IMAX cinemas
-
అవతార్-2ను మించిన టికెట్ ధరలు.. ఆ సినిమాకు ఎందుకంత క్రేజ్!
హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన చిత్రం ఓపెన్ హైమర్. ఈ చిత్రం జూలై 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. హాలీవుడ్ నటుడు సిలియన్ మర్ఫీ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం కోసం ఇండియాలోనూ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీని 2005లో కై బర్డ్, మార్టిన్ జె. షెర్విన్ రచించిన అమెరికన్ ప్రోమేథియస్ జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో ఎమిలీ బ్లంట్, మాట్ డామన్, రాబర్ట్ డౌనీ జూనియర్, ఫ్లోరెన్స్ పగ్, జోష్ హార్ట్‌నెట్, కేసీ అఫ్లెక్, రామి మాలెక్, కెన్నెత్ బ్రానాగ్ ప్రధాన పాత్రల్లో కనిపించారు. ఈ చిత్రానికి లుడ్విగ్ గోరాన్సన్ సంగీతమందించారు. (ఇది చదవండి: స్వీయ దర్శకత్వంలో నచ్చినవాడు.. క్రేజీ అప్డేట్ వచ్చేసింది! ) అయితే భారత్‌లో ఇప్పటికే టికెట్స్ ప్రీ బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. ఈ చిత్రానికి సంబంధించి ఐమాక్స్‌లో కళ్లు చెదిరే రేట్లకు టికెట్స్ అమ్ముడవుతున్నాయి. ఈ మూవీ మొదటి రోజు షోలకు ఒక్కో టికెట్ ధర రూ.2450 పలుకుతోంది. గతంలో జేమ్స్ కామెరూన్ విజువల్ వండర్ అవతార్-2 సినిమా టికెట్ ధర బెంగళూరులో గరిష్ఠంగా రూ.1700 మాత్రమే పలికింది. అంతటి ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉన్న అవతార్‌ను సినిమాను మించి టికెట్ ధరలు ఉండడంతో సినీ ప్రియులు ఆశ్చర్య పోతున్నారు. మనదేశంలో సాధారణంగా టిక్కెట్ ధరలు నగరాన్ని బట్టి మారుతుంటాయి. తాజాగా ముంబయిలో ఓపెన్ హైమర్ మూవీ టికెట్ ధర రూ.2450 ( ఎలాంటి పన్నులు లేకుండా) ఇప్పటికే అమ్ముడయ్యాయి. ముంబయిలోని పీవీఆర్ ఐకాన్, ఫీనిక్స్ పల్లాడియంలో సాయంత్రం ఏడు, రాత్రి పది గంటల షో కోసం సినిమా రిలీజ్ రోజున టిక్కెట్స్ బుక్ కావడంతో అందరి కళ్లు ఈ సినిమాపైనే ఉన్నాయి. ఈ భారీ టికెట్ ధరలు చూస్తే ఓపెన్ హైమర్ మొదటి రోజే భారీ వసూళ్లు రాబట్టనున్నట్లు తెలుస్తోంది. గతవారంలో టామ్ క్రూజ్ మూవీ మిషన్: ఇంపాజిబుల్ – డెడ్ రికనింగ్ పార్ట్ వన్ ఇండియాలో మొదటి రోజు రూ.12.50 కోట్లు వసూలు చేసింది. తాజాగా సిలియన్ మర్ఫీ నటించిన ఓపెన్‌హైమర్ ఆ చిత్రాన్ని అధిగమిస్తోందేమో వేచి చూడాల్సిందే. అసలేంటీ ఓపెన్‌హైమర్? ఒపెన్‌హైమర్ అమెరికన్ సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త జె.