాలు పగలగొట్టి చూస్తే.. అతడు సీలింగ్‌కు వేలాడుతూ కనిపించాడు. వెంటనే దగ్గర్లో ఉన్న హిజ్లీ ఔట్‌పోస్టులో పోలీసులకు సమాచారం తెలిపారు. ఖరగ్‌పూర్ అదనపు ఎస్పీ అక్కడకు వచ్చి, తలుపులు పగలగొట్టి నిధిన్ మృతదేహాన్ని కిందకు దించారు.