Indian Financial System
-
గతంకన్నా ఫైనాన్షియల్ వ్యవస్థ పటిష్టం: ఆర్బీఐ
ముంబై: భారత ఫైనాన్షియల్ వ్యవస్థ గతం కంటే పటిష్టంగా ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) డిప్యూటీ గవర్నర్ ఎం రాజేశ్వర్ రావు అన్నారు. ప్రపంచవ్యాప్తంగా బలమైన ఎదురుగాలులు వీస్తున్నప్పటికీ దేశ ఆర్థిక వ్యవస్థ వాటిని ఎదుర్కొంటోందని అన్నారు. డిప్యూటీ గవర్నర్ జేపీ మోర్గాన్ ఇండియా లీడర్షిప్ సిరీస్ ఉపన్యాసం చేస్తూ, 2024లో జీ20 సభ్యులలో భారతదేశం అత్యధిక వాతావరణ మార్పు పనితీరు సూచిక (సీసీపీఐ) స్కోర్‌ను సాధించిందని అన్నారు. వాతావరణ పరిరక్షణ విషయంలో భారత్ చిత్తశుద్దిని తెలియజేస్తున్నట్లు వివరించారు. దేశంలో గ్రీన్ ఇన్వెస్ట్‌మెంట్లకూ ఇది దోహదం చేసే అంశమని తెలిపారు. బ్యాంకింగ్ రంగం పటిష్ట బాటలో పయనిస్తోందని అన్నారు. -
ఎఫ్‌పీఐల భారీ పెట్టుబడులు
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా సవాళ్లతో కూడుకున్న పరిస్థితులు నెలకొన్నప్పటికీ భారత ఆర్థిక మూలాలు పటిష్టంగా ఉన్న నేపథ్యంలో విదేశీ ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) మళ్లీ ఇటువైపు చూస్తున్నారు. డిపాజిటరీల డేటా ప్రకారం 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఈక్విటీల్లో ఏకంగా రూ. 2 లక్షల కోట్ల పైగా ఇన్వెస్ట్ చేశారు. డెట్ మార్కెట్లో రూ. 1.2 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టారు. మొత్తం మీద భారత క్యాపిటల్ మార్కెట్లో రూ. 3.4 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేశారు. అంతక్రితం రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఈక్విటీల నుంచి ఎఫ్‌పీఐలు పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు. 2020–21లో ఏకంగా రూ. 2.74 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేసిన ఎఫ్‌పీఐలు ఆ మరుసటి సంవత్సరం రూ. 1.4 లక్షల కోట్లు, ఆ తర్వాత 2022–23లో రూ. 37,632 కోట్లు వెనక్కి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో 2023–24లో భారీగా ఇన్వెస్ట్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. సానుకూలంగా కొత్త ఏడాది.. కొత్త ఆర్థిక సంవత్సరంపై కూడా అంచనాలు కాస్త సానుకూలంగానే ఉన్నాయని భారత్‌లో మజార్స్ సంస్థ మేనేజింగ్ పార్ట్నర్ భరత్ ధావన్ తెలిపారు. పురోగామి పాలసీ సంస్కరణలు, ఆర్థిక స్థిరత్వం, ఆకర్షణీయమైన పెట్టుబడి మార్గాల కారణంగా దేశంలోని ఎఫ్‌పీఐల ప్రవాహం స్థిరంగా కొనసాగవచ్చని పేర్కొన్నారు. అయితే, అంతర్జాతీయంగా భౌగోళిక, రాజకీయ అంశాల కారణంగా మధ్యమధ్యలో ఒడిదుడుకులు ఉండవచ్చన్నారు. -
భారత్ ఫైనాన్షియల్ వ్యవస్థ పటిష్టం
న్యూఢిల్లీ: ప్రపంచ ఆర్థిక పరిస్థితి తీవ్ర అనిశ్చితిలో ఉన్నప్పటికీ, భారత ఫైనాన్షియల్ వ్యవస్థ నియంత్రణలకు అనుగుణంగా పటిష్ట బాటలో ఉందని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేథ్ తెలిపారు. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో జరిగిన 27వ ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ డెవలప్మెంట్ కౌన్సిల్ (ఎఫ్ఎస్డీసీ) సమావేశం వివరాలను ఆయన మీడియాకు వివరిస్తూ, ‘‘భారత్ ఫైనాన్షియల్ వ్యవస్థ ఎంతో పటిష్టంగా ఉంది. అయితే ఏదైనా తీవ్ర సమస్య సూచిక కనిపించిన వెంటనే మనం ఎల్లప్పుడూ అప్రమత్తం కావాలి. అంతర్జాతీయ పరిస్థితులతో సంబంధం లేకుండా దేశ ప్రయోజనాలే లక్ష్యంగా మన కాలిపై మనం నిలబడాలి’’ అని అన్నారు. తద్వారా ఆర్థిక వ్యవస్థలపై ఒత్తిడిని సరైన సమయంలో గుర్తించి తగిన దిద్దుబాటు చర్యలు తీసుకోగలుగుతామని పేర్కొన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. ► సిలికాన్ వ్యాలీ బ్యాంక్, సిగ్నేచర్ బ్యాంక్ వైఫల్యం అలాగే క్రెడిట్ సూచీ ఎదుర్కొంటున్న ద్రవ్య పరమైన ఒత్తిడి గురించి ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ డెవలప్మెంట్ కౌన్సిల్ సమావేశంలో ప్రత్యేకంగా ఏమీ చర్చించలేదు. వీటి ప్రభావం మాత్రం మన