రాబర్ట్ జీవితం ఆధారంగా తెరకెక్కించారు. ఆయన మొదటి అణు బాంబును అభివృద్ధి చేసిన భౌతిక శాస్త్రవేత్త. కై బర్డ్, మార్టిన్ జె షెర్విన్ రచించిన రాబర్ట్ జీవిత చరిత్ర అమెరికన్ ప్రోమేథియస్ ఆధారంగా రూపొందించారు. కాగా.. ఇప్పటికే హాలీవుడ్ సమ్మె ప్రభావం ఈ చిత్రంపై ఉండదని మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: ఈమెని గుర్తుపట్టారా? మీరనుకునే హీరోయిన్ మాత్రం కాదు!) -
పేరుకే అతిపెద్ద స్క్రీన్.. ఐమాక్స్‌లో సినిమా కష్టాలు
సాక్షి, ఖైరతాబాద్: ఏ కొత్త సినిమా విడుదలైనా ప్రజలు ఐమాక్స్‌కు క్యూ కడతారు. అయితే నిర్వాహకులు సినిమాకు వచ్చే వారి వద్ద టికెట్ డబ్బులు వసూలు చేయడం తప్ప సందర్శకుల సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తున్నారు. సినిమాకు వచ్చేవారు సరైన పార్కింగ్ సదుపాయం లేక నరక యాతన పడుతున్నా యాజమాన్యం నో పార్కింగ్, పార్కింగ్ ఫుల్ అంటూ బోర్డులు పెట్టి చేతులు దులుపుకుంటోంది. పార్కింగ్ నిండిపోయిందని షో పూర్తయ్యే వరకు వేచి ఉండాలంటూ సెక్యురిటీ సిబ్బంది చెబుతుండటంతో సందర్శకులు దిక్కు తోచని స్థితిలో రోడ్డుపైనే వాహనాలను పార్కింగ్ చేసి హడావిడిగా షో టైం అవుతోందని పరుగులు తీస్తున్నారు. దీంతో ఐమాక్స్ నుంచి ఇందిరాగాంధీ చౌరస్తా వరకు ట్రాఫిక్ జాం అవుతోంది. గతంలో ఐమాక్స్ పక్కన ఉన్న హెచ్ఎండీఏ స్థలంలో కార్లను పార్కింగ్ చేసుకునేవారు. ప్రస్తుతం ఆ స్థలంలో అంబేడ్కర్ విగ్రహ నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. దీంతో సదరు స్థలంలో పార్కింగ్ చేసుకునేందుకు వీలులేకుండా పోయింది. ఐమాక్స్ ఎదురుగా ఉన్న జీహెచ్ఎంసీ స్థలంలో స్థలంలోనూ ఖైరతాబాద్ ప్రాంత వాసులకోసం మల్టీ లెవల్ ఫంక్షన్‌హాల్ నిర్మిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ స్వయంగా ప్రకటించారు. ఆ స్థలంలో ప్రస్తుతం పార్కింగ్ కాంట్రాక్టు దక్కించుకున్న వ్యక్తులు బైక్‌కు రూ. 30, కార్లకు రూ. 50 చొప్పున వసూలు చేస్తున్నారు. ఐమాక్స్‌లో అతిపెద్ద సినిమా థియేటర్‌తో పాటు మొత్తం 6 థియేటర్లు ఉంటాయి. ఇవన్నీ నిండితే ఒకేసారి 500 పైగా కార్లు, బైక్‌లు వస్తాయి. ఐమాక్స్ సెల్లార్లో కేవలం 100 నుంచి 150 కార్లు, బైక్‌లకు మాత్రమే పార్కింగ్ సౌకర్యం ఉంది. దీంతో మిగతా వాహనాలను రోడ్డుపై పార్క్ చేసుకోవాల్సిందే. యాజమాన్యం సందర్శకుల ఇబ్బందులను పట్టించుకోవడం లేదనేందుకు గురువారం రాత్రి జరిగిన సంఘటనే నిదర్శనం. రాత్రి 11.15 నిమిషాలకు చివరి షోకు సందర్శకులు ఎస్కలేటర్ మీదుగా వెళ్తుండగా, అటు వైపు నుంచి షో ముగించుకొని వచ్చిన వారు ఎదురుగా రావడంతో ఎస్కలేటర్‌పై ఉన్న వారు ముందుకు వెళ్లేందుకు స్థలం లేక కేకలు వేశారు. వెంటనే ఎస్కలేటర్‌ను ఆపివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. -
ఫంక్షన్.. ఉండదిక టెన్షన్
సాక్షి హైదరాబాద్: నగరంలోని ఐమాక్స్ దగ్గరలో అత్యాధునిక మల్టీపర్పస్ కన్వెన్షన్ హాల్ నిర్మించనున్నారు. ప్రజల సదుపాయార్థం హెచ్ఎండీఏకు చెందిన కోట్లాది రూపాయల విలువైన స్థలంలో దీనిని నిర్మించనున్నారు. సంపన్నులు తమ శుభకార్యాలకు వినియోగించే ఫంక్షన్ హాళ్ల మాదిరిగా వివిధ వర్గాల వారికి సైతం తగిన సదుపాయాలతో కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి జీహెచ్ఎంసీ సిద్ధమైంది. మంత్రి కేటీఆర్ చొరవతో.. ఐమాక్స్ సమీపంలోని ఇందిరానగర్‌లో డబుల్బెడ్రూం ఇళ్ల ప్రారంభోత్సవానికి ఇటీవల హాజరైన మంత్రి కేటీఆర్‌ను స్థానిక ప్రజా ప్రతినిధులు సదరు స్థలాన్ని జీహెచ్ఎంసీకి అప్పగిస్తే మల్టీపర్పస్ కన్వెన్షన్ హాల్ నిర్మించవచ్చని సూచించారు. పేదలు, దిగువ మధ్యతరగతి సైతం సదుపాయంగా ఉంటుందని తెలిపారు. సమ్మతించిన మంత్రి.. ఇందుకోసం కోట్లాది రూపాయల విలువైన స్థలాన్ని ఫంక్షన్ హాల్ కోసం కేటాయించేలా చర్యలు తీసుకున్నారు. దాదాపు 7 వేల చదరపు గజాల ఖాళీస్థలంలో కన్వెన్షన్‌హాల్‌ను నిర్మించనున్నారు. అన్ని వర్గాలకూ అందుబాటులో.. పేదలు, సంపన్నులు అనే తేడా లేకుండా అన్ని వర్గాల వారికి సదుపాయంగా ఉండేలా నిర్మించే యోచనలో అధికారులున్నారు. అందుకుగాను తగిన డిజైన్లు తదితరమైన వాటి కోసం ‘ఆర్ట్ ఆఫ్ ది స్టేట్‌గా’ ఉండేలా కన్సల్టెన్సీ సేవల కోసం టెండర్లు పిలిచారు. స్ట్రక్చరల్, సివిల్, ఎలక్ట్రికల్‌కు సంబంధించిన ఇంజినీరింగ్ డ్రాయింగ్స్‌తో పాటు ఫైర్‌సేఫ్టీ, ల్యాండ్ స్కేపింగ్ తదితర ఏర్పాట్లన్నీ సవివరంగా, సమగ్రంగా డీపీఆర్ సమర్పించాల్సిందిగా కన్సల్టెన్సీలను ఆహ్వానించారు. ఎన్ని అంతస్తులు, ఎంత వ్యయం కానుంది వంటి వివరాలను సైతం కన్సల్టెన్సీలు అందజేయాలి. డిజైన్ ఖరారయ్యాక పనులు ప్రారంభించనున్నారు. ప్రాజెక్టు పూర్తయి. ప్రజలకు వినియోగంలోకి వచ్చేంతవరకు ఎంపికయ్యే కన్సల్టెన్సీ సంస్థ పనిచేయాల్సి ఉంటుంది. ప్రముఖ ప్రదేశాలకు చేరువలో.. ఐమాక్స్‌కు ఎదురుగా నిర్మించబోయే మల్టీపర్పస్ కన్వెన్షన్ హాల్‌కు సమీపంలోనే కొత్త సచివాలయం రానుంది. దాని నిర్మాణ పనులు పగలూ, రాత్రి వేగంగా జరుగుతున్నాయి. కన్వెన్షన్ హాల్‌కు దగ్గరలోనే రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్.