Indexes
-
అచీవర్స్ జాబితాలో ఏపీ
-
స్టాక్ మార్కెట్ పతనానికి ఇవే కారణం
ముంబై : దేశీయ ఈక్విటీ మార్కెట్ గురువారం భారీ నష్టంతో ముగిసింది. ఐటీ తప్ప అన్ని రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తడంతో సూచీలు ఒక శాతాన్ని నష్టాన్ని చవిచూశాయి. సెన్సెక్స్ సూచీ 486 పాయింట్లను కోల్పోయి నష్టపోయి 52,569 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 152 పాయింట్లు పతనమై 15,728 వద్ద నిలిచింది. టెక్ దిగ్గజం టీసీఎస్ క్యూ1 ఆర్థిక ఫలితాల ప్రకటనకు ముందు ఐటీ షేర్లు మాత్రమే స్వల్పంగా లాభపడ్డాయి. అధిక వెయిటేజీ షేర్లను కలిగిన మెటల్, బ్యాంకులు, ఆటో, ఆర్థిక రంగాల ఇండెక్సులు రెండున్నర శాతం పతనాన్ని చవిచూశాయి. మెటల్ షేర్లలో అధిక విక్రయాలు జరిగాయి. చిన్న, మధ్య తరహా షేర్ల కంటే లార్జ్ క్యాప్ షేర్ల పతనం సూచీలకు అధిక నష్టాన్ని కలిగించింది. సెన్సెక్స్ సూచీలో మొత్తం 30 షేర్లకు గానూ ఐదు షేర్లు, నిఫ్టీ 50 షేర్లలో 7 మాత్రమే లాభపడ్డాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.555 కోట్ల విలువైన షేర్లను, దేశీయ ఇన్వెస్టర్లు రూ.949 కోట్ల షేర్లను విక్రయించారు. ఇంట్రాడే ట్రేడింగ్ ఇలా... ఆసియా మార్కెట్లలో ప్రతికూల సంకేతాలను అందుకున్న దేశీయ మార్కెట్ ఉదయం స్వల్ప నష్టంతో మొదలైంది. సెన్సెక్స్ 11 పాయింట్లు క్షీణించి 53,066 వద్ద, నిఫ్టీ 25 పాయింట్ల నష్టంతో 15,855 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. క్రమక్రమంగా అమ్మకాల ఉధృతి పెరగడంతో సూచీలు ఏ దశలో కోలుకోలేకపోయాయి. మిడ్‌సెషన్‌లో యూరప్ మార్కెట్ల నష్టాల ప్రారంభం సెంటిమెంట్‌ను మరింత దెబ్బతీసింది. ఒక దశలో సెన్సెక్స్ 626 పాయింట్ల పతనమై 52,429 వద్ద, నిఫ్టీ 173 పాయింట్లు నష్టపోయి 15,682 వద్ద ఇంట్రాడే కనిష్టాలను తాకాయి. చివర్లో అరగంటలో కనిష్ట స్థాయిల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు కొంత నష్టాలను పూడ్చుకోగలిగాయి. ‘ప్రపంచ మార్కెట్లలోని విక్రయాల సెగలు దేశీయ మార్కెట్‌ను తాకడంతో అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. టీసీఎస్ క్యూ1 ఫలితాలను ప్రకటనతో దలాల్ స్ట్రీల్లో ఆర్థిక ఫలితాల సందడి మొదలైంది. జొమాటో, పేటీఎంతో సహా మరిన్ని కంపెనీలు నిధుల సమీకరణకు ఐపీఓ బాట పట్టాయి. వచ్చే వారాల్లో రెండు అంశాలు మార్కెట్ గమనానికి ఎంతో కీలకం కానున్నాయి’’ అని జియోజిత్ ఫైనాన్షియల్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. నష్టాలకు