ఆర్థిక వ్యవస్థపై లేదని భావిస్తున్నాం. ► ప్రభుత్వ బాండ్ల మార్కెట్ విషయంలో సాంకేతికత వినియోగం మరింత పెంపొందేలా చర్యలు తీసుకునే ప్రయత్నం జరుగుతోంది. పెట్టుబడిదారులు ఆర్బీఐ లేదా సెబీ ఇన్ఫ్రా ద్వారా ఇందుకు సంబంధించి పొందుతున్న సదుపాయాలకన్నా, సాంకేతికత ద్వారా పొందుతున్న ప్రయోజనాలు అధికంగా ఉంటున్నాయి. ఇవే సాంకేతిక చర్యల మరింత పటిష్టానికి చర్యలు తీసుకుంటున్నాం. ► అంతర్జాతీయంగా వస్తున్న ముందస్తు హెచ్చరిక సూచికలకు అనుగుణంగా భారత్ ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు చర్యలు తీసుకోవడం, ఆయా అంశాల్లో భారత్ సంసిద్ధత, నియంత్రణ నాణ్యతను మెరుగుపరచడం, దేశంలో కార్పొరేట్లు అలాగే గృహాల రుణ స్థాయిలు, కేవైసీ సరళీకరణ–క్రమబద్ధీకరణ, తద్వారా ఆర్థిక రంగంలో నియంత్రిత సంస్థలపై అనవసర భారాన్ని తగ్గించడం వంటి అంశాలపై కౌన్సిల్ చర్చించింది. ఆయా అంశాలన్నీ డిజిటల్ ఇండియా అవసరాలను తీర్చడానికి మరింత పటిష్ట ఫ్రేమ్‌వర్క్‌ని రూపొందిస్తాయని భేటీ భావించింది. ► రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలోని ఎఫ్ఎస్డీసీ సబ్ కమిటీ నిర్ణయాలు, ఎఫ్ఎస్డీసీ గతంలో తీసుకున్న నిర్ణయాల విషయంలో కార్యాచరణ వంటి అంశాలపైనా తాజా కౌన్సిల్ దృష్టి సారించింది. ► ఆర్బీఐ గవర్నర్‌తోపాటు, సెబీ చైర్పర్సన్ మాధవీ పురి బుచ్, ఐఆర్డీఏఐ చైర్మన్ దేబాషిస్ పాండా, దివాలా బోర్డ్ (ఐబీబీఐ) చైర్మన్ రవి మిట్టల్, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీకి చైర్మన్‌గా కొత్తగా నియమితులైన దీపక్ మెహంతీ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆర్థికశాఖ సహాయమంత్రులు పంకజ్ చౌదరి, భగవత్ కృష్టారావు కరాద్, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేథ్, రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా, ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్రటరీ వివేక్‌జోషి, తదితర ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్న వారిలో ఉన్నారు. అన్క్లెయిమ్డ్ డిపాజిట్ల పరిష్కారంపై దృష్టి... కాగా, ఎఫ్ఎస్డీసీ సమావేశం ప్రత్యేకించి బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థల్లో ఉన్న అన్క్లెయిమ్డ్ డిపాజిట్ల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. దీనికోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలని రెగ్యులేటర్లకు సూచించింది. రెండు సంవత్సరాలకుపైగా నిర్వహణలో లేని ఖాతాలకు సంబంధించి ఖాతాదారులు/చట్టబద్ధమైన వారసుల ఆచూకీని కనుగొనడం కోసం ప్రత్యేక డ్రైవ్‌ను ప్రారంభించే అంశానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొంది. 2023 ఫిబ్రవరి నాటికి దాదాపు రూ. 35,000 కోట్ల అన్క్లెయిమ్డ్ డిపాజిట్లను ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్బీ) రిజర్వ్ బ్యాంక్‌కు బదిలీ చేశాయి. దాదాపు 10.24 కోట్ల ఖాతాలకు సంబంధించిన ఈ మొత్తాలను గత 10 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలంపాటు ఎవ్వరూ క్లెయిమ్ చేయలేదు. బదలాయింపులకు సంబంధించి తొలి స్థానాల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (రూ.8,086 కోట్లు), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (రూ.5,340 కోట్లు), కెనరా బ్యాంక్ (రూ.4,558 కోట్లు), బ్యాంక్ ఆఫ్ బరోడా (రూ.3,904 కోట్లు) ఉన్నాయి. డిపాజిటర్లు, లబ్ధిదారులు వివిధ బ్యాంకుల్లో క్లెయిమ్ చేయని డిపాజిట్ల వివరాలను యాక్సెస్ చేయగల కేంద్రీకృత పోర్టల్ మూడు లేదా నాలుగు నెలల్లో సిద్ధమవుతుందని గత నెలలో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంతదాస్ చెప్పారు. -
ఈ సంక్షోభానికి శస్త్రచికిత్సే మందు
