immortal heroes
-
అమరుల కుటుంబాలను గౌరవించాలి
సుభాష్‌నగర్ : ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ఆత్మబలిదానాలు చేసుకున్న అమరుల త్యాగాలు స్మరించు కోవడానికే సంస్మరణ దినోత్సవం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు తెలిపారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం కలెక్టరేట్లో అమరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జెడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా, నగర మేయర్ దండు నీతూకిరణ్, అదనపు కలెక్టర్ చిత్ర మిశ్రా, అధికారులు హాజరయ్యారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ కోసం త్యాగం చేసిన వారి కుటుంబాలను గౌరవించుకోవడం కోసమే కార్యక్రమం చేపట్టామన్నారు. ఉద్యమంలో జిల్లాలో 32 మంది ఆత్మబలిదానాలు చేసుకున్నారని, వారి కు టుంబానికి రూ.10 లక్షల చొప్పున నగదు అందించామని, 30 మందికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించా మన్నారు. మరో రెండు కుటుంబాలకు కూడా ఉ ద్యోగాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. 21 రోజుల పా టు గ్రామ, మండల, జిల్లా స్థాయి అధికారులు దశాబ్ది ఉత్సవాల్లో పాల్గొని విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అండగా సీఎం కేసీఆర్ ఉద్యమంలో అమరులైన వారి కుటుంబాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదుకుంటున్నారని జెడ్పీ చైర్మన్ విఠల్‌రావు అన్నారు. 2001 నుంచి కేసీఆర్‌తో అడుగులో అడుగు వేసి ఉద్యమంలో పాల్గొన్నామన్నారు. అన్ని వర్గాల ప్రజల సహకారంతో తెలంగాణ సాధించి 9 ఏళ్లలో ఎంతో అభివృద్ధి సాధించామన్నారు. అమరుల త్యాగ ఫలితమే తెలంగాణ అమరుల త్యాగంతోనే తెలంగాణ ఏర్పడిందని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా అన్నారు. నిజామాబాద్ నగరంలో 8 మంది యువకులు ఆత్మబలిదానం చేసుకున్నారని గుర్తుచేశారు. వారి లోటు మరువలేనిదని, బాధిత కుటుంబ సభ్యులకు రూ.10 లక్షల నగదు అందజేసి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించామన్నారు. మేయర్ నీతూకిరణ్ మాట్లాడుతూ అమరవీరులను స్మరించుకోవడం, వారి కుటుంబాలను సన్మానించుకోవడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన ఉద్యోగ సంఘాల నాయకులను విస్మరించడం సరికాదని, కార్యక్రమ సమాచారం, ఆహ్వానం అందలేదని టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు అలుక కిషన్ పేర్కొన్నారు. అనంతరం అమరుల కుటుంబ సభ్యులను సన్మానించారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ రజిత యాదవ్, నుడా చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు అలుక కిషన్, కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు. -
వీరులారా వందనం...రాష్ట్ర సాధనకు అనేకమంది ఆత్మబలిదానం
