‘రెప్పపాటు’లో ఘోర ప్రమాదం
లావేరు :రెప్పపాటులో ఘోరం జరిగిపోయింది. సొంత ఊరికి అద్దె కారులో వస్తుండగా ఆగి ఉన్న లారీని ఢీ కొనడంతో వృద్ధ దంపతులు మృతి చెందగా, ఇద్దరు చిన్నారులతో పాటు మరో ముగ్గురికి గాయాలయ్యాయి. వారిలో ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉంది. పోలీసుల కథనం ప్రకారం... శ్రీకాకుకుళం జిల్లాలోని సారవకోట మండలంలోని కుమ్మరిగుంట గ్రామానికి చెందిన జంగాం అప్పన్న గుం టూరు జిల్లాలోని రేపల్లె ఇండియన్ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజరుగా పనిచేస్తున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి స్వగ్రామానికి రావడానికి నిశ్చయించుకున్నారు. తల్లితండ్రులిద్దరూ వృద్ధాప్యంతోపాటు, అనారోగ్య సమస్యలతో బాధపడుతుండడంతో, రైలు లేదా బస్సులో అయితే ప్రయాణం కష్టమని భావించి విజయవాడలో ఇ న్నోవా కారును బాడుగకు తీసుకున్నా రు. అందులో తన తల్లిదండ్రులైన కృ ష్ణమూర్తి (68), సావిత్రి (60)లతోపాటు, భార్య మాధురి, కుమార్తె లాస్య, వదిన గాయత్రి, ఆమె కుమారుడు హరిహరణ్ సోమవారం సాయంత్రం బయలుదేరారు.
విజయవాడ నుంచి దాదాపు ఏడు గంటలు ప్రయాణించి, మరో గంటలో స్వగ్రామమైన కుమ్మరి గుంట చేరుకుంటారన్న సమయంలో లావేరు మండలంలోని సుభద్రాపురం గ్రామం వద్దకు వచ్చేసరికి జాతీయ రహదారి పక్కన ఆగి ఉన్న లారీని మంగళవారం వేకువజామున 3 గం టల సమయంలో వీరి కారు ఢీకొంది. దీంతో కారుముందుభాగం దాదాపు లారీ కిందికి దూసుకుపోయి నుజ్జునుజ్జయింది. కారు ముందుభాగంలో కూర్చొన్న అప్పన్న తండ్రి కృష్ణమూర్తితోపాటు, వెనుకసీటులో ఉన్న తల్లి అక్కడికక్కడే మృతిచెందారు. కారులో ఉన్న అప్పన్న, అతని భార్య మాధురి, కుమార్తె లాస్య, వదిన పద్మ, వారి కుమారుడు హరిహరణ్‌కు గాయాలయ్యాయి. వీరిలో పద్మకు తీవ్రగాయాలు కావడంతో విశాఖపట్నం ఆస్ప త్రికి తరలించారు. ప్రమాదం జరిగినప్పుడు పెద్ద శబ్దం రావడంతో సుభద్రాపురం గ్రామస్తులు వెంటనే వచ్చి సహాయక చర్యలు చేపట్టారు.
లావేరు ఎస్ఐ జి. అప్పారావు తన సి బ్బందితో సంఘటన స్థలికి వచ్చి, కా రులో ఇరుక్కుపోయి గాయపడిన వా రిని స్థానికుల సహకారంతో 108లో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. కారులో ఇరుక్కుపోయి మృతి చెందిన అప్పన్న తల్లిదండ్రులను బయటకు తీయించి పోస్టు మార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. జాతీయరహదారిపై వాహనాల రాకపోకలకు అడ్డంగా ఉన్న లారీని, కారును తొల గించి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. మృతదేహాలకు రి మ్స్‌లో ఎస్ఐ అప్పారావు పంచనామా నిర్వహించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కారు డ్రైవర్‌కు నిద్ర వచ్చి రెప్ప వాల్చడం వ ల్లే అదుపుతప్పి లారీని ఢీకొన్నట్లు తె లుస్తోందన్నారు. కాగా, ఇంత ప్రమా దం జరిగినా కారు డ్రైవర్‌కు ఎలాంటి గాయాలూ లేకుండా సురక్షితంగా బ యటపడ్డారు.
కుమ్మరిగుంటలో విషాద ఛాయలు
సారవకోట: జంగం కృష్ణమూర్తి, సావిత్రిల మృతితో వారి స్వగ్రామమైన కుమ్మరిగుంటలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విషయం తెలియడంతో బంధువులు రోదిస్తూ వారి ఇంటికి తరలివచ్చారు. సావిత్రి కన్నవారి గ్రామమైన జగ్గయ్యపేటలోనూ విషాద ఛాయలు అలముకున్నాయి.