india australia series
-
భారత్ – ఆసీస్ టీ20కి సన్నాహాలు
ప్రపంచ కప్‌కు ముందే విశాఖవాసులు క్రికెట్ విందు ఆస్వాదించనున్నారు. భారత్–ఆస్ట్రేలియా సిరీస్‌లో భాగంగా జరిగే రెండో టీ20 మ్యాచ్‌కు విశాఖ మహానగరం వేదికగా ఖరారైనవిషయం తెలిసిందే. ఈ మ్యాచ్ నిర్వహక కమిటీ మంగళవారం సమావేశమై ఏర్పాట్లపై చర్చించింది. టికెట్లరేట్లు, ఎప్పటినుంచి విక్రయాలు ప్రారంభించాలన్న అంశాలపై చర్చించడంతోపాటు నిర్వహణకు సంబంధించిసబ్ కమిటీలను నియమించారు. విశాఖ స్పోర్ట్స్: విశాఖలో, ఉత్తరాంధ్రలో క్రికెట్ వీరాభిమానులకు శుభవార్త! భారత, ఆస్ట్రేలియా జట్ల మధ్య టీ20 మ్యాచ్ విశాఖలో వచ్చేనెల 27న జరగనుంది. భారత్‌లో పర్యటించనున్న ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ఇరు దేశాల మధ్య రెండో టీ20 మ్యాచ్‌ను విశాఖలోని వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో ఆడనుంది. ఈ పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా జట్టు భారత్‌లో రెండు టీ20 మ్యాచ్‌లు, ఐదు వన్డే మ్యాచ్‌లు ఆడనుంది. తొలి టీ20 మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఫిబ్రవరి 24న జరగనుంది. ఈ సిరీస్‌లో కేవలం రెండే టీ20 మ్యాచ్‌లు జరగనుండగా రెండో టీ20 మ్యాచ్‌కు విశాఖ వేదికగా నిలిచింది. ఫిబ్రవరి 27న రాత్రి ఏడు గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇక వన్డే సిరీస్‌లో ఐదు మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి వన్డే మార్చి రెండో తేదీన జరగనుండగా చివరిదైన ఐదో మ్యాచ్ మార్చి13న జరగనుంది. మ్యాచ్ నిర్వాహక కమిటీ సమీక్ష : ఆస్ట్రేలియాతో జరిగే టీ20 మ్యాచ్ నిర్వాహక కమిటీ మంగళవారం ఇక్కడ సమావేశమైంది. టిక్కెట్లు, నిర్వహణ వ్యవహారాల చర్చించింది. కమిటీ చైర్మన్‌గా వీపీటీ చైర్మన్ ఎంటీ కృష్ణబాబు వ్యవహరించనున్నారు. నిర్వహణకు సంబంధించి సబ్ కమిటీలను ఏర్పాటు చేశారు. నగర పోలీస్ కమిషనర్ మహేష్ చంద్ర లడ్డా, వీపీటీ డెప్యూటీ చైర్మన్ హరినాథ్, జీవీఎంసీ అదనపు కమిషనర్ జీవీవీఎస్ మూర్తి, ఈకో రైల్వే సహాయ క్రీడాధికారి శివహర్ష, కమర్షియల్ టాక్స్ విభాగం డిప్యూటీ సహాయ కమిషనర్ ఏఎన్‌వి ప్రసాద్, ఆర్టీసీ ఆర్ఎం అప్పలనాయుడు, ఏసీఏ అధ్యక్షుడు రంగరాజు, కార్యదర్శి అరుణ్‌కుమార్, వీడీసీఏ కార్యదర్శి పార్ధసారథి, ఏసీఏ మీడియా మేనేజర్ సీఆర్‌మోహన్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. సబ్కమిటీల ప్రతినిదులు ఈనెల30న మరోసారి సమావేశమై మ్యాచ్ నిర్వహణకు స్టేడియం సన్నద్ధతపై చర్చించనున్నారు. ఆన్లైన్ ద్వారా టిక్కెట్ల అమ్మకాలు మ్యాచ్‌ను వీక్షించేందుకు టిక్కెట్లను ఆన్లైన్లో ఈవెంట్ నౌ వెబ్సైట్ ద్వారా విక్రయించనున్నారు. రూ.500ను కనీస ధరగా రూ.1200, రూ. 1600, రూ. 2000, రూ. 4000 డినామినేషన్లలో టికెట్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. -
కోహ్లీపై ఆసీస్ దిగ్గజం ప్రశంసల జల్లు
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఆసీస్ దిగ్గజ క్రికెటర్ ఆడమ్ గిల్ క్రిస్ట్ ప్రశంసలు కురిపించాడు. కోహ్లీ గొప్ప నాయకుడని, ఇప్పటికైనా ఆస్ట్రేలియా.. భారత్ జట్లు డీఆర్ఎస్ వివాదాన్ని పక్కనపెట్టి ప్రొఫెషనల్ క్రికెట్ ఆడాలని గిల్ క్రిస్ట్ అన్నాడు. ఈ సిరీస్‌లో ఇంకా కోహ్లీ బ్యాట్ నుంచి తగినన్ని పరుగులు రావాల్సి ఉంది. ధర్మశాలలో శనివారం నుంచి జరిగే చివరి టెస్టులో కోహ్లీ తనదైన ఆట చూపిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. కోహ్లీ తన జట్టుతో పాటు మొత్తం దేశాన్ని తనతో తీసుకెళ్తాడని ప్రశంసించాడు. ధర్మశాల టెస్టులో కోహ్లీ వీరవిహారం చేస్తే ఎలా ఉంటోందనని తాను భయపడుతున్నట్లు గిల్‌క్రిస్ట్ తెలిపాడు. ఇది చాలా అరుదైన సిరీస్ అని, రెండు జట్లు జాగ్రత్తగా కూర్చుని.. ఇప్పటివరకు తాము చెప్పిన విషయాలను వేరేగా ఎలా చెప్పచ్చో ఆలోచించుకోవాలని సూచించాడు. 2008లో ఇలాంటి వివాదమే ఏర్పడి అది బాగా ఎక్కువకాలం సాగిందని, ఇప్పుడు అలా కాకుండా వీలైనంత త్వరగా ఆ వివాదాన్ని ముగించుకోవాలని అన్నాడు. భారత్-ఆస్ట్రేలియా క్రికెట్ శత్రుత్వంలో వివాదాలు కూడా అంతర్భాగమేనని తన కాలం నాటి ప్రముఖ వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ అయిన గిల్‌క్రిస్ట్ సరదాగా చెప్పాడు. సిరీస్ అయిపోయే సమయానికి రెండు జట్ల మధ్య మంచి గౌరవభావం ఉంటుందని, రెండు జట్లు చాలా మంచి పోటీ ఇస్తాయని అభిప్రాయపడ్డాడు. ప్రస్తుత సిరీస్‌లో ఆసీస్ పెర్ఫామెన్స్ చూసి తాను చాలా ఆశ్చర్యపోతున్నట్లు తెలిపాడు. అసలు వాళ్లు ఇంత బాగా ఎలా ఆడగలిగారోనని అందరూ ఆశ్చర్యపోతున్నారన్నాడు. ఇది భలే అద్భుతమైన సిరీస్ అని, భారతదేశంలో తాము 2001 నుంచి చూసిన వాటిలో ఇదే బెస్ట్ సిరీస్ అని చాలామంది చెబుతున్నట్లు గిల్లీ చెప్పాడు. -
ఎంత లక్ష్యం సరిపోతుంది?
