కడప: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన రెండోరోజు జిల్లాలో కొనసాగుతోంది. బుధవారం సాయంత్రం ఆయన తొండూరు మండలం ఇనగలూరులో వేరుశెనగ పంటలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు మొలకెత్తని విత్తానాల గురించి తమ గోడు వినిపించారు.
నాసిరకం విత్తనాల వల్లే రైతులకు ఈ దుస్థితి ఏర్పడిందని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే రైతులకు విత్తనాలు సరఫరా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నాసిరకం విత్తనాలు ప్రభుత్వమే దగ్గరుండి సప్లయి చేస్తుందంటే సిగ్గుతో తల ఒంచుకోవాలని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి జులై 15వ తేదీ లోపు రైతులకు వేరుశెనగ విత్తనాలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. అన్నదాతకు అన్ని విధాలా అండగా ఉంటామన్నారు. అనంతరం వైఎస్ జగన్... జిల్లా కలెక్టర్కు ఫోన్ చేసి రైతులకు విత్తనాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.