నాలుగు కారణాలు..! పపంచ మార్కెట్లలో అమ్మకాలు... చైనాకు చెందిన దిది చుక్సింగ్, టెన్సెంట్, అలీబాబాలు సంస్థలు విలీనాలు, కొనుగోలు సరైన సమాచారాన్ని ఇవ్వలేదంటూ చైనా దేశ నియంత్రణ సంస్థ చర్యలకు ఉపక్రమించింది. దిగ్గజ కంపెనీలపై చైనా దుందుడుకు చర్యలతో ఆసియా మార్కెట్లు సెంటిమెంట్ దెబ్బతింది. హాంగ్‌కాంగ్ స్టాక్ మార్కెట్ మూడు శాతం క్షీణించి ఆరునెలల కనిష్టానికి దిగివచ్చింది. చైనా, సింగపూర్, జపాన్, థాయిలాండ్ కొరియా దేశాల స్టాక్ సూచీలు 2% వరకు నష్టపోయాయి. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ సమావేశానికి ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తూ అమ్మకాలకు మొగ్గుచూపారు. ఫలితంగా యూరప్‌లోని బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ స్టాక్ మార్కెట్లు రెండు నుంచి రెండున్నర శాతం నష్టపోయాయి. అమెరికా మార్కెట్లు సైతం భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ‘డెల్టా’ కేసుల పెరుగుదల భయాలు పలు దేశాల్లో డెల్టా వేరియంట్ కోవిడ్ వైరస్ విజృంభణ ఈక్విటీ మార్కెట్లను భయపెట్టింది. ఈ ఏడాదిలోనే జూన్ 8న ఒకరోజులో అత్యధిక కేసులు నమోదైనట్లు ఆస్ట్రేలియా ప్రకటించింది. యూఎస్‌లో నమోదవుతున్న కరోనా కేసుల్లో 51.7 శాతం డెల్టా వేరియంట్ అని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వెల్లడించింది. ఐరోపాలో పలు దేశాల్లో ఇదే వేరియంట్ కేసులు నమోదవుతున్నాయి. ఫెడ్ రిజర్వ్ మినిట్స్ నుంచి ప్రతికూలతలు ఈ ఏడాదిలో వీలైనంత తొందరగా బాండ్ల కొనుగోళ్ల ప్రక్రియను ప్రారంభిస్తామని ఫెడ్ రిజర్వ్ తన మినిట్స్‌లో తెలిపింది. ఫెడ్ తీసుకున్న నిర్ణయంతో డాలర్ మూడు నెలల గరిష్టానికి చేరుకుంది. డాలర్ అనూహ్య ర్యాలీ భారత్ లాంటి వర్థమాన దేశాల మార్కెట్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. అవుట్‌లుక్ తగ్గింపు ఆందోళనలు... ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గానూ భారత్ వృద్ధి అవుట్‌లుక్‌ను ఫిచ్ రేటింగ్స్ సంస్థ 12.8% నుంచి పదిశాతానికి తగ్గించింది. కోవిడ్–19 సెకండ్ వేవ్ కారణంగా రికవరీ ప్రక్రియ మందగించడం ఇందుకు కారణంగా చెప్పుకొచ్చింది. -
అల