80లలో 200 పరుగులు, 90లలో 250, కొత్త మిలీనియంలో 300...వన్డే మ్యాచ్‌లో ఒక జట్టు ఈ స్కోరు సాధిస్తే గెలుపుపై ధీమాతో ఉండేది. కానీ ఇప్పుడు!!! ఎన్ని పరుగులు చేసినా గెలుస్తామనే విశ్వాసం జట్టు కెప్టెన్లలో కనిపించడం లేదు. పక్షం రోజుల వ్యవధిలో భారత్ రెండు సార్లు 350కు పైగా పరుగుల లక్ష్యాన్ని ఛేదించిందంటే అది సాధారణ విషయం కాదు. టి20ల రాకతో బ్యాటింగ్‌లో వేగం పెరిగిందనే మాట వాస్తవమే అయినా...అది కొంత వరకే. భారత్-ఆస్ట్రేలియా సిరీస్‌లో బ్యాట్స్‌మెన్ వీర కొట్టుడు చూస్తే బౌలర్లపై నిజంగా జాలి కలుగుతుంది. స్పీడ్‌ను నమ్ముకున్న జాన్సన్ అయినా...స్పిన్‌తో పడగొట్టే అశ్విన్ అయినా...అందరూ ఇక్కడ సమానమే. బ్యాట్స్‌మెన్ దూకుడు ముందు తలవంచాల్సిందే. ఎక్కడ బంతి వేయాలో, ఎలా వైవిధ్యం చూపాలో తెలీని గందరగోళంలో బౌలర్లు నిస్సహాయంగా మారిపోతున్నారు. ఇలాంటి స్థితిలో సత్తా ఉన్న బౌలర్లు కూడా బ్యాట్స్‌మెన్‌పై ఆధిక్యం ప్రదర్శించే మాట దేవుడెరుగు...కేవలం ‘బాల్‌బాయ్స్’గా మారిపోతున్నారు. నిజానికి క్రికెట్ ఇప్పుడు పూర్తిగా బ్యాట్స్‌మెన్ ఆటగా మారిపోయింది. కేవలం భారీ సిక్సర్లు, బౌండరీలతో ప్రేక్షకులను ఆకట్టుకోవాలని ఆటలో నిబంధనలు ఏకపక్షంగా మార్చేస్తున్నారు. భారత పిచ్‌లు ఈ రికార్డు విజయాల్లో తమ వంతు పాత్రను పోషిస్తున్నాయి. బ్యాట్‌కు, బాల్‌కు మధ్య సమాన పోటీ అనే మాటే ఇప్పుడు మారిపోయింది. ‘స్పోర్టింగ్ పిచ్’ అనే పదం మచ్చుకు కూడా కనిపించడం లేదు. ఇవేం నిబంధనలు... కొత్త నిబంధనలతో మమ్మల్ని ఏం చేయదల్చుకున్నారు అని సిరీస్ ఆరంభంలోనే ధోని తన అసంతృప్తిని వెళ్లగక్కాడు. ఇప్పుడు సరిగ్గా అతను భయపడినట్లే జరిగింది. ఈ సిరీస్‌లో రెండు జట్లు కలిపి నాలుగు మ్యాచ్‌ల్లో ఏకంగా 2565 పరుగులు చేశాయి. సర్కిల్ లోపల మరో ఫీల్డర్‌ను అదనంగా ఉంచాల్సి రావడంతో బౌలర్లు ఏమీ చేయలేక భారీగా పరుగులు సమర్పించుకుంటున్నారు. ఇప్పుడు బౌలర్లను కాకుండా నిబంధనలను తప్పు పట్టాల్సి వస్తోంది. అసలు ఎన్ని పరుగులు ఇస్తే బౌలర్ చెత్తగా బంతులు వేశాడో చెప్పలేకపోతున్నానని ధోని వ్యాఖ్యానించడం గమనార్హం. ఇకపై క్రికెట్ నేర్చుకునే ప్రతీ ఒక్కరు బ్యాట్స్‌మన్ కావడానికే ఇష్టపడతాడు తప్ప...బౌలర్‌గా మారాలని అనుకోరేమో! ‘ఇరు జట్లలో ఎవరు చెత్త బౌలింగ్ వేశారో అర్థం కావడం లేదు. సర్కిల్ లోపల అదనపు ఫీల్డర్ ఉండటంతో బౌలర్ కొంచెం పక్కకు వేసినా బంతి బౌండరీ దాటుతోంది. బౌలర్లు చాలా నిరాశగా ఉన్నారు. ఇలా ఉంటే బౌలింగ్ చేయాల్సిన అవసరం ఏముందని వాళ్లు భావిస్తున్నారు. బౌలర్ల స్థానంలో మైదానంలో బౌలింగ్ మెషీన్ పెడితే చాలని వారికనిపిస్తోంది. 10 ఓవర్లలో 100 పరుగులు ఇవ్వడమా, 80 పరుగులా, 60 పరుగులా....ఎన్ని ఇస్తే బౌలర్ విఫలమైనట్లు భావించాలి’ - ఎం.ఎస్. ధోని, భారత కెప్టెన్