ఆర్థిక సంక్షోభం పన్ను రాయితీలు, ప్రోత్సాహకాలు, హామీలు ఇస్తే సర్దుకునే స్థాయిని దాటిపోయింది. వీటిలో కొన్ని పని చేయొచ్చు, కానీ స్టెరాయిడ్స్, ఇన్సులిన్ లాంటి మందు కావాలి. నిజమైన, ధైర్యంగా తీసుకునే చర్యలు ఇప్పుడు భారత ఆర్థిక వ్యవస్థకు అవసరం. బహుశా, పీఎస్‌యూలను పెద్దఎత్తున ప్రైవేటీకరించడం ద్వారా అది సాధ్యం కావచ్చు.మోదీ ప్రభుత్వం ఆరో ఏడాది పాలనలో కూడా ఇటువంటి చర్యలు తీసుకోనట్టయితే, అది ఓ గెలుపు గుర్రమే కానీ, సంస్కరణలు తీసుకువచ్చే సత్తాను కోల్పోయిందని అభివృద్ధి అనేది వాంఛనీయమైనదే తప్ప అత్యవసరమైన అంశం కాదని నమ్మేవారి మాటలను నిజం చేసినట్లవుతుంది. నిజమైన, సాహసోపేతమైన సంస్కరణతో మాత్రమే ఆర్థిక సంక్షోభాన్ని సరిచేయవచ్చు. నరేంద్రమోదీ ప్రభుత్వం దాన్ని చేయలేకపోతే, అది తన ప్రాభవాన్ని కోల్పోతోందన్న భయాలు రుజువైనట్లే లెక్క. ఇది మన రాజకీయ వర్గాలు తరచుగా ఉపయోగించే వ్యక్తీకరణ కాదు. కానీ భారతీయ పారిశ్రామిక వర్గం జంతు సహజాతాల బలీయమైన ప్రభావం గురించి ప్రతిచోటా మాట్లాడుకుంటూ ఉంటడం కద్దు. భారతీయ కార్పొరేట్ వర్గం నుంచి ఇలాంటి సహజాతాలకు సంబంధించినంతవరకు అభ్యర్థన చేసిన ఏౖకైక నాయకులు డాక్టర్ మన్మోహన్ సింగ్, తర్వాత జస్వంత్ సింగ్ మాత్రమే. ఇక మోదీ ప్రభుత్వం ఆలస్యంగానైనా తన సొంత మాటల్లో ఆ పని చేయడానికి ప్రయత్నించింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ తన స్వాతంత్య్రదినోత్సవ ప్రసంగంలో, భారతీయ సంపద సృష్టికర్తలను ఆకర్షించడానికి కొంత ప్రయత్నం చేశారు. భారత సంపన్నులను తన ప్రభుత్వం గౌరవిస్తుందని చెప్పడమే కాక, జాతి నిర్మాణంలో వారు చక్కటి పాత్ర పోషించారని గుర్తు చేశారు. ఎర్రకోట నుంచి ఒక భారతీయ ప్రధాని ప్రైవేట్ పారిశ్రామిక వర్గాన్ని అత్యంత శక్తివంతంగా సొంతం చేసుకున్న ఘటనలలో ఇదీ ఒకటి. ఇది మరింత దిద్దుబాటు చర్యకు వీలు కల్పించింది. భారీగా కార్పొరేట్ పన్ను కోతలు, మూలధన లబ్ధిపై పన్నులో మార్పులు, కార్పొరేట్ లాభాలపై పన్ను తగ్గింపు వంటివి ప్రకటించారు. అదేవిధంగా విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపుదారుల కార్పొరేట్ లాభాలపై పన్ను విధింపును వెనక్కు తీసుకోవడం కూడా జరిగిపోయింది. ఒకసారి తీసుకున్న నిర్ణయాన్ని ఎన్నటికీ వెనక్కు తీసుకోని, నష్టభయాన్ని తట్టుకునే ప్రభుత్వం, పారాచూట్‌ని తనిఖీ చేయకుండానే విమానం వెనుకనుంచి దుమికేయాలని నిర్ణయించుకున్నాక వెనక్కు తిరగని ప్రభుత్వం ఈవిధమైన తిరోగమనాలకు పాల్పడటమే ఒక కొత్త అనుభవం. అలా తిరోగమించడాన్ని ప్రభుత్వంలో ఏ ఒక్కరూ అంగీకరించకపోవచ్చు, కానీ మొట్టమొదటిసారిగా అసాధారణ ప్రజాదరణ కలిగిన ప్రధాని నరేంద్రమోదీ, ఆయన ప్రభుత్వం కలిసి నియంత్రించలేని అంశమేమిటంటే మార్కెట్లే. న్యాయవ్యవస్థ, మీడియా, ఎన్నికల కమిషన్, చివరకు పాకిస్తా¯Œ తో అయినా సరే.. మోదీ అంత శక్తివంతంగా వ్యవహరించగలిగింది. కానీ పశుబలం కలిగిన రాజకీయ అధికారం కూడా మార్కెట్ విషయంలో ఏమీ చేయలేదు. గత కొద్ది వారాలుగా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ దేశ వాణిజ్య ప్రముఖులను కలుసుకుంటూ వస్తున్నారు. ప్రెస్ కాన్ఫరె¯Œ్స తర్వాత ప్రెస్ కాన్ఫరెన్సులో ఆమె తన బడ్జెట్లోని అత్యంత సమస్యాత్మక విభాగాలను గురించి చెబుతూ వచ్చారు. ఈ ’అప్రియ వార్తల’ బడ్జెట్ ముసాయిదా తయారీలో కీలక వ్యక్తి అయిన ఆర్థిక శాఖ కార్యదర్శి రంగంనుంచి తప్పుకుని ముందస్తు పదవీవిరమణ కోసం ప్రయత్నించారు. ఈదఫా కేంద్రబడ్జెట్ సమర్పించిన తర్వాత ఆర్బీఐ రెండు సత్వర రెపో రేట్స్‌ని తీసుకొచ్చింది. అయినప్పటికీ మన కార్పొరేట్ వర్గం మానసిక స్థితిలో పెద్దగా మెరుగుదల లేదు. చివరకు ప్రపంచ ఆర్థిక వేదిక నిర్వహించిన ఇండియా ఎకనమిక్ సమ్మిట్‌లో కూడా మన కార్పొరేట్ వర్గంలో కళాకాంతులు లేవు. చిరునవ్వు కనిపించలేదు. మనం జంతు సహజాతాల గురించి మాట్లాడుతున్నామా? అవి కచ్చితంగా కంటికి కనబడతాయి. మీరు కోరుకుంటున్న రీతిలో జంతువు ఉండలేదు. పులి తోక పైకి లేపి మరీ పడుకుంటుంది. యజమాని వదిలేసిన కుక్క కూడా తన తోకను కాళ్లమధ్య దాచుకుంటూ ఉంటుంది. మీకు నేను వాడుతున్న పదబంధం ఇష్టం కానట్లయితే, కుక్కలతో పోల్చడం ఇష్టం లేకపోతే, నేను మరింత సాంప్రదాయికమైన పదం వెనుక దాక్కుంటాను. అది నైతిక ధృతి లేని సైన్యం. అత్యుత్తమ ఆయుధాలను మీరు ఇవ్వవచ్చు. కానీ సైనికాధికారులు తమ మనస్సులో ఇప్పటికే ఓడిపోవడం జరిగాక, యుద్ధంలో గెలవటం మాట అటుంచి తమ సైనిక బలగాలను కూడా ముందుకు నడిపించలేక పోవచ్చు. సెప్టెంబర్ 24న పన్ను కోతలు తగ్గించినప్పటినుంచి దేశీయ కార్పొరేట్ రంగం తన స్పూర్తిని ఎంతగా కోల్పోయిందంటే, బీఎస్ఈ సెన్సెక్‌లో నమోదైన కంపెనీలు తాజాగా రూ. 