‘‘విపత్తులు రాబోతున్నప్పుడు పక్షులు ఇండికేషన్స్ ఇస్తాయట! మనుషుల మధ్య రిలేషన్స్ ఏర్పడబోయే ముందు కూడా అలా ఏవైనా ఇండికేషన్స్ ఉంటే బావుండేది’’ ‘‘ఏమంటున్నావ్ కార్తీక్! నేను నీకు విపత్తులా దాపురించాననేనా?’’.. పెద్దగా అరిచేసింది హేమ. కార్తీక్ చికాగ్గా చూశాడు. ‘‘లుక్. మన రెండేళ్ల స్నేహాన్ని గోనెసంచిలో కట్టేసి ఈ సముద్రంలో పడేద్దాం. ఇవాళే, ఇప్పుడే. నువ్వు నాకు నచ్చట్లేదు హేమా. యు ఆర్ సెల్ఫిష్’’ అన్నాడు. హేమ సీరియస్‌గా చూసింది. ‘‘యా! స్నేహం చచ్చిపోయింది కదా. గోనెసంచిలో కట్టేద్దాం. బట్ కార్తీక్. మన స్నేహాన్ని చంపింది నువ్వా, నేనా అన్నది ముందు తేలాలి’’. లాగి పెట్టి ఆ పిల్ల చెంప మీద కొట్టాలనిపించింది కార్తీక్‌కి. ‘‘పోనీ, నేనే చంపాననుకో హేమా.. మన స్నేహాన్ని! సంతోషమే కదా నీకు. నిన్నెప్పటికీ నేను అర్థం చేసుకోలేనని అంటుంటావ్ కదా.. అందుకు శిక్షగా నా ప్రేమ చచ్చిపోవాల్సిందే.’’ ‘‘స్నేహం అన్నావ్.. ప్రేమ అంటున్నావ్.. ఏంటి కార్తీక్ నీ కన్ఫ్యూజన్?’’‘‘ఎస్. నాది కన్ఫ్యూజన్. నీది క్లారిటీ. నేను ప్రేమ అనుకున్నాను. నువ్వు స్నేహం అనుకున్నానన్నావు’’ అన్నాడు కార్తీక్.హేమ నెత్తి కొట్టుకుంది. ‘‘ముందే చెప్పాను కార్తీక్.. నీ మీద నాకున్నది ప్రేమ కాదని’’ అంది.‘‘దెన్.. ముందే ఎందుకు వెళ్లిపోలేదు హేమా.. నా నుంచి’’ పెద్దగా అరిచేశాడు కార్తీక్. హేమ ఉలిక్కిపడి చూసింది.‘‘నా ప్రేమను ఎక్స్‌ప్రెస్ చేశాను కదా.. అప్పుడే ఎందుకు వెళ్లిపోలేదు హేమా నువ్వు ’’ అని మళ్లీ గట్టిగా అరిచాడు.‘‘నీ స్నేహం నన్ను వెళ్లనివ్వలేదు కార్తీక్’’ అంది హేమ.పిచ్చిపట్టిపోయింది కార్తీక్‌కి ఆ మాటకు. ‘‘అందుకే అంటున్నా.. నువ్వు సెల్ఫిష్ అని. నీ స్నేహాన్నే నువ్వు చూసుకున్నావ్. నా ప్రేమను కన్ఫ్యూజన్ అంటున్నావ్’’.హేమ మాట్లాడలేదు. ‘‘ఇలాగే ఉండు హేమా. ఎప్పటికీ నాతో మాట్లాడకుండా! అదే నాకు బాగుంటుంది. ఇంకెప్పుడూ నాకు కాల్ చెయ్యకు. పలకరించకు’’.. హేమ ఇంకా మౌనంగానే ఉంది. ‘‘ఏమీ తోచనప్పుడు నా దగ్గరకు వచ్చేంత స్నేహం నాకు అక్కర్లేదు హేమా. నా దగ్గరకు రానిదే ఏమీ తోచనంత ప్రేమ నాకు కావాలి’’ అన్నాడు కార్తీక్.స్నేహం ఒడ్డున ఒకరు, ప్రేమ ఒడ్డున ఒకరు నిలబడిపోయినట్లుగా ఆ రాత్రి ఇద్దరూ ఒకే ఒడ్డు మీద చాలాసేపు ఉండిపోయారు. ‘‘హారర్ కథ చెప్తానని.. లవ్ స్టోరీ చెప్తున్నావేంటి?’’ అంది మల్లిక. పెద్దగా నవ్వాడు విష్ణు. ‘‘లవ్‌ని మించిన హారర్ ఉంటుందా జీవితంలో!’’ అన్నాడు. మల్లికకు కోపం వచ్చింది. ‘‘అంటే మన లవ్ కూడా హారరేనా?’’ అంది, విష్ణు భుజం మీద పిడికిలితో కొడుతూ. మళ్లీ నవ్వాడు విష్ణు. ‘కాదా మరి.. రావడం అరగంట లేట్ అయింద ఇందాక నువ్వు హారర్ సినిమా చూపించలా నాకు’ అన్నాడు. మల్లిక నవ్వలేదు.