Illegal deputations
-
ఆరోగ్యశాఖలో అక్రమ డిప్యుటేషన్లు !
నల్లగొండ టౌన్ : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో సిబ్బంది అక్రమ డిప్యుటేషన్లకు అధికారులు పెద్దపీట వేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేయాల్సిన ఉద్యోగులు డిప్యుటేషన్లపై పోస్టింగ్ మార్పించుకొని పట్టణాలకు పరిమితం అవుతున్నారు. కార్యాలయంలో పనిచేసే ఓ అధికారికి అడినంత ముట్టుచెప్పి డిప్యుటేషన్‌పై వచ్చి జిల్లా కార్యాలయంలో పనిచేస్తున్నట్టు సమాచారం. ఈ కార్యాలయంలో రెగ్యులర్ సీనియర్ అసిస్టెంట్లు ఐదుగురు పనిచేస్తుండగా డిప్యుటేషన్‌పై ఏడుగురు సీనియర్ అసిస్టెంట్లు వచ్చి పనిచేస్తున్నారంటే డిప్యుటేషన్లకు కార్యాలయంలో పెద్దపీట వేస్తున్నారనడానికి నిదర్శనంగా నిలుస్తుంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కూడా ఇంతమంది సీనియర్ అసిస్టెంట్లు పనిచేసిన దాఖలాలు లేవనే చెప్పవచ్చు. జిల్లా కార్యాలయంలో అక్కర లేకున్నా.. చందంపేట, వీటినగర్, పెద్దవూర, గుర్రంపోడు, కనగల్, దేవరకొండ, నార్కట్‌పల్లి తదితర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేయాల్సిన సీనియర్ అసిస్టెంట్లు సదరు అధికారికి నగదు ముట్టచెప్పి డిప్యుటేషన్ వేయించుకుని కార్యాలయంలో కాలం వెల్లదీస్తున్నారు. అదేవిధంగా ఐదుగురు పారామెడికల్ సిబ్బంది కూడా డిప్యుటేషన్‌పై జిల్లా కార్యాలయంలో పనిచేయడం విశేషం. ఐదుగురు సీనియర్ అసిస్టెంట్లతో పనిచేయించాల్సిన అధికారులు అక్కర లేకున్నా ఇష్టానుసారంగా ఉద్యోగులను డిప్యుటేషన్‌పై జిల్లా కార్యాలయానికి తీసుకువస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉన్న ఉద్యోగులకు చేతినిండా పనిలేక ఖాళీగా కూర్చుంటుంటే అదనంగా డిప్యుటేషన్‌పై ఉద్యోగులను కార్యాలయానికి తీసుకురావడం ఏమిటని మిగతా ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. నీకింత.. నాకింత! కార్యాలయంలో పనిచేస్తున్న ఓ అధికారి తనకు అనుకూలంగా ఉన్వారిని డిప్యుటేషన్‌పై నియమించుకుని ప్రతి పనికి ఓ రేటును నిర్ణయించి అక్రమ సంపాదనకు తెరలేపారని ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఏ చిన్న పని అయినా ఆ అధికారికి కాసులను ముట్టచెప్పాల్సిందేనని పలువురు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పని పూర్తి కావాలంటే ఆయన అనుచరులతో బేరం చేయించి వచ్చిన దాంట్లో నీకింత నాకింత అనే విధంగా పంపకాలు చేసుకుంటున్నారని సమాచారం. ఇంత తతంగం జరుగుతున్నా ఆ అధికారిని ప్రశ్నించే వారు లేకుండా పోయారు. రిటైర్డ్ ఉద్యోగులు, విధుల్లో ఉండి మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులను కూడా వదలకుండా బెనిఫిట్స్‌ను ఇవ్వడానికి వారినుంచీ డబ్బులను వసూళ్లు చేస్తున్నారంటే వారి అక్రమ సంపాదన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నా పిరియడ్‌లో జరగలేదు ఇన్చార్జి బాధ్యతలను స్వీకరించిన తరువాత ఎలాంటి డిప్యుటేషన్లపై ఉద్యోగులను తీసుకురాలేదు. గత పిరియడ్‌లో జరిగింది. నిబంధనలకు వ్యతిరేకంగా ఉంటే చర్యలు తీసుకుంటాం. ఎవరినీ ఉపేక్షించేది లేదు. – డాక్టర్ వై.గంగవరప్రసాద్, డీఎంహెచ్ఓ -
