illeagal
-
రెండవ భార్యకు, పిల్లలకు ఆస్తి వస్తుందా?
భార్య లేదా భర్త బతికి ఉండగా, చట్టరీత్యా విడాకులు తీసుకోకుండా చేసుకున్న రెండవ పెళ్లి చెల్లదు. ప్రస్తుతం ఉన్న చట్టాలలో, (ముస్లింలకు, కొన్ని ప్రత్యేక మతాచారాలు వున్నవారికి తప్ప) అది నేరం కూడా. అందుకనే రెండవ భార్యకి భర్త ఆస్తిలో ఎటువంటి హక్కు ఉండదు. మొదటి భార్య సంతానానికి, రెండవ భార్య సంతానానికి మాత్రం ఆస్తిలో సమాన హక్కు ఉంటుంది. అయితే మొదటి భార్య చనిపోయిన తర్వాత లేదా విడాకులు తీసుకున్న తర్వాత రెండో పెళ్లి చేసుకుంటే, ఆ రెండవ భార్యకి కూడా మొదటి భార్య సంతానం – రెండవ భార్య సంతానంతో పాటు ఆస్తిలో సమాన హక్కు ఉంటుంది.ఉదాహరణకు: చనిపోయిన మొదటి భార్యకి భర్తకి కలిపి ఇద్దరు సంతానం ఉన్నారు. అలాగే రెండవ భార్యకి ఇద్దరు సంతానం ఉన్నారు. ఎటువంటి వీలునామా రాయకుండా చనిపోయిన భర్త స్వార్జితంలో – పూర్వీకుల ద్వారా సంక్రమించిన ఆస్తిలో 5 భాగాలు అవుతాయి. అందులో నాలుగు భాగాలు మొదటి – రెండవ భార్య సంతానానికి, ఒక భాగం రెండవ భార్యకి చెందుతుంది.ప్రభుత్వ ఉద్యోగి పెన్షన్ – పదోన్నతి తర్వాత సంక్రమించే సర్వీస్ బెనిఫిట్స్‌కి సంబంధించి మాత్రం చట్టం కొంత వేరుగా ఉంటుంది. సాధారణ పరిస్థితులలో, పైన తెలిపిన విధంగా చెల్లుబాటు కాని పెళ్లి చేసుకున్న రెండవ భార్యకి పెన్షన్, సర్వీస్ బెనిఫిట్స్ లో ఎటువంటి హక్కు ఉండదు. కానీ అన్నివేళలా అలా వుండదు. ఇటీవలే 2023లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఒక తీర్పులో మొదటి భార్య బతికి ఉన్నప్పటికీ, చట్టరీత్యా విడాకులు తీసుకోనప్పటికీ రెండవ భార్యకి కూడా పెన్షన్ – సర్వీస్ బెనిఫిట్స్‌లో సమాన హక్కు కల్పించింది. మొదటి భార్య నుంచి విడాకులు కావాలి అంటూ చనిపోయిన ప్రభుత్వ ఉద్యోగి డైవర్స్ కేసు ఫైల్ చేసి ఉండడం ఆ కేసులో గమనించదగ్గ అంశం.అంతేకాక ఫ్యామిలీ పెన్షన్ ఉద్దేశానికి, మెయింటెనెన్స్ చట్టం వెనుక ఉన్న ఉద్దేశానికి తేడా ఏమీ లేదు అని అంటూ, మొదటి భార్యకి, రెండవ భార్యకి పెన్షన్ సమానంగా రెండు భాగాలుగా పంచాలి అని కోర్టు తన తీర్పు వెలువరించింది. రైల్వే విభాగంలో మాత్రం, పెన్షన్ రూల్స్ లోని సెక్షన్ 75 ప్రకారం, మొదటి భార్యకి – రెండవ భార్యకి కూడా పెన్షన్‌లో సమాన హక్కు ఉంటుంది అని గతంలో పలు హైకోర్టులు పేర్కొన్నాయి. కొన్ని హక్కులు రెండవ భార్యకి వర్తిస్తాయా లేదా అన్నది కేసు పూర్వాపరాలను బట్టి, ఆయా కేసులోని ప్రత్యేక అంశాలపైనా ఆధారపడి ఉంటుంది.– శ్రీకాంత్ చింతల, హైకోర్ట్ అడ్వకేట్ -
‘కాశిబుగ్గ’లో కలెక్షన్ కింగ్..! పైసలిస్తేనే ఫైళ్లు క్లియర్..!!