ఇద్దరూ సముద్రపు ఒడ్డున ఇసుకలో నడుస్తున్నారు. అలలు రొద పెడుతున్నాయి. చీకటి చిక్కనవుతోంది. బీచ్‌లో జనం పలచబడుతున్నారు. ‘‘తర్వాత ఏమైంది విష్ణూ’’ అని అడిగింది ‘‘స్టోరీ అయిపోయింది’’ అన్నాడు విష్ణు. ‘‘అదేంటీ.. కార్తీక్, హేమ గొడవ పడడంలో హారర్ ఏముందీ?’’‘‘గొడవ పడడంలో లేదు. వాళ్లిద్దరూ ఆ రాత్రి.. ఇదిగో.. ఈ సముద్రంలో దూకి సూసైడ్ చేసుకోవడంలో ఉంది’’. షాక్ తింది మల్లిక. ‘‘అవును. హేమ వెళ్లిపోయాక చాలాసేపు బీచ్‌లోనే ఉండిపోయాడు కార్తీక్. కార్తీక్‌ని వదిలి వెళ్లాక ఆ రాత్రి మళ్లీ బీచ్ దగ్గరికి ఒక్కతే వచ్చింది హేమ. ఉదయాన్నే స్నేహమూ, ప్రేమా రెండూ.. వేర్వేరుగా ఒడ్డుకు కొట్టుకొచ్చాయి’’.. చెప్పడం పూర్తి చేశాడు విష్ణు. మల్లిక కళ్లు చెమర్చాయి. ‘‘హేమ తనని లవ్ చెయ్యడం లేదని కార్తీక్ చనిపోయాడని అనుకుందాం. మరి హేమ ఎందుకు చనిపోయింది?’’ అని అడిగింది. ‘‘యశ్వంత్ ప్రేమను పొందలేక హేమ చనిపోయింది’’ అన్నాడు విష్ణు. ‘‘యశ్వంత్ ఎవరు?’’.. మల్లిక ఆశ్చర్యంగా అడిగింది‘‘హేమ ప్రేమించిన అబ్బాయి. బీచ్‌లో కార్తీక్ తనతో గొడవపడ్డాక అమె నేరుగా యశ్వంత్ రూమ్‌కి వెళ్లింది. లేట్‌గా వెళ్లినందుకు పరిహారంగా అతడిని గట్టిగా కావలించుకుంది. ‘‘ఈ అబ్బాయిలేంటో.. స్నేహాన్ని ప్రేమ అనుకుంటారు’’ అని నవ్వింది హేమ బ్యాక్ హుక్స్ పెట్టుకుంటూ. ‘‘అమ్మాయిలు కూడా..’’ అని నవ్వాడు యశ్వంత్ అలసటగా. ‘‘అంటే ఏంటీ.. నువ్వు నాతో స్నేహం మాత్రమే చేస్తున్నావా యశ్వంత్! నన్ను ప్రేమించట్లేదా?’’ అంది డౌట్‌గా.యశ్వంత్ మాట్లాడలేదు. ‘‘చెప్పు యశ్వంత్’’ అంది. ‘‘నీతో స్నేహం బాగుంటుంది హేమా’’ అన్నాడు. ఫోన్ మోగింది. ‘‘సౌమ్య కాల్ చేస్తోంది. ఒక్క నిముషం హేమా ప్లీజ్’’ అని అమెకు కాస్త దూరంగా వెళ్లాడు. కాలేజ్‌లో హేమకు జూనియర్ సౌమ్య. అక్కడి నుంచి హేమ నేరుగా బీచ్‌కి వచ్చింది. కార్తీక్, తను పోట్లాడుకున్న స్పాట్‌కు వచ్చింది. కార్తీక్ లేడు. కార్తీక్‌కి బదులుగా అలలు ఉన్నాయి. అలల్లో కలిసిపోయింది. విష్ణుని గట్టిగా అంటుకుపోయింది మల్లిక. ‘‘ఇదంతా కల్పితమే కదా. నిజం కాదు కదా’’ అంది. ‘‘కథల్లో జీవితం ఉంటుంది కానీ, జీవితంలో కథలు ఉండవు హేమా..’’ అని.. ఆమెను బలంగా హత్తుకున్నాడు విష్ణు. ‘‘హేమా.. అంటున్నావ్ ఏంటి విష్ణు’’ అంది మల్లిక. సమాధానం లేదు.ఆమె గుండెల్లోకి తన ముఖాన్ని గట్టిగా అదుముతూ.. ‘ఐ లవ్యూ హేమా.. ఐ లవ్యూ హేమా’ అంటున్నాడు విష్ణు. మల్లిక గుండె ఆగినంత పనైంది. ‘విష్ణూ ఎక్కడున్నావ్?’ అని గట్టిగా అరిచి పడిపోయింది. తేరుకున్నాక అమె చెప్పింది. ‘విష్ణు.. ఇంకెప్పుడూ మనం బీచ్‌కి రాకూడదు’’.‘‘సరే’’ అన్నాడు విష్ణు.. అమె పక్కనే నడుస్తూ. ‘‘ఈ బీచ్‌కే కాదు. అసలు ఏ బీచ్‌కీ వెళ్లకూడదు’’ అంది. మళ్లీ ‘సరే’ అన్నాడతడు. -