అక్రమ డిప్యుటేషన్లు రద్దు చేయాలి
నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్ నేతలు అనంతపురం: ఉపాధ్యాయుల అక్రమ డిప్యుటేషన్లను వెంటనే రద్దు చేయాలని నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేష¯Œన్ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం యూనియ¯ŒS జిల్లా అధ్యక్షుడు హరికృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి బీ.జయరాంనాయక్, విలేకరులతో మాట్లాడారు. డివిజన్లను మార్చి సర్దుబాట్లు చేయడం సరైనది కాదన్నారు. అవసరమైన చోట సర్దుబాటుకు తమ అసోసియేష¯ŒS వ్యతిరేకం కాదన్నారు. నిబంధనల మేరకు సర్దుబాట్లు పారదర్శకంగా ఉండే విధంగా చూడాలన్నారు. నాయకులు కె.రవీంద్రబాబు, వెంకటేష్‌బాబు, రాజూనాయక్లు పాల్గొన్నారు. -
వైద్యశాఖలో అక్రమ డెప్యూటేషన్లు రద్దు
- నల్లగొండ జిల్లాలో 60 మంది పారామెడికల్ సిబ్బంది వెనక్కి - ప్రాంతీయ పరిధిలోని అక్రమ బదిలీల రద్దుకు సిఫార్సు? - ‘సాక్షి’ కథనంతో కదిలిన డొంక... ఇంకా కొనసాగుతోన్న విచారణ సాక్షి, హైదరాబాద్: వైద్య ఆరోగ్యశాఖ ఆరో జోన్ ప్రాంతీయ పరిధిలో జరిగిన పారా మెడికల్ సిబ్బంది, సీనియర్ అసిస్టెంట్ కేడర్ అక్రమ డెప్యూటేషన్లను కొన్నింటిని రద్దు చేశారు. ముందుగా నల్లగొండ జిల్లాలో 60 అక్రమ డెప్యూటేషన్లను రద్దు చేశారు. ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో ఆ జిల్లా కలెక్టర్ ఇటీవల వాటిని రద్దు చేశారు. గత జనవరి 28వ తేదీన ‘సాక్షి’లో ప్రచురితమైన వైద్యశాఖలో అక్రమ బదిలీలు కథనానికి స్పందించిన సర్కారు విచారణ కమిటీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. నల్లగొండ జిల్లాతోపాటు రంగారెడ్డి, నిజామాబాద్, మెదక్, హైదరాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లోనూ అక్రమ డెప్యూటేషన్లు జరిగాయి. వాటిపైనా విచారణ జరుగుతోంది. విచారణ అనంతరం వాటిని రద్దు చేసే అవకాశం ఉందని వైద్య శాఖ అధికారులు చెబుతున్నారు. కాగా, సరెండర్ పేరుతో రూ. 3 లక్షల వరకు తీసుకొని వైద్య ఉద్యోగులను వారికి ఇష్టమైన ప్రాంతానికి బదిలీలు చేశారు. వీటి పైనా విచారణ జరుగుతోంది. త్వరలో నిబంధనలకు విరుద్ధంగా జరిగిన సరెండర్లను అనంతరం జరిగిన 150 బదిలీల రద్దుకూ సిఫార్సు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. కీలకాధికారిపైనా చర్యలు:ఆరో జోన్ పరిధిలోని ఆరు జిల్లాలకు వైద్య ఆరోగ్యశాఖలో కీలక అధికారుల్లో ఆయన ఒకరు. అక్రమ డెప్యూటేషన్లకు, సరెండర్లు అనంతరం జరిగిన బదిలీలకు ఆయనే సూత్రధారి అని విచారణ కమిటీ భావిస్తున్నట్లు సమాచారం. సరెండర్ పేరుతో ఇష్టమైన చోటుకు ఉద్యోగులను బదిలీ చేశారు. అందుకు రూ.3 లక్షల వరకు వసూలు చేశారు. సరెండర్ కుదరకపోతే డెప్యూటేషన్ సదుపాయాన్ని వాడేసుకున్నారు. రూ.50 వేలు తీసుకుని నల్లగొండలో 60 మంది పారామెడికల్, సీనియర్ అసిస్టెంట్లను కోరుకున్న చోటికి పోస్టింగ్ ఇచ్చారు. ఆ జిల్లాకు చెందిన రాష్ట్ర స్థాయి ప్రజాప్రతినిధి తల్లికి ప్రమోషన్ ఇవ్వడం సాధ్యం కాకపోవడంతో 12 మంది ఏఎన్ఎంల పదోన్నతులను నిలిపి వేశారు. ఈ నేపథ్యంలో ఆయన పాత్రపైనా విచారణ జరుగుతోంది. విచారణ అనంతరం ఆయనపై చర్య తీసుకునే అవకాశం ఉంది. -