వరంగల్: ‘మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. మీ వసూళ్ల విషయం నాకు తెలియంది కాదు. అన్నీ నాకు తెలుసు. కొత్త ఇంటి నంబర్‌కు రూ.2వేలు, నూతన భవన నిర్మాణ ధ్రువీకరణ పత్రానికి మినిమమ్ రూ.3వేల చొప్పున ముట్టజెప్పాల్సిందే. లేదంటే ఫైల్ విచారణ పేరిట పెండింగ్‌లో ఉంటుంది. క్షేత్రస్థాయిలో మీరు ఎంత తీసుకుంటున్నారో నా వద్ద ఆధారాలున్నాయి. నేను ఫైల్ పెడితే సస్పెండ్ అవుతారు.. జాగ్రత్త’ అంటూ గ్రేటర్ వరంగల్ కాశిబుగ్గ సర్కిల్ కార్యాలయంలో ఇటీవల వచ్చిన ఓ అధికారి.. టౌన్ ప్లానింగ్, పన్నుల విభాగం ఉద్యోగులపై కర్ర పెత్తనం చేస్తున్న వైనం కలకలం రేపుతోంది. పేరుకు సిన్సియర్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తూ.. అడ్డదారిలో అందినకాడికి దోచుకునేందుకు తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు చేస్తుండడంతో ఉద్యోగులు లబోదిబోమంటున్నారు. రూ.లక్షల్లో జీతం తీసుకుంటూ ఆదర్శంగా నిలవాల్సిన ఆ అధికారి క్షేత్రస్థాయి సిబ్బందిని అక్రమ వసూళ్లకు ప్రోత్సహిస్తుండడం కార్యాలయంలో చర్చనీయాంశంగా మారింది. ఎంతైనా ఫర్వాలేదు. ప్రతీ ఫైల్‌కు పైసలు తీసుకోండి.. తన వాటా తనకు సమర్పించుకోండంటూ నేరుగా చెప్పడం చూస్తుంటే ఇదేం చోద్యం అని ఉద్యోగులు ముక్కున వేలేసుకుంటున్నారు. సిన్సియర్ అధికారిగా.. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలోని ఓ మున్సిపాలిటీనుంచి మూడు నెలల కిందట బదిలీపై కాశిబుగ్గ సర్కిల్‌కు వచ్చారు. కాశిబుగ్గ కార్యాలయంలో విధులు నిర్వరిస్తున్నారు. విధుల్లో చేరిన కొత్తలో ప్రతీ విషయం రూల్ అంటే రూల్ అని, నిర్లక్ష్యం చేసినా, అవినీతికి పాల్పడినా.. శాఖాపరమైన చర్యలు తప్పవని ఉద్యోగులకు, అధికారులను ఘాటుగా హెచ్చరించాడు. అంతేకాకుండా ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ఓ ఈఈ, టౌన్ ప్లానింగ్‌కు చెందిన ఏసీపీకి విధుల నిర్లక్ష్యంపై మెమోలు కూడా జారీ చేశాడు. దీంతో ఆఫీస్ సబార్డినేటర్ నుంచి ఈఈ, ఏసీపీ స్థాయి అధికారి వరకు గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ఆ తర్వాత వసూళ్లకు తెగబడడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పైసలిస్తేనే పైళ్లు క్లియర్.. ‘కొత్త ఇంటినంబర్ కేటాయిస్తే రూ. 2వేలు ఇవ్వాలి. పేరు మార్పిడికి కనీసం రూ.1,000 చెల్లించాలి’.. ఇదీ పన్నుల విభాగం సిబ్బందికి విధించిన కండీషన్. ఇటీవల టౌన్ ప్లానింగ్‌కు సంబంధించిన బిల్డింగ్ ఇన్స్పెక్టర్లను సమావేశ పర్చి, తాను క్లియరెన్స్ ఇవ్వాలంటే ప్రతీ ఫైల్‌కు రూ.3వేల చొప్పున చెల్లించాల్సిందేనని నిబంధన పెట్టినట్లు తెలుస్తోంది. ఆమాట విన్న బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు అవాక్కయ్యారని సమాచారం. సర్వేయర్లు, మధ్యవర్తులు తనకు అవసరం లేదని బాహాటంగా హెచ్చరించడంతో ఉద్యోగులు హైరానా పడుతున్నారు. ఈ అధికారి వసూళ్లపై తాజాగా ఓ రెవెన్యూ ఇన్స్పెక్టర్.. బల్దియా ద్వితీయ శ్రేణి అధికారికి సమాచారం ఇచ్చారు. ‘నా మాటే ఖాతరు చేయడం లేదు. నీ మాట ఎంత ’అని ఆయన వదిలేసినట్లు కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి. సదరు అధికారి అక్రమ వసూళ్ల వ్యవహారం శృతి మించడంతో క్షేత్రస్థాయి సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాలకవర్గ పెద్దలు, ఉన్నతాధికారుల అండ ఉందని బహిరంగంగా చెబుతున్న ఆయన వసూళ్ల వ్యవహరంపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ విషయమై ఓ ద్వితీయ శ్రేణి అధికారిని వివరణ కోరగా ఈ విషయం తన దృష్టికి కూడా వచ్చిందని, కమిషనర్‌కు సమాచారం ఇస్తానని తెలిపారు. -
మహబూబాబాద్ కలెక్టరేట్ వద్ద కొనసాగుతున్న టెన్షన్
-
తమ్ముడి ఇంట్లో తుపాకీ పెట్టాడు!
సాక్షి, హైదరాబాద్: సోదరుడితో ఉన్న ఆస్తి వివాదాల నేపథ్యంలో అతడిని హతమార్చాలని భావించిన అన్న నాటు తుపాకీ ఖరీదు చేశాడు. అది సాధ్యం కాకపోవడంతో కనీసం అక్రమ మారణాయుధాల కేసులో ఇరికించే కుట్ర చేశాడు. దీనిని గుర్తించిన నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిందితుడిని పట్టకున్నారు. అదనపు సీపీ (నేరాలు) ఏఆర్ శ్రీనివాస్ గురువారం వివరాలు వెల్లడించారు. జేసీపీ డాక్టర్ గజరావ్ భూపాల్, ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మట్లాడారు. రసూల్‌పుర ప్రాంతానికి చెందిన షేక్ మహ్మద్ అజ్మతుల్ల అలియాస్ షౌకత్ ముషీరాబాద్‌లో స్టీల్ వ్యాపారం చేస్తున్నాడు. ఇతడికి అన్న అబ్దుల్లా, తమ్ముడు సోహైల్ ఉన్నారు. సంపన్న కుటుంబానికి చెందిన వీరికి నవాబ్కాలనీ, రసూల్‌పుర, బేగంపేట, టోలిచౌకీ, కింగ్‌కోఠి, నాచారం, ఎల్బీనగర్ల్లో రూ.వందల కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. 2005లో వీరి తండ్రి కన్నుమూయడంతో వీరి మధ్య ఆస్తి వివాదాలు మొదలయ్యాయి. ప్రస్తుతం ముగ్గురూ రసూల్‌పురలోని ఒకే భవనంలో నివసిస్తున్నారు. 15 ఏళ్లుగా వివాదాల పరిష్కారానికి జరిగిన ప్రయత్నాలు ఫలించలేదు. అన్న–తమ్ముడు కలిసే తనను ఇబ్బంది పెడుతున్నారని షౌకత్ భావిస్తున్నాడు. వీరిని అంతం చేయాలని భావించిన షౌకత్ కొన్నేళ్ల క్రితం ముషీరాబాద్‌కు చెందిన మహ్మద్ సలీంను సహాయం కోరాడు. అతను రూ.5 వేలు వెచ్చించి నాందేడ్ నుంచి నాటు తుపాకీ, 10 తూటాలు, రెండు కత్తులు తీసుకువచ్చి ఇచ్చాడు. అప్పటి నుంచి వీటిని తన వద్దే ఉంచుకున్న షౌకత్ అదును కోసం ఎదురు చూశాడు. ఈ తుపాకీ చూసిన బంధువులు లైసెన్డ్స్ ఆయుధంగా