మందకొడిగా మార్కెట్
స్వల్పంగా తగ్గిన సూచీలు ముంబై: క్రితం రోజు కదంతొక్కిన స్టాక్ మార్కెట్ మంగళవారం మందకొడిగా ట్రేడయ్యింది. స్వల్ప శ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనైన స్టాక్ సూచీలు కొద్దిపాటి నష్టాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 31,392–31,261 పాయింట్ల గరిష్ట, కనిష్టస్థాయిల మధ్య కదిలిన బీఎస్ఈ సెన్సెక్స్ 14 పాయింట్ల నష్టంతో 31,298 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. 9,674–9,643 పాయింట్ల మధ్య 30 పాయింట్ల శ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనైన ఎన్ఎస్ఈ నిఫ్టీ 4 పాయింట్ల నష్టంతో 9,653 పాయింట్ల వద్ద ముగిసింది. గతరాత్రి అమెరికా మార్కెట్ రికార్డు గరిష్టస్థాయికి ర్యాలీ జరిపినప్పటికీ, మంగళవారం జపాన్ మినహా మిగిలిన ప్రధాన ఆసియా సూచీలు, యూరప్ మార్కెట్లు క్షీణించిన ప్రభావం ఇక్కడి ట్రేడింగ్‌పై పడిందని బ్రోకింగ్ వర్గాలు తెలిపాయి. టాటా మోటార్స్ అప్... టాటా గ్రూప్‌నకు చెందిన లగ్జరీ కార్ల తయారీ సబ్సిడరీ జాగ్వర్ లాండ్రోవర్ తొలి పబ్లిక్ ఆఫర్ జారీచేయనున్నదనే వార్తలతో టాటా మోటార్స్ షేరు 3.28 శాతం ర్యాలీ జరిపి రూ. 467 వద్ద ముగిసింది. సెన్సెక్స్ షేర్లలో బాగా పెరిగిన షేరు ఇదే. ఓఎన్జీసీ, ఇన్ఫోసిస్, సిప్లాలు 1 శాతంపైగా పెరిగాయి. అయితే పవర్‌గ్రిడ్, లుపిన్, హెచ్డీఎఫ్సీ, బజాజ్ ఆటోలు 1–2 శాతం మధ్య క్షీణించాయి. -
ముగింపులో అమ్మకాలు
♦ గరిష్టస్థాయి నుంచి తగ్గిన సూచీలు ♦ ఫెడ్ పాలసీపై దృష్టి ముంబై: సానుకూల ఆసియా మార్కెట్ల ప్రభావానికి తోడు మే నెలలో ద్రవ్యోల్బణం 2.18 శాతానికి తగ్గడంతో మంగళవారం ట్రేడింగ్ ప్రారంభంలో భారత్ సూచీలు అరశాతం వరకూ ర్యాలీ జరిపాయి. అయితే మరో రోజులో అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ పాలసీ నిర్ణయం వెలువడనున్న నేపథ్యంలో జాగ్రత్త వహించిన ఇన్వెస్టర్లు ట్రేడింగ్ ముగింపులో అమ్మకాలు జరపడంతో సూచీలు వాటి తొలి లాభాల్ని పూర్తిగా కోల్పోయాయి. దాదాపు 166 పాయింట్ల పెరుగుదలతో 31,261 పాయింట్ల గరిష్టస్థాయివరకూ ర్యాలీ జరిపిన బీఎస్ఈ సెన్సెక్స్ చివరకు 8 పాయింట్ల స్వల్పలాభంతో 31,103 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 9,654 పాయింట్ల గరిష్టస్థాయికి చేరిన తర్వాత..అమ్మకాల ఒత్తిడి ఏర్పడటంతో ట్రేడింగ్ ముగింపులో 9,600 పాయింట్లస్థాయి దిగువకు జారిపోయింది. చివరకు 9 పాయింట్ల నష్టంతో 9,607 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. బుధవారంనాటి ఫెడ్ సమీక్షా సమావేశంలో పావుశాతం వడ్డీ రేట్లు పెంచుతారన్న అంచనాలు వున్నాయని, దాంతో ఇన్వెస్టర్లు జాగ్రత్త వహిస్తున్నారని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. హెచ్డీఎఫ్సీ ద్వయం అప్... హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ హెచ్డీఎఫ్సీ, దాని బ్యాంకింగ్ సబ్సిడరీ హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లు కొత్త రికార్డుస్థాయిని నమోదు చేశాయి. ఇంట్రాడేలో రూ. 1,682 పాయింట్ల చరిత్రాత్మక గరిష్టస్థాయికి చేరిన హెచ్డీఎఫ్సీ చివరకు 1 శాతంపైగా లాభంతో రూ. 1,668 వద్ద ముగిసింది. అలాగే రూ. 1,692 నూతన రికార్డుస్థాయికి చేరిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ చివరకు స్వల్పలాభంతో రూ.1,679 వద్ద క్లోజయ్యింది. పవర్‌గ్రిడ్, లుపిన్, ఎన్టీపీసీ, అదాని పోర్ట్స్ షేర్లు పెరగ్గా, టాటా మోటార్స్, టీసీఎస్, విప్రో, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్‌లు తగ్గాయి. ఆర్ఐఎల్ను మించిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్... మార్కెట్ విలువలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్...రిలయన్స్ ఇండస్ట్రీస్‌ను అధిగమించింది. మంగళవారం ట్రేడింగ్ ముగిసేటప్పటికి హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 4.31,471 కోట్లుకాగా, రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాప్ రూ. 4,26,783 కోట్లు. బీఎస్ఈలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేరు 0.63 శాతం ఎగిసి రూ. 1,679 వద్ద ముగియగా, రిలయన్స్ షేరు 0.51 శాతం క్షీణించి రూ. 1,312 వద్ద క్లోజయ్యింది. కాగా మార్కెట్లో ప్రస్తుతం అత్యంత విలువైన కంపెనీగా టీసీఎస్ వుంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ. 4,83,425 కోట్లు. తర్వాతి స్థానాల్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్, ఐటీసీ (రూ. 3,70,130 కోట్లు), హెచ్డీఎఫ్సీ (రూ. 2,65,178 కోట్లు)వున్నాయి. -
బిహార్ డైలమా-హెచ్చుతగ్గుల మార్కెట్