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఎంతోమంది ఆత్మబలి దానాలతో నేటి స్వరాష్ట్రం ఏర్పడింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొమ్మిదేళ్లు పూర్తయి పదో ఏడాదిలోకి అడుగు పెడుతున్న వేళ దశాబ్ది ఉత్సవాల నిర్వహణ కొనసాగుతోంది. ఈ ఉత్సవాల్లో భాగంగా నేడు గురువారం అమరవీరుల సంస్మరణ దినో త్సవం నిర్వహించనున్నారు. అమరుల్లో విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, రైతులు, మహిళలు ఉన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఎంతో మంది తెలంగాణ ఏర్పాటును కాంక్షిస్తూ ఆత్మబలి దానం చేశారు. వీరిలో కొందరికి మాత్రమే ప్రభుత్వం నుంచి సాయం అందింది. మరికొందరికి స్థాని క నాయకులు, రాజకీయ పార్టీల నుంచి సాయం అందింది. ఇప్పటికీ తమ కుటుంబాలకు న్యాయం జరగలేదని బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తెలంగాణ కోసం ఆత్మబలిదానాలు చేసుకున్న వారిలో 27మందికి రూ.పది లక్షల చొప్పున ఆర్థిక సాయం అందింది. ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు. కొందరికి ఇవ్వాల్సి ఉంది. ఇప్పటికీ కొంతమంది అమరుల కుటుంబాలకు ఎటువంటి సాయం అందలేదు. బెల్లంపల్లిలో తెలంగాణ ఉద్యమంలో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. వీరిలో పిన్న రాజ్‌కుమార్ అనే వ్యక్తి భార్య పద్మకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించారు. ప్రస్తుతం మంచిర్యాల ఆర్డీఓ కార్యాలయంలో అటెండర్‌గా పనిచేస్తోంది. ప్రభుత్వ పరంగా రూ.10 లక్షల ఆర్థిక సాయం కూడా అందజేశారు. ● 2012లో ఆదిలాబాద్‌కు చెందిన సంతోష్ హైదరాబాద్‌లోని ప్రైవేటు కాలేజీలో డిగ్రీ చదువుతుండేవాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఓయూ క్యాంపస్‌లో ఆర్ట్స్ కాలేజీ ముందే ఓ చెట్టుకు ఉరి వేసుకుని ప్రాణత్యాగం చేశాడు. ఆత్మహత్యతో ఓయూ అట్టుడికింది. అమరుని కుటుంబానికి రూ.పది లక్షల సాయం అందింది. ● 2013లో ఆదిలాబాద్ మండలం యాపల్గూడకు చెందిన పుంద్రువార్ నర్సింగ్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. అప్పట్లో ఎమ్మెల్యే జోగు రామన్న నేతృత్వంలో రాస్తారోకో చేశారు. ఈయన కుటుంబంలో ఒకరి ఉద్యోగం, రూ.పది లక్షల సాయం అందింది. అమరుల కుటుంబాలకు te ● బెల్లంపల్లికి చెందిన శ్రీనివాస్, రాజు అనే ఇద్దరు యువకులు కూడా స్వరాష్ట్రం కోసం ఆత్మార్పణ చేసుకున్నారు. కానీ వీరి ఆత్మహత్య కేసు పోలీ సు రికార్డుల్లో నమోదు కాలేదు. అందువల్ల ఇరువురు బాధిత కుటుంబాలకు ప్రభుత్వపరంగా ఆర్థిక సాయం అందలేదు. ఉద్యోగ అవకాశం కల్పించలేదు. ● చెన్నూర్ మండలం బావురావుపేట గ్రామానికి చెందిన ముత్యాల రాజగౌడ్, సుబ్బారాంపల్లి గ్రామానికి చెందిన బిల్కి మహేష్ ప్రాణత్యాగం చేశారు. అమరవీరుల ఆకాంక్షలు నెరవేరలే.. తెలంగాణ వస్తే బతుకులు బాగుపడుతా యని అనేకమంది ఆత్మబలిదానాలు చేసుకుంటే ఇప్పటికీ వారి ఆకాంక్షలు నెరవేరలే. కుటుంబ, గడీల పాలనలో సామాజిక న్యాయం జరగలేదు. ప్రజలు కోరుకున్న తెలంగాణ రాలేదు. నేటికీ రైతులు, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. – దుర్గం భాస్కర్, తెలంగాణ విద్యార్థి జేఏసీ చైర్మన్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి -
అమరుల స్మృతివనమేది?: కోదండరాం
సాక్షి, హైదరాబాద్: ప్రత్యే క తెలంగాణ రాష్టం ఏర్పడి ఆరేళ్లు కావస్తున్నా ఇప్పటివరకు అమర వీరులకు స్మృతివనాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించలేకపోయిందని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం విమర్శించారు. అమరుల స్మృతివనాన్ని నిర్మించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని, అన్ని సంఘాలను కలుపుకొని పోరాడతామని అన్నారు. శనివారం అసెంబ్లీ సమీపంలోని తెలంగాణ అమరుల స్తూపం వద్ద ఉద్యమంలో అమరులైన వారికి టీజేఎస్ నేతలతో కలిసి కోదండరాం నివాళులర్పించారు. హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో నామినేషన్లను దాఖలు చేసేందుకు వెళుతున్న సర్పంచ్‌లను ప్రభుత్వం అరెస్ట్ చేయడం సరికాదని, ఈ విషయంలో సీఈవో రజత్‌కుమార్ జోక్యం చేసుకోవాలని కోరారు. -
వీరులారా వందనం
హుస్నాబాద్ రూరల్: హుస్నాబాద్ మండలం మహ్మదాపూర్ గుట్టల్లో తెలంగాణ సాయుధ పోరాటంలో అసువులు బాసిన వీరుల జ్ఞాపకాలను నేటి ప్రజలు మరిచి పోవడం లేదు. నిజాం ప్రభుత్వ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగిన సాయుధ పోరాటంలో వీరమరణం పొందిన వీరుల జ్ఞాపకార్థం గుట్ట కింద అనభేరి ప్రభాకర్‌రావు, సింగిరెడ్డి భూపతిల సమాధులు నిర్మించి ప్రతి ఏటా సెప్టెంబర్ 17న, మార్చి 14 కమ్యూనిస్టులు నిర్వహించే సభలకు ప్రజలు పార్టీలకు అతీతంగా హాజరై వీరులకు నివాళులర్పించి ఆనాటి జ్ఞాపకాలను నేమరువేసుకుంటారు. మహ్మదాపూర్ శివారులోని ఎతైన గుట్టలు, ప్రకృతి సోయగాలు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకొనే ప్రకృతి సౌందర్యం కోటగిరి గుట్టల సొంతం. ప్రతీ శ్రావణమాసంలో పర్యటకులు గుట్టల ప్రదేశానికి వనభోజనాలకు వచ్చి ఆనందంగా గడిపి ఆనాటి తెలంగాణ వీరు త్యాగాలను స్మరించుకుంటారు. ప్రతీ ఏటా సీపీఐ అధ్వర్యంలో హుస్నాబాద్ నుంచి మహ్మదాపూర్ వరకు భారీ ర్యాలీ తీసి అమరుల వర్ధంతి సభను ఘనంగా జరుపుకుంటారు. 2016 సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం పేరున భారీతీయ జనతా పార్టీ మహ్మదపూర్లోని అమరుల వీర భూమిని సందర్శించి పర్యటక కేంద్రంగా మార్చుతామని చెప్పినా నేటికి ఆచరణలో అమలుకు నోచుకోలేదు. 14 మంది వీరుల మరణానికి గుర్తుగా నిర్మించిన శిలా ఫలకం సాయుధ వీరులకు స్థావరం ఈ కోటలు.... తెలంగాణ పేద ప్రజల విముక్తి కోసం నిజాం ప్రభుత్వ అరాచక పాలనను ఎదిరించిన తెలంగాణ సాయుధ పోరాట వీరులకు, హుస్నాబాద్ ప్రాంతానికి ఒక చరిత్ర ఉంది. సాయుధ పోరాటంలో పేదల విముక్తి కోసం పోరు చేసిన కమ్యూనిస్టులు పోలంపల్లికి చెందిన అనభేరి ప్రభాకర్‌రావు, íసిరిసిల్ల జిల్లా లక్ష్మీపూర్‌కు చెందిన సింగిరెడ్డి భూపతిరెడ్డిల దళాలు రజాకార్ల పోరు చేస్తూ మహ్మదాపూర్‌కు చేరుకున్నాయి. 