2.53 లక్షల కోట్లను కోల్పోయాయి. గత నిర్ణయాలనుంచి వెనక్కు రావడం, వడ్డీ రేట్లలో కోతలు వంటి సంస్కరణలు నిండా ఆవరించిన నిరాశావాదంలోంచి బయటపడలేకపోయాయి. మార్కెట్లకు పికెట్టీ భరోసా ఇచ్చిన తర్వాత కూడా ప్రపంచ స్థాయిలో మార్కెట్ల పరిస్థితి బాగాలేదు. అయితే కార్పొరేట్ వర్గాలు ఎంత అసమర్థంగా ఉన్నప్పటికీ, క్రమరాహిత్యంతో ఉన్నప్పటికీ అధికారపీఠంలో కూర్చుని ఉన్నవారికి నిజం చెప్పడంలో ఇప్పుడు వెనుకాడటం లేదు. మీడియా, న్యాయవ్యవస్థ వంటి కనీసం ఊహించలేని చోట భారతీయ మార్కెట్లు నిర్బయంగా ఒక విషయాన్ని చెబుతున్నయి: మోదీ ప్రభుత్వం దృష్టికి చెడువార్తలను తీసుకుపోండి. గత త్రైమాసికంలో వృద్ధి రేటు 5శాతం వద్ద కనిపడి అందరికీ షాక్ కలిగించింది. అయితే అలా షాక్ తగిలింది అమాయకులకే అనుకోండి. ఆర్థిక వ్యవస్థను పరిశీలిస్తున్న ఎవరికైనా ఇది బోధపడుతుంది. ఏదైనా అసాధారణమైనది జరిగితే తప్ప ఈ పరిస్థితిని మెరుగుపర్చడం కష్టమే. ఆ మార్పు ఏంటన్నది ప్రస్తుతానికి ఎవరికీ తెలీదు. మన అదృష్టాన్ని నిర్ణయించే అలాంటి అసాధారణ పరిణామం ఎవరికైనా తెలిసి ఉంటే, ఆర్బీఐ ఈ సంవత్సరం వృద్ధి అంచనాను 6.9 నుంచి 6.1కి తగ్గించి ఉండదు. ఈరోజు లాభాలు, పన్ను కోతల బట్టి కాక, రేపటి ఆశావాదం బట్టే పారిశ్రామిక వర్గం ముందడుగు వేస్తుంది. ఆ ఆశావాదమే పతనమవుతోంది. మోదీ ప్రభుత్వం పెద్దనోట్ల రద్దుతో అన సొంత ఆర్థిక అభివృద్దిని విచ్చిన్న పర్చుకోవడం సాధ్యమైనప్పటినిుంచి మన ఆశావాదం తగ్గుపట్టనారంభించింది. వ్యాపార వర్గాలు సాధారణ ప్రజలు, కుటుంబాలనుంచి విభిన్నంగా ఉండవు. భవిష్యత్తు బాగా లేదని అర్థం కాగానే వారు తాజా ఆదాయాలు, సేవింగ్స్, ఇటీవలి పన్ను కోతలు వంటి ద్వారా వచ్చే బొనాంజాలను మొత్తంగా కుటుంబ ఆదాయాలుగా మార్చిస్తారు. పరిస్థితి మెరుగుపడిందని గ్రహించాకే వారు నష్టభయాలకు సిద్ధమై వ్యాపారంలో పెట్టుబడులు పెడతారు. ఈ సమాచారాన్ని మీరు ఎటునుంచి ఎటు తిరగేసినా విషయం మాత్రం అదే. ఎటువంటి మినహాయింపూ లేకుండా అన్ని ఆర్థిక సూచికలు గత కొద్దికాలంగా దిగజారుతూనే ఉన్నాయి. ప్రపంచ పరిణామాల నేపథ్యంలో ఇందుకు మీరు ఏదో కారణం వెతకచ్చు. కానీ, అది చాలా చిన్న విషయం. సమస్య మూలాలు ఇక్కడ ఉన్నాయి. ముఖేష్ అంబానీలాంటివారితో సహా చాలామంది నగదు నిల్వలను వదులుకోవడం లేదు. లేదంటే అప్పులు తగ్గించుకోవడానికీ, ఇబ్బందులు లేకుండా చూసుంటూ, లోన్లను తిరిగి చెల్లిస్తూ కాలం వెళ్లబుచ్చుతూ–మిగిలినవారంతా పెట్టుబడులు పెట్టాలని చూడటం సరికాదు. దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్తలను ఎవరిని అడిగినా 1991 తర్వాత ఇటువంటి పరిస్థితి ఎప్పుడూ లేదని గుసగుసగా చెబుతారు. పన్నుల అధికారులకు దాడులు చేయడానికి, అరెస్ట్ చేయడానికి అవసరమైన అధికారాలు కట్టబెట్టడం వల్ల మాత్రమే కాదు, మొండి బాకీల విషయంలో వ్యవహరిస్తున్న తీరు వల్ల కూడా ఈ పరిస్థితి తలెత్తింది. అన్ని వ్యాపారాల్లో రిస్క్ ఉంటుందని ప్రముఖ వ్యాపారవేత్త ఒకరు నాతో చెప్పారు. 30 రోజుల్లో నేను తీసుకున్న అప్పు తీర్చకపోతే, బ్యాంకులు నన్ను ఎ¯Œ సీఎల్టీగా పేర్కొంటూ నా పేరును ఎగవేతదారుల జాబితాలో ప్రచురిస్తాయి. నేనెందుకు రిస్క్ తీసుకోవాలి? ఒక మనిషి అనారోగ్యానికి గురైతే ఆసుపత్రికి తీసుకువెళతారా, లేక స్మశానానికా? ఆర్బీఐ కొత్త దివాళా నిబంధనలు భారత పారిశ్రామికవిధానానికి ఎ¯Œ సీఎల్టీ అనే స్మశానాలు నిర్మిస్తున్నట్టుగా ఉన్నాయి. ఆర్థిక సంక్షోభం పన్ను రాయితీలు, ప్రోత్సాహకాలు, హామీలు ఇస్తే సర్దుకునే స్థాయిని దాటిపోయింది. వీటిలో కొన్ని పని చేయొచ్చు, కానీ స్టెరాయిడ్స్, ఇన్సులిన్ లాంటి మందు కావాలి. నిజమైన, ధైర్యంగా తీసుకునే చర్యలు ఇప్పుడు భారత ఆర్థిక వ్యవస్థకు అవసరం. బహుశా, పీఎస్‌యూలను పెద్దఎత్తున ప్రైవేటీకరించడం ద్వారా అది సాధ్యం కావచ్చు.