* చివర్లో సూచీలు డౌన్ * నెలరోజుల కనిష్టస్థాయి ముంబై: బిహార్ ఎన్నికల ఫలితాల పట్ల ఇన్వెస్టర్లు అయోమయంలో పడటంతో శుక్రవారం స్టాక్ మార్కెట్ హెచ్చుతగ్గులకు లోనయ్యింది. వివిధ ఎగ్జిట్ పోల్స్ విభిన్నంగా వుండటంతో కనిష్టస్థాయి వద్ద కొనుగోళ్లు, గరిష్టస్థాయి వద్ద అమ్మకాలు జరిగాయి. దాంతో రోజంతా సూచీలు ఎగుడుదిగుడులకు లోనయ్యాయి. 26,439-26,190 పాయింట్ల మధ్య ఊగిసలాడిన బీఎస్ఈ సెన్సెక్స్ చివరకు 39 పాయింట్ల నష్టంతో 26,265 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 8,003-7,926 పాయింట్ల గరిష్ట, కనిష్టస్థాయిల మధ్య కదలాడి, చివరకు 1 పాయింటు స్వల్పనష్టంతో 7,954 పాయింట్ల వద్ద ముగిసింది. సూచీలకు ఇది నెలరోజుల కనిష్టస్థాయి. గత 10 ట్రేడింగ్ సెషన్లలో భారత్ సూచీలు క్షీణించడం ఇది తొమ్మిదవసారి. బిహార్ ఎన్నికలలో స్పష్టమైన విజేత ఎవరో ఎగ్జిట్ పోల్స్ తేల్చకపోవడంతో మార్కెట్లో తీవ్ర హెచ్చుతగ్గులు నెలకొన్నాయని బీఎన్పీ పారిబాస్ మ్యూచువల్ ఫండ్ మేనేజర్ శ్రేయాష్ దేవాల్కర్ చెప్పారు. వెలుగులో పీఎస్‌యూ బ్యాంకులు సూచీలు చివరకు నష్టాల్లో ముగిసినా, మార్కెట్ వేళల్లో ఆర్థిక ఫలితాలు వెల్లడించిన మూడు పీఎస్‌యూ బ్యాంక్ షేర్లు భారీ ట్రేడింగ్ పరిమాణంతో ర్యాలీ జరిపాయి. బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంచనాల్ని మించిన ఫలితాలు వెల్లడించడంతో 3.86 శాతం ఎగిసింది. బ్యాంక్ ఆఫ్ బరోడా నికరలాభం అనూహ్యంగా క్షీణించడంతో ట్రేడింగ్ తొలిదశలో 10 శాతంపైగా నష్టపోయింది. దాదాపు ఏడాది కనిష్టస్థాయి అయిన రూ. 140 వద్ద ఆ షేరుకు భారీ కొనుగోలు మద్దతు లభించడంతో ఆ స్థాయి నుంచి వేగంగా 15 శాతంవరకూ ర్యాలీ జరిపి రూ. 168 స్థాయికి పెరిగింది. మరో ప్రభుత్వ రంగ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఫలితాలు అంచనాలకంటే మెరుగ్గా వుండటంతో 2.5 శాతం పెరిగింది. ఓరియంటల్ బ్యాంక్, ఆంధ్రాబ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్లు కూడా 2-3 శాతం పెరిగాయి. -
లాభాల స్వీకరణకు చాన్స్
న్యూఢిల్లీ: గత కొద్ది రోజులుగా స్టాక్ మార్కెట్లలో నెలకొన్న బుల్ ధోరణి కారణంగా ప్రధాన ఇండెక్స్‌లు కొత్త గరిష్టాలను తాకుతున్నాయి. గడిచిన వారంలో ప్రామాణిక సూచీ సెన్సెక్స్ 23,000 సమీపానికిరాగా, నిఫ్టీ 6,800ను అధిగమించింది. దీంతో గత శుక్రవారం ఇన్వెస్టర్లు కొంతమేర అమ్మకాలకు దిగారు. సాధారణంకంటే తక్కువ వర్షపాతం నమోదు కావచ్చన్న తాజా అంచనాలు ఇందుకు కారణమయ్యాయి. ఈ అంశం సెంటిమెంట్‌ను దెబ్బకొట్టిందని విశ్లేషకులు తెలిపారు. ఫలితంగా గత వారం చివర్లో