భారతీయ అమెరికన్‌కు ఇండెక్స్ డిజైన్ అవార్డు
న్యూయార్క్: ఆహారాన్ని దీర్ఘకాలంపాటు తాజాగా ఉంచేందుకు దోహదపడే తాజా కాగితం(ఫ్రెష్ పేపర్) రూపొందించిన భారతసంతతి అమెరికన్ కవితశుక్లా ఇండెక్స్ డిజైన్ అవార్డును గెలుచుకున్నారు.ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి దోహదపడే అత్యుత్తమ ఆవిష్కరణలకు గుర్తింపుగా.. రూ.4.25 కోట్ల విలువైన ఈ అవార్డును రెండేళ్లకోసారి డెన్మార్క్ రాజధాని కోపెన్‌హాగెన్‌లో అందజేస్తారు. హోమ్ కేటగిరీలో శుక్లా ఎంపికయ్యారు. సాదాసీదాగా ఉండటమే కాకుండా ప్రతిఒక్కరికీ అందుబాటులో ఉండేవిధంగా ఉన్న ఫ్రెష్ పేపర్ ధర న్యాయనిర్ణేతలను విశేషంగా ఆక ర్షించింది. అమెరికా మార్కెట్లలో ఇది ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. రిఫ్రిజిరేటర్లు పరిమితంగా ఉన్న అభివృద్ధి చెందని ప్రాంతాల్లో ఇది బాగా ఉపయోగపడుతుందని ‘ఇండెక్స్’ జ్యూరీ చైర్మన్ మికాల్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.