India China ties
-
భారత సరిహద్దులపై చైనా కొత్త విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు
వాషింగ్టన్: చైనా విదేశాంగ మంత్రిగా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన క్విన్ గ్యాంగ్ భారత్‌తో సంబంధాలు, సరిహద్దు సమస్యలపై కీలక వ్యాఖ్యలు చేశారు. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా న్యూఢిల్లీతో సంబంధాలను మెరుగుపరుచుకోవాలని బీజింగ్ చూస్తోందని తెలిపారు. వాంగ్ యీ స్థానంలో విదేశాంగ శాఖ బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజునే యూఎస్ మ్యాగజైన్ ఇంటర్వ్యూలో పలు అంశాలపై మాట్లాడారు. ‘ప్రపంచం పట్ల చైనా ధోరణి’ అనే శీర్షికతో ప్రచురితమైన ఈ మ్యాగజైన్లో భారత్-చైనా సరిహద్దు అంశాలను ప్రస్తావించారు క్విన్ గ్యాంగ్. సరిహద్దుల్లో పరిస్థితులను సాధారణ స్థితికి తీసుకురావాలని ఇరు వర్గాలు కోరుకుంటున్నాయని పేర్కొన్నారు. అలాగే సరిహద్దుల్లో సంయుక్తంగా శాంతిని కాపాడేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. మరోవైపు.. అమెరికాపై మండిపడ్డారు క్విన్. తైవాన్ విషయంలో అమెరికా, దక్షిణ చైనా సముద్రంలోని పరిస్థితులకు జపాన్‌లు కారణమని పేర్కొన్నారు. చైనా అభివృద్ధి అంటే శాంతిని పరిరక్షించేందుకు బలమైన దళాన్ని సిద్ధం చేయటం తప్పా.. వారు చెబుతున్నట్లు భౌగోళిక స్థితిని మార్చే ప్రయత్నం కాదని స్పష్టం చేశారు. తైవాన్ జలసంధిలో ఉద్రిక్తతలకు కారణం చైనా కాదని, తైవాన్ వేర్పాటువాదులు, విదేశీ శక్తులు అందుకు కారణమని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు అమెరికాలో చైనా రాయబారిగా పని చేశారు 56 ఏళ్ల క్విన్ గ్యాంగ్. విదేశాంగ మంత్రిగా పదోన్నతి కల్పించిన క్రమంలో వాషింగ్టన్ నుంచి చైనాకు పయణమయ్యారు. 13వ జాతీయ ప్రజా కాంగ్రెస్ స్టాండింగ్ కమిటీ ఆయనను విదేశాంగ మంత్రిగా నియమించింది. క్విన్ గ్యాంగ్‌కి అమెరికా విదేశాంగ మంత్రి ఫోన్ చైనా నూతన విదేశాంగ మంత్రి క్విన్ గ్యాంగ్‌తో ఆదివారం ఫోన్లో మాట్లాడారు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్. వాషింగ్టన్-బీజింగ్ సంబంధాలు, ఇరు దేశాల మధ్య సమచారా మార్పిడి వంటి అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఇదీ చదవండి: పాక్, భారత్ మధ్య అణు సమాచార మార్పిడి -
భారత్-చైనా సరిహద్దు వివాదం.. రష్యా కీలక వ్యాఖ్యలు
సాక్షి,న్యూఢిల్లీ: భారత్, చైనా సరిహద్దు వివాదంపై రష్యా కీలక వ్యాఖ్యలు చేసింది. ఎట్టిపరిస్థితుల్లోనూ తాము ఈ విషయంలో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. ఇది రెండు దేశాలకు సంబంధించిన ద్వైపాక్షిక సమస్య అని.. భారత్, చైనానే చర్చల ద్వారా సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించింది. ఈమేరకు భారత్‌కు రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్ శుక్రవారం తెలిపారు. కొన్ని దేశాలు చైనా పట్ల, మరికొన్ని దేశాలు భారత్ పట్ల అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయని డెనిస్ అన్నారు. కానీ తాము అలా కాదని చెప్పారు. వీలైనంత త్వరగా రెండు దేశాలు పరస్పర అంగీకారంతో ఓ తీర్మానానికి రావాలని తాము కోరుకుంటున్నామన్నారు. ఈ చర్చల్లో ఇతర దేశాల పాత్ర అవసరం లేదని తాము అభిప్రాయపడుతున్నట్లు వివరించారు. అలాగే ఒప్పందం ప్రకారం భారత్‌కు తాము అందించాల్సిన ఎస్-400 వాయు క్షిపణి వ్యవస్థ షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని స్పష్టం చేశారు. 