అంబేడ్కర్ 125 అడుగుల ఎత్తయిన విగ్రహం కూడా ఏర్పాటు కానుంది. హుస్సేన్‌సాగర్, ఎన్టీఆర్ గార్డెన్, లుంబినీ పార్కు సైతం సమీపంలోనే ఉన్నాయి. (చదవండి: రైళ్లు ఢీకొనకుండా...ఆటోమెటిక్ ట్రెయిన్ ప్రొటెక్షన్ సిస్టం ‘కవచ్’) -
shop.. eat.. & సెలబ్రేట్
ఒకప్పుడు థియేటర్లో సినిమా అంటే.. నేల టికెట్ల నుంచి వినిపించే ఈలలు.. గోలలు. కత్తిలాంటి సీన్‌కు బాల్కనీ నుంచి కురిసే కాగితాలు.. ఇవన్నీ ఉంటేనే సినిమా చూసినట్టు. మారుతున్న కాల ం.. థియేటర్ స్వరూపాన్నే మార్చేసింది. తారల తళుకులు కనిపించే తెరను మల్టీస్క్రీన్లుగా మార్చి.. అన్ని రకాల ఆనందాలకు నెలవుగా చేసేశారు. ఎంట్రీ నుంచి ఎగ్జిట్ వరకు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండే కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ జోన్‌గా తీర్చిదిద్దారు. మల్టీప్లెక్స్‌లోకి అడుగుపెట్టిన వాళ్లను సినిమా రెండున్నర గంటలు కట్టిపడేస్తే.. మాల్లో కళ్లు చెదిరే షాపులు రోజంతా ఎంగేజ్ చేస్తాయి. వెరైటీ రుచులు గాలం వేస్తాయి. నగరంలో ఎంట్రీతోనే సక్సెస్ కొట్టిన మల్టీప్లెక్స్‌లు హైదరాబాదీలకు మరింత దగ్గరవ్వడంతో.. బిజినెస్మెన్లు ఒంటరి థియేటర్లను రంగుహంగుల మల్టీప్లెక్స్‌లుగా మార్చేస్తున్నారు. హైదరాబాద్ కొత్తదనానికి చిరునామాగా మారుతోంది. అంతర్జాతీయ నగరాలతో అన్నింటా పోటీపడుతోంది. నయా పోకడలను కూడా అంతే తొందరగా మమేకం చేసుకుంటోంది. థియేటర్ల విషయంలోనూ ‘మల్టీ’ట్రెండ్ సక్సెస్ కొడుతోంది. భారీ మాల్స్‌లో మల్టీప్లెక్స్‌కు చోటిచ్చి బిజినెస్మెన్ హైదరాబాదీల మనసు దోచేస్తున్నారు. ఒంటరి థియేటర్లను మల్టీ స్క్రీన్లుగా మలిచి.. ప్లెంటీ లాభాలు పొందుతున్నారు. ‘తెర’మరుగవుతున్నాయి.. ఒకప్పుడు హైదరాబాద్ అంటే చారిత్రక కట్టడాలకే కాదు సినిమా థియేటర్లకు కేరాఫ్ అడ్రస్. 