illegal actions
-
పాపులర్ ఫ్రంట్‌పై ఎన్ఐఏ గురి
న్యూఢిల్లీ: నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ)తోపాటు దాని అనుబంధ సంస్థలపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులు దృష్టి పెట్టారు. చట్టవ్యతిరేక, హింసాత్మక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు సదరు సంస్థలపై ఇప్పటికే కేసు నమోదయ్యింది. కేసు దర్యాప్తులో భాగంగా కేరళలో 12 జిల్లాల్లో పీఎఫ్ఐ, అనుబంధ సంస్థలకు సంబంధించిన 56 ప్రాంతాల్లో గురువారం అధికారులు సోదాలు నిర్వహించారు. పీఎఫ్ఐ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు, జోనల్ హెడ్స్, ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్స్–ట్రైనర్స్తోపాటు మారణాయుధాలు ఉపయోగించడంలో శిక్షణ పొందిన మరికొందరి నివాసాల్లో సోదాలు చేసినట్లు ఎన్ఐఏ ప్రతినిధి చెప్పారు. మరో 20 మంది అనుమానితుల ఇళ్లను తనిఖీ చేసినట్ల తెలిపారు. ఆయుధాలు, డిజిటల్ పరికరాలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. పీఎఫ్ఐ, అనుబంధ సంస్థలపై గతంలోనే కేసు నమోదు చేసింది. -
ఇదేం కక్కుర్తి
ఎల్లారెడ్డిరూరల్(ఎల్లారెడ్డి): పట్టణంలోని గిరిజన బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ జ్యోతిలక్ష్మి హాస్టల్ నుంచి అక్రమంగా తరలిస్తున్న వస్తువులను ఏబీవీపీ నాయకులు పట్టుకుని నిలదీసి న సంఘటన ఎల్లారెడ్డిలో బుధవారం జరిగింది. ఏబీవీపీ నాయకులు ఓంకార్, తులసీరాంలు తెలిపిన వివరాల ప్రకారం తెలంగాణ గిరిజన సంక్షేమ బాలికల పాఠశాల వార్డెన్‌గా విధులను నిర్వర్తిస్తున్న జ్యోతిలక్ష్మి బుధవారం మధ్యాహ్నం పాఠశాల నుంచి అక్రమంగా విద్యార్థులకు అందించాల్సిన మిరియాలు, పెసర్లు, నువ్వులు, ఆవాలు, బెడ్ షీట్లు, స్టీల్ గిన్నెలను సంచిలో వేసుకుని ఇంటికి తరలిస్తుండగా పోలీస్ స్టేషన్ ప్రాంతంలో పట్టుకున్నట్లు వారు తెలిపారు. విద్యార్థులకు అందించాల్సిన వస్తువులను ప్రతి సారీ సంచులలో తీసుకుని వెళ్తుందని వారు ఆరోపించారు. పట్టుకున్న వస్తువులను హాస్టల్‌కు తరలించి రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. స మాచారం అందుకున్న రెవెన్యూ అధి కారి గిర్దావార్ వెంకట్‌రెడ్డి పాఠశాలకు చేరుకుని పంచనామా నిర్వహించారు. ప్రిన్సిపాల్ సంచిలో 5కిలోల నువ్వులు, 5కిలోల ఆవాలు, 5కిలోల పెసర్లు, 5 బెడ్షీట్లు, 6స్టీల్ గిన్నెలు, 3కిలోల మిరి యాలను సీజ్ చేసినట్లు ఆయన తెలిపా రు. నివేదికను తహసీల్దార్ అంజయ్యకు అందించనున్నట్లు ఆయన తెలిపారు. -
కొందరికి అడ్డా!
నిరూపయోగంగా స్కూలు భవనాలు అసాంఘిక కార్యకలాపాలకు నిలయాలు పట్టించుకోని అధికారులు రామాయంపేట: నిరూపయోగంగా ఉన్న పాఠశాలల భవనాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారాయి. మండలంలోని కాట్రియాల పన్యా తండా, రామాయంపేట ఎక్కల దేవుని బండ వద్ద ప్రభుత్వ పాఠశాలలను గతంలోనే ఎత్తివేయడంతో సదరు భవనాలు నిరూపయోగంగా ఉన్నాయి. కొందరు వ్యక్తులు వీటిని అసాంఘిక కార్యకలాపాలకు ఉపయోగించుకుంటున్నారు. పిల్లలు రావడంలేదనే ఉద్దేశంతో పన్య తండాలో ఎనిమిదేళ్ల క్రితం, ఎక్కల దేవుని బండ వడ్డెర కాలనీ వద్ద మూడేళ్ల క్రితమే స్కూళ్లు మూతపడ్డాయి. ఈ భవనాలను ఇతర అవసరాలకు వినియోగించాల్సి ఉండగా, ఆయా పంచాయతీలు ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంతో వృథాగా పడి ఉన్నాయి. ఈ భవనాలు రోజురోజుకు శిథిలావస్థకు చేరుతున్నాయి. వీటిని ఇతర అవసరాలకు వినియోగించాలని రెండు గ్రామాల వారు కోరుతున్నారు. మహిళా సంఘాల నిర్వహణకు ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.