5 బిలియన్ డాలర్లు విలువ చేసే ఈ ఒప్పందం భారత్-రష్యా మధ్య 2018 అక్టోబర్‌లో కుదిరింది. దీని ప్రకారం ఐదు యూనిట్ల వాయు క్షిపణి వ్యవస్థలను రష్యా భారత్‌కు అందించాల్సి ఉంది. 2020లో గల్వాన్ లోయలో భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణలు తలెత్తినప్పటినుంచి ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 16 సార్లు కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చలు జరిపిన అనంతరం సెప్టెంబర్ 12న గోగ్రా హాట్‌స్ప్రింగ్స్ పెట్రోలింగ్ పాయింట్ 15నుంచి తమ బలగాలను ఉపసంహరించుకున్నాయి. చదవండి: 'పేసీఎం' పోస్టర్‌పై ఫోటో.. కాంగ్రెస్‌కు వార్నింగ్ ఇచ్చిన నటుడు -
‘అత్యంత క్లిష్ట దశలో భారత్-చైనా సంబంధాలు’
బ్యాంకాక్: సరిహద్దుల్లో చైనా చేస్తున్న దుశ్చర్యలను ఖండించారు భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్. ప్రస్తుతం భారత్-చైనా సంబంధాలు అత్యంత క్లిష్ట దశలో కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. రెండు పొరుగు దేశాలు కలిసి పని చేస్తేనే ఆసియా అభివృద్ధి పథంలో వెళ్తుందని సూచించారు. బ్యాంకాక్ చులలాంగ్‌కోర్న్ యూనివర్సిటిలో ఇండో-పసిఫిక్‌లో భారత్ విజన్‌పై మాట్లాడిన తర్వాత ఎదురైన ప్రశ్నలకు సమాధానంగా ఈ వ్యాఖ్యలు చేశారు జైశంకర్. ‘సరిహద్దులో డ్రాగన్ చేసిన పనికి ప్రస్తుతం భారత్-చైనా సంబంధాలు అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో కొనసాగుతున్నాయి. భారత్, చైనా కలసి నడిచేందుకు ఒక్క శ్రీలంక మాత్రమే కాదు, చాలా కారణాలున్నాయని నేను భావిస్తున్నా. అయితే, అది భారత్, చైనా వ్యక్తిగత నిర్ణయం. చైనా వైపు సానుకూల స్పందన ఉంటుందని మాకు నమ్మకం ఉంది. శ్రీలంకకు అన్ని విధాలా భారత్ సాయం చేసింది. ఈ ఏడాదిలోనే 3.8 బిలియన్ డాలర్ల సాయం అందించింది. ఐఎంఎఫ్ వద్ద శ్రీలంకకు అవసరమైన మద్దతును ఇస్తాం.’ అని తెలిపారు విదేశాంగ మంత్రి జైశంకర్. రోహింగ్యాల సమస్యపై అడిగిన ప్రశ్నకు.. బంగ్లాదేశ్‌తో చర్చిస్తున్నామని సమాధానమిచ్చారు మంత్రి జైశంకర్. వారిని తిరిగి స్వదేశానికి పంపించటమే ప్రధాన అంశమని, ఆ విషయంలో బంగ్లాదేశ్‌కు మద్దతు ఇస్తామన్నారు. మరోవైపు.. రష్యా నుంచి చమురు దిగుమతులపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టారు జైశంకర్. రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్నది ఒక్క భారత్ మాత్రమే కాదన్నారు. పలు ఐరోపా దేశాలు సైతం చమురు దిగుమతలు చేసుకుంటున్నాయని గుర్తు చేశారు. ఇదీ చదవండి: అమెరికాలో సెటిల్ కావడానికి ప్లాన్ చేసిన గొటబయా రాజపక్స! -
200 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్ ప్రారంభం
