ఫైనల్లో సానియా జోడి
మియామి : భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మరో టైటిల్‌కు చేరువయింది. మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్), సానియా జోడి మియామి ఓపెన్ టెన్నిస్ మహిళల డబుల్స్‌లో ఫైనల్‌కు చేరుకున్నారు. శుక్రవారం రాత్రి (భారత కాలమానం ప్రకారం శనివారం ఉదయం) జరిగిన సెమీస్‌లో టాప్‌సీడ్ సానియా జోడి 6-2, 6-4తో టిమియా బాబోస్, క్రిస్టినా మాలెనోవిచ్‌పై నెగ్గారు.
ఫైనల్లో వీరు మకరోవా, వెస్నినా జోడితో తలపడతారు. రెండు వారాల క్రితం బీఎన్పీ పరిబాస్ ఓపెన్ ఫైనల్లోనూ మకరోవా-వెస్నినాపై గెలిచిన సానియా జోడీ టైటిల్ సాధించడం విశేషం.