1927లో నగరంలో మొదటి థియేటర్‌గా పేరొందిన ‘రాయల్’ టాకీస్ ఓ వెలుగు వెలిగింది. రామ్‌కోఠిలోని హనుమాన్ వ్యాయామశాల ఏరియాలో ఉన్న ఈ టాకీస్, ఇక్కడే హౌస్‌ఫుల్ కలెక్షన్లతో నడిచిన ‘దిల్షాద్’ థియేటర్ తెరమరుగయ్యాయి. ఐదు దశాబ్దాల క్రితం గోల్కొండ కోట సమీపంలో పరదాలపైనే సినిమాలు ప్రదర్శించేవారు. తర్వాత అక్కడ ‘తస్వీర్ మహల్’ థియేటర్‌ను కట్టారని చరిత్రకారులు చెబుతుంటారు. రాణి రజియా బేగం సినిమాలను చూసేందుకు వారింట్లోనే రెండో అంతస్తును థియేటర్‌గా మార్చారట. 50 సీట్ల సామర్థ్యం ఉండేదట. తర్వాత ఈ థియేటర్‌నే ‘లైట్ హౌస్’గా పేరు మార్చారు. 1948లో ముషీరాబాద్‌లో ‘రహత్ మహల్’ థియేటర్‌ను నిర్మించారు. రాజాడీలక్స్గా పేరు మార్చుకున్న ఈ థియేటర్.. ప్రస్తుతం శ్రీసాయిరాజాగా అలరిస్తోంది. అబిడ్స్‌లో ఇప్పుడున్న బిగ్‌బజార్ స్థానంలో ఒకప్పుడు ‘ప్యాలెస్’ థియేటర్ ఉండేది. మోజంజాహి మార్కెట్లోని ‘నవరంగ్’ థియేటర్ షాపింగ్ కాంప్లెక్స్‌గా, ‘విక్రాంత్’ థియేటర్ రేస్ కోర్స్ కార్యాలయంగా మారిపోయాయి. మోండామార్కెట్ దగ్గర్లోని రాజేశ్వరీ టాకీస్‌కు నగరంలోనే మొదటి డీలక్స్ థియేటర్‌గా గుర్తింపు ఉండేది. అదే బాటలో నేటి థియేటర్లు.. ఈ మధ్య కాలంలో మూతపడుతున్న థియేటర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఏడాదిగా నగరంలో సమారు 10 థియేటర్ల వరకు మూతపడ్డాయి. నారాయణగూడలోని వెంకటేశ, శ్రీనివాస, దీపక్ థియేటర్లు, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని ఓడియన్ డీలక్స్, 70 ఎంఎం, మినీ ఓడియన్, సుదర్శన్ 70 ఎంఎం థియేటర్లు ఇటీవల మూతపడ్డాయి. వీటిలో చాలా వరకు ఫంక్షన్ హాళ్లుగా, షాపింగ్ మాల్స్‌లా మారుతున్నాయి. తొలి ‘ఐమాక్స్’ నగరంలోనే.. నగరంలో థియేటర్ల చరిత్ర ఇలా ఉంటే, సౌతిండియాలో తొలి ఐమాక్స్ థియేటర్ ఏర్పాటైంది హైదరాబాద్‌లోనే. 2003లో ప్రసాద్ మీడియా కార్పొరేషన్ లిమిటెడ్ నెక్లెస్ రోడ్లో ‘ప్రసాద్ ఐమాక్స్’ పేరుతో మల్టిప్లెక్స్‌ను నిర్మించింది. ఇందులో 5 స్క్రీన్లపై సినిమాలాడుతున్నాయి. ఒకదాని వెనుక మరొకటి.. ఐమాక్స్ రాకతో నగరవాసుల్లో మల్టీప్లెక్స్‌పై మోజు పెరిగింది. దీన్ని గమనించిన దేశ, విదేశీ కంపెనీలు నగరంలో మల్టీప్లెక్స్‌ల నిర్మాణానికి క్యూ కట్టాయి. పంజగుట్ట సర్కిల్లో ప్యాంటలూన్ రిటైల్ ఇండియా లిమిటెడ్ నిర్మించిన ‘హైదరాబాద్ సెంట్రల్ ’ మాల్లో 5 స్క్రీన్ల మల్టీప్లెక్స్ ఉంది. బంజారాహిల్స్‌లోని రోడ్ నంబర్ 1లోని ‘జీవీకే వన్’ మాల్లో 6 స్క్రీన్లు ప్రేక్షకులను రంజింపజేస్తున్నాయి. కొంపల్లిలో సినీప్లానెట్, బంజారాహిల్స్‌లో సినీమాక్స్, అమీర్‌పేటలో బిగ్‌బజార్, మాదాపూర్‌లో ఇనార్బిట్‌మాల్, కూకట్‌పల్లిలో మంజీరా ట్రినిటీ వంటివెన్నో మల్టీ స్క్రీన్లతో ప్రేక్షకులకు మల్టీ ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నాయి. ఉప్పల్‌లోని ఓ షాపింగ్ మాల్లో ఇటీవల ఏషియన్ సినిమాస్ ‘సినీ స్క్వేర్’ పేరుతో 4 స్క్రీన్లు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇదే సంస్థ త్వరలోనే అత్తాపూర్‌లో మల్టీప్లెక్స్‌లు నిర్మించనుంది. ఆల్ ఇన్ వన్ బెస్ట్ చాయిస్ బిజీలైఫ్‌లో రిలాక్స్ కోసం, వీకెండ్స్ జోష్ కోసం మెట్రోవాసులు షాపింగ్ మాల్స్‌కు వస్తున్నారు. థియేటర్ అంటే సినిమా, షాపింగ్, ఫన్ ఇలా అన్నీ ఒక్క చోటుండే కేంద్రమని నేటి మెట్రోవాసుల అభిప్రాయం. దాన్ని ఫుల్‌ఫిల్ చేయడమే వ్యాపార సూత్రం. అందుకే మల్టీప్లెక్స్, మాల్స్‌కు ఆదరణ పెరుగుతోంది. - మంజీరా గ్రూప్ సీఎండీ యోగానంద్ వచ్చేస్తున్నాయ్.. నగరంలో 2015 చివరి నాటికి 24 షాపింగ్ మాళ్లు అందుబాటులోకి రానున్నాయి. వీటిల్లో 60కి పైగా స్క్రీన్లు ఉంటాయని అంచనా. డజనుకు పైగా మాల్స్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి కూడా. * కొండాపూర్‌లో శరత్స్ సిటీ క్యాపిటల్ నిర్మిస్తున్న షాపింగ్ మాల్లో 7 స్క్రీన్లకు ప్లాన్ చేస్తున్నారు. * ల్యాంకోహిల్స్ సంస్థ ల్యాంకోహిల్స్‌లో 12 స్క్రీన్లతో మెగామాల్ నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోంది. * శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ సంస్థ ప్యాట్నీ సర్కిల్లో 4 స్క్రీన్ల మల్టీప్లెక్స్‌తో ఓ షాపింగ్ మాల్ నిర్మిస్తోంది. * ఇదే సంస్థ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని ఓడియన్ కాంప్లెక్స్‌లో 6 స్క్రీన్లతో భారీ షాపింగ్‌మాల్ నిర్మిస్తోంది. సుదర్శన్ థియేటర్ స్థానంలో కూడా షాపింగ్ మాల్ కం మల్టీప్లెక్స్ కూడా నిర్మిస్తోంది. బేగంపేటలో కమర్షియల్ కాంప్లెక్స్, గచ్చిబౌలిలో భారీ మాల్, హోటల్‌ను నిర్మిస్తోంది. వీటిల్లో కూడా మల్టీప్లెక్స్‌లకు ప్లాన్ చేస్తోంది. * ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ సంస్థ మియాపూర్‌లో ‘ఎస్ఎంఆర్ వినయ్’ పేరుతో మెట్రో షాపింగ్ విత్ మల్టీప్లెక్స్ నిర్మిస్తుంది. ఇదే ప్రాంతంలో 6 స్క్రీన్లతో మరో మాల్ ప్లాన్ చేస్తోంది. * ఫీనిక్స్ గ్రూప్ కూకట్‌పల్లిలో 11 స్క్రీన్ల మల్టీప్లెక్స్‌తో ఫీనిక్స్ లోటస్ మాల్ డిజైన్ చేస్తోంది. * కూకట్‌పల్లిలో ఐజేఎం (ఇండియా) ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మల్టీప్లెక్స్‌తో ‘రెయిన్‌ట్రీ మాల్’ను నిర్మిస్తోంది. ‘మెట్రో’రూట్లో మల్టీప్లెక్స్.. హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ‘మెట్రో’రూట్లో కూడా మల్టీప్లెక్స్‌లు దూసుకుపోనున్నాయి. మెట్రోకారిడార్లలో కళ్లు చెదిరే మాల్స్‌తో పాటు మల్టీప్లెక్స్‌లు కనువిందు చేయనున్నాయి. హైటెక్‌సిటీ, పంజాగుట్ట, ఎర్రగడ్డ, మూసారాంబాగ్ , అమీర్‌పేట్, సికింద్రాబాద్, బాలానగర్, ఎల్బీనగర్, ముషీరాబాద్, రాయదుర్గం ప్రాంతాల్లో మెట్రో మాల్స్ రానున్నాయి. ప్రస్తుతం పంజగుట్టలో షాపింగ్‌మాల్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ప్రాజెక్ట్ పూర్తి అయ్యాక మాల్స్, మల్టీప్లెక్స్‌ల నిర్మాణానికి మెట్రో నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. - శ్రీనాథ్ ఆడెపు -
ప్రేయసి తప్పని చెప్పడానికి ఐమాక్స్ థియేటర్ల బుకింగ్
ప్రేయసి మెప్పు పొందడానికి యువకులు కష్టాలు తప్పవనేది కాదనలేని వాస్తవం. చైనాలోని ఓ పేద ప్రేమికుడికి ప్రేయసిని ఒప్పించడానికి చాలానే కష్టపడాల్సి వస్తోంది. ఏడేళ్ల క్రితం తన ప్రేమని రిజెక్ట్ తీరు తప్పు అని నిరసన వ్యక్తం చేస్తూ ఓ చైనా యువకుడు హు జియా యూన్ 40 వేల డాలర్లు పెట్టి 'ట్రాన్స్ ఫార్మర్స్' అనే చిత్రం చూసేందుకు మొత్తం నాలుగు ఐమాక్స్ సినిమాహాళ్లను తొలి రోజు తొలి ఆటకు బుక్ చేశారు. 2007లో కళాశాల విద్యలో నాలుగవ సంవత్సరం చదువుతున్న సమయంలో తాను చాలా పేదవాడిని. ఆసమయంలో రెండు సినిమా టికెట్లు కొనే స్థోమత కూడా లేదు అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రేయసి విధించిన శిక్ష తలచుకుంటూ గత ఏడు సంవత్సరాలుగా చాలా కష్టపడి పనిచేస్తున్నాను. జూన్ 27 తేదిన బీజింగ్ లోని ఐమాక్స్ సినిమా హాళ్లలో ఓ నెల సంపాదనలోని సగం మొత్తాన్ని ఖర్చు చేశానన్నారు. తన ప్రేయసి తీసుకున్న నిర్ణయం తప్పని చేప్పడానికే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని అన్నారు. తన ప్రేయసిని చూసేంత వరకు ఈ వార్తను ఇంటర్నెట్ వినియోగదారులు పోస్ట్ చేయాలని.. ప్రతిఫలంగా నగదు బహుమతితోపాటు ఉచితంగా సినిమా టికెట్లను అందిస్తాను అని ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. ఒకవేళ తనను విడిచి వెళ్తే.. నేను నీకోసమే ఉంటాననే విషయాన్ని ప్రపంచానికి తెలియచేస్తానని ఆమెను కలుసుకున్న తొలి రోజే చెప్పానని యూన్ తెలిపారు.