భారత్-చైనాల మధ్య నెలకొన్న సరిహద్దు వివాదం నేపథ్యంలో బుధవారం భారత స్టాక్ మార్కెట్ నష్టంతో ప్రారంభమైంది. సెన్సెక్స్ 205 పాయింట్లను కోల్పోయి 33399 వద్ద, నిఫ్టీ 53 పాయింట్లు నష్టపోయి 9860 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. బ్యాంకులు, ఫైనాన్స్, అటో, ఎఫ్ఎంసీజీ, రియాల్టీ రంగ షేర్లలో అమ్మకాలు నెలకొగా, ఐటీ మీడియా, ఫార్మా షేర్లకు స్వల్పంగా కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. బ్యాంకింగ్ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ 1.25శాతం నష్టంతో 20,045.65 వద్ద ట్రేడ్ అవుతోంది. లద్ధాఖ్లోని గాల్వన్ ప్రాంతంలో భారత్-చైనాల బలగాల మధ్య జూన్ 15, 16వ తేదీల్లో జరిగిన హింసాత్మక ఘర్షణల్లో మొత్తం 20 మంది భారత సైనికులు మరణించారని ఇండియన్ ఆర్మీ మంగళవారం రాత్రి అధికారికంగా ప్రకటించింది. ఈ హింసాత్మక ఘర్షణలో 43 మంది చైనా సైనికులూ మరణించినట్లు భారత సైనిక వర్గాలు వెల్లడించాయి. ఇరు దేశాల మధ్య ఏర్పడిన సరిహద్దు ఉద్రిక్తతలతో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తూ అమ్మకాల తెరలేపారు. ఇంద్రప్రస్థగ్యాస్, జేకే సిమెంట్స్, పిడిలైట్ ఇండస్ట్రీట్తో సుమారు 46కంపెనీలు నేడు తమ ఆర్థిక సంవత్సరపు మార్చి త్రైమాసిక ఫలితాలను విడుదల చేయనున్నాయి. మిశ్రమంగా అంతర్జాతీయ సంకేతాలు: ప్రపంచ ఈక్విటీ మార్కెట్లో మిశ్రమ వైఖరి నెలకొంది. నేడు ఆసియాలో ఒక్క హాంగ్‌కాంగ్ తప్ప మిగిలిన దేశాలకు చెందిన ఇండెక్స్ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అత్యధికంగా జపాన్ ఇండెక్స్ 1శాతం పతనమైంది. యూరప్ మార్కెట్లు మంగళవారం 3.50శాతం లాభంతో ముగిసాయి. అమెరికాలో మే నెల రిటైల్ అమ్మకాలు పెరగడంతో నిన్నరాత్రి ఈ దేశ స్టాక్ సూచీలు 2 శాతం లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ బ్రెంట్ క్రూడాయిల్ ధర 1.50శాతం నష్టపోయి 40.30డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ-50 ఇండెక్స్‌లో ..... ఇన్ఫ్రాటెల్, జేఎస్‌డబ్ల్యూస్టీల్, పవర్‌గ్రిడ్, కోటక్‌బ్యాంక్ ఎస్బీఐ షేర్లు 3.50శాతం నుంచి 2శాతం నష్టపోయాయి. మారుతి, ఇన్ఫోసిస్, విప్రో, కోల్ ఇండియా, బీపీసీఎల్ షేర్లు 1శాతం లాభడ్డాయి. -
చైనాకు భారత్ ఝలక్ ఇస్తుందా?
న్యూఢిల్లీ: పఠాన్‌కోట్ ఉగ్రవాద దాడి సూత్రధారి, పాకిస్థాన్‌కు చెందిన జైషే మహమ్మద్ ఉగ్రవాద గ్రూప్ చీఫ్ మసూద్ అజార్‌పై ఐక్యరాజ్యసమితి ఆంక్షలు విధించకుండా చైనా అడ్డుకోవడంపై భారత్ ఆగ్రహంగా ఉంది. ఈ విషయంలో చైనాకు తగిన బుద్ధి చెప్పాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దేశంలో చైనా పెట్టుబడులకు అనుమతించే విషయమై కేంద్రం పునరాలోచన చేయవచ్చునని సమాచారం. దేశంలో చైనా పెట్టుబడులకు భద్రతా అనుమతులు ఇచ్చే విషయంలో కేంద్రం పునరాలోచన చేయడమంటే.. ఐరాసలో చైనా చర్యకు దీటుగా బదులు ఇవ్వడమేనని అధికార వర్గాలు చెప్తున్నాయి. పఠాన్‌కోట్ ఉగ్రవాద దాడితోపాటు భారత్ వ్యతిరేక చర్యలు చేపడుతున్న అజార్‌ను అంతర్జాతీయంగా నిషేధించాలని భారత్ చాలాకాలంగా కోరుతోంది. అయితే అతడిపై నిషేధ తీర్మానాన్ని ఐరాసలో తన వీటో అధికారంతో చైనా తిరస్కరించడం భారత్‌ను అసంతృప్తికి గురిచేసింది. 'చైనా దౌత్యపాలసీలో పాకిస్థాన్‌కు ప్రత్యేక స్థానముంది. అందులో భాగంగానే ఐరాసలో చైనా చర్యను చూడాల్సి ఉంటుంది. ఉగ్రవాదం పీడ చైనాపై పడితేగానీ ఆ దేశం పాకిస్థాన్‌కు మద్దతు తెలుపడం మానుకోదు' అని ఆర్మీ మాజీ చీఫ్, కేంద్ర మంత్రి వీకే సింగ్ అన్నారు. 1962 భారత్-చైనా యుద్ధంనాటి నుంచి ఆసియా దిగ్గజాలైన ఈ ఇరుదేశాలకు సత్సంబంధాలు లేవు. అరుణాచల్ ప్రదేశ్, జమ్ముకశ్మీర్ లోని లడఖ్ విషయమై రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదాలు ఉన్న సంగతి తెలిసిందే.