అమ్మకాలు ఊపందుకున్నాయని చెప్పారు. ప్రస్తుతం ఈ ట్రెండ్ కొనసాగే అవకాశం ఉందన్నారు. అయితే స్వల్ప కాలానికి కంపెనీల ఆర్థిక ఫలితాలు మార్కెట్లకు దిశా నిర్దేశం చేస్తాయని పేర్కొన్నారు. మే డే సెలవు: ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితంకానుంది. మే డే కారణంగా గురువారం(1న) మార్కెట్లు పనిచేయవు. కాగా, దేశీ కంపెనీల ‘జనవరి-మార్చి’ ఫలితాలకుతోడు.... అంతర్జాతీయ సంకేతాలు, విదేశీ పెట్టుబడులు, డాలరుతో మారకంలో రూపాయి కదలికలు వంటి అంశాలు కూడా మార్కెట్లను ప్రభావితం చేస్తాయని పలువురు నిపుణులు పేర్కొన్నారు. ఇక ఈ వారం చివర్లో ఆటో రంగ షేర్లు వెలుగులో నిలిచే అవకాశముందని తెలిపారు. ఏప్రిల్ నెలకు వాహన విక్రయ గణాంకాలు వెలువడనున్నందున ఇన్వెస్టర్లు ఆటో షేర్లపై దృష్టిపెడతారని తెలిపారు. బ్లూచిప్స్ ఫలితాలు... ఈ వారం ఫలితాలు వెల్లడించనున్న దిగ్గజాలలో హిందుస్తాన్ యూనిలీవర్, భారతీ ఎయిర్టెల్, జిందాల్ స్టీల్, సెసాస్టెరిలైట్ తదితరాలున్నాయి. ఇక అంతర్జాతీయ అంశాల విషయానికి వస్తే.. అమెరికా ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమీక్షను చేపట్టనుంది. 29-30న రెండు రోజులపాటు నిర్వహించనున్న పాలసీపై అంతర్జాతీయస్థాయిలో ఇన్వెస్టర్లలో ఆసక్తి నెలకొంది. దేశీయంగా ఫార్మా, పీఎస్‌యూ బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్ రంగ బ్లూచిప్స్ ప్రకటించనున్న ఫలితాలు మార్కెట్లను ప్రభావితం చేస్తాయని రెలిగేర్ సెక్యూరిటీస్ రిటైల్ పంపిణీ ప్రెసిడెంట్ జయంత్ మాంగ్లిక్ అభిప్రాయపడ్డారు. 6,650 కీలకం: ఎన్ఎస్ఈ ప్రధాన సూచీ నిఫ్టీకి 6,630-6,650 పాయింట్ల స్థాయి కీలకంగా నిలవనుందని జయంత్ అంచనా వేశారు. ఈ స్థాయికి దిగువన అమ్మకాలు పెరుగుతాయని చెప్పారు. కాగా, గరిష్ట స్థాయిల వద్ద లాభాల స్వీకరణ కోసం ఇన్వెస్టర్లు అమ్మకాలు చేపడతారని బొనాంజా పోర్ట్‌ఫోలియో సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ రాకేష్ గోయల్ అంచనా వేశారు. ఈక్విటీలలో కొనసాగుతున్న ఎఫ్ఐఐల కొనుగోళ్లు, విదేశీ సానుకూల సంకేతాలు, దేశీయంగా వడ్డీ రేట్లలో మార్పు లేకపోవడం, లోక్‌సభ ఎన్నికలపై ఆశావహ అంచనాలు వంటివి మార్కెట్లను నడిపిస్తాయని వివరించారు. అయితే స్టాక్ మార్కెట్లకు జోష్‌నివ్వగల బలమైన అంశం కేంద్రంలో సుస్థిర ప్రభుత్వ ఏర్పాటేనని, దీంతో వచ్చే నెల 16న వెల్లడికానున్న ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నదని నిపుణులు వ్యాఖ్యానించారు.