14 మార్చి 1948లో పేద ప్రజలకు చైతన్యం చేస్తున్నక్రమంలో మహ్మదాపూర్లో సమావేశం అయినప్పుడు రజాకార్లు సమాచారం తెలుసుకొని సాయుధ దళాలపై దాడులు చేశాయి. రజాకార్ల తో పోరు చేస్తూ గుట్టలకు వెల్లుతున్న సాయుధులను రజాకార్లు వెంటబడి వేటాడి కాల్పులు జరుపడంతో అక్కడే 12 మంది వీరులు వీరమరణం పొందారు. దీంతో హుస్నాబాద్ ప్రాంతానికి ప్రత్యేకత చోటు చేసుకుంది. వీరుల జ్ఞాపకార్థం ఆనాటి దళనాయకులైన అనభేరి ప్రభాకర్‌రావు, సింగిరెడ్డి భూపతిరెడ్డి పేరుతో రెండు సమాధులు నిర్మించారు. ప్రతి ఏటా వర్ధతి రోజున సీపీఐ ఆధ్వర్యంలో సభలు నిర్వహిస్తూ వీరుల త్యాగలను గుర్తు చేసుకుంటారు. పర్యాటక కేంద్రం చేయాలి.. ఈ ప్రాంతాన్ని పర్యటక కేంద్రం చేయాలని ఆనాటి ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి ప్రతిపాదనలు పంపించారు. పర్యటక కేంద్రానికి వైఎస్ సానుకూలంగా స్పందించి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి ఆ దిశగా ప్రయత్నం సాగుతున్న క్రమంలో ఆయన మరణంతో పర్యటక కేంద్రం అక్కడే ఆగిపోయింది. ప్రస్తుత ప్రభుత్వం స్పందించి పర్యటక కేంద్రం ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని ఈ ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. -
పోలీసు అమర వీరుల సేవలు చిరస్మరణీయం
అనంతపురం మెడికల్: అంతర్గత భద్రత పర్యవేక్షణలో అసాంఘిక శక్తులు ఆటకట్టించే క్రమంలో అసువులు బాసిన పోలీసులు సేవలు చిరస్మరణీయమని, వారి స్ఫూర్తితో ప్రజాసేకు పునరంకితం అవుదామని ఎస్పీ రాజశేఖర్‌బాబు అన్నారు. పోలీసు అమర వీరుల సంస్మరణ వారాత్సవాల సంద్భరంగా స్థానిక సర్వజన ప్రభుత్వాస్పత్రిలో సోమవారం ఆత్మకూరు సీఐ విజయకుమార్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఎస్పీతోపాటు రిజిస్ట్రార్ హేమచంద్రారెడ్డి, ఆస్పత్రి ఆర్ఎంఓ కన్నెగంటి భాస్కర్, రక్తనిధి ఇన్చార్జి డాక్టర్ శివకుమార్, డీఎస్పీ నాగరాజు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఎస్పీ మాట్లాడుతూ యూనిఫారం ధరించి ఫోర్స్‌లు తాము నమ్మిన సిద్ధాంతాల కోసం త్యాగాలు చేస్తాయన్నారు. సమాజ పరిరక్షణలో భాగంగా అసాంఘిక శక్తులతో జరిగే పోరాటంలో పోలీసులూ అసువులు భాస్తున్నారన్నారు. 2006 తరువాత రాష్ట్రంలో మావోయిజం దాదాపు తుడిచిపెట్టుకు పోయిందన్నారు. పోలీసులు అంకిత భావంతో పనిచేయడం వల్లనే ఇది సాధ్యమయ్యిందన్నారు. ఈ రోజు ఏపీలో స్వేచ్ఛాయుత వాతావరణం నెలకొందంటే దాని వెనుక ఎందరో పోలీసులు ప్రాణత్యాగం ఉందన్నారు. రిజిస్ట్రార్ హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ సమాజ శ్రేయసు కోసం రక్షణగా నిలుస్తున్న పోలీసులకు సమాజం బాసటగా నిలవాలని అన్నారు. పోలీసులు సమాజసేవలో తమ ప్రాణాలను సైతం అర్పిస్తున్నారన్నారు. కన్నెగంటి బాస్కర్, శివకుమార్, నాగరాజులు మాట్లాడారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ఎస్పీ, రిజిస్ట్రార్ ప్రారంభించారు. రక్తదానం చేసిన వారికి ప్రశంసాపత్రాలను అందజేశారు. ఎస్ఎస్బీఎన్, ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు రక్తదానం చేశారు.