భావించారు. అన్న–తమ్ముడిని హత్య చేయడం సాధ్యం కాకపోవడంతో కనీసం కేసుల్లో ఇరికించి ఇబ్బంది పెట్టాలని షౌకత్ భావించాడు. కొన్ని రోజుల క్రితం తుపాకీ, తూటాలు, కత్తులను ఓ సంచిలో ఉంచాడు. దీనిని ఎవరూ చూడకుండా తన తమ్ముడి వంటింట్లో ఫ్రిడ్జ్ కింద పెట్టాడు. ఈ విషయంపై పోలీసులకు సమాచారం ఇవ్వడానికి కొత్త ఫోన్, సిమ్‌కార్డు కొనుగోలు చేశారు. వీటిని వినియోగించి పదేపదే టాస్క్‌ఫోర్స్‌కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వర్రావు నేతృత్వంలో ఎస్సైలు కె.శ్రీకాంత్, అనంతాచారి, అర్వింద్ గౌడ్ తమ బృందంతో ఆ ఇంటిపై దాడి చేసి సోహైల్‌ను అదుపులోకి తీసుకుని ఆయుధాలు, తూటాలు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నేపథ్యంలో అతడికి వీటితో సంబంధం లేదని తేలింది. దీంతో కాల్ చేసింది ఎవరనే కోణంలో పోలీసులు ఆరా తీయగా షౌకత్ పేరు వెలుగులోకి రావడంతో అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. నేరం అంగీకరించడంతో తదుపరి చర్యల నిమిత్తం బేగంపేట పోలీసులకు అప్పగించారు. (చదవండి: రియల్ హత్యలే..దృశ్యం సినిమా తరహాలో తప్పించుకునేందుకు యత్నం) -
పోలీస్ కమిషనర్ పేరుతో పోలీసులనే బురిడి కొట్టించాడు!!
కొన్ని సంఘటనలు చూస్తే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇటీవల దొంగలు కూడా రూటు మార్చారనే చెప్పాలి. ఇదివరకు దొంగలు అమాయకులు, ఒంటరివాళ్లను, వృద్ధులను టార్గెట్ చేసి మోసాలకు పాల్పడేవారు. ఇప్పుడు అత్యున్నతస్థాయి ఉద్యోగులను, బ్యాంకు ఉద్యోగులనే కాక ఏకంగా పోలీసులునే బురిడి కొట్టిస్తున్నారు. అచ్చం అలాంటి సంఘటనే మహారాష్ట్రలో చోటు చేసుకుంది. (చదవండి: మృత్యుంజయురాలు! ...ఐదు రోజులుగా గడ్డకట్టే మంచులో కారులోనే ... అసలు విషయంలోకెళ్లితే...ముంబైలోని గోరేగావ్‌కు చెందిన ఖలీలుల్లా అయానుల్లా ఖాన్ పోలీస్ కంట్రోల్ రూమ్‌కి కాల్ చేసి తనను తాను అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ (సీపీ) విజయ్ సింగ్‌గా పరిచయం చేసుకున్నాడు. ఈ మేరకు అయానుల్లా ఖాన్పింప్రీ చించ్వాడ్ పోలీస్ చీఫ్ నంబర్ ఇవ్వవల్సిందిగా అభ్యర్థించాడు. ఆ తర్వాత కాసేపటికి అయానుల్లా ఖాన్ తానే మళ్లీ కంట్రోలో రూమ్‌కి ఫోన్ చేసి ఆయనని కలవలేకపోయాను అందువల్ల క్రైమ్ బ్రాంచ్‌లోని ఇతర పోలీసు నెంబర్లను ఇవ్వండి అని కోరాడు. ఈ క్రమంలో అయానుల్లా ఖాన్ ఒక పోలీసు అధికారికి ఫోన్ చేసి టౌన్షిప్ ప్రాంతంలో సుమారు 5 నుంచి 6 వరకు పిస్టల్స్ డెలివరీ అయ్యే అవకాశం ఉందంటూ అక్రమ ఆయుధాలకు సంబంధించిన సమాచారాన్ని అందించాడు. అంతేకాదు వాట్సాప్‌లో కొంతమంది వ్యక్తుల ఫోటోలను కూడా పంపించాడు. ఈ మేరకు పూర్తి సమాచారం కొరకు అయానుల్లా ఖాన్ పోలీసులను రూ 15, 000 కూడా డిమాండ్ చేశాడు. అయితే పోలీసులు కూడా అంగీకరించి డబ్బులు పంపించారు. ఈ క్రమంలో కొంత మంది పోలీసులకు అయానుల్లా ఖాన్ తీరు పై అనుమానం వచ్చి విచారించడం మొదలు పెట్టారు. ఈ మేరకు అయానుల్లా ఖాన్ పోలీస్ కమిషనర్ పేరుతో మోసం చేసినట్ల గుర్తించి పోలీసులు అరెస్టు చేశారు. (చదవండి: రాజహంసలు ఒకేచోట సందడి చేశాయి: క్యూట్ వైరల్ వీడియో!!) -
పాతాళంలోకి భూగర్భజలాలు
వేములవాడ అర్బన్: ఇసుకాసురుల పైసాచికానందానికి మూలవాగు కనుమరుగయ్యే ప్రమాదం పొంచి ఉంది. అధికారులు పట్టించుకోకపోవడంతో ఇసుక అక్రమంగా తరలిపోతుంది. దీంతో చుట్టుపక్కల ప్రాంతాలలో భూగర్భజలాలు అంతరించిపోతున్నాయి. ఇప్పటికే మూలవాగుతోపాటు చుట్టూపక్కల ప్రాంతాలలో చుక్క నీరు కనిపించని పరిస్థితులు ఉన్నాయి. వీటన్నింటికీ మూలవాగులోని ఇసుక ఖాళీ కావడమేనని నిపుణులు పేర్కొంటున్నారు. వేములవాడ పట్టణంలో దాదాపు 30 ట్రాక్టర్లు ఉన్నాయి. దీంతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా ఇసుకను తరలిస్తున్నారు. పాతాళంలోకి భూగర్భజలాలు: ఈ ఏడాది జిల్లాలో సగటు వర్షపాతంలో 21 శాతం లోటు ఉంది. జిల్లాలో సగటు భూగర్భ జలమట్టం 14.25 మీటర్లు లోతులో ఉంది. వర్షాకాలంలో వర్షాలు సాధారణ వర్షపాతం 823.19 మిల్లీమీటర్లుకాగా 646.40 మిల్లీమీటర్లు కురిసింది. వర్షాలు సరిగ్గా కురవకపోవడంతో ఈ సంవత్సరం మూలవాగు పారలేదు. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల్లోని నీటి వనరులు ఎండిపోయాయి. శీతాకాలం ప్రారంభంలోనే భూగర్భజలాల పాతాళంలోకి పోవడంతో అటు అన్నదాతులు.. ఇటు పట్టణవాసులు ఆందోళన చెందుతున్నారు. వేములవాడ అర్బన్‌లో 24.72 మీటర్ల అత్యధిక లోతుల్లో నీరు ఉంది. మూలవాగే ఆధారం... కోనరావుపేట మండలంలోని కొన్ని గ్రామాలు, వేములవాడ మండలంలోని నాంపల్లి, అయ్యోరుపల్లి, వేములవాడ, జయవరం, తిప్పాపూర్, మల్లారం, హన్మాజీపేట గ్రామాలకు మూలవాగే ఆధారం. ఆయా గ్రామాలలో సాగు, తాగునీరు కోసం మూలవాగుపైనే ఆధారపడతారు. ఇసుక అనుమతులు.. వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ పనులకు మాత్రమే అధికారులు ఇసుక అనుమతి ఇస్తున్నట్లు చెబుతున్నారు. అది కూడా మిడ్‌మానేరు ముంపునకు గురవుతున్న గ్రామాల్లోని పరిసరాల వాగులో ఇసుకను తీసేందుకే అనుమతి ఇస్తున్నారు. పట్టణంలోని ప్రభుత్వ పనులకు అయితే మంగళవారం, గురువారం, శనివారం మూడు రోజులు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అనుమతి ఇస్తున్నారు. కాంట్రాక్టర్ వర్క్ ఆర్డర్ తెచ్చిన తర్వాత ఒక ట్రాక్టర్ ఇసుక ట్రిప్పునకు రూ.220 డీడీ చెల్లించాలి. అనంతరం వారు తహసీల్దార్ కార్యాలయంలో అనుమతులు పొందాలి. తర్వాతనే ఇసుకను తరలించే అవకాశం ఉంటుంది. కానీ వేములవాడ మూలవాగులో ఎలాంటి అనుమతులు లేకుండానే ఇసుకను ఇష్టారీతిగా తోడేస్తున్నారు. అక్రమంగా రవాణా చేస్తే చర్యలు... వేములవాడలోని ప్రభుత్వ పనులకు మాత్రమే ఇసుకను అనుమతి ఇస్తున్నాం. అది కూడా కేటాయించిన రోజు, సమయానికే తరలించాలి. మూలవాగులో ఇసుక తోడేందుకు ఎలాంటి అనుమతి లేదు. అక్రమంగా రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. -నక్క శ్రీనివాస్ తహసీల్దార్, వేములవాడ బావుల వద్ద తోడుతున్నారు మూలవాగులో ఉదయం 4 గంటలకే ట్రాక్టర్లలో ఇసుకను తరలిస్తున్నారు. వ్యవసాయ బావుల వద్ద కూడా ఇసుకను తోడేస్తున్నారు. ఇదేం పద్ధతి అం టే బెదిరింపులకు దిగుతున్నారు. అధికారులే పట్టించుకోవాలి. -చిర్రం శేకర్ రైతు గొల్లపల్లి అడుగంటుతున్న భూగర్భ జలాలు వర్షాలు సరిగ్గా కురువక మూలవాగులోని వ్యవసా య బావుల్లో నీరు అడుగంటిపోయింది. బావులల్లా నీరు మోటార్ల ద్వారా ఒక్క గంట కూడా పోయడం లేదు. ఏసంగి వ్యవసాయం చేయడం కష్టమే. -ఎం.మల్లేశం రైతు గొల్లపల్లి -
మత ఘర్షణల్లో ఇద్దరి మృతి
ఔరంగాబాద్: మహారాష్ట్రలోని ఔరంగాబాద్ నగరంలో శుక్రవారం రాత్రి రెండు వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, దాదాపు 50 మంది గాయపడ్డారు. ఈ అల్లర్లను అదుపు చేసేందుకు 144 సెక్షన్‌ను విధించడంతో పాటు ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేసినట్లు పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇటీవల ఔరంగాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అక్రమ నల్లా కనెక్షన్లను తొలగించే కార్యక్రమాన్ని ప్రారంభించడంతో గత కొన్నిరోజులుగా స్థానికులు ఆగ్రహంగా ఉన్నారన్నారు. శుక్రవారం రాత్రి 10 గంటలకు కార్పొరేషన్ సిబ్బంది మోతీకరంజాలోని ఓ ప్రార్థనాలయంలో ఉన్న అక్రమ నల్లా కనెక్షన్‌ను తొలగించడంతో వివాదం రాజుకుందన్నారు. తమ కనెక్షన్‌తో పాటు మరో వర్గానికి చెందిన ప్రార్థనాస్థలంలో ఉన్న అక్రమ నీటి కనెక్షన్‌ను కూడా తొలగించాలని ఓ వర్గం డిమాండ్ చేయడంతో ఘర్షణ చెలరేగిందన్నారు. దీంతో అల్లర్లు మోతీకరంజా నుంచి గాంధీనగర్, రాజా బజార్, షా గంజ్, సరఫా ప్రాంతాలకు విస్తరించాయన్నారు. ఈ సందర్భంగా రెచ్చిపోయిన ఆందోళనకారులు 100 దుకాణాలకు, 80 వాహనాలకు నిప్పుపెట్టారని వెల్లడించారు. వీరిని అదుపు చేసేందుకు జరిపిన కాల్పుల్లో ఓ యువకుడు(17)చనిపోగా, ఆందోళనకారులు మంట లు అంటించడంతో ఓ షాపులోని 65 ఏళ్ల వృద్ధుడు దుర్మరణం చెందాడని పేర్కొన్నారు. ఈ ఘటనలో ఓ ఏసీపీ సహా 12 మంది పోలీసులు గాయపడినట్లు తెలిపారు. ఈ అల్లర్లకు సంబంధించి ఇప్పటివరకూ 37 మంది నిందితుల్ని అరెస్ట్ చేశామన్నారు. -
తవ్వేస్తున్నారు!
డబ్బు సంపాదనే లక్ష్యంగా పెట్టుకున్న కొందరు అసాధ్యాలను సైతం సుసాధ్యాలుగా మార్చుకుంటున్నారు.. పర్యావరణానికి పెను ప్రమాదం అని తెలిసినా పచ్చని చెట్లను నేలమట్టం చేస్తున్నారు.. ఎర్రగుట్టను తవ్వేసి దర్జాగా దందా సాగిస్తున్నారు. ఇంతజరుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. ధన్వాడ : అనుమతులు లేకుండా గుట్టను తవ్వి కొందరు దందా చేస్తున్నారు. మట్టిని తరలిస్తూ జేబులు నింపుకుంటున్నారు. ధన్వాడ మండల కేంద్రనికి రెండు కిలోమీటర్ల దూరంలో భారత గట్లు నుంచి గత కొంత కాలంగా జేసీబీలతో తవ్వి ఎర్రమట్టిని తరలిస్తున్నారు. ఇది తమ పట్టా భూమి అంటూ ఇటుక బట్టీలను పెట్టుకొని వాడుకుంటున్నారు. బోర్డు ఏర్పాటుచేసినా.. ఆ స్థలంలో ఫారెస్ట్ ఏరియాను సూచించే బోర్డును అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసినా అవేవీ పట్టించుకోకుండా తవ్వకాలు జరిపారు. అంతే కాకుండా పచ్చని చేట్లను నరికేస్తున్నారు. మట్టిని భూమి సమాంతరంగా తవ్వి వాటిని తమ పొలంలోకి కలిపేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా అటు ఫారెస్ట్ శాఖ అధికారులుగాని, ఇటు రెవెన్యూ అధికారులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. దర్జాగా ఇటుక దందా.. ఎక్కడి నుంచో ఇటుకకోసం మట్టిని తె చ్చుకుంటూ వాటికి డబ్బులు ఎందుకు ఖర్చు పెటలనుకున్నారో ఏమో ఏకంగా గుట్ట దగ్గరే మకాం పెట్టేశారు. ఇటుక బ ట్టీ యజమనులు వ్యాపారం మూడు పు వ్వులు ఆరు కాయలుగా ఉంది. ఒక ఇ టుకకు రూ.5 నుంచి రూ.15వరకు అ మ్ముతున్నారు. అంటే వేయ్యి ఇటుకలకు రూ.5వేలు పలుకుతుంది. మండలంలో దాదాపు నాలుగు ఇటుక బట్టీలు ఏర్పా టు చేసుకున్నారు. వీటికి ఎక్కడా అనుమతులు తీసుకోవడంలేదు. ప్రధాన రా హదారులకు పక్కనే ఉన్నా అధికారులు అటునుంచే రాకపోకలు చేస్తున్నారు. ఎర్రమట్టిని తవ్వేస్తున్నారు మండలంలో ఎక్కడా ఎర్రమట్టి కావాల్సినా భారత గుట్టనే టార్గెట్ చేసుకుంటున్నారు. ఒక్క ట్రాక్టర్ ట్రీప్‌కు రూ.400 నుంచి రూ.600 వసూలు చేస్తున్నారు. పొలాలకు వేళ్లే రాహదారిని తవ్వడంతో బాటలేక రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. పరిశీలిస్తాం ఈ వ్యవహారం మా దృష్టికి రాలేదు. అధికారులను పంపించి వివరాలు సేకరిస్తాం. ఎవరైన హద్దులు దాటి అటవీప్రాంతం మట్టిని తరలిస్తే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. – గంగారెడ్డి, జిల్లా అటవీశాఖ అధికారి(డీఎఫ్ఓ) -
‘దేవాదాయ’లో అక్రమాలకు చెక్