మోదీ ప్రభుత్వం ఆరో ఏడాది పాలనలో కూడా ఇటువంటి చర్యలు తీసుకోనట్టయితే, అది ఓ గెలుపు గుర్రమే కానీ, సంస్కరణలు తీసుకువచ్చే సత్తాను కోల్పోయిందని అభివృద్ధి అనేది వాంఛనీయమైనదే తప్ప అత్యవసరమైన అంశం కాదని నమ్మేవారి మాటలను నిజం చేసినట్లవుతుంది. వ్యాసకర్త : శేఖర్ గుప్తా, ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
పెద్దలకు రాయితీ–పేదలకు కోత
యూరియా సబ్సిడీ మీద కోతలు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం ప్రయ త్నం చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. దీనికంటే ముం దర వంటగ్యాస్ సబ్సిడీల తగ్గింపు దిశగా ప్రభుత్వం చేపట్టిన చర్యలు తెలిసినవే. అదేవిధంగా, ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా జరిగే ఆహార పంపిణీలను కూడా క్రమేణా నామమాత్రంగా మార్చివేశారు. ఇదే నేపథ్యంలో కొద్దిరోజుల క్రితమే ప్రభు త్వం కార్పొరేట్లపై పన్నును సుమారు 34 శాతం నుంచి 25 శాతం మేరకు తగ్గించింది. ఈ నిర్ణయం వలన, కేంద్ర ప్రభుత్వ ఆదాయానికి సుమారు 1.45 లక్షల కోట్లమేరకు గండిపడుతుంది. ఇప్పటికే పన్నుల సేకరణ, ఆదాయ సమీకరణ లక్ష్యంలో మన ప్రభుత్వం దారుణంగా విఫలం అవుతోంది. ఈ స్థితిలో కార్పొరేట్లకు వదులుకున్న ఈ 1.45 లక్షల కోట్ల రూపాయలు మన ఖజానాను మరింత బలహీనపరచగలవు. దీనికి తోడుగా ఈమధ్యకాలంలోనే ఉద్దీపన పథకాల పేరిట వాహనరంగం, రియల్ ఎస్టేట్ రంగం వంటి కార్పొరేట్ రంగాలకు వేలకోట్ల రూపాయలను ప్రభుత్వం కట్టబెట్టే ఆలోచన చేసింది. అలాగే, ఒత్తిడికి లొంగి విదేశీ పోర్ట్‌పోలియో ఇన్సెస్టర్ల మీద వేసిన పన్నును ఉపసంహరించుకుంది. ఈ చర్యల ద్వారా మన దేశ ఆరి్థక వ్యవస్థలో నెలకొన్న మాంద్య పరిస్థితులను చక్కదిద్దగలమని పాలకులు భావిస్తున్నారు. కానీ, నిజా నికి మాంద్యం సమస్యకు ఇది పరిష్కారం కాదు. నేడు వ్యవస్థలో మాంద్యానికి కారణం పడిపోయిన ప్రజల కొనుగోలు శక్తి. ఉపాధిరాహిత్యం, ద్రవ్యోల్బణం, వేతనాల పెరుగుదలలో స్తంభనవంటి వాటి వలన మన ప్రజల కొనుగోలు శక్తి పడిపోయింది. అలాగే, దీనికి పెద్దనోట్ల రద్దు, హడావుడి జీఎస్టీలు అగ్గికి ఆజ్యంలా తోడయ్యాయి. విషయం డిమాండ్ పతనం కాగా, ప్రభుత్వం బండికి వెనుక గుర్రాన్ని కట్టినట్టుగా కార్పొరేట్లకు రాయితీల ద్వారా వ్యవస్థకు చికిత్స చేయడానికి ఉపక్రమించింది. ఈ విధమైన ధోరణి తాత్కాలికంగా కార్పొరేట్లకు కొద్దిపాటి ఉపశమనాన్ని కల్పించగలదు. వాటి బ్యాలెన్స్ షీట్లు కాస్తంత మెరుగుపడగలవు. కానీ, ప్రజల కొనుగోలు శక్తిని పెంచి, మాంద్యాన్ని అధిగమించే నికరమైన పనిని ఈ విధానాలు సాధించలేవు. ఈ కారణం గానే అమెరికాలో ట్రంప్, కార్పొరేట్లపై పన్నును భారీగా తగ్గించినప్పుడు, ఆర్థ్ధిక రంగంలో తాత్కాలికంగా ఆశావహ లక్షణాలు కనపడ్డాయి. కానీ, అదంతా కేవలం తాత్కాలికంగానే. కొద్దికాలంలోనే అమెరికాలో ఆర్థిక మందగమన స్థితి మరలా విజృంభించింది. కాగా, ప్రజల డిమాండ్ లేదా కొనుగోలు శక్తిని పెంచేందుకు ఉపాధి కల్పన, సంక్షేమం వంటి వాటి రూపంలో ఉద్దీపనలను ఇచ్చేందుకు ప్రభుత్వం వెనుకాడుతోంది. దీనికి కారణంగా తన ఆదాయ లోటును లేదా ద్రవ్య లోటును చెబుతోంది. ప్రభుత్వ ఖజానాలో తగినమేరకు డబ్బు లేదు గనుక నేడు సంక్షేమ పథకాలను అమలు జరపటం సాధ్యం కాదంటూ, రిజర్వ్‌బ్యాంక్ గవర్నర్ కూడా సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. మరి, ఈ స్థితిలో ఉన్న కాస్తంత ఆదాయాన్నీ కార్పొరేట్లకు రాయితీలు ఇచ్చేందుకు ఎందుకు వదులుకున్నట్లు? మరోప్రక్కన ద్రవ్యలోటు పెరిగిపోతోందంటూ యూరియా, రేషన్ సరుకులు, వంట గ్యాస్ వంటి సామాన్య జనం, రైతుల అవసరాలపై సబ్సిడీలను ఎత్తేయడం ఎందుకు? అలాగే, మొన్నటి బడ్జెట్లో ప్రజావసరం అయిన పెట్రోల్‌పై లీటరుకు రూపాయి సెస్ వేయడం ఎందుకు? అదే, 1980ల నుంచీ పాలకులు