il and fs transport
-
ఎన్సీఎల్ఏటీలో డెలాయిట్, కేపీఎంజీలకు చుక్కెదురు!
న్యూఢిల్లీ: రుణ సంక్షోభంలో కూరుకుపోయిన ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ కేసులో తమను పార్టీగా చేర్చడాన్ని సవాలుచేస్తూ ఆడిటర్లు డెలాయిట్ హాస్కిన్స్ అండ్ సెల్స్, కేపీఎంజీ అనుబంధ విభాగం బీఎస్ఆర్ అండ్ అసోసియేట్స్ దాఖలు చేసిన పిటిషన్లను ఎన్సీఎల్ఏటీ (నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్) బుధవారం కొట్టివేసింది. స్వతంత్ర డైరెక్టర్లు ఈ మేరకు దాఖలు చేసిన పిటీషన్‌నూ అప్పీలేట్ ట్రిబ్యునల్ తోసిపుచ్చింది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ అనుబంధ విభాగం ఐఎఫ్‌ఐఎన్‌లో మోసానికి సంబంధించి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్, ముంబై ద్విసభ్య ధర్మాసనం 2019 జూలై 23న ఇచ్చిన రూలింగ్‌ను సమర్థించింది. కేసుకు సంబంధించి తమనూ యాజమాన్యంలో భాగంగా పరిగణించడం తగదని ఆడిటర్లు డెలాయిట్ హాస్కి న్స్ అండ్ సెల్స్, కేపీఎంజీ బీఎస్ఆర్ అండ్ అసోసియేట్స్ చేసిన వాదనలను అప్పీలేట్ అథారిటీ తిరస్కరించింది. ఈ కేసులో మాజీ ఆడిటర్లనూ పార్టీలుగా చేర్చి ఆస్తులనూ జప్తు చేయాలని ఎన్సీఎల్టీని కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ కోరింది. దీనిని గత ఏడాది జూలై 23న ముంబై ధ ర్మాసనం ఆమోదించింది. అయితే ఈ తీర్పును ఆడిటర్లు, స్వతంత్ర డైరెక్టర్లు ఎన్సీఎల్ఏటీలో సవాలు చేశారు. జూలై 29న అప్పీలేట్ ట్రిబ్యునల్ కేసులో స్టే ఇస్తూ, మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఈ స్టేను మరో రెండు వారాలు పొడిగించాలన్న ఆడిటర్లు, స్వతంత్య్ర డైరెక్టర్ల తాజా విజ్ఞప్తిని అప్పీలేట్ ట్రిబ్యునల్ ఆమోదించడం తక్షణం ఆయా ఆడిటర్లు, స్వతంత్ర డైరెక్టర్లకు ఊరటనిచ్చే అంశం. -
ఇథియోపియాలో భారతీయుల నిర్బంధం
ముంబై: ఇథియోపియాలోని వివిధ ప్రాజెక్టుల్లో తమ సిబ్బందిని స్థానికులు నిర్బంధించారని ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ సంస్థకు చెందిన ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్స్ లిమిటెడ్(ఐటీఎన్‌ఎల్) తెలిపింది. అక్కడ నిర్వహిస్తున్న పనులకు సంబంధించి స్థానికులకు వేతనాలు ఇవ్వకపోవడంతో వారు ఏడుగురు భారతీయ ఉద్యోగులను నిర్బంధించినట్లు పేర్కొంది. నీరజ్ రఘువంశి అనే ఉద్యోగి తనతోపాటు ఏడుగురిని స్థానిక సిబ్బంది నిర్బంధించినట్లు గత నెలలో బయటపెట్టడం తెల్సిందే. దీంతో ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ సంస్థ వెంటనే అక్కడి భారత దౌత్య కార్యాలయానికి, విదేశాంగ శాఖకు ఈ సమాచారం అందించి, సాయం కోరింది. వీరి ప్రయత్నాలు ఫలించి శనివారం ఇద్దరిని విడుదల చేశారు. ఇతర దేశాల్లో బకాయిల చెల్లింపులకు అనుమతి కోరుతూ అక్కడి బ్యాంకులకు ఐటీఎన్‌ఎల్ లేఖలు రాసింది. అయితే, అనుమతుల్లో జాప్యం కారణంగా చెల్లింపులు ఆలస్యమయ్యాయని, ఇథియోపియాలోని పనివారికి వెంటనే వేతనాలు చెల్లిస్తామని ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ పేర్కొంది. ఐటీఎన్‌ఎల్ తన సబ్సిడరీ అయిన ఎల్సమెక్స్ ఎస్ఏ అనే కంపెనీ ద్వారా ఇథియోపియాలో రోడ్లు, భవనాలు, పెట్రోల్, గ్యాస్ స్టేషన్ల నిర్మాణ పనులు చేపడుతోంది. -
సెన్సెక్స్ 115 పాయింట్లు ప్లస్
ఈ నెల డెరివేటివ్ కాంట్రాక్ట్‌ల ముగింపు నేపథ్యంలో మార్కెట్లు యథాప్రకారం ఒడిదొడుకులకు లోనయ్యాయి. అయితే రోజులో అత్యధిక సమయం సానుకూలంగానే కదిలాయి. ఇందుకు ఆసియా, యూరప్ మార్కెట్ల లాభాలు ప్రభావం చూపాయి. వెరసి సెన్సెక్స్ 115 పాయింట్లు లాభపడి 20,535 వద్ద నిలవగా, 35 పాయింట్లు పుంజుకున్న నిఫ్టీ 6,092 వద్ద స్థిరపడింది. అమెరికాలో ఉద్యోగ గణాంకాలు, వినియోగదారుల విశ్వాస సూచీ బలపడటంతో సెంటిమెంట్ మెరుగుపడిందని విశ్లేషకులు పేర్కొన్నారు. కాగా, శుక్రవారం(29న) దేశీయ జీడీపీ గణాంకాలు వెలువడనున్నాయి. మరోవైపు జర్మనీకి సంబంధించిన ద్రవ్యోల్బణం, నిరుద్యోగిత వంటి గణాంకాలు వెలువడనున్న నేపథ్యంలోనూ యూరప్ మార్కెట్లు లాభాలతో ట్రేడవుతుండటం గమనార్హం! లాభాల్లో క్యాపిటల్ గూడ్స్ ఇటీవల వెలుగులోకి వచ్చిన క్యాపిటల్ గూడ్స్ రంగం మరోసారి 2% ఎగసింది. అమెరికా తదితర దేశాలతో ఇరాన్ అణుఒప్పందం కుదుర్చుకున్నాక ఈ షేర్లు జోరు చూపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా సుజ్లాన్, వెల్స్పన్ కార్ప్, కార్బొరాండమ్, సద్భావ్, ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ట్రాన్స్పోర్ట్, క్రాంప్టన్ గ్రీవ్స్, సీమెన్స్, ఏబీబీ, భెల్, పుంజ్ లాయిడ్, ఎల్అండ్టీ 9-2% మధ్య దూసుకెళ్లాయి. ఇక సెన్సెక్స్‌లో హిందాల్కో, ఎంఅండ్ఎం, కోల్ ఇండియా, జిందాల్, టాటా స్టీల్, ఆర్ఐఎల్, హెచ్‌యూఎల్ 2.4-1% మధ్య లాభపడ్డాయి. ఎఫ్ఐఐలు రూ. 103 కోట్లు, దేశీయ ఫండ్స్ రూ. 331 కోట్లు చొప్పున ఇన్వెస్ట్ చేశాయి. చిన్న షేర్లు ఓకే మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు దాదాపు 1% స్థాయిలో బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1,442 లాభపడగా, 1,032 నష్టపోయాయి. మిడ్ క్యాప్స్‌లో వోల్టాస్ 12% జంప్‌చేయగా, పెనిన్సులార్, కోరమాండల్ ఇంటర్నేషనల్, అదానీ ఎంటర్ప్రైజెస్, డిష్ టీవీ, టాటా ఎలక్సీ, జేపీ అసోసియేట్స్, బాంబే డయింగ్, బ్లూస్టార్ 10-6% మధ్య పురోగమించాయి.