దశబంధం చెరువు వ్యవహారం కూడా పరిష్కరిస్తాం ‘సాక్షి’తో దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ వెండిదండి శ్రీనివాసరెడ్డి ఒంగోలు కల్చరల్: దేవాదాయశాఖ ఆస్తులు ఎవరైనా ఆక్రమించాలని చూస్తే సహించేది లేదని చట్టపరంగా చర్యలు తీసుకుంటామని దేవాదాయశాఖ సహాయ కమిషనర్ వెండిదండి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన “సాక్షి’తో మాట్లాడారు. త్రోవగుంటలోని ఎనిమిది ఎకరాల ధర్మకుంట దేవాదాయశాఖదే అని అయితే కొందరు ఆ స్థలంలో ప్లాట్లు వేస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ స్థలానికి సంబంధించి ఉన్నత న్యాయస్థానంలో కేసు కూడా దాఖలైందన్నారు. ధర్మకుంట స్థలం దేవాదాయశాఖదేనని స్పష్టం చేస్తూ 22ఏ 1సీ ప్రకారం ఏ విధమైన క్రయవిక్రయాలు జరగకుండా చూడాలని రిజిస్ట్రార్ కార్యాలయానికి వివరాలు కూడా సమర్పించామని పేర్కొన్నారు. సంతమాగులూరు మండలంలోని 192 ఎకరాల దశబంధం చెరువు కూడా దేవాదాయశాఖదేనని ఆయన స్పష్టం చేశారు. చెరువుపై ప్రతి ఏటా రూ. 25 లక్షల ఆదాయాన్ని కొందరు అనుభవిస్తున్నారన్నారు. మామిళ్లపల్లి, కుందుర్రు గ్రామాలకు సంబంధించిన ఈ చెరువుపై కొందరు పెత్తనం చెలాయిస్తున్నారని, చెరువు దేవాదాయశాఖదేనని సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌లో ఉందని వెల్లడించారు. ఒంగోలు కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయ భూముల కేసు త్వరలో విచారణ జరిగే అవకాశం ఉందని ఆయన తెలిపారు. రెవెన్యూశాఖ పరంగా జరుగుతున్న కొన్ని పొరపాట్లతో సమస్యలు వస్తున్నాయని సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతామని పేర్కొన్నారు. దేవాదాయశాఖకు చెందిన విలువైన ఆస్తులకు సంబంధించి ఎక్కడైనా ఆక్రమణలు చోటుచేసుకుంటే ఆ వివరాలు 94910 00676 నంబర్లో తెలియజేయాలని కోరారు. -
ఎస్సీ వర్గీకరణ చట్టవిరుద్ధం
ఉట్నూర్ : ఎస్సీ వర్గీకరణ కోసం ఏకాభిప్రాయం కోసం ప్రయత్నాలు చేస్తోందని కేంద్ర ప్రభుత్వం అనడం సిగ్గు చేటని అసలు ఎస్సీ వర్గీకరణ చట్ట విరుద్ధమని గతంలో సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ చెల్లదని తెల్చి చెప్పిన రాజకీయ పార్టీలు ఓట్ల కోసం ఎస్సీలను పావుగా వాడుకుంటున్నాయని తెలంగాణ నేతకాని (మహార్) రిజర్వేషన్ పొరాట సమితి జిల్లా అధ్యక్షుడు కోత్తపల్లి మహేందర్ అన్నారు. గురువారం మండల కేంద్రంలో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం దిష్టి బోమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణతో ఎస్సీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు ఏకాభిప్రాయం కోసం ప్రయత్నాలు చేస్తున్నాయని చెప్పడం సరికాదన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ సాధ్యం కాదని వెంటనే ప్రకటించాలన్నారు. కార్యక్రమంలో తెలంగాణ నేతకాని (మహార్) రిజర్వేషన్ పొరాట సమితి మండల అధ్యక్షుడు దూట మహేందర్, జిల్లా కార్యదర్శి కాంబ్లే రవికాంత్, నాయకులు కేశవ్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.