ఎమ్మెల్యేల సేవలో టీచర్లు
అక్రమ డెప్యుటేషన్లకు ప్రజాప్రతినిధి మద్దతు - విద్యాహక్కు చట్టానికి తూట్లు - పాఠశాలలో తగ్గుతున్న విద్యార్థుల సంఖ్య - మూసివేత దిశగా సర్కార్ బడులు సిరిసిల్ల రూరల్ : ప్రభుత్వ జీవో ఎంఎస్ నం.476 జీఏ(ఎస్ఆర్) ప్రకారం ప్రభుత్వ ఉపాధ్యాయులను ఎమ్మెల్యేలకు పీఏలుగా నియమించొద్దు.. అయితే ఇవి ఎక్కడా అమలు కావడంలేదు. తమకు నచ్చిన ఉపాధ్యాయులను అక్రమంగా డెప్యుటేషన్లపై పీఏలుగా నియమించుకుని డ్యూటీ చేయకుండానే ప్రజాధనాన్ని వేతనంగా ఇవ్వడానికి పావులు కదుపుతున్నారు. దీంతో వారు పనిచేసే పాఠశాలల్లో కొత్త ఉపాధ్యాయులను నియమించకపోవడంతో విద్యార్థులకు అన్యాయం జరుగుతోంది. మరికొన్ని సర్కార్ స్కూళ్లు మూతపడుతున్నాయి. జగిత్యాల డివిజన్ పరిధిలోని ఓ టీఆర్ఎస్ ఎమ్మెల్యే సిరిసిల్ల మండలం రామన్నపల్లి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు అనిల్రావును వదలడంలేదు. గతేడాది కూడా డెప్యుటేషన్‌పై పీఏగా నియమించుకుని పాఠశాలలో విధులు నిర్వహించకుండా చే శారు. ఈ ఎమ్మెల్యే పుణ్యమా అని విద్యార్థుల సంఖ్య 24 నుంచి 11కు పడిపోయింది. ఈ విద్యా సంవత్సరంలోనూ అనిల్‌రావు పాఠశాల ప్రారంభరోజు విధుల్లో చేరి ఈ తర్వాత నుంచి డుమ్మా కొడుతున్నాడు. ఎలాంటి సెలవు చీటి పెట్టకుండా ఫోన్లో చెప్పి మళ్లీ ఆ ఎమ్మెల్యేకు పీఏగా వెళ్లడానికి పైరవీలు ప్రారంభించినట్లు తెలిసింది. ఇప్పటికే సదరు ఎమ్మెల్యే ఒత్తిడితో కలెక్టర్ సంతకం పూర్తయి డీఈవోకు జాబితా వెళ్లినట్లు సమాచారం. దీంతో గ్రామస్తులు, ఎస్ఏంసీ సభ్యులు అనిల్రావును ఎమ్మెల్యేకు పీఏగా నియమించవద్దని, తమ పిల్లల భవిష్యత్ అంధకారమవుతుందని కలెక్టర్‌కు ఫిర్యాదుచేశారు. చదువు చెప్పడం ఇష్టం లేకుంటే తమ గ్రామం నుంచి పంపించి తమకు మరో ఉపాధ్యాయుడిని కేటాయించాలని కోరారు. గతేడాది ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేకు సిరిసిల్ల మండల చిన్నలింగాపూర్ ఉపాధ్యాయుడిని పీఏగా పంపించడంతో పిల్లల సంఖ్య తగ్గి ఏకంగా పాఠశాలనే మూసివేశారు. ఇప్పుడు రామన్నపల్లి ప్రభుత్వ పాఠశాల కూడా ఈ అధికార పార్టీ ఎమ్మెల్యే నిర్వాహకంతో మూతపడే అవకాశాలు కనిపిస్తున్నాయని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యేకు ప్రజలకు అనుగుణంగా ఉండాలని, చట్టాలాను గౌరవించి విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని ఉపాధ్యాయులను పీఏలుగా నియమించుకోవద్దని పేర్కొంటున్నారు. ఈ అక్రమ డెప్యుటేషన్లపై ఉపాధ్యాయ సంఘాలు సైతం ఆందోళన నిర్వహిస్తున్నా లాభం లేకుండా పోతోంది. నోటీసులు జారీ చేస్తా.. - దూస రఘపతి, సిరిసిల్ల ఎంఈవో సెలవు చీటి లేకుండా పాఠశాలకు రావడం లేదని నా దృష్టికి వచ్చింది. ఈ విషయం నిన్ననే తెలిసింది. సదరు ఉపాధ్యాయునికి, ఎంఈవోకు రిపోర్టు చేయని హెచ్ఏంకు సైతం నోటీసులు జారీచేసి వివరణ కోరుతా. డీఈవోకు నివేదిక పంపిస్తా. శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం.