India Mobile Users
-
భారత్‌లో యాపిల్ యూజర్లకు అలర్ట్
భారత్‌లో యాపిల్ డివైజ్‌ల యూజర్లకు అలర్ట్ జారీ అయ్యింది. వెంటనే ఐఫోన్లను, ఐప్యాడ్లను వీలైనంత త్వరగా అప్డేట్ చేసుకోవాలని సూచనలు అందాయి. ఈ మేరకు ఐటీ సెక్యూరిటీ ఆర్గనైజేషన్ విభాగం సీఈఆర్టీ-ఇన్(Indian Computer Emergency Response Team) తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. ఐవోఎస్ 14.7.1, ఐప్యాడ్ 14.7.1 వారం కిందట రిలీజ్ అయ్యాయి. వీటికి సంక్లిష్టమైన మెమరీ కరప్షన్ బగ్‌ను ఫిక్స్ చేసే సామర్థ్యం ఉంది. కాబట్టి, వెంటనే ఆ వెర్షన్లకు అప్డేట్ చేసుకోవాలని యాపిల్ యూజర్లకు సూచించింది. మెమరీ కరప్షన్ ఇష్యూస్ ఉన్నందున అప్డేట్ చేసుకోమని తెలిపింది. ‘హ్యాకర్లు పాత అప్డేట్ ఉన్న ఐఫోన్లలో కోడింగ్‌ను హ్యాక్ చేసి.. రిమోట్ యాక్సెస్ చేసే ప్రమాదం ఉంద’ని పేర్కొంది. వీటితో పాటు మాక్ యూజర్లు(డెస్క్‌టాప్ వెర్షన్) యూజర్లు కూడా సాప్ట్వేర్ అప్డేట్ చేసుకుంటే మంచిదని సూచించింది. సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి.. జనరల్‌ను క్లిక్ చేయాలి.. సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకోవాలి అప్డేట్ వేటికంటే.. ఐఫోన్ 6ఎస్, ఆ తర్వాత వచ్చిన మోడల్స్, ఐప్యాడ్ ప్రో మోడల్స్ అన్నీ, ఐప్యాడ్ ఎయిర్ 2 ఆ తర్వాత వచ్చిన మోడల్స్, ఐప్యాడ్ ఫిఫ్త్ జనరేషన్-ఆ తర్వాత వచ్చిన డివైజ్‌లు, ఐప్యాడ్ మినీ 4-తర్వాతి మోడల్స్, ఐప్యాడ్ టచ్(సెవెన్త్‌జనరేషన్), మోస్ట్ అడ్వాన్స్డ్ మాక్‌ఓస్ బిగ్ సర్ డివైజ్‌లను అప్డేట్ చేసుకోవాలని సూచించింది. -
భారత్‌లో మొబైల్ యూజర్లు 55.4 కోట్లే!
న్యూఢిల్లీ: భారత్‌లో వాస్తవ మొబైల్ వినియోగదారులు 55.48 కోట్ల మందేనని జక్స్ట్ రీసెర్చ్ సంస్థ రూపొందించిన ఇండియా మొబైల్ ల్యాండ్‌స్కేప్ నివేదిక తెలిపింది. అలాగే ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 14.32 కోట్లుగా ఉందని వివరించింది. అయితే టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) గణాంకాల ప్రకారం దేశంలో 87.33 కోట్ల మంది మొబైల్ వినియోగదారులున్నారు. మొత్తం 28 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 109 పట్టణ ప్రాంతాలు, 196 గ్రామాల్లో ఈ ఏడాది మే-జూలై కాలంలో నిర్వహించిన సర్వే ఆధారంగా జక్స్ట్ సంస్థ ఇండియా మొబైల్ ల్యాండ్‌స్కేప్ నివేదికను రూపొందించింది. గణాంకాలు, ప్రణాళికల అమలు మంత్రిత్వ శాఖ అధీనంలో నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ నిర్వహించే 88 ప్రాంతాల్లో 80 ప్రాంతాలు ఈ సర్వే కిందకు వచ్చాయి. ఈ సర్వే 94.8 శాతం భారత జనాభాను 96.1 శాతం భారత కుటుంబాలకు ప్రాతినిధ్యం విహ స్తోంది. నివేదిక ముఖ్యాంశాలు..., మొత్తం 55.48 కోట్ల మొబైల్ వినియోగదారుల్లో 29.8 కోట్ల(54 శాతం) మంది గ్రామీణ ప్రాంతాలకు చెందినవారు. కాగా పట్టణాల్లోని మొబైల్ వినియోగదారుల సంఖ్య 25.6 కోట్లుగా ఉంది. దేశంలో మొత్తం 77.39 కోట్ల సిమ్ కార్డులు పనిచేస్తున్నప్పటికీ, 55.48 కోట్ల మంది 64.34 కోట్ల సిమ్ కార్డులను ఉపయోగిస్తున్నారు. ఇక యూనిక్ ఇంటర్నెట్ యూజర్ల(డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్, స్మార్ట్‌టీవీ, మొబైల్ల ద్వారా ఇంటర్నెట్ను యాక్సెస్ చేసేవాళ్లు) సంఖ్య 9.47 కోట్లుగా ఉంది. ఎయిర్టెల్ లైవ్, రిలయన్స్ ఆర్ వరల్డ్ వంటి ఆపరేటర్ల పోర్టల్స్ ద్వారా ఇంటర్నెట్ను వినియోగించుకునే వారి సంఖ్యను కూడా కలిపితే మొత్తం 14.32 కోట్ల మంది ఇంటర్నెట్ యూజర్లున్నారు. జీపీఆర్ఎస్, 3జీ కనెక్షన్ల ద్వారా ఇంటర్నెట్ను యాక్సెస్ చేసే వారి సంఖ్య 2.38 కోట్లుగా ఉంది. వీటిల్లో 93 లక్షల మంది మొబైల్ ద్వారా ఇంటర్నెట్ను యాక్సెస్ చేస్తున్నారు. వీరిలో 77 శాతం మంది గ్రామీణ ప్రాంతాల వారే.