సంస్కరణలపై ఏం చేద్దాం?
నేడు బీసీసీఐ ఎస్జీఎం
ఠాకూర్ అఫిడవిట్‌పై చర్చ
న్యూఢిల్లీ: జస్టిస్ ఆర్ఎం లోధా సంస్కరణల అమలు విషయంలో బీసీసీఐ ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. కచ్చితంగా అమలు చేయాల్సిందేనని సుప్రీం కోర్టు విస్పష్టంగా ప్రకటించిన నేపథ్యంలో నేడు (శనివారం) బోర్డు ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్జీఎం) అత్యంత కీలకంగా మారింది. నిజానికి ఈనెల 7నే కోర్టు తుది తీర్పు ఇవ్వాల్సి ఉన్నా 17కు వారుుదా పడడంతో బోర్డు కాస్త ఊపిరి పీల్చుకుంది. అరుుతే ఆలోపునే బీసీసీఐ చీఫ్ అనురాగ్ ఠాకూర్‌ను అఫిడవిట్‌ను దాఖలు చేయాల్సిందిగా కోర్టు ఆదేశించింది. ఇప్పుడు ఎస్‌జీఎంలో ఇదే ప్రధాన చర్చ కానుంది. లోధా ప్యానెల్ ప్రతిపాదనలను అమలు చేస్తే ప్రభుత్వ జోక్యంగా పరిగణిస్తూ, బీసీసీఐని నిషేధిస్తామంటూ లేఖ రాయాలని అనురాగ్ ఠాకూర్ ఐసీసీకి గతంలో లేఖ రాశారు.
ఈ విషయంలో కోర్టు సీరియస్ అరుు వ్యక్తిగతంగా అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా ఆదేశించింది. మరోవైపు లోధా ప్యానెల్ సూచించిన ప్రతిపాదనల్లో ఒక రాష్ట్రం.. ఒక ఓటు, మూడేళ్ల కూలింగ్ పీరియడ్ వంటి అంశాలు బోర్డుకు ఏమాత్రం రుచించడం లేదు. వీటిని ఆయా రాష్ట్ర సంఘాలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారుు. సోమవారం కోర్టు తీర్పు వెలువరించనున్న దృష్ట్యా ప్రతిపాదనలపై బోర్డుకు ఇవే చివరి చర్చలుగా మారారుు. ‘ఒక రాష్ట్రం.. ఒక ఓటు నిబంధనకు మేం వ్యతిరేకం కాదు. అరుుతే ఓట్ల సంఖ్యను ఎందుకు పెంచకూడదనే మేం అడగదల్చుకున్నాం. మణిపూర్, మిజోరాం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ ఇప్పటికే ఓటు హక్కు కలిగి ఉన్నారుు. ఇదే సమయంలో ముంబై, సౌరాష్ట్ర ఎందుకు తమ ఓటును కోల్పోవాలి?’ అని ఈశాన్య రాష్ట్రాలకు చెందిన అధికారి ఒకరు ప్రశ్నించారు. అలాగే మూడేళ్ల పదవీ కాలానికి మూడేళ్ల కూలింగ్ పీరియడ్ కూడా సభ్యులకు ఆమోదయోగ్యం కాదని అన్నారు. ఎక్కువ మంది దీన్ని ఆరేళ్ల పాటు రెండు పర్యాయాలు చేయాలని భావిస్తున్నట్టు చెప్పారు. ఇదిలావుండగా ఇప్పటికే విదర్భ, త్రిపుర రాష్ట్ర సంఘాలు బేషరతుగా లోధా సంస్కరణల అమలుకు ముందుకువచ్చారుు.