ప్రపంచవ్యాప్తంగా, 1990ల నుంచీ మన దేశంలో అమలుజరుపుతోన్న సప్లై సైడ్ ఆర్థిక సిద్ధాంతం. ఈ సిద్ధాంతం సారం సులువైనదే. దీని ప్రకారం, ఆర్థికవ్యవస్థలో వృద్ధికోసం కార్పొరేట్లపై పన్నులు, తదితర ‘భారాలు’, నియంత్రణలను తగ్గించడం లేదా తొలగించడం చేయాలి. తద్వారా వారు మరింతగా పెట్టుబడులు పెడతారు. ఫలితంగా వ్యవస్థలో ఉపాధికల్పన జరుగుతుంది. కాగా, ఈ సప్లై సైడ్ ఆర్థిక సిద్ధాంతం, దానిముందరి కాలపు డిమాండ్ యాజమాన్య సిద్ధాంతానికి తిలోదకాలు ఇచి్చంది. ఈ డిమాండ్ యాజమాన్య సిద్ధాంతమే 1930ల నాటి పెను ఆరి్థకమాంద్య కాలం నుంచి 1980ల వరకూ ప్రపంచంలో బలంగా ఉంది. దీని ప్రకారం, మార్కెట్ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలంటే మెజారిటీ ప్రజల కొనుగోలు శక్తి బలంగా ఉండాలి. దానికోసం, ప్రభుత్వం; కార్పొరేట్లూ కారి్మకుల, ఉద్యోగుల, సామాన్యుల సంక్షేమానికి పెద్దపీట వేయాలి. అంటే, ఆయా వర్గాలకు ఉచిత వైద్యం, విద్యవంటి సంక్షేమ పథకాలు అమలు జరగాలి. ప్రజాసంక్షేమం కోసం ప్రభుత్వం వ్యయాలు చేయాలి. ఈ రకమైన విధానాల ద్వారానే 1950ల నుంచి 1980ల వరకూ ప్రపంచ పెట్టుబడిదారీ విధానం తాలూకు స్వర్ణయుగంగా చెప్పుకునే కాలం నడిచింది. అదే సంక్షేమరాజ్యాల కాలం. కానీ, తరువాతి కాలంలో కార్పొరేట్లు తమ లాభాలను పెంచుకోగలిగేందుకు డిమాండ్ యాజ మాన్య, సంక్షేమరాజ్య విధానాలకు బ్రిటన్, అమెరికాలతో మొదలుపెట్టి, మెల్లగా ప్రపంచంలోని ప్రభుత్వాలన్నీ తిలోదకాలు ఇచ్చాయి. సంస్కరణలూ, ప్రపంచీకరణ పేరిట కార్పొరేట్లు ధనవంతులకు అనుకూలమైన సప్లై సైడ్ ఆరి్థక విధానాలను ముందుగు తెచ్చారు. తద్వారా పేద ప్రజలకు సంక్షేమం కలి్పస్తే వారు సోమరిపోతులవుతారనే కొత్త సిద్ధాంతం ముందుకు వచి్చంది. తద్వారా ప్రభుత్వ నిధులను కార్పొరేట్లూ, ధనికులకు రాయితీలుగా మళ్ళించడం మొదలుపెట్టారు. కడకు ఈ విధానాలు ప్రజల కొనుగోలు శక్తి పతనానికి దారి తీసి, అంతిమంగా 2008 నాటి ఆర్థిక సంక్షోభానికి కారణమయ్యాయి. కాబట్టి, నేడు మన దేశంలో కూడా ఈ కాకులను కొట్టి గద్దలకు వేసే కార్పొరేట్ల అనుకూల విధానాలు ఆర్థ్ధిక మాంద్య స్థితిని మరింత జటిలం మాత్రమే చేయగలవు. ఈ కారణం చేతనే నేటి మాంద్య స్థితిలో కూడా 2018లో 831 మందిగా ఉన్న వెయ్యి కోట్ల రూపాయలపైన సంపద ఉన్న వారి సంఖ్య, 2019లో 953కు పెరిగింది. అంటే, ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల విధానాలు ధనవంతులను మరింత ధనవంతులను చేస్తున్నాయి. సామాన్య జనాన్ని ఆరి్థకమాంద్యపు అ«థఃపాతాళంలోకి నెట్టేస్తున్నాయి. వ్యాసకర్త : డి. పాపారావు, ఆర్థికరంగ విశ్లేషకులు మొబైల్ : 98661 79615 -
రెండు మూడు అంశాల్లో ఆర్బీఐతో విభేదాలు
ముంబై: రెండు మూడు విషయాల్లో ఆర్బీఐతో ప్రభుత్వానికి అంతరాలు ఉన్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అంగీకరించారు. ఆర్బీఐ పనితీరుపై చర్చను దెబ్బతీయడంగా ఎలా అభివర్ణిస్తారని జైట్లీ ప్రశ్నించారు. రాజకీయ పరమైన ఒత్తిళ్ల కారణంగానే ఉర్జిత్ పటేల్ ఆర్బీఐ గవర్నర్ పదవికి రాజీనామా చేశారంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో... గతంలోనూ ప్రభుత్వాలు ఈ తరహా చర్యలు తీసుకున్న ఉదంతాలున్నాయన్నారు. కాంగ్రెస్ ప్రధానులు నెహ్రూ, ఇందిరాగాంధీ ఆర్బీఐ గవర్నర్లను రాజీనామా చేయాలని కోరిన విషయాన్ని గుర్తు చేశారు. ముంబైలో టైమ్స్ నెట్వర్క్ నిర్వహించిన భారత ఆర్థిక సదస్సుకు హాజరైన సందర్భంగా జైట్లీ మాట్లాడారు. ఆర్థిక వ్యవస్థలో రుణాల లభ్యత, ద్రవ్యపరమైన మద్దతు విషయాల్లో ఆర్బీఐతో విభేదాలు ఉన్నట్టు మంత్రి చెప్పారు. ప్రభుత్వం తన ఆందోళనలను తెలియజేసేందుకు చర్చలను ప్రారంభించినట్టు తెలిపారు. ఓ కీలకమైన సంస్థగా ఆర్బీఐతో చర్చలు జరపడం దెబ్బతీయడం అవుతుందా? అని ప్రశ్నించారు. ‘‘మాది సౌర్వభౌమ ప్రభుత్వం. ఆర్థిక వ్యవస్థ నిర్వహణ విషయంలో చాలా ముఖ్యమైన భాగస్వాములం’’ అని జైట్లీ అభివర్ణించారు. రుణాలు, లిక్విడిటీ విషయంలో ఆర్బీఐపై బాధ్యత ఉందన్నారు. -
భారత్‌కు అపశకునం!
