భారత్‌లో మొబైల్ యూజర్లు 55.4 కోట్లే! | India has 55.48 cr mobile owners, 14.32 cr Internet users | Sakshi
Sakshi News home page

భారత్‌లో మొబైల్ యూజర్లు 55.4 కోట్లే!

Published Mon, Sep 9 2013 1:52 AM | Last Updated on Fri, Sep 1 2017 10:33 PM

భారత్‌లో మొబైల్ యూజర్లు 55.4 కోట్లే!

భారత్‌లో మొబైల్ యూజర్లు 55.4 కోట్లే!

న్యూఢిల్లీ: భారత్‌లో వాస్తవ మొబైల్ వినియోగదారులు 55.48 కోట్ల మందేనని జక్స్ట్ రీసెర్చ్ సంస్థ రూపొందించిన ఇండియా మొబైల్ ల్యాండ్‌స్కేప్ నివేదిక తెలిపింది. అలాగే ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 14.32 కోట్లుగా ఉందని వివరించింది. అయితే టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) గణాంకాల ప్రకారం దేశంలో 87.33 కోట్ల మంది మొబైల్ వినియోగదారులున్నారు. మొత్తం 28 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 109 పట్టణ ప్రాంతాలు, 196 గ్రామాల్లో ఈ ఏడాది మే-జూలై కాలంలో నిర్వహించిన సర్వే ఆధారంగా జక్స్‌ట్ సంస్థ ఇండియా మొబైల్ ల్యాండ్‌స్కేప్ నివేదికను రూపొందించింది.
 
  గణాంకాలు, ప్రణాళికల అమలు మంత్రిత్వ శాఖ అధీనంలో నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ నిర్వహించే 88 ప్రాంతాల్లో 80 ప్రాంతాలు ఈ సర్వే కిందకు వచ్చాయి. ఈ సర్వే 94.8 శాతం భారత జనాభాను 96.1 శాతం భారత కుటుంబాలకు ప్రాతినిధ్యం విహ స్తోంది. నివేదిక ముఖ్యాంశాలు..., 
   మొత్తం 55.48 కోట్ల మొబైల్ వినియోగదారుల్లో 29.8 కోట్ల(54 శాతం) మంది గ్రామీణ ప్రాంతాలకు చెందినవారు. కాగా పట్టణాల్లోని మొబైల్ వినియోగదారుల సంఖ్య 25.6 కోట్లుగా ఉంది. 
   దేశంలో మొత్తం 77.39 కోట్ల సిమ్ కార్డులు పనిచేస్తున్నప్పటికీ, 55.48 కోట్ల మంది 64.34 కోట్ల సిమ్ కార్డులను ఉపయోగిస్తున్నారు. 
 
   ఇక యూనిక్ ఇంటర్నెట్ యూజర్ల(డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్, స్మార్ట్‌టీవీ, మొబైల్‌ల ద్వారా ఇంటర్నెట్‌ను యాక్సెస్ చేసేవాళ్లు) సంఖ్య 9.47 కోట్లుగా ఉంది. ఎయిర్‌టెల్ లైవ్, రిలయన్స్ ఆర్ వరల్డ్ వంటి ఆపరేటర్ల పోర్టల్స్ ద్వారా ఇంటర్నెట్‌ను వినియోగించుకునే వారి సంఖ్యను కూడా కలిపితే మొత్తం 14.32 కోట్ల మంది ఇంటర్నెట్ యూజర్లున్నారు.   జీపీఆర్‌ఎస్, 3జీ కనెక్షన్ల ద్వారా ఇంటర్నెట్‌ను యాక్సెస్ చేసే వారి సంఖ్య 2.38 కోట్లుగా ఉంది. వీటిల్లో 93 లక్షల మంది మొబైల్ ద్వారా ఇంటర్నెట్‌ను యాక్సెస్ చేస్తున్నారు. వీరిలో 77 శాతం మంది గ్రామీణ ప్రాంతాల వారే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement