Inagaluru
-
అపాచీ పరిశ్రమతో 10 వేల మందికి ఉద్యోగాలు : సీఎం జగన్
సాక్షి, తిరుపతి జిల్లా: శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఇనగలూరులో రూ. 700 కోట్లతో ఏర్పాటు చేయబోతున్న అపాచీ పరిశ్రమకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. ఇనగలూరులో అపాచీ పరిశ్రమ ఏర్పాటు చేయడం సంతోషకరమైన విషయమన్నారు. మొదటి దశలో రూ.350 కోట్లు, వచ్చే ఐదేళ్లలో మరో 350 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు సీఎం జగన్ తెలిపారు. అపాచీ పరిశ్రమలో అడిడాస్ షూలు, లెదర్ జాకెట్స్, బెల్ట్లు వంటి ఉత్పత్తులను తయారు చేస్తారు. అపాచీ పరిశ్రమ ఏర్పాటుతో 10 వేల మందికి ఉద్యోగాలు అవకాశాలు లభిస్తాయన్నారు. 2023 సెప్టెంబర్ కల్లా పరిశ్రమ అందుబాటులోకి వస్తుందన్నారు. పరిశ్రమ ఏర్పాటుతో 80 శాతం మంది స్థానికులకే ఉద్యోగాలు వస్తాయని సీఎం జగన్ తెలిపారు. ఏపీ ప్రభుత్వం తోడ్పాటు మరువలేనిది: టోనీ పరిశ్రమల ఏర్పాటుకు సహకారం అందించిన ముఖ్యమంత్రి వైఎస్జగన్మోహన్రెడ్డికి అపాచీ కంపెనీ డైరెక్టర్ టోనీ కృతజ్ఞతలు తెలియజేశారు. పరిశ్రమల ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం అందించిన తోడ్పాటు మరువలేనిదన్నారు. పారిశ్రామికరంగాన్ని సీఎం జగన్ ప్రోత్సహిస్తున్నారన్నారు. చదవండి: (ఒక్క రూపాయికే పక్కా ఇల్లు) -
అపాచీ పరిశ్రమ ఏర్పాటుతో 10 వేల మందికి ఉద్యోగాలు: సీఎం వైఎస్ జగన్
-
ఏపీలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం సహకరించింది: అపాచీ కంపెనీ డైరెక్టర్ టోనీ
-
ఇనగలూరులో అపాచీ పరిశ్రమకు సీఎం జగన్ శంకుస్థాపన
-
రైతులకు విత్తనాలు సరఫరా చేయాలి: వైఎస్ జగన్
కడప: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన రెండోరోజు జిల్లాలో కొనసాగుతోంది. బుధవారం సాయంత్రం ఆయన తొండూరు మండలం ఇనగలూరులో వేరుశెనగ పంటలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు మొలకెత్తని విత్తానాల గురించి తమ గోడు వినిపించారు. నాసిరకం విత్తనాల వల్లే రైతులకు ఈ దుస్థితి ఏర్పడిందని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే రైతులకు విత్తనాలు సరఫరా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నాసిరకం విత్తనాలు ప్రభుత్వమే దగ్గరుండి సప్లయి చేస్తుందంటే సిగ్గుతో తల ఒంచుకోవాలని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి జులై 15వ తేదీ లోపు రైతులకు వేరుశెనగ విత్తనాలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. అన్నదాతకు అన్ని విధాలా అండగా ఉంటామన్నారు. అనంతరం వైఎస్ జగన్... జిల్లా కలెక్టర్కు ఫోన్ చేసి రైతులకు విత్తనాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.