రాజన్ నిష్ర్కమణ.. ♦ ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం చేకూరుస్తుంది ♦ అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్టకు దెబ్బ ♦ ఆర్థిక వేత్తల ముక్తకంఠం.. న్యూఢిల్లీ: ఆర్బీఐ గవర్నర్ పదవి నుంచి రఘురామ్ రాజన్ నిష్ర్కమిస్తుండటం... భారత్ ఆర్థిక వ్యవస్థకు అపశకునమేనని విఖ్యాత ఆర్థికవేత్తలు, మాజీ విధానకర్తలు పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం కట్టడికి అనుసరిస్తున్న పాలసీ, మొండిబకాయిల(ఎన్పీఏ) సమస్య విషయంలో తీసుకుంటున్న చర్యలను భారత ప్రభుత్వం సమర్థించడం లేదన్న అభిప్రాయం ప్రపంచదేశాల్లో నెలకొంటుందన్నారు. రెండో విడత ఆర్బీఐ గవర్నర్‌గా కొనసాగేది లేదని.. ఆధ్యాపక వృత్తిలోకి తిరిగివెళ్లిపోనున్నట్లు రాజన్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది సెప్టెంబర్ 4తో రాజన్ మూడేళ్ల పదవీకాలం ముగియనుంది. కాగా, భారత్ ఆర్థిక వ్యవస్థను రాజన్ భ్రష్టుపట్టించాడని.. ఆయన్ను తక్షణం పదవినుంచి తొలగించాలంటూ బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి తీవ్ర ఆరోపణలు చేయడంతోపాటు ప్రధాని మోదీకి కూడా లేఖ రాయడం విదితమే. ఈ నేపథ్యంలో రఘురామ్ రాజన్ కొనసాగింపుపై తీవ్ర వివాదం, ఉత్కంఠ నెలకొన్నాయి. స్వయంగా ఇప్పుడు ఆయనే తనకు రెండో చాన్స్ వద్దని తేల్చిచెప్పడంతో సస్పెన్స్‌కు తెరపడింది. పోతేపోనీలే అన్నట్లు వ్యవహరించారు... రాజన్ నిష్ర్కమణ భారత్‌కు తీవ్ర నష్టం చేకూరుస్తుందని షికాగో యూనివర్సిటీ బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో రాజన్ సహచర ప్రొఫెసర్ అయిన లిగి జింగేల్స్ పేర్కొన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ ప్రయాజనాలను పరిరక్షించడంలో ఇతోధికంగా సేవలందించిన రాజన్ నిబద్దతను ప్రశ్నించడంతోపాటు నోటికొచ్చినట్లు కూడా మట్లాడారని.. అలాంటప్పుడు ఆయనను కొనసాగించేందుకు తీవ్రంగా ఒప్పించాల్సిన ప్రభుత్వం కూడా పోతేపోనీలే అన్నట్లు వ్యవహరించడం ఏమాత్రం బాగోలేదని హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ గీతా గోపీనాథ్ వ్యాఖ్యానించారు. రాజన్ నిష్ర్కమణకు సంబంధించి అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్ట విషయంలో తాను చాలా చింతిస్తున్నానని భారత్‌కు చెందిన ఆర్థికవేత్త, బ్రిటిష్ లేబర్ పార్టీ నేత మేఘనాధ్ దేశాయ్ పేర్కొన్నారు. ప్రపంచంలో అత్యుత్తమ సెంట్రల్ బ్యాంకర్లలో ఒకరుగా రాజన్ నిలుస్తారని భారత్ మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు, ప్రపంచ బ్యాంక్ ప్రస్తుత ముఖ్య ఆర్థికవేత్త కౌశిక్ బసు వ్యాఖ్యానించారు. ఐఎంఎఫ్‌లో చీఫ్ ఎకనమిస్ట్‌గా పనిచేసిన రాజన్.. 2008 నాటి ప్రపంచ ఆర్థిక సంక్షోభాన్ని ముందుగానే పసిగట్టిన ఘనతను దక్కించుకున్నారు. ప్రస్తుతం షికాగో బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఆన్-లీవ్ ప్రొఫెసర్‌గా కొనసాగుతున్నారు. ‘ఒక్క భారత్‌కే కాదు ప్రపంచం మొత్తంలోనే రాజన్ ఎంత గొప్ప సెంట్రల్ బ్యాంకరో భవిష్యత్తులో అందరూ కచ్చితంగా ఒప్పుకుంటారు. భారత్ ఆర్థిక వ్యవస్థకు ఇది చాలా దుర్ధినం’ అని గోపీనాథ్ పేర్కొన్నారు. కొత్త గవర్నర్ ఎంపిక క్లిష్టతరమే... రాజన్ తర్వాత ఆ పదవికి అంత సమర్ధులైనవారిని ఎంపిక చేయడం కష్టతరమైన అంశమేనని దేశాయ్ అభిప్రాయపడ్డారు. ఒక సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ ఏం చేయాలో అదిచేసినందుకు రాజన్‌ను అందరూ విమర్శించారని దేశాయ్ వ్యాఖ్యానించారు. కాగా, మాజీ ఆర్థిక శాఖ కార్యదర్శి అరవింద్ మాయారామ్ కూడా రాజన్ నిష్ర్కమణపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ‘రాజన్ తీసుకున్న నిర్ణయం భారత్ ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం చేకూరుస్తుంది. ఇది మంచి శకునం కాదు’ అని మాయారామ్ ట్వీట్ చేశారు. ఆర్బీఐని వీడి మళ్లీ బూత్ స్కూల్‌కు వస్తుండడం మాకు లాభదాయం. భారత్‌కు మాత్రం తీవ్ర నష్టం అని జింగేల్స్ వ్యాఖ్యానించారు. రాజన్ ఆర్థిక శాస్త్రంలో తనకున్న గొప్ప నైపుణ్యం, సామర్థ్యాలతోనే ఆర్బీఐ అత్యున్నత పదవికి చేరుకోగలిగారని పేర్కొన్నారు. ‘ప్రపంచ అత్యుత్తమ ఆర్థిక నిపుణుల్లో రాజన్ ఒకరు. అలాంటి వ్యక్తిని భారత్ వదిలేసుకుంటోంది. ఇది ప్రభుత్వంతోపాటు దేశం కూడా భవిష్యత్తులో చింతించే విషయం’ అని నోబెల్ గ్రహీత అమర్త్యసేన్ అభిప్రాపడ్డారు. ఆర్బీఐ పూర్తిగా స్వతంత్ర సంస్థకాదని కూడా ఆయన కుండబద్ధలు కొట్టడం గమనార్హం. ఆయన చర్యలతో భారత్‌కు మేలు: కార్పొరేట్ ఇండియా ప్రపంచ ఆర్థికవ్యవస్థల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత తరుణంలో రాజన్ నిష్ర్కమణపై భారత్ పారిశ్రామిక రంగం ఆందోళన వ్యక్తం చేసింది. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితితో దేశ ఆర్థిక స్థిరత్వానికి అనేక రిస్కులు పొంచిఉన్నాయని.. అయితే, ఆర్బీఐ గవర్నర్‌గా రాజన్ చేపట్టిన నిర్మాణాత్మక చర్యలు, మార్పులతో భవిష్యత్తులో భారత్‌కు సానుకూల ఫలితాలు రానున్నాయని కార్పొరేట్ ఇండియా అభిప్రాయపడింది. రాజన్ తన నిర్ణయంపై పునరాలోచిస్తారని భావిస్తున్నాం. ఆయన ఆర్బీఐ నుంచి వెళ్లిపోతుండటం భారత్ ఆర్థిక వ్యవస్థకు మంచి సంకేతం కాదు. ‘ఒకపక్క, ప్రపంచ ఆర్థిక అనిశ్చితి మరోపక్క, మొండిబకాయిలు ఆర్థిక వ్యవస్థకు పెను ముప్పుగా మారాయి. ఈ తరుణంలో రాజన్ నిష్ర్కమణ చాలా దురదృష్టకరం’ అని అశోచామ్ సెక్రటరీ జనరల్ డీఎస్ రావత్ అన్నారు. పదవీకాలాన్ని పెంచాలి... ఆర్థిక సంస్కరణలను సరిగ్గా అమలు చేయడం, విధానపరమైన స్థిరత్వం ఉండాలంటే ఆర్బీఐ గవర్నర్ పదవీ కాలాన్ని కనీసం ఐదేళ్లపాటు ఉండేవిధంగా చూడాలి. వడ్డీరేట్ల నిర్ణయం కోసం ప్రతిపాదించిన ఆరుగురు సభ్యుల మానిటరీ పాలసీ కమిటీ రాజన్ నిష్ర్కమణ తర్వాత కూడా కొనసాగుతుంది. - రాకేశ్ మోహన్, ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ రెండోసారి కొనసాగరాదన్నది రాజన్ వ్యక్తిగత నిర్ణయం. దీన్ని ప్రతిఒక్కరూ గౌరవించాల్సిందే. అధ్యాపక వృత్తిలోకి మళ్లీ అడుగుపెట్టనున్న రాజన్‌కు రానున్నకాలంలో మరింత ఉజ్వల భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నా. - చందా కొచర్, ఐసీఐసీఐ బ్యాంక్ చీఫ్ భారత్‌లో 10 శాతం వృద్ధి రేటు, కోటి ఉద్యోగాల కల్పన కోసం కలలు కంటున్న ఇలాంటి తరుణంలో ఒక అత్యుత్తమ ఆర్థికవేత్త సేవలను దేశం కోల్పోతుండటం చాలా విచారకరం. దేశంలో ఇప్పుడున్న సవాళ్లను ఎదుర్కోవాలంటే ప్రపంచవ్యాప్తంగా మరింతమంది నిపుణులను భారత్‌కు రప్పించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. - ‘ఇన్ఫీ’ నారాయణ మూర్తి -
ఇట్లు.. మీ ‘విశ్వాస’పాత్రుడు
-
ప్రభుత్వ వ్యయంతోనే వృద్ధికి జోష్: హెచ్ఎస్బీసీ
ముంబై: భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకోవాలంటే ప్రభుత్వ వ్యయాల పెంపు, ఆగిపోయిన ప్రాజెక్టులను వేగంగా పట్టాలెక్కించడం ఒక్కటే మార్గమని హెచ్ఎస్బీసీ ఒక నివేదికలో పేర్కొంది. భారీ అప్పులతో అటు కార్పొరేట్లు, మొండి బాకాయిల పెరుగుదలతో ఇటు బ్యాంకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో తక్షణం వృద్ధి రేటు గాడిలో పడేందుకు ప్రభుత్వమే మరింత బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. ఆర్థిక శాఖ తాజా గణాంకాల ప్రకారం ప్రభుత్వ, కార్పొరేట్ రంగం నుంచి పెట్టుబడుల్లో ప్రతిష్టంభన నెలకొన్న విషయం స్పష్టంగా కనబడుతోందని నివేదిక వివరించింది. ప్రైవేటు రంగ పెట్టుబడులకు ఊతమిచ్చేలా కీలక పాత్ర పోషించే విషయంలో... నిలిచిపోయిన ప్రాజెక్టులను తిరిగి ప్రారంభించేలా చొరవ, ప్రభుత్వ వ్యయాల పెంపు, ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యాల్లో కొత్త ఆచరణాత్మక విధానాన్ని ప్రవేశపెట్టడం.. ఈ మూడు మార్గాలున్నాయని హెచ్ఎస్బీసీ ఇండియా చీఫ్ ఎకనమిస్ట్ (క్యాపిటల్ మార్కెట్స్ విభాగం) ప్రాంజుల్ భండారీ పేర్కొన్నారు. సీఎంఐఈ గణాంకాల ప్రకారం... ఆగిపోయిన 100 ప్రధాన ప్రాజెక్టుల్లో 66 శాతం ప్రైవేటు రంగంలోనివి కాగా, మిగతావి ప్రభుత్వ రంగానికి చెందినవి. భూసేకరణ, పర్యావరణ ఇతరత్రా అనుమతుల్లో జాప్యం, ముడివస్తువుల సరఫరారో అడ్డంకులు వంటివే ప్రాజెక్టులు నిలిచిపోయేందుకు ప్రధాన కారణాలని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.