ప్రేయసి తప్పని చెప్పడానికి ఐమాక్స్ థియేటర్ల బుకింగ్
Published Fri, Jun 27 2014 5:51 PM | Last Updated on Mon, Aug 13 2018 3:35 PM
ప్రేయసి మెప్పు పొందడానికి యువకులు కష్టాలు తప్పవనేది కాదనలేని వాస్తవం. చైనాలోని ఓ పేద ప్రేమికుడికి ప్రేయసిని ఒప్పించడానికి చాలానే కష్టపడాల్సి వస్తోంది. ఏడేళ్ల క్రితం తన ప్రేమని రిజెక్ట్ తీరు తప్పు అని నిరసన వ్యక్తం చేస్తూ ఓ చైనా యువకుడు హు జియా యూన్ 40 వేల డాలర్లు పెట్టి 'ట్రాన్స్ ఫార్మర్స్' అనే చిత్రం చూసేందుకు మొత్తం నాలుగు ఐమాక్స్ సినిమాహాళ్లను తొలి రోజు తొలి ఆటకు బుక్ చేశారు.
2007లో కళాశాల విద్యలో నాలుగవ సంవత్సరం చదువుతున్న సమయంలో తాను చాలా పేదవాడిని. ఆసమయంలో రెండు సినిమా టికెట్లు కొనే స్థోమత కూడా లేదు అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రేయసి విధించిన శిక్ష తలచుకుంటూ గత ఏడు సంవత్సరాలుగా చాలా కష్టపడి పనిచేస్తున్నాను. జూన్ 27 తేదిన బీజింగ్ లోని ఐమాక్స్ సినిమా హాళ్లలో ఓ నెల సంపాదనలోని సగం మొత్తాన్ని ఖర్చు చేశానన్నారు.
తన ప్రేయసి తీసుకున్న నిర్ణయం తప్పని చేప్పడానికే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని అన్నారు. తన ప్రేయసిని చూసేంత వరకు ఈ వార్తను ఇంటర్నెట్ వినియోగదారులు పోస్ట్ చేయాలని.. ప్రతిఫలంగా నగదు బహుమతితోపాటు ఉచితంగా సినిమా టికెట్లను అందిస్తాను అని ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. ఒకవేళ తనను విడిచి వెళ్తే.. నేను నీకోసమే ఉంటాననే విషయాన్ని ప్రపంచానికి తెలియచేస్తానని ఆమెను కలుసుకున్న తొలి రోజే చెప్పానని